సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలిపింది. 2021 డిసెంబర్ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది.
అయితే జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదు కాగా తర్వాత స్థానాల్లో రాజస్తాన్ (27.1 శాతం) జార్ఖండ్ (17.3 శాతం), బిహార్ (16 శాతం), జమ్మూకశ్మీర్ (15 శాతం) ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైనట్లు సీఎంఐఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment