నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం | Unemployment in the country reached Above 9 percent | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం

Published Thu, Aug 20 2020 5:44 AM | Last Updated on Thu, Aug 20 2020 5:44 AM

Unemployment in the country reached Above 9 percent - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగభూతం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో అది 9.1 శాతానికి చేరుకుంది. గత తొమ్మిది వారాల్లో జాతీయస్థాయిలో ఇదే అత్యధికం. ఆగస్ట్‌ 16తో ముగిసిన వారాంతానికి జాతీయస్థాయిలో చూస్తే... పట్టణాల్లో 9.61 శాతం, గ్రామాల్లో 8.86 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సెంటర్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. ఆగస్టు 9 తేదీ నాటికి 8.67 శాతమున్న దేశ నిరుద్యోగ శాతం ఆగస్టు 16 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ఈ నెలలో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పట్టడం నిరుద్యోగ శాతం పెరగడానికి కారణాలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్‌ తగ్గుదలతో ఉద్యోగ అవకాశాల్లో కోత పడినట్టు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ట్రెండ్‌ కావచ్చని మరికొందరు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం.. వేతనాలు, ఉద్యోగాల (శాలరీడ్‌ జాబ్స్‌)పై అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌తో ముగిసిన నెలకు 6.84 కోట్ల శాలరీడ్‌ జాబ్స్‌ తగ్గగా, జూలై మాసాంతానికి 6.72 కోట్లకు చేరుకున్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

తెలంగాణ, ఏపీల్లో ఏవిధంగా ఉందంటే..
► తెలంగాణలో 9.1 శాతం నిరుద్యోగం నమోదైంది 
► ఛత్తీస్‌గఢ్‌లో 9, తమిళనాడులో 8.1, జార్ఖండ్‌లో 8.8 శాతం  
► ఆంధ్రప్రదేశ్‌లో 8.3 శాతం, కేరళలో 6.8 శాతం 
► పశ్చిమబెంగాల్‌లో 6.8 శాతం, యూపీలో 5.5 శాతం నిరుద్యోగం  

అగ్రస్థానంలో హరియాణా
► హరియాణా 24.5 శాతం నిరుద్యోగంతో టాప్‌ప్లేస్‌లో ఉంది  
► పుదుచ్చేరి 21.1, ఢిల్లీ 20.3 శాతంతో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి 
► హిమాచల్‌ ప్రదేశ్‌ 18.6 శాతంతో నాలుగోస్థానం, గోవా 17.1 శాతంతో ఐదో ప్లేస్‌లో నిలిచింది.  

అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రాలివే... 
► ఒడిశా, గుజరాత్‌ల్లో 1.9 శాతం చొప్పున అత్యల్ప నిరుద్యోగం 
► మేఘాలయ 2.1, అస్సాం 3.2, మధ్యప్రదేశ్, కర్ణాటక 3.6 శాతం చొప్పున 
► మహారాష్ట్ర 4.4, సిక్కింలో 4.5 శాతం నిరుద్యోగం 

10 శాతానికిపైగా నిరుద్యోగమున్న రాష్ట్రాలు..
► త్రిపురలో 16.4, రాజస్తాన్‌లో 15.2, ఉత్తరాఖండ్‌లో 12.4 శాతం నిరుద్యోగం 
► బిహార్‌లో 12.2, జమ్మూ,కశ్మీర్‌లో 11.2, పంజాబ్‌లో 10.4 శాతం నిరుద్యోగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement