సాక్షి, ఢిల్లీ: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
వాస్తవానికి ఇవాళ(శుక్రవారం) కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం నడిచింది. అయితే.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావిడిగా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.
𝐑𝐚𝐣𝐠𝐨𝐩𝐚𝐥𝐑𝐞𝐝𝐝𝐲 𝐦𝐞𝐞𝐭𝐬 𝐁𝐡𝐚𝐭𝐭𝐢, 𝐔𝐭𝐭𝐚𝐦
— Team Congress (@TeamCongressINC) October 26, 2023
Komati Reddy Rajagopal Reddy, who is joining the Congress, had a courtesy meeting with CLP leader Bhatti Vikramarka and MP Uttam Kumar Reddy in Delhi on Thursday night.#KomatireddyRajGopalReddy pic.twitter.com/ZRfsVPuYDu
మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరునున్నారు.
కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, పైగా కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ.. అందుకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. తాను మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని.. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానంటూ ఆయన అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment