ముంబై: దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో రుణ వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్‌మెంట్ (ఎఫ్‌ఏసీఈ) 100 కంపెనీలపై నిర్వహించిన సర్వే ఈ అంశాన్ని వెల్లడించింది. సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిస్తే.. రుణ వసూళ్ల ఏజెంట్లు తమ విధుల నిర్వహణలో వైఫల్యం చెందుతున్నారు. రుణ గ్రహీతలు నిజంగానే తీవ్ర ఒత్తిడి, వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూరుకునిపోవడమే దీనికి కారణం.
20 % వరకు
రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రుణదాతల పరిస్థితి మెరుగ్గాలేదు. మొత్తం మంజూరుచేసిన రుణాల్లో దాదాపు 10 నుంచి 20 శాతం వరకూ వసూళ్లు కష్టమవుతున్నాయి. రుణం పునఃచెల్లింపుల్లో గడువు ముగిసిపోయి ఒకటి నుంచి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఆయా రుణాలు వసూలు కావడం లేదు. అయితే 2020తో పోల్చితే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడం కొంత ఊరట. 2021 జూలై ముగిసే నాటికి పరిస్థితి కొంత మెరుగు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి కఠిన లాక్‌డౌన్ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, కేసులు తగ్గి క్రమంగా అన్ లాకింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం దీనికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment