Lockdown Impact
-
చైనాలో ‘జీరో కోవిడ్’ ఎత్తివేస్తే ఏం జరుగుతుంది?
బీజింగ్: కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి ‘జీరో కోవిడ్’ ఆంక్షలు అమలు చేస్తోంది చైనా. అయితే, రోజుల తరబడి ఇంట్లోనే నిర్భందించటంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని ప్రజలు రోడ్లపైకి వస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీరో కోవిడ్ ఆంక్షలను సడలిస్తోంది డ్రాగన్. ఓవైపు కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలను సడలిస్తే పెను విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు వైద్య వ్యవస్థపై పెను భారం పడుతుందంటున్నారు. చైనాలో ఇప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్ అందలేదు. హెర్డ్ ఇమ్యూనిటీ సైతం లేని తరుణంలో కోవిడ్ ఆంక్షలను సడలించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే దేశంలో ఎన్ని మరణాలు సంభవిస్తాయనే అంశంపై పరిశోధకులు అంచనా వేశారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 మరణాలు, 331,952కేసులు నమోదయ్యాయి. పరిశోధకుల అంచనా ప్రకారం.. ► 20లక్షలకుపైగా మరణాలు.. హాంకాంగ్ తరహాలో పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు సడలిస్తే మెయిన్‌ల్యాండ్ చైనాలో 20 లక్షలలకుపైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. గత నెలలో షాంఘై జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ విషయాలను పేర్కొన్నారు. మరోవైపు.. కరోనా కేసులు సైతం 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ► దేశంలో టీకాల పంపిణీని వేగవంతం చేయకుండా, ఆరోగ్య సదుపాయలు మెరుగుపరచకుండా జీరో కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేస్తే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని చైనా, అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు గత మే నెలలోనే అంచనా వేశారు. కరోనా పీక్ దశకు చేరిన సమయంలో ఐసీయూలకు 15 రెట్ల డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ► జీరో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే 13 నుంచి 21 లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటిష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ ఎయిర్ఫినిటీ పేర్కొంది. టీకాలు, బూస్టర్ రేటు, హైబ్రిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే అందుకు కారణంగా తెలిపింది. ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా? -
China: బూతు బొమ్మలతో ఉక్కు పాదం!
బీజింగ్: సోషల్ మీడియా కాలంలో ఉద్యమాల్ని అణచివేయడం అంత తేలికనా?.. అవునని నిరూపిస్తోంది చైనా. కోవిడ్ కట్టడి పేరుతో అక్కడ అమలు అవుతున్న కఠోర లాక్డౌన్ ఇక తమ వల్ల కాదంటూ ఎదురు తిరిగిన ప్రజావేశాన్ని తొక్కిపెట్టేందుకు దుర్మార్గమైన ఆలోచనలను అమలు చేస్తోంది జిన్‌పింగ్ నేతృత్వంలోని సర్కార్. బోట్ పోలీస్, సెక్స్ బోట్స్.. ఇప్పుడు నిరసనల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న ఆయుధాలు. ప్రపంచమంతా కరోనా స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్న వేళ.. చైనా మాత్రం ఇంకా వైరస్ టెన్షన్‌తోనే వణికిపోతోంది. రోజుకు 30వేలకు పైగా కేసుల నమోదుతో.. జీరో కొవిడ్ పాలసీని.. అదీ అతికఠినంగా అమలు చేస్తుండడంతో జనం సహనం కోల్పోతున్నారు. చైనాలోని పదుల సంఖ్యలో నగరాల్లో.. కొవిడ్ ఆంక్షల వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరాయి. తమ గళాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ, ఆ ఆన్లైన్ నిరసనలను అంతే సమర్థవంతంగా అణచివేస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చైనాలో పాపులర్ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను సెన్సార్ చేస్తున్నారు అధికారులు. నిరసన, బీజింగ్, అల్లర్లు.. ఇలాంటి పదాలతో కూడిన పోస్టులు చేయకుండా.. పూర్తిగా బ్యాన్ చేసింది. ఇందు కోసం పోలీస్ బోట్లను ఉపయోగించుకుంటోంది. అదే సమయంలో.. బయటి ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. ట్విటర్లో అయితే నిరసనల ప్రదర్శనల ఊసు లేకుండా చేస్తోంది. ట్విటర్ సెర్చింగ్‌లో.. చైనా నిరసనలు, బీజింగ్, ఇతర ప్రముఖల నగరాల కోసం వెతికితే.. ఆ ప్లేస్‌లో అందమైన మోడల్స్ ఫొటోలు, అశ్లీల వీడియోలు, బూతు బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్లు దర్శనమిస్తున్నాయి. చైనీస్(మాండరిన్) భాషలో.. అదీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆ పోస్టులు ట్రెండ్ అవుతుండడం గమనార్హం. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 2009లో ట్విటర్‌ను చైనా వ్యాప్తంగా బ్లాక్ చేసింది. అయితే కొందరు యూజర్లు వీపీఎన్, వెబ్సైట్ ప్రాక్సీ సర్వీసుల ద్వారా అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ట్విటర్లో ఇప్పుడు పెయిడ్ యాడ్స్ కనిపిస్తున్నాయి. అదీ పోర్న్ నుంచి వ్యభిచారం సంబంధించినవి ట్రెండ్ అవుతుండడం గమనార్హం. వీఛాట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇదే పరిస్థితి. నిబంధన ఉల్లంఘన పేరుతో నిరసనల పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ఏదైనా సరే.. ‘తప్పుడు సమాచారం’గా పేర్కొంటూ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. తాజాగా.. గురువారం ఉరుమ్‌ఖ్వీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఈ నిఘా ఎక్కువైంది. అగ్ని ప్రమాద సమయంలో కరోనా లాక్డౌన్, బారికేడ్లు, వాహనాల అడ్డగింత ద్వారా సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా ప్రాణ నష్టం సంభవించగా.. కఠోర నిబంధనల అమలుపై ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. Chinese netizens filling WeChat with angry messages condemning deadly fire in Urumqi (rescue possibly delayed by covid measures) and zerocovid policy. As messages are censored, netizens post articles only using ‘safe’ words: OK OK OK, agree agree agree, support support support pic.twitter.com/Bv4x6VIXN0 — leen vervaeke (@leenvervaeke) November 25, 2022 షుయిమోగావో జిల్లాలో ఓ యువకుడు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే.. అతన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ పదిరోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు చైనా అధికారులు. అదే సమయంలో నిరసనకారులపై వ్యతిరేక పోస్టులను, ప్రభుత్వ అనుకూల పోస్టులకు అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అనుమతి లభిస్తోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి హావో లిజియన్ భార్య.. నిరసన కారులపై ఆగ్రహంతో చేసిన ఓ పోస్టు విపరీతంగా ట్రెండ్ అయ్యింది. -
అతి జాగ్రత్తల వల్లే కేసులు పెరుగుతున్నాయని అనిపిస్తోంది సార్!
ప్రపంచమంతా మాస్కు లేకుండా తిరుగుతుంటే.. మనమింకా అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అనిపిస్తోంది సార్! -
బిగ్ ట్విస్ట్.. చైనా అధ్యక్ష పదవికి జిన్‌పింగ్ రాజీనామా..?
China President Xi Jinping.. డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనాలో పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం, చైనా ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. చైనాలో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని బలవంతంగా క్వారన్టైన్ కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక, కరోనా కారణంగా చైనాలో వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ కారణంగా జిన్‌పింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కెనడాకు చెందిన బ్లాగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. అంతకన్నా ముందు.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసి జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించనుందని బాంబు పేల్చాడు. ఇది కూడా చదవండి: యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ -
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం?
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్డౌన్లు, కఠిన నిబంధనలు, వర్క్‌ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్ అండ్ టీ సన్నాహలు చేస్తోంది. మెట్రో స్పీడుకి కోవిడ్ బ్రేకులు పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్‌షిప్‌లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. నష్టాల ట్రాక్‌లో కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది. వర్క్‌ఫ్రం హోం ఎఫెక్ట్ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్‌ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్‌గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్ వేవ్ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. వాటా అమ్మకానికి సిద్ధం లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్‌లోని పవర్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్ అండ్ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్ అండ్ టీ వైస్‌ప్రెసిడెంట్ డీకే సేన్ అన్నారు. అయితే దీనిపై గ్రీన్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా ? హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్ అండ్ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు. సాయం అందేనా ? నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం -
HYD Metro: సీన్ కట్ చేస్తే.. నష్టం రోజుకు రూ.కోటి!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్.. హైదరాబాదు నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన ప్రయాణ సాధనం.. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నగరవాసి కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించవచ్చు..అందుకే చాలామంది ఉపయోగించుకున్నారు.. ఎంతగా అంటే.. రోజుకు దాదాపు 4.5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు.. సీన్ కట్‌చేస్తే.. ఇపుడు రోజుకు కనీసం లక్ష మంది కూడా మెట్రోను ఉపయోగించడం లేదు. లాక్డౌన్ ఎఫెక్ట్.. కరోనా థర్డ్ వేవ్ భయంతో అధికశాతం మంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో హెచ్ఎంఆర్కు రోజుకు దాదాపు రూ.కోటి నష్టం వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను ఉదయం 7 నుంచి రాత్రి 10.45 గంటల వరకు పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష మార్కును కూడా దాటకపోవడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు కోటిరూపాయల నష్టంతో మెట్రో నెట్టుకొస్తున్నట్లు సమాచారం. అయినా సీన్మారలేదు.. లాక్డౌన్ సమయంలో పరిమితవేళలు మెట్రో పాలిట శాపంగా పరిణమించాయి. మరోవైపు గ్రేటర్ పరిధిలోని సుమారు వెయ్యికి పైగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ఫ్రం హోంకు అనుమతిచ్చాయి. దీంతో మెట్రో రద్దీ ఒక్కసారిగా పడిపోయింది. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేయడం గమనార్హం. ఇప్పుడు కోవిడ్ థర్డ్‌వేవ్ భయంతో మెజార్టీ సిటీజనులు ఇంకా వ్యక్తిగత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలు మినహా మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సరాసరిన నిత్యం 50 వేలు, నాగోల్–రాయదుర్గం రూట్లో నిత్యం సుమారు 30 వేలు, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో సుమారు పదివేల మంది మాత్రమే జర్నీ చేస్తున్నట్లు సమాచారం. నష్టాల జర్నీ.. గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు గత నాలుగేళ్లుగా నష్టాల జర్నీ తప్పడంలేదు. సుమారు రూ.16 వేల కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టుకు ప్రయాణీకుల చార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టులు, మాల్స్ అభివృద్ధి ద్వారా ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదు. దీంతో నిత్యం మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, భద్రతకు అత్యధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. రోజుకు సుమారు కోటి రూపాయల నష్టంతో మెట్రో కనాకష్టంగా నెట్టుకొస్తోంది. ఇదే తరుణంలో తమను ఆదుకోవాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ఇటీవల సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో కోరాయి. సీఎం సానుకూలంగా స్పందించినా.. మెట్రోకు రాష్ట్ర సర్కారు నుంచి ఏవిధంగా ఆర్థిక సాయం అందుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఇదీ లెక్క(రోజుకు) రూట్ ప్రయాణికుల సంఖ్య ఎల్బీనగర్- మియాపూర్ 50 వేలు నాగోల్-రాయదుర్గం 30వేలు జేబీఎస్-ఎంజీబీఎస్ 10వేలు (గతంలో ఈ మూడు రూట్లలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణించేవారు) -
బైకుల అమ్మకాలు ఢమాల్
వెబ్‌డెస్క్ : లాక్డౌన్ ఎఫెక్ట్‌తో బైకుల అమ్మకాలు మేలో ఢమాల్ అన్నాయి. ఒక్కసారిగా అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని స్టేట్స్లో లాక్డౌన్ అమలు చేశారు. దీంతో టూ వీలర్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ది ఫేడరేషన్ ఆఫ్ ఆటో మొబైల్ డీలర్ అసోసియేషన్స్ (ఫెడా) తాజా గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. 56 శాతం లాక్డౌన్ అమల్లోకి రాకముందు ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా టూ వీలర్స్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. 2021 ఏప్రిల్‌లో 6,67,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మేలో ఈ సంఖ్య 2,95,257కి పడిపోయింది. ప్రత్యేకించి స్కూటర్ అమ్మకాలు మరీ దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో అమ్ముడుపోయిన యూనిట్ల సంఖ్య 3,00,462 ఉండగా మే వచ్చే సరికి ఈ సంఖ్య 50,294కి పడిపోయింది. మొత్తంగా టూ వీలర్ అమ్మకాల్లో 56 శాతం క్షీణత నమోదు అవగా స్కూటర్ సెగ్మెంట్లో 83 శాతం క్షీణత నమోదైంది. ఆటో అమ్మకాలు ఇలా ఆటో అమ్మకాలపై కూడా లాక్డౌన్ ప్రభావం పడింది. ఏప్రిల్‌లో 13,728 యూనిట్లు అమ్ముడు కాగా మే వచ్చే సరికి 1,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా 91 శాతం అమ్మకాలు పడిపోయాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ - రాజేశ్ మీనన్ (డైరెక్టర్ జనరల్) సోసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ దేశవ్యాప్తంగా మేలో లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దాని ప్రభావం ఆటో మొబైల్ పరిశ్రమపై పడింది. చాలా కంపెనీలు తయారీ యూనిట్లు మూసేశాయి. షోరూమ్‌లు తెరిచే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే అమ్మకాలు బాగా తగ్గాయి. చదవండి: తగ్గనున్న టూ వీలర్ ధరలు.. ఈవీలపై సబ్సిడీ పెంపు -
రుణ వసూళ్లు పడిపోతున్నాయ్!
ముంబై: దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో రుణ వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్మెంట్ (ఎఫ్‌ఏసీఈ) 100 కంపెనీలపై నిర్వహించిన సర్వే ఈ అంశాన్ని వెల్లడించింది. సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిస్తే.. రుణ వసూళ్ల ఏజెంట్లు తమ విధుల నిర్వహణలో వైఫల్యం చెందుతున్నారు. రుణ గ్రహీతలు నిజంగానే తీవ్ర ఒత్తిడి, వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూరుకునిపోవడమే దీనికి కారణం. 20 % వరకు రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రుణదాతల పరిస్థితి మెరుగ్గాలేదు. మొత్తం మంజూరుచేసిన రుణాల్లో దాదాపు 10 నుంచి 20 శాతం వరకూ వసూళ్లు కష్టమవుతున్నాయి. రుణం పునఃచెల్లింపుల్లో గడువు ముగిసిపోయి ఒకటి నుంచి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఆయా రుణాలు వసూలు కావడం లేదు. అయితే 2020తో పోల్చితే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడం కొంత ఊరట. 2021 జూలై ముగిసే నాటికి పరిస్థితి కొంత మెరుగు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి కఠిన లాక్డౌన్ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, కేసులు తగ్గి క్రమంగా అన్ లాకింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం దీనికి కారణం. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్: ప్రైవేటు ఫీజులు 15 శాతం రద్దు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వారు ఆ ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ఇతరులు 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలు- సామూహిక విద్యా విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్–19 ఆంక్షలు ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుత సంప్రదింపులు విజయవంతం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేని, నిస్సహాయ స్థితిని తల్లిదండ్రుల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విచారకర పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు మూడు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కరోనా తాండవిస్తున్న పరిస్థితుల్లో పాఠశాలలు వసూలు చేస్తున్న వార్షిక ఫీజును పరిమితి మేరకు పలు అంచెలుగా ఖరారు చేసి అంచెల వారీగా ఫీజుల్లో మినహాయింపు కల్పించాలని హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో అసంతృప్తి తలెత్తితే తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు కేసు విచారణకు తెరదించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలు ప్రైవేట్ పాఠశాలలు అంచెల వారీగా ఫీజులు మినహాయించే ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. ఈ వివాదం మరోసారి బిగుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఒప్పందం నిరాకరించిన యాజమాన్యాలు 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
Lockdown effect: కార్ల అమ్మకాల్లో తగ్గుదల
హైదరాబాద్: కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో కార్ల అమ్మకాలు పడిపోయాయి. వైరస్ విజృంభనకు తోడు వరుసగా ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ విధిస్తూ పోవడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. అయితే గతేడాది లాక్‌డౌన్‌తో పోల్చితే ఈసారి అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పైగా కరోనా వచ్చిన తర్వాత వ్యక్తిగత కారుకు డిమాండ్ పెరిగిందని, అందువల్ల అమ్మకాల్లో తగ్గుదల తాత్కాలికమే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ తగ్గుదల ఇండియా మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజుకిపై లాక్డౌన్ల ప్రభావం భారీగా పడింది. దేశంలో లాక్డౌన్లు అమల్లోకి రాకముందు అంటే 2021 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 1.35 లక్షల ప్యాసింజర్ వెహికల్ కార్లు అమ్మింది సుజూకి. ఆ తర్వాత లాక్డౌన్ కాలమైన మేలో కార్ల అమ్మకాలు కేవలం 32,903గా నమోదు అయ్యాయి. లాక్డౌన్ ఫస్ట్ విడతకు సంబంధించి 2020 మేలో అయితే మరీ దారుణంగా కేవలం 13,702 కార్లే అమ్ముడయ్యాయి. సగానికి సగం కార్ల అమ్మకాల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 49,002 ప్యాసింజర్ కార్లను అమ్మింది. కానీ కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న మేలో అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. మేలో హ్యందాయ్ కార్ల అమ్మకాలు 25,001 యూనిట్లకే పరిమితం అయ్యాయి. టాటాకు తప్పని తిప్పలు మరో ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు సైతం కరోనా కష్టాలు తప్పలేదు. ఏప్రిలో 25,095 కార్ల అమ్మకాలు జరగగా మేలో ఈ సంఖ్య 15,181కి పరిమితమయ్యింది. టాటా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌కి సంబంధించి ఏప్రిల్‌లో 14,435 వాహనాలు అమ్మగా మేలో 9,871 వాహనాలే అమ్ముడయ్యాయి. మహీంద్రాది అదే దారి ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్ అమ్మకాల్లో జోరు కనబరిచే మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లోనూ క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలకు సంబంధించి ఏప్రిల్‌లో 18,825 యూనిట్లు అమ్ముడవగా మేలో ఈ సంఖ్య 8,004కే పరిమితమైంది. కమర్షియల్ సెగ్మెంట్లో 16,147 నుంచి 7,508 యూనిట్లకు అమ్మకాలు పడిపోయాయి. టోయోట కిర్లోస్కర్ మోటార్స్‌లోనూ ఇదే ట్రెండ్ నమోదైంది. ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో 9,622 కార్లు అమ్మగా మేలో కేవలం 707 యూనిట్లే అమ్మగలిగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభనతో ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ని తాత్కాలికంగా షట్‌డౌన్ కూడా చేసింది. హోండా కార్ల అమ్మకాలు సైతం పడిపోయాయి. క్యా కియా అతితక్కువ కాలంలోనే ఇండియాలో 10.70 శాతం కార్లమార్కెట్ను కొల్లగొట్టిన కియా మేలో 11,050 కార్లను అమ్మగలిగింది. కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ల ప్రభావం అన్ని రంగాలపై ఉందని, ఆటోమొబైల్స్ రంగం అందుకు మినహాయింపు కాదని కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. గతం కంటే మెరుగు గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో పోల్చితే ఈ ఏడాది లాక్డౌన్ ప్రభావం ఆటోమొబైల్ పరిశ్రమపై తక్కువగానే ఉందంటున్నారు ఈ పరిశ్రమ ఎక్స్పర్ట్స్. గతేడాది సేల్స్ చాలా దారుణంగా పడిపోయాని చెప్పారు. కేవలం మే నెలలోనే అమ్మకాల్లో క్షీణత ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ పరిశ్రమ పుంజకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. పైగా కరోనా కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, షేరింగ్ ట్రాన్స్‌పోర్టు కంటే వ్యక్తిగత వాహనాలు కలిగి ఉండటానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని.... ఆ సెంటిమెంట్ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆటోమోబైల్ రంగ నిపుణులు అంటున్నారు. -
లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య
మైసూరు: లాక్‌డౌన్‌తో వ్యాపారం లేక పాన్ బ్రోకర్ ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది మండి మోహల్లా పరిధిలోని అక్బర్ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ (37) లాక్డౌన్ కారణంగా వ్యాపారం లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
నా వివాహం.. సారీ కొద్దిమందికే ఆహ్వానం
సిరిసిల్ల కల్చరల్: జీవితంలో ఒకేసారి జరిగే వేడుక పెళ్లి. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ అతిథులుగా ఆహ్వానించి జరుపుకునే సంబురం. అలాంటి అపురూప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు చల్లుతోంది. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరుల కల తీరడం లేదు. కేవలం కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో శుభలేఖల రూపురేఖలతోపాటు పెళ్లి తంతులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పెళ్లంటే అదొక వైభవం. ఈ వేడుకను సామాజిక హోదాకు చిహ్నంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఫంక్షన్‌హాళ్లకు బదులుగా ఇంటి ముందే ముత్యాల పందిరి వేస్తున్నారు. భారీ సంఖ్యలో బంధువులకు బదులు 30, 40 మందితో కానిచ్చేస్తున్నారు. పోలీసులైతే ఏకంగా 20 మందికే పరిమితం చేసుకోవాలని నిబంధన విధించారు. నిశ్చితార్థం రోజు వధూవరులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే కానుకల్లో మాస్క్‌లు, శానిటైజర్లు చేరిపోయాయి. పెళ్లికి రాలేమండి.. కోవిడ్ కారణంగా పెళ్లికి ఇంటికొక్కరిని కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆహ్వానించేందుకు వెళ్లినా బంధువులు సరే అంటున్నారు కానీ కరోనాను తల్చుకొని జంకుతున్నారు. కొందరైతే శుభలేఖలు ఇచ్చే సమయంలోనే మేం రాలేమండీ.. రోజులు బాగుంటే చూద్దాం లెండి.. ఏమీ అనుకోవద్దు.. రాకపోయినా వచి్చనట్టే భావించండి.. అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. శుభలేఖల్లో మాస్కు ధరించి హాజరు కావాలని కొందరు ముద్రిస్తుండగా, మరికొందరు ఇంటి వద్దే ఉండి ఆశీస్సులు అందించాలని కోరుతున్నారు. ఈ నెల తొలివారం నుంచి ముహూర్తాలు.. మే తొలివారం నుంచే ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి వందల సంఖ్యలో వివాహాలు నిశ్చయమయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పెళ్లికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకోవాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇదివరకే బుక్ చేసుకున్నవారు అడ్వాన్స్‌లు వాపస్ ఇవ్వాలని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులపై ఒత్తిడి చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, స్వల్ప సంఖ్యలో బంధువుల సమక్షంలో ఇంటిముందే పెళ్లి జరిపిస్తున్నారు. -
ఇవి పార్కింగ్‌లో పెట్టిన బండ్లు కావు..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ బండ్లు పార్కింగ్ చేసినవి కావు. ఏదో మార్కెట్‌కు వచ్చి నిలిపి ఉంచిన బండ్లయితే అసలే కావు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్న వెహికిల్స్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఉదయం వివిధ కూడళ్లలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సడలింపు సమయం ఉదయం 10 గంటలు ముగిసి తర్వాత కూడా పలువురు రోడ్లపైకి వచ్చారు. అలా వచ్చిన బండ్లను తనిఖీ చేసి సీజ్ చేశారు. సాయంత్రం వరకు 7,059 కేసులు నమోదు చేయగా.. 2099 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని సీపీ వెల్లడించారు. - కరీంనగర్‌క్రైం -
ఆత్మనిర్భర్ 2.0
న్యూఢిల్లీ : దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మూడు రంగాలపై ఫోకస్ ఈసారి లాక్డౌన్ కారణంగా ఏవియేషన్, టూరిజం, ఆతిధ్యరంగాలు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను ఆత్మనిర్భర్ 2 ద్వారా ఆదుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఇప్పుడే కాదు గతేడాది లాక్డౌన్, అన్‌లాక్ ప్రక్రియలను పూర్తిగా కేంద్రమే చేపట్టింది. ఈసారి లాక్డౌన్ విధింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో లాక్డౌన్ విధించింది. కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత... జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఆత్మనిర్భర్ 2 ప్యాకేజీని ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. -
పరిశ్రమలు కుదేల్: ఇం‘డల్’స్ట్రియల్
పటాన్చెరులో ఉన్న ఓ పరిశ్రమ బయోమాస్క్ బ్రికెట్ (బొగ్గుకు ప్రత్యామ్నాయం) తయారు చేసి టైల్స్ ఉత్పత్తి చేసే ఓ భారీ పరిశ్రమ (కొత్తూరు)కు సరఫరా చేస్తోంది. ఈ టైల్స్ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి రవాణా అవుతాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో టైల్స్ పరిశ్రమకు ఆర్డర్లు తగ్గాయి. దీంతో ఈ టైల్స్ పరిశ్రమ పటాన్‌చెరులోని బ్రికెట్ల ఆర్డర్లను తగ్గించింది. చేసేదేమీ లేక పటాన్‌చెరులోని బ్రికెట్ పరిశ్రమ ఉత్పత్తిని దాదాపు సగానికి తగ్గించింది. ఈ పరిశ్రమలో పనిచేసే సుమారు 200 మందిలో 80 నుంచి 100 మంది కారి్మకులకు పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితి ఒక్క పటాన్‌చెరులోని బయోమాస్క్ బ్రికెట్ ఫ్యాక్టరీదే కాదు.. జిల్లాలోని పాశమైలారం, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి, హత్నూర, సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మా సంబంధిత కేటగిరీలకు చెందిన పరిశ్రమలను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమలపైనా లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సరైన ఆర్డర్లు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. పారిశ్రామిక ప్రగతి చక్రం ఆగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు అన్ని రకాల పరిశ్రమల కార్యకలాపాలను లాక్డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇచి్చంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూనే ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలపై ఉన్న లాక్‌డౌన్‌తో పాటు, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం పారిశ్రామిక రంగంలోని కార్మికులపై పడుతోంది. కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి దెబ్బ లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడంతో కారి్మకుల ఉపాధిపై దెబ్బ పడుతోంది. అనేక పరిశ్రమలు కాంట్రాక్ట్ కారి్మకులు, రోజువారీ వేతనాలపై పనిచేసే కారి్మకులకు పని ఇవ్వడం లేదు. కేవలం పరి్మనెంట్ కారి్మకులకు మాత్రమే పని కల్పిస్తున్నాయని కారి్మక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పరి్మనెంట్ కారి్మకుల్లో కూడా కొందరిని సెలవులపై వెళ్లాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రోజువారీ వేతనాలు, కాంట్రాక్ట్ కారి్మకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్కండ్ వంటి రాష్ట్రాల నుంచి వచి్చన వలస కూలీలు చాలామంది నెల రోజుల క్రితం నుంచి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక కారి్మకులు పని దొరక్క, చేతిలో చిల్లిగవ్వ లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఫార్మా పరిశ్రమల్లో నిరాటంకంగా ఉత్పత్తి కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రకాల మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్–19కు చికిత్స అందించే మందుల కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి నిరాటంకంగా కొసాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు మూడు షిఫ్టులతో పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా కరోనా సోకుతుండటంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కారి్మకులను ఆదుకోవాలి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిత్యావసరాలతో పాటు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కరోనా బారిన పడిన కారి్మకులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు ఇంట్లో ఉండలేని బాధితులకు హోం ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి. - కొల్కూరి నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్డర్లు తగ్గాయి.. లాక్డౌన్ నిబంధనలతో పరిశ్రమల్లో ఉత్పత్తిని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఆయా రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా నిర్మాణ, ఆటోమొబైల్ వంటి రంగాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. దీంతో సంబంధిత పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోంది. - కాల రమేశ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ -
Lockdown Impact: ‘చిరు’ నవ్వులు దూరం
భూపాలపల్లి: కరోనా మహమ్మారి వేల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. అయిన వారిని కోల్పోయి వేలాది మంది దుఖః అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా పూట గడవక పనుల కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్ ప్రబలడమేమో కానీ కూలీ దొరికి ఇంటికి నిత్యావసర సరుకులు తీసుకెళ్తే బాగుండు అని భావిస్తున్నారు. ఉపాధి లేక వేలాది మంది.. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభించి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు తెరవాలని, మిగతా సమయాల్లో కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ప్రకటించింది. దీంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, వివిధ రంగాల్లో పనులు జరుగక అసంఘటిత రంగంలోని 27 విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా గత 12 రోజులుగా పనులు లేక పస్తులుండాలి్సన పరిస్థితి నెలకొంది. కుటుంబాన్ని వెళ్లదీసేందు కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చేసేది లేక అప్పులు తీసుకొని వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయం.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ చిరు వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటో, ట్రాలీ డ్రైవర్లు లాక్డౌన్ సడలింపు సమయంలో అడ్డాల వద్ద గిరాకీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీ, రిక్షా కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. పొట్టకూటి కోసం రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారం సాగించే కూరగాయలు, పండ్లు, సోడా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్, మిర్చిబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఇంటికే పరిమితమై వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా.. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. పూట ఎల్లుడు ఇబ్బంది ఐతాంది.. లాక్డౌన్ పెట్టినంక పుటకు ఎల్లుడు ఇబ్బంది ఐతాంది. ఇదివరకు రోజంతా రిక్షా తొక్కితే రూ. 400 నుంచి రూ. 500 వచ్చేవి. ఇప్పుడు రిక్షా అడిగినొళ్లే లేరు. అడ్డా మీద రోజుకు నాలుగు రిక్షాలు బయటకు వెళ్తలేవు. రోజుకు ఒక గిరాకీ వస్తే వస్తాంది.. లేదంటే లేనే లేదు. రోజుకు వంద కూడా సంపాదించకపోతే ఇల్లు ఎట్ల గడుస్తది. చాన ఇబ్బంది పడుతానం. - మొలుగూరి సారయ్య, రిక్షా కార్మికుడు ఇంటికాడనే ఉంటాన.. లాక్డౌన్ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాండ్లు తియ్యాలె అంటుండ్రు. మధ్యాహ్నం అయితేనే సోడాలకు గిరాకీ ఉంటది. పొద్దుపొద్దున సోడా తాగెటోళ్లు ఎవ్వరు ఉండరు. పొయిన ఎండాకాలం మొత్తం లాక్‌డౌనే ఉన్నది. ఇప్పుడు కూడా గట్లనే అయింది. ఇంటి కర్చులైతే ఆగవు కదా. పని లేక, పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వాళ్లను ఆదుకోవాలె. - మార్కండేయ, సోడాబండి వ్యాపారి ప్రభుత్వం సాయం అందించాలి కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఎవరూ బయటకు వస్తలేరు. ఆర్టీసీ బస్సులే నడుస్త లేవు. ఇగ మా ఆటోలు నడుస్తయా. ఉదయం 6 గంటలకు ఆటోను అడ్డా మీద ఉంచితే ఒక్కరు కూడా కిరాయి అడుగుతలేరు. రోజుకు రూ. వంద గిరాకీ కూడా అయితలేదు. చూసి చూసి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఆటో ఫైనాన్స్‌కు కిస్తీ తప్పకుండా కట్టాలి్సందే. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. - యార రామకృష్ణ, ఆటో డ్రైవర్ -
Lockdown: కాలక్షేపం పేరిట కాయ్ రాజా కాయ్..
కాలక్షేపమే కొంపముంచుతోంది. సరదాగా మొదలుపెట్టిన పేకాట వ్యసనంగా మారుతోంది. మూడుముక్కలాట సామాన్యుల జేబులను గుల్ల చేస్తోంది. కష్ట పడకుండా సంపాదించాలనే తాపత్రయంతో ఎంతో మంది ఆటకు బానిసలవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ అందరూ ఇంటిపట్టునే ఉండటంతో ఈ ఆట మరింత ఎక్కువైంది. అద్దె ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలు పేకాట స్థావరాలకు వేదికలవుతుండగా, లక్షల్లో నగదు చేతులు మారుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట పేకాటరాయుళ్లు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. - మెదక్ రూరల్ జిల్లాలో మూడు రాజాలు, ఆరు రాణులుగా పేకాట కొనసాగుతుంది. మూడేళ్ల పోలీస్ రికార్డులతో పోలిస్తే జిల్లాలో పేకాట కేసుల సంఖ్య, పట్టుబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2019లో 36 పేకాట కేసులు నమోదవగా, 191 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించగా, రూ.4,46,722 జరిమానా విధించారు. అదే విధంగా 2020లో మొత్తం 90 కేసులు నమోదవగా, 552 మందిని కోర్టులో హాజరుపరచగా, రూ.13,52,789 జరిమానా విధించారు. అలాగే 2021లో ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నమోదు కాగా, 57 మందిని కోర్టుకు తరలించగా రూ. 97,700లను జరిమానా విధించారు. కొంపముంచుతున్న కాలక్షేపం.. జిల్లాలో లాడ్జీలు, అద్దె ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, అటవీ, నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా ఏర్పరుచుకొని యథేచ్ఛగా పేకాటను కొనసాగిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహస్యంగా పేకాట ఆడుతుండటం వల్ల లక్షల్లో నగదు చేతులు మారుతున్నాయి. మెదక్ పట్టణంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, అల్లాదుర్గ్, టేక్మాల్, రేగోడ్, కౌడిపల్లి, కొల్చారం, శంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్ తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు. కాలక్షపం పేరిట మొదలైన పేకాట ఎంతో మంది సామాన్యుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుంది. తనఖా పెట్టి మరీ.. పేకాటరాయుళ్లు తమ స్థోమతను బట్టి రౌండ్ రౌండ్‌కు డబ్బులను పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఆటను కొనసాగిస్తుంటారు. పేకాటలో డబ్బులను పోగొట్టుకున్న కొందరు తిరిగి ఆట ఆడి సంపాదించాలనే కోరికతో తమ వద్ద ఉన్న సెల్ఫోన్లను, వాహనాలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లను సైతం వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి ఆటను కొనసాగిస్తూ సర్వం కోల్పోతున్నారు. ఇంకొందరు ఆటకు అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు పేకాటకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ పెరిగిన ఆట.. కరోనా పేకాటరాయుళ్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరగడం, స్కూళ్లు, కాలేజీలు మూతపడగా, ఆయా శాఖల కార్యాలయాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూలు, లాక్డౌన్లతో పేకాటరాయుళ్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. దీంతో కొందరు గుంపులుగా ఒక చోటకు చేరి అడ్డూఅదుపు లేకుండా పేకాటను కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి తమ స్థావరాలను మార్చుకుంటూ రహస్యంగా పేకాటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి పేకాటను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చట్టరీత్యా చర్యలు తప్పవు.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ప్రత్యేక బృందాలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల పేకాట స్థావరాలను గుర్తించడంతో పాటు పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ప్రజల దృష్టికొస్తే 100 డయల్ చేయాలి లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచి్చన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. - చందనాదీప్తి, ఎస్పీ -
Fishermen: ‘వల’సి సొలసి
బరంపురం: రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్, షట్డౌన్లతో రోజువారీ కూలీలు, కొన్ని సంప్రదాయ వృత్తుల వారు పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనాది కాలంగా చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అయితే మరీ దారుణం. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ వేట కొనసాగించలేని వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమై, ఆకలితో పస్తులుంటున్నారు. కొంతమంది తీరం వైపు చూస్తూ తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తావమని సముద్ర దేవునికి దండం పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, వేటకు వెళ్తే కానీ ఆ రోజు కాలం గడవదని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి, తమకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 475 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న గంజాం జిల్లాలో సూన్‌పూర్ నుంచి చందిపూర్ వరకు దాదాపు 108 మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాల్లోని 15 వేల కుటుంబాలు చేపల వేటని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆదుకోవాలని పలు మత్స్యకార సంఘాల ప్రతినిధులు జి.ఎర్రయ్య, టి.సింహాద్రి, జి.పాపారావు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
లాక్డౌన్ ఫలితం: ముంబైలో కరోనా తగ్గుముఖం!
ముంబై: ముంబైలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం కొత్తగా 3,629 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. లాక్డౌన్ ఆంక్షలు పకడ్భందీగా అమలు చేయడంతో గత వారం రోజులుగా నగరంలో కరోనా కేసులు 3 నుంచి 4 వేలలోపు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో ముంబైకర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కరోజే 79 మంది మృతి చెందారు. కాగా, ముంబైలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,55,997 అయింది. మొత్తం మృతుల సంఖ్య 13,294గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 56,647 కోవిడ్ కేసులు నమోదయినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,22,401కి చేరుకుంది. అలాగే ఆదివారం ఒక్కరోజే 51,356 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 39,81,658కి పెరిగింది. కొత్తగా 669 కరోనా మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 70,284కు చేరుకుంది. ఆదివారం 2,57,470 కరోనా వైరస్ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 2,76,52,758 కరోనా టెస్టులు నిర్వహించారు. మహారాష్ట్ర కరోనా బాధితుల రికవరీ రేటు 84.31 శాతం, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. ప్రస్తుతం 6,68,353 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 39,96,946 మంది గృహ నిర్బంధంలో 27,735 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్లో ఒక్కరోజులో 9,700 కేసులు నమోదయ్యాయి, 156 మంది రోగులు మరణించారు. ముంబై డివిజన్లో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 13,91,160 కాగా, మరణాల సంఖ్య 23,622గా ఉంది. పుణే డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 15,776 కరోనా పాజిటివ్ కేసులు, పుణే నగరంలో 4,194 నమోదు కాగా, లాతూర్ డివిజన్లో కొత్తగా 3,569 కరోనా కేసులు, ఔరంగాబాద్ డివిజన్లో 3,240, కొల్లాపూర్ డివిజన్లో 3,828 కేసులు నమోదయ్యాయి. అకోలా డివిజన్లో 3,601, నాగ్‌పూర్ డివిజన్లో 8,909 కేసులు, నాసిక్‌లో 8,024 కేసులు నమోదయ్యాయి. థానేలో 53మంది మృతి థానేలో ఆదివారం 2,869 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 4,70,050కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపా రు. గత 24 గంటల్లో జిల్లాలో 53 మంది కోవిడ్ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 7,643కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 1.62 గా ఉంది. పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఇప్పటివరకు 87,132 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 1,578 మంది మరణించినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారు రావొద్దు కాగా, నేడు ముంబైలో కరోనా టీకాల కోసం 45 ఏళ్లు పైబడిన వారు రావొద్దని బీఎంసీ సూచించింది. ఐదు కేంద్రాల్లో కేవలం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగలవారికే వ్యాక్సినేషన్ ఉంటుందని పేర్కొంది. నగరంలో టీకాల కొరత ఉందని తెలిపింది. శనివారం వేయి మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. -
వాహన విస్ఫోటం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వాహన విస్ఫోటం దిశగా సాగుతోంది. గత ఐదేళ్లలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రస్తుతం గరిష్టస్థాయికి చేరుకుంది. తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 1,37,47,534 వాహనాలున్నాయి.15 ఏళ్ల కింద రాష్ట్రంలో వాహనాల సంఖ్య కంటే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం లో 83 లక్షల కుటుంబాలు ఉండగా, వాహనాలు 1.37 కోట్లకు చేరాయి. ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 9 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. కోవిడ్ వల్ల గత ఏడాది నుంచి ఆ సంఖ్య కొంత తగ్గగా, వచ్చే సంవత్సరం ఏకంగా 12 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఐదేళ్ల కిందట కోటి..సరిగ్గా ఐదేళ్ల కిందట రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి మార్కును చేరింది. ఇప్పుడా సంఖ్య కోటిన్నరకు చేరువవుతోంది. మరో నాలుగేళ్లలో 2 కోట్లను మించుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం వాహనాల్లో బైక్‌ల వాటా ఏకంగా 74.25 శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో 1.02 కోట్ల బైక్‌లు ఉన్నాయి. గతంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని బైక్ ఆక్రమించింది. హైదరాబాద్ సహా పట్టణాల్లో కచ్చితంగా ఇంటింటా బైక్ ఉండాల్సిందే. గతంలో పండ్లు, పూలు విక్రయించేవారు సైకిళ్లను వినియోగించేవారు. రెండేళ్ల నుంచి వారు మోపెడ్లను వినియోగించటం ప్రారంభించారు. కొన్ని మోపెడ్ తయారీ సంస్థలు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాయి. నెలకు 55 వేల బైక్‌లు.. ప్రతినెలా సగటున 55 వేల నుంచి 60 వేల వరకు బైక్‌లు అమ్ముడవుతున్నాయి. ఇక కార్ల కొనుగోలు కూడా బాగానే పెరిగింది. మధ్యతరగతి వారు ప్రస్తుతం కారును అవసరంగా భావించే పరిస్థితి వచ్చింది. లోన్ పద్ధతిలో కార్లను విక్రయిస్తున్నారు. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కార్ల తయారీ సంస్థలు తక్కువ ధరలో వచ్చే కార్ల మోడళ్లను పెద్ద సంఖ్యలో పవేశపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యక్తిగత కార్ల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ప్రతి నెలా 12 వేల నుంచి 16 వేల వరకు కార్లు అమ్ముడవుతున్నాయి. కోవిడ్ కాలంలోనూ అదే తీరు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో చాలాకుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. కానీ వాహనాలు కొనే విషయంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. కరోనా వల్ల ఇతరులతో కలసి ప్రయాణించేందుకు భయపడ్డ జనం.. సొంత వాహనం ఉండాలన్న అభిప్రాయంతో వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న 2 నెలలు కాకుండా.. మిగతా నెలల్లో వాహనాల కొనుగోలు భారీగానే సాగింది. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కోవిడ్ భయం ఎక్కువగానే ఉంది. ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 4,39,188 ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.6 లక్షలు అమ్ముడయ్యాయి. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోగా, గత నవంబర్‌లో 75 వేలు విక్రయమయ్యాయి. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే, గత డిసెంబరులో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక ఆ 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్ముడుకాగా, గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, 2020 డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2019 సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే వాహనాలు అమ్ముడవటం విశేషం. ఈ మూడు నెలల్లో సగటున నెలకు 75 వేల బైక్‌లు అమ్ముడు కాగా, కార్లు 18 వేల చొప్పున అమ్ముడయ్యాయి. ఉధృతంగా సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయం.. సెకండ్‌హ్యాండ్ వాహనాల అమ్మకాలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. కోవిడ్ సమయంలో అల్పాదాయ వర్గాలు సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు దృష్టి సారించారు. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.1 లక్షల బైక్‌లు చేతులు మారగా, 2020లో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు, 99,807గా ఉండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఇలా.. ద్విచక్ర వాహనాలు: 1,02,12,380 వ్యక్తిగత కార్లు: 16,69,490 మోటార్ క్యాబ్: 1,15,857 సరుకు రవాణా వాహనాలు: 5,45,653 ట్రాక్టర్, ట్రెయిలర్స్: 5,94,677 ఆటో రిక్షా: 4,41,135 స్టేజీ క్యారేజీ వాహనాలు: 18,462 విద్యాసంస్థల బస్సులు: 27,883 మ్యాక్సీ క్యాబ్: 31,070 కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు: 9,063 ప్రైవేటు సర్వీస్ వెహికిల్స్: 2,942 ఈ–రిక్షా కార్ట్: 208 ఇతర వాహనాలు: 78,714 -
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది. భారమవుతున్న ముడిసరుకు.. ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్జీ సవరించింది. కొత్త కస్టమర్ల చేరిక.. ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది. ముందుగా మొదలైన విక్రయాలు.. విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు. వాహనం... భారం! ► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం ► ముడి సరుకు వ్యయాల ప్రభావం ► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పదార్థాల భారం.. ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు. -
బతుకు పూలబాటకాదు
గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది. కరోనా దెబ్బతో విలవిల రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు. కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు రెండున్నర ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్ 23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా -
మద్యం మానేస్తే వచ్చే మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం విపరీతం అయింది. ఎంతంటే, ఒక్క ఆస్ట్రేలియాలోనే ఎప్పటికన్నా 2020 సంవత్సరంలో మద్యం విక్రయాలు రెండు బిలియన్ పౌండ్లు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) పెరిగాయట. మద్యపానం వల్ల మంచికన్నా చెడే ఎక్కువన్న విషయం తెలిసిందే. మద్యం మానేస్తే 31 రోజుల్లో మనువుల ఆరోగ్యం ఎంతో మెరగుపడుతుందని పోషక నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే ఆస్ట్రేలియా వాసులు ప్రతి ఏడాది ‘డ్రై జనవరి’ పేరిట మద్యం తీసుకోకుండా ఉపవాసం పాటిస్తున్నారు. ఆఖరి పెగ్గు తీసుకున్న గంట నుంచి ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తాయని, కొన్ని రోజులు, వారాలు దూరంగా ఉన్నట్లయితే ఆరోగ్యం మరింత మెరగుపడుతుందని డైటీషియన్లు, ఫిట్నెస్ కోచ్‌లు తెలియజేస్తున్నారు. మద్యానికి దూరంగా ఉన్నట్లయితే కాలేయం బాగా పని చేస్తుందని, శరీర బరువు తగ్గుతుందని, మంచి నిద్ర వస్తుందని, జ్ఞాపక శక్తి పెరగుతుందని వారంతా చెబుతున్నారు. మద్యం మానేస్తే శక్తి, సామర్థ్యాలు పెరగడమే కాకుండా ఆర్థికంగా డబ్బు ఎంతో కలసి వస్తోందని ‘డ్రై జనవరి’ పాటిస్తున్న ఆస్ట్రేలియా వాసులు సూచిస్తున్నారు. ప్రతి ‘డ్రై జనవరి’లో 70 శాతం మంది ఆస్ట్రేలియా వాసులు మద్యానికి దూరంగా ఉంటుండగా, ఈ సారి లాక్డౌన్ కారణంగా ఆ సంఖ్య యాభై శాతానికి దిగువకు పడిపోయింది. అందుకే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మద్యం వల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే అవకాశాలు పెరగడంతోపాటు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని, లైంగిక సుఖాన్ని కలగజేసే ‘టెస్టోస్టెరోన్’ ఎంజైమ్ తగ్గిపోతుందని, మహిళలో పీరియడ్స్ పడిపోతాయని, కడుపుల్లో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా వైద్యులు తెలియజేస్తున్నారు. -
లాక్డౌన్ల షాక్- జారుతున్న చమురు
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఫలితంగా అక్టోబర్‌లో నైమెక్స్ చమురు ధరలు నికరంగా 11 శాతం పతనంకాగా.. బ్రెంట్ బ్యారల్ ధరలు సైతం 10 శాతం వెనకడుగు వేశాయి. ఈ బాటలో మరోసారి చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు వెల్తువెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం.. 3.5 శాతం డౌన్ గత వారం భారీగా వెనకడుగు వేసిన ముడిచమురు ధరలు మళ్లీ పతన బాట పట్టాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 3.7 శాతం నష్టంతో 34.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3.25 శాతం క్షీణించి 36.72 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. కారణాలివీ కొద్ది రోజులుగా అమెరికాలో ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల రికార్డ్ స్థాయిలో రోజుకి లక్ష కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరోపియన్ దేశాలలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో బ్రిటన్ తదితర దేశాలు పూర్తిస్థాయి లాక్డవున్లతోపాటు.. కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. దీంతో ఇటీవల ఏర్పడిన ఆర్థిక రివకరీ అంచనాలకు షాక్ తగిలింది. తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ట్రేడర్లలో భయాలు వ్యాపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. ఇటీవల జనవరి నుంచి రోజుకి 2 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిని పెంచేందుకు రష్యా, ఒపెక్ దేశాలు ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. చమురు ఉత్పత్తి, కోతల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయి. -
ముడిచమురుకూ కోవిడ్-19 సెగ
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్‌డవున్‌ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఓకే ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కారణాలివీ అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి.