హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ కావడం.. రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్‌తో పాటు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడం.. తాజాగా హస్తిన పర్యటనతోనూ దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతుందని చెబుతూనే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడడంతో.. హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిల సైతం ఆయన వెంట ఉండడం గమనార్హం. ‘‘షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి?. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు కదా!. షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్సార్ కూతురిగా ఆమెకు ఎప్పుడైనా కాంగ్రెస్‌లోకి ఆహ్వానం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా లాభమే. ఒకరినొకరు కలుపుకుని బలపడాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీది’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
షర్మిల మౌనం.. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల. ఈ క్రమంలో కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా స్పందన కోరగా.. ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ఢిల్లీ పరిణామాలపై తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయని ఆమె వర్గీయులు చెబుతున్నారు.
Warm congratulations to Sree @RahulGandhi ji on being reinstated as the Member of Parliament. While your unwavering grit continues to rekindle hopes among millions of people across the nation, justice took its course and delivered a verdict that gladdened many hearts.
— YS Sharmila (@realyssharmila) August 8, 2023
I am now…
ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment