సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడం ఖాయమైంది. ఈక్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్డీకే శివకుమార్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిసిన సంగతి తెలిసిందే. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలాన్నిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని.. ఆమె వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి చాలా లాభమని మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను రెండు విడతలుగా ముందుగానే ప్రకటిస్తామన్నారు.
బీఆర్‌ఎస్ - బీజేపీ ఒకటే అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని కొనియాడారు. భట్టి విక్రమార్క వాహనం అనేది ఎక్కకుండా వంద రోజులుగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఇది పార్టీకి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
(చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్!)
వైఎస్ షర్మిల రిప్లై ఇదే..
ఇదిలా ఉండగా.. మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యలకు భిన్నంగా వైఎస్ షర్మిల ట్వీట్‌తో బదులిచ్చారు. ‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి.
అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే’ అని ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
(చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ)
వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని…
— YS Sharmila (@realyssharmila) June 23, 2023
చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment