CMIE
-
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
ముంబై: దేశంలో నిరుద్యోగం మే నెలలో తగ్గుముఖం పట్టింది. 7.7 శాతానికి తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉపాధి లేమి 8.5 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్ నెలతో పోలిస్తే కార్మికుల భాగస్వామ్య రేటు మే నెలలో 1.1 శాతం తగ్గి 39.6 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున పనుల్లోకి చేరడంతో మే నెలలో కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గుతుందని అంచనా వేసిందేనని తెలిపింది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) దీనివల్ల మే నెలలో ఉపాధి కోసం అన్వేషించే వారి సంఖ్య తగ్గినట్టు వివరించింది. ఫలితంగా కార్మిక శక్తి 453.5 మిలియన్ల నుంచి 441.9 మిలియన్లకు తగ్గిందని సీఎంఐఈ ప్రకటించింది. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. పట్టణాల్లో పనిచేసే కార్మికులు 4.5 మిలియన్లు తగ్గారు. ఏప్రిల్ నెలలో పట్టణాల్లో పనిచేసే కార్మికులు 147 మిలియన్లుగా ఉంటే, మే నెలలో 142.5 మిలియన్లకు తగ్గారు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) పట్టణాల్లో ఉద్యోగుల సంఖ్యతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు యూఎంఐఈ వెల్లడించింది. పట్టణాల్లో కార్మిక శక్తి 129.5 మిలియన్లుగా ఉంటే, 13 మిలియన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరి ఉద్యోగం, నిరుద్యోగం రేటు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు 299.4 మిలియన్లుగా మే నెలలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 306.5 మిలియన్లుగా ఉంది. మరిన్ని బిజినెస్ వార్తలు, సక్సెస్ స్టోరీస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
అమ్మ బాబోయ్! నిరుద్యోగులుగా మారిన భారతీయులు అంత మందా?
2023 ప్రారంభం నుంచి ఎంతోమంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగాలను కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, గత మూడు నెలల కాలంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. భారతీయుల నిరుద్యోగిత రేటు మార్చి నెలలో మునుపటికంటే పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఎంతోమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ డేటాను సిఎమ్ఐఈ విడుదల చేసింది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని కూడా స్పష్టం చేసింది. డిసెంబర్ 2022లో నిరుద్యోగుల రేటు 8.30 శాతం ఉండేది, అయితే ఈ రేటు 2023 జనవరి నాటికి 7.14 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 7.8 శాతానికి పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే డీలర్ యార్డ్‌లో కనిపించిన మారుతి జిమ్నీ - పూర్తి వివరాలు) మార్కెట్లో తీవ్ర క్షీణత ఏర్పడిన కారణంగా 2023 మార్చిలో ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరుగుదల 39.8 శాతానికి చేరిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ 'మహేష్ వ్యాస్' తెలిపారు. అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలలో హర్యానా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత జాబితాలో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
నిరుద్యోగ భారతం! దేశంలో 5.10 కోట్లకు చేరుకున్న నిరుద్యోగులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 5.10 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత శ్రామికశక్తి 2022లో ఇంకా కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థాయికి చేరుకోలేదు. 2019లో శ్రామికశక్తి 44.2 కోట్లుగా ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి సందర్భంగా 2020లో అది 42.4 కోట్లకు తగ్గింది. తిరిగి 2021లో 43.5 కోట్లకు పెరగ్గా తాజాగా ఈ ఏడాది నవంబర్ నాటికి 43.7 కోట్లకు శ్రామికశక్తి చేరుకుంది. 2019లో కరోనా వ్యాప్తికి ముందు 4.5 కోట్లుగా ఉన్న నిరుద్యోగులు, 2020లో 5.3 కోట్లకు, 2021లో 4.8 కోట్లకు 2022 నవంబర్‌లో 5.1 కోట్లకు చేరుకున్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 11 శాతం దాకా నిరుద్యోగులు ఉన్నారనే విషయం వెల్లడైంది. అదే సమయంలో డిసెంబర్లో నిరుద్యోగిత శాతం 8.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా 9.9 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.1 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆర్థికరంగ విశ్లేషకుడు డి. పాపారావు తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. నిరుద్యోగితకు కారణాలు ఇవే... ►ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు. ►కేంద్రంఅవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు దేశానికి నష్టం చేస్తున్నాయి. ►ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడానికి బదులు కార్పొరేట్లకు డబ్బులిస్తోంది. ►ప్రస్తుతమున్న పరిశ్రమలే 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగాలనే తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేస్తే మేలు... ►ప్రభుత్వ ఆర్థిక విధానాల మార్పుతోనే పరిస్థితులు మారతాయి. ►సాగులో డిమాండ్‌ను సృష్టించాలి. ►కనీస మద్దతు ధర పెంచాలి. చౌకగా విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. ►ఒక్క వ్యవసాయ సీజన్లో గుణాత్మక మార్పు తీసుకురాగలిగితే ఉపాధి కల్పనలో మార్పు దానంతట అదే వస్తుంది. -
ఏపీలోనే నిరుద్యోగం తక్కువ
సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. అంతేకాదు దేశీయ సగటు కంటే కూడా ఏపీ నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి జాతీయ సగటు నిరుద్యోగ రేటు 8.3%గా ఉండగా.. ఏపీలో నిరుద్యోగ రేటు 6 శాతమేనని సీఎంఐఈ తెలిపింది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉంది. తమిళనాడులో 7.2%గా ఉంటే.. తెలంగాణలో 6.9%గా నమోదయ్యింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో 37.3%, జమ్మూ అండ్ కశ్మీర్ 32.8, రాజస్తాన్‌లో 31.4% ఉండగా.. అత్యల్పంగా చత్తీస్‌గఢ్‌లో 0.4% మేర నిరుద్యోగముంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో 2.2%, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 2.6%గా నిరుద్యోగ రేటు నమోదయ్యింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కోవిడ్‌ను అధిగమించి.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2020 ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 23.6 శాతానికి చేరగా.. ఏపీలో 20.5 శాతంగా నమోదయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తీసుకున్న చర్యలతో నిరుద్యోగ రేటు తగ్గుతూ వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విభాగాల్లో కలిపి మొత్తం 6,16,323 మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించింది. ఇందులో శాశ్వత ఉద్యోగాలు 2,06,638 ఉన్నాయి. ఇవి కాకుండా కోవిడ్ సమయంలో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు మూతపడకుండా.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే విధంగా చేపట్టిన చర్యలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి ఎంఎస్ఎంఈలను ఆదుకోవడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించింది. అలాగే ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ఇప్పటికే పలు సంస్థలు తమ పరిశ్రమలను ప్రారంభించడంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
నిరుద్యోగం పైపైకి.. ఉద్యోగాలు లేక యువత విలవిల
న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటేశామని మీసాలు మెలేస్తున్నాం. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశ్మీర్లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి. 40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్ కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది. ప్రభుత్వం ఏం చేస్తోంది ? నిరుద్యోగం కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2023 చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రైవేటు రంగంలో పని చేయడానికి నిపుణులైన కార్మికులు లభిస్తారన్నది కేంద్రం వాదనగా ఉంది. రవాణా రంగంలో ఊబర్, ఓలా, ఆతిథ్య రంగంలో ఇంటికి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి, జోమాటో సర్వీసులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ తయారీ రంగం, మౌలికసదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం -
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్‌కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్‌కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
3.6 కోట్ల మంది.. యువతకు ఉద్యోగాల్లేవు
సాక్షి, హైదరాబాద్: దేశ యువత త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. 2021లో 18–29 ఏళ్ల మధ్య వయస్సులోని 3.6 కోట్లమంది యువజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక నిరుద్యోగం కోరల్లో చిక్కుకున్నారు. కోట్లాది మంది చాలా తక్కువ జీతాలు, వేతనాలతో కూడిన ఉద్యోగాలతో సర్దుబాటు చేసుకున్నారు. కాగా భారత్‌లో గత డిసెంబర్లో నిరుద్యోగిత శాతం 7.91గా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2017–18లో ఇది 4.7 శాతంగా, 2018–19లో 6.3 శాతంగా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని దాదాపు 140 కోట్ల జనాభాలో ఐదో వంతు కంటే ఎక్కువగా ఉన్న యువతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని సీఎంఐఈ పేర్కొంది. కోవిడ్‌తో మరింత పెరిగిన నిరుద్యోగిత కోవిడ్ మహమ్మారి కాలంలో.. గత రెండేళ్లుగా ఎదురైన విపత్కర పరిస్థితులు, వివిధ రకాల కంపెనీలు, ఉత్పాదకసంస్థల మూత, వ్యాపారాలు దెబ్బతినడంతో యువతరం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. కెరీర్ ప్రారంభంలోనే దీర్ఘకాలం పాటు నిరుద్యోగులుగా గడపాల్సి వచ్చింది. దీని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి కంటే ముందునుంచే యువతలో నిరుద్యోగిత శాతం ఎక్కువగానే ఉండగా, మహమ్మారి కారణంగా అది మరింత తీవ్రరూపం దాల్చిందని ఆర్థికవేత్తలు వెల్లడించారు. 30 లక్షల మంది మహిళల ఉపాధికీ కోత కోవిడ్ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో లాక్డౌన్లు, ఆంక్షలు, నిబంధనలు ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపించడంతో పాటు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన కోతకు ఆస్కారమేర్పడిందని చెబుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే.. 2020–21లో 45 లక్షల మంది పురుషులు, 30 లక్షల మంది మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టుగా సెంటర్ ఫర్ ఎకనమిక్ డేటా అనాలిసిస్, సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఆర్థికరంగ విశ్లేషకులు డి.పాపారావు, హెచ్ఆర్ నిపుణురాలు డాక్టర్ డి.అపర్ణారెడ్డి తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆరు నెలల్లో మామూలు స్థితికి చేరుకోవచ్చు అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఈ–కామర్స్ ఇండస్ట్రీ, ఆతిథ్య, హోటల్, పర్యాటకం, తదితర అనుబంధ పరిశ్రమలు బాగా దెబ్బతినడం నిరుద్యోగిత శాతం పెరగడానికి ప్రధాన కారణం. కరోనా కాలంలో వివిధ రకాల పరిశ్రమలు దెబ్బతినడం, మూతపడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉండకపోవచ్చు. వచ్చే ఆరునెలల్లో మామూలు స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా తగిన నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ బాగానే ఉంటోంది. అయితే ఈ స్కిల్స్ ఉన్నవారు మన దగ్గర 5 నుంచి 10 శాతం లోపే ఉంటారు. –డాక్టర్ డి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు ఉద్యోగ, ఉపాధి రహిత వృద్ధి జరుగుతోంది నిరుద్యోగం పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఉత్పత్తి, సర్వీసు రంగాల్లో యాంత్రీకరణ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియామకాల పెరుగుదలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి రంగం లేకుండా బతికే స్థితికి చేరుకుంటున్నాం. ఉత్పత్తి లేకపోతే ఉద్యోగాలుండవు. దేశంలో తయారీ పరిశ్రమ (మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీ)లు వస్తున్నా ఉద్యోగాలు పెరగడం లేదు. ఆటోమేషన్ దీనికి ప్రధాన కారణం. అలాగే కార్ల కంపెనీలు వస్తున్నా పెయింట్లు వేయడం మొదలు, అసెంబ్లింగ్ తదితర ఉత్పత్తి శ్రమను రోబోలే నిర్వహిస్తున్నాయి. మనుషులతో అవసరం లేకుండా యంత్రాలే చేసేస్తున్నాయి. ఇలా మూడు, నాలుగేళ్లుగా ఉపాధి రహిత అభివృద్ధి ఉండింది. తాజాగా ఉద్యోగ రహిత వృద్ధి అనేది వచ్చింది. ఉన్న ఉద్యోగాలు పోయే దశ ఇది. మరోవైపు ఉద్యోగాలు లేక కొనుగోలు శక్తి తగ్గి ఆర్థికరంగం కుచించుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, నామమాత్రం చదువుకున్న వారి కోసం పట్టణ ఉపాధి పథకాలు తీసుకురావాలి. లేనిపక్షంలో నిరుద్యోగ విస్ఫోటనం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. – డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు -
తెలంగాణలో నిరుద్యోగం ఎంతంటే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలిపింది. 2021 డిసెంబర్ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. అయితే జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదు కాగా తర్వాత స్థానాల్లో రాజస్తాన్ (27.1 శాతం) జార్ఖండ్ (17.3 శాతం), బిహార్ (16 శాతం), జమ్మూకశ్మీర్ (15 శాతం) ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైనట్లు సీఎంఐఈ తెలిపింది. -
తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..
సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగురాష్ట్రాల్లో నిరు ద్యోగం తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రాల్లో నిరు ద్యోగిత జాతీయసగటు కంటే మెరుగ్గా ఉంది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టో బర్ నాటికి జాతీయస్థాయి నిరుద్యోగరేటు 7.75% ఉండగా, తెలంగాణలో 4.2, ఆంధ్రప్రదేశ్‌లో 5.4 శాతం చొప్పున నమోదైందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిరుద్యోగరేటు క్రమేపీ తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అగ్రస్థానంలో హరియాణా: నిరుద్యోగరేటులో హరియాణాదే అగ్రస్థానం. జాతీయసగటు కంటే ఎక్కువశాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా (30.7 శాతం), రాజస్థాన్ (29.6 శాతం), జమ్మూ, కశ్మీర్ (22.2 శాతం), జార్ఖండ్(18.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.1 శాతం), బిహార్ (13.9 శాతం), గోవా (11.7 శాతం), పంజాబ్ (11.4 శాతం), ఢిల్లీ (11 శాతం), సిక్కిం (10 శాతం), త్రిపుర (9.9 శాతం)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగరేటు నమోదైంది. -
మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు దేశంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆగష్టులో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు. ‘‘మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం. ఈ ప్రభుత్వం స్నేహితులు కాని వారి వ్యాపారాన్ని, ఉపాధిని ప్రోత్సహించదు. దానికి బదులుగా వ్యాపారాలు కలిగి ఉన్న వారి నుంచి ఉద్యోగాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని రాహుల్ విమర్షించారు. స్వతంత్ర థింక్ ట్యాంక్ వివరాల ప్రకారం.. జులైలో 6.96 శాతం ఉన్న జాతీయ నిరుద్యోగం గత నెలలో 8.32 శాతానికి పెరిగిందన్నారు . ఆగస్టులో పట్టణ నిరుద్యోగం 9.78 శాతంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు మార్చిలో 7.2 శాతం ఉండగా.. జూలైలో 8.3 శాతం పెరిగిందన్నారు. చదవండి: భూములు, డబ్బులపై అత్యాశ, ఆసక్తి లేవు దేశవ్యాప్తంగా కనీసం ఎనిమిది రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా,రాజస్థాన్ ఇప్పటికీ రెండంకెల నిరుద్యోగ రేట్లను నివేదిస్తున్నాయి. హర్యానా నిరుద్యోగిత రేటు అత్యధికంగా 35.7 శాతంగా ఉంది. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి విఫలమైందని దుయ్య బట్టారు. పైగా "ఆర్థిక నిర్మాణాన్ని నాశనం చేసే" విధానాలను రూపొందించి, కోట్ల మందిని నిరుద్యోగులుగా మార్చారని ఆరోపించారు. నరేంద్ర మోదీ విధానాల ద్వారా 14 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చదవండి: హుజురాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
గణాంకాలు–వాస్తవాలు
బ్రిటిష్ మాజీ ప్రధాని బెంజమిన్ డిజ్రేలీ స్వయంగా నవలా రచయిత కూడా కనుక తన అనుభవాన్ని రంగరించి గణాంకాల గురించి ఓ చక్కని మాట చెప్పారు. గణాంకాలు చెప్పని వాస్తవాలేమిటో తెలుసుకున్నాకే వాటిని విశ్వసించాలన్నారు. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి విడుదల చేసిన జీడీపీ, జీవీఏ గణాంకాలను ఆ దృష్టితో చూడకతప్పదు. దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ అమలైన గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్ 24.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు, ఈసారి అదే త్రైమాసికంనాటికి 20.1 శాతానికి ఎగబాకిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి భారీగా కేసులు నమోదైన సమయంలో జీడీపీ ఇంతగా వృద్ధి చెందడం గమనించదగ్గదని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంటున్నారు. నిరుడు తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థను అవస్థలపాలు చేసిన కరోనా, ఈ ఏడాది మరింత ఉగ్రరూపం దాల్చినా మనల్ని ఏమీ చేయలేకపోయిందని కూడా ఆయన చెప్పారు (చదవండి: ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?) ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ను పరిగణించవచ్చునని ఆయన లెక్కేశారు. ఆయనే కాదు...ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్ అండ్ పీ వగైరా సంస్థలు భారత వార్షిక వృద్ధి రేటు ఈసారి చైనాను అధిగమిస్తుందని జోస్యం చెప్పాయి. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ 16.9 శాతం కుంచించుకుపోయింది. అదే సమయంలో ప్రస్తుత వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంకు, బ్లూమ్‌బర్గ్ అంచనాలకు దగ్గరగానే ఉంది. కరోనా మహమ్మారి కంటే చాలా ముందే మన ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరానికి ముందు 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2020 ఆర్థిక సంవత్సరానికి 4 శాతానికి పడిపోయింది. అనాలోచితమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, హడావుడిగా అమలుచేసిన జీఎస్టీ ఇందుకు కారణాలు. అయితే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకూ భరోసానిస్తూ దేన్నయినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకున్నదని, ఇది తిరిగి మరింత శక్తిమంతంగా పుంజుకుంటుందని చెప్పారు. కరోనా మహమ్మారి కాటేయకపోతే ఆయన ఆశలు నెరవేరేవేమో! కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. వేరే దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికింది. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు కూడా మనల్ని అధిగమించాయి. అసలు జీడీపీ ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేయడం సరికాదన్నది పలువురు ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న వాదన. నిర్దిష్ట కాలంలో వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవా రంగం తదితరాల్లో సాగిన లావాదేవీల మారకపు విలువ ఆధారంగా జీడీపీని లెక్కగడతారు. అయితే ఈ సంపదంతా ఏ రకంగా పంపిణీ అవుతున్నదన్న అంశమే ప్రధానం. కరోనాకు ముందే కుంగిపోవడం మొదలైన సామాన్యుల జీవితాలు ఆ మహమ్మారి కాటుతో మరింత దెబ్బతిన్నాయి. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిటా ఉపాధి లేమి ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఫలితంగా ప్రజానీకం సగటు ఆదాయం గణనీయంగా క్షీణించింది. ప్రజారోగ్యం సరేసరి. కరోనా మహమ్మారి దాన్ని బాహాటంగా బయటపెట్టింది. తాజాగా భారతీయ ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం(సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి. (చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..) గత నెలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షలమంది ఉపాధి కోల్పోయారని దాని సారాంశం. ఇందులో గ్రామీణ భారతం వాటాయే అధికమని ఆ సంస్థ అంచనా వేస్తోంది. అంతకుముందు జూలై నెలలో కొద్దో గొప్పో సాధించిన పురోగతి కాస్తా నెలరోజుల వ్యవధిలో తిరగబడిందని సీఎంఐఈ అంటున్నది. జూలై నెలలో నిరుద్యోగిత 6.95 శాతం ఉంటే ఆగస్టులో అది 8.32 శాతం. తరచి చూస్తే జూలై నెలలో పుంజుకున్నట్టు కనబడిన ఉపాధి అవకాశాలన్నీ సాగు రంగానికి సంబంధించినవేనని అర్థమవుతుంది. వానాకాలంలో వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు జోరందుకోవడం ఇందుకు ప్రధాన కారణం. జీడీపీ గణాంకాలు చూసి, స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న తీరు చూసి మన ఆర్థిక వ్యవస్థ క్రమేపీ సాధారణ స్థితికి చేరుకుంటున్నదన్న అభిప్రాయం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో కనబడుతోంది. కానీ జీడీపీని, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటాయి. వాటికి క్షేత్ర స్థాయి వాస్తవాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఉదాహరణకు సీఎంఐఈ ప్రకారం 2,546 కంపెనీల నికర అమ్మకాలు 2019 జూన్ త్రైమాసికం స్థాయికి చేరకపోయినా, వాటి నికర లాభాలు మాత్రం కరోనా మహమ్మారికి ముందునాటికన్నా బాగున్నాయి. వ్యయంలో భారీగా కోత వేయడం వల్లే ఇది సాధ్యమైందని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. పెరిగిన ముడి సరుకుల వ్యయాన్ని తగ్గించుకోవడం ఎటూ సాధ్యం కాదు. ఏతా వాతా కోత పడేది ఉద్యోగాల్లోనే. అలాగే వడ్డీ రేట్ల పెంపుదల ఉండదని ఆర్బీఐ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు హుషారుగా ఉన్నాయి. మొత్తానికి గత ఏడాది ఇదే సమయంలో అట్టడుగుకు పడిపోయిన వృద్ధితో పోల్చడం వల్లే ఈసారి జీడీపీ మెరుగ్గా ఉన్నట్టు కనబడుతోంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పుంజుకోనిదే ఉపాధి అవకాశాలుండవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. ఇవి సాధ్యం కావాలంటే కేంద్ర వ్యయం భారీగా పెరగాలి. పెట్రో ఉత్పత్తులపై పరోక్ష పన్నుల భారం తగ్గించాలి. ద్రవ్య లోటును అదుపు చేయడం ప్రధానమే. కానీ ఉపాధి అవకాశాలనూ, కొనుగోలు శక్తినీ పెంచకుండా కృత్రిమంగా పైకి ఎగబాకే వృద్ధి రేటును చూసి ఎన్నాళ్లు సంతృప్తి పడతాం? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. (చదవండి: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్!) -
పట్టణ, గ్రామీణ ఉపాధికి సెకండ్ వేవ్ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయం, లాక్డౌన్ ఆంక్షలు ఉద్యోగ భారతాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో వారపు నిరుద్యోగిత రేటు బాగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు భారీగా ఎగిసింది. జూలై 25తో ముగిసిన వారంలో ఇది 6.75 శాతానికి పెరిగిందని తాజా డేటా వెల్లడించింది. అంతకు ముందు వారం ఇది 5.1 శాతం ఉంది. ప్రస్తుత జాతీయ నిరుద్యోగిత రేటు 7.14 శాతంగా ఉండగా, అంతకుముందు వారంలో ఇది 5.98 శాతంగా ఉంది అయితే గ్రామీణ పప్రాంతంతో పోలిస్తే పట్టణ ఉపాధిలో స్వల్ప పెరుగుదల నమోదైంది. జూలై 25 తో ముగిసిన వారంలో పట్టణ నిరుద్యోగం 8.01 శాతంగా నమోదైంది. అంతకుముందు వారం క్రితం 7.94 శాతంగా ఉంది. అయితే పట్టణాల్లో కోవిడ్ నిబంధనలను సడలించినప్పటికీ పట్టణ నిరుద్యోగిత రేటు గ్రామీణ, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. జూలై 25 తో ముగిసిన వారంలో మొత్తం నిరుద్యోగిత రేటు పెరిగినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ తరువాత గత మూడు నెలలకంటే పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎంఐఈ పేర్కొంది. జూన్‌లో నెలవారీ జాతీయ నిరుద్యోగిత రేటు 9.17 శాతంగా ఉండగా, పట్టణ నిరుద్యోగం 10.07 శాతం, గ్రామీణ భారతదేశంలో 8.75 శాతంగా ఉంది. మెరుగైన వాతావరణానికి తోడు, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం లాంటివి దీనికి సాయపడినట్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవేవ్తో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమలు కావడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో గ్రామీణ, పట్టణ ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. అయితే మే నెలలో 11.9 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్ 1 నాటికి 9.17 శాతానికి దిగి వచ్చింది. -
జనవరి నుంచి భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు
కరోనా మహమ్మారి వల్ల దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా విషాద ఛాయలు మిగిలిచింది. కొందరు తమ ఆప్తుల్ని కోల్పోతే, మరి కొందరు ఆర్ధికంగా నష్ట పోయారు. గత ఏడాది మార్చిలో లాక్ డౌన్ విధించడం వల్ల అప్పుడు చాలా మంది జీవితాల మీద కత్తి వేలాడింది. కొందరు మానసిక భాదను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దేశంలో ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయి. మధ్యలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికి తిరిగి విజృంభించడంతో ఇంకా దేశంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2021 మేలో 11.9 శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు జూన్ ప్రారంభం వరకు పెరుగుతూనే ఉంది. జూన్ నెలలో కేసులు తగ్గుముఖం పట్టిన కూడా నిరుద్యోగ రేటు 13శాతానికి చేరుకుంది. అసంఘటిత రంగంలో లాక్ డౌన్ కారణంగా కోల్పోయిన ఉద్యోగాలు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని రంగాలలో ఇంకా ఇప్పటికీ నియామకాలు జరగ లేదు. సీఎంఐఈ ప్రకారం, జనవరి 2021 నుంచి కోల్పోయిన మొత్తం వ్యవసాయేతర ఉద్యోగాల సంఖ్య 36.8 మిలియన్లు ఉంటే ఇందులో రోజువారీ వేతన కార్మికులు 23.1 మిలియన్ల మంది ఉన్నారు. ఇంకా వేతన ఉద్యోగులు 8.5 మిలియన్ల మంది ఉన్నారు. కొన్ని కంపెనీలు కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అనే కారణం చేత ఇప్పటికీ నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..? -
ఆర్థిక అవస్థ!
వ్యవసాయం, మత్స్యరంగం, అటవీ రంగం మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెలువరిం చిన గణాంకాలు ఆర్థిక నిపుణులు కొంతకాలంగా వ్యక్తం చేసిన భయాందోళనలను ధ్రువీకరిస్తు న్నాయి. కరోనా మహమ్మారి తొలి దశను అడ్డుకోవటానికి నిరుడు దీర్ఘకాలంపాటు విధించిన లాక్డౌన్ వల్ల మొత్తంగా వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్బీఐ, ఇతర సంస్థలు భావించినా నాలుగో త్రైమాసికంలో అన్ని రంగాలూ ఏదోమేర పనిచేయటం మొదలుకావటంతో ఆ సమ యంలో స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదు చేసిన పర్యవసానంగా మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం స్వల్పంగా తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రతికూల వృద్ధి నమోదు కావటం ఇదే తొలిసారని అంటున్నారు. ద్రవ్యలోటు సైతం జీడీపీలో 9.3 శాతమని తేలింది. దేశ పాలకుల దగ్గర ఇందుకు సంబంధించి ముందస్తు అంచనాలు ఏమేరకున్నాయోగానీ అంతా సవ్యంగా వున్నదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో కలగజేయటానికి ప్రయత్నించటమే గత ఏడెనిమిది నెలలుగా కనబడుతుంది. ఒకపక్క అమెరికా మొదలుకొని అన్ని దేశాలూ తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకొంటుండంగా, రకరకాల ప్యాకే జీల ద్వారా చేసిన కేటాయింపులు, వాటి చుట్టుతా వున్న నిబంధనలవల్ల మెజారిటీ ప్రజలకు అందకుండా పోయాయి. విద్యావంతులైన యువత ఉపాధిని కోల్పోయింది. కొత్తవారికి ఉపాధి ఊసేలేదు. రోజువారీ పనులు చేసి పొట్ట పోసుకునే వర్గాల పరిస్థితి అయితే మరింత దారుణం. ఇన్ని వర్గాలు నిస్సహాయ స్థితిలో పడబట్టే వినియోగం బాగా పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నది వాస్తవం. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడింది. తయారీ రంగం అనుకున్నంత కాకపోయినా కొంతయినా పుంజుకుంది. అది పన్నుల వసూళ్లలో ప్రతిఫలి స్తున్నది. కేంద్రానికి పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాతో పోలిస్తే 5.5 శాతం అధికమని తేలింది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనే వర్గాలెక్కడ? వినియోగదారుల సూచీని గమనిస్తే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు డిసెంబర్లో డిమాండ్ గణనీయంగా పడిపో యిందని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం చీఫ్ మహేష్ వ్యాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 97 శాతం కుటుంబాల ఆదాయం క్షీణించిందని ఆ సంస్థ సర్వే తెలి పింది. కేవలం 3 శాతం కుటుంబాలు మాత్రమే తమ ఆదాయం పెరిగిందని చెప్పాయి. 55 శాతం కుటుంబాలు ఏదో నెట్టుకు రాగలుగుతున్నామని చెప్పగా...మిగిలిన 42 శాతం కుటుం బాలు కరోనాకు ముందూ తర్వాతా ఒకేలా వున్నామని చెప్పాయి. అంటే జనాభాలో అధిక శాతంమంది ఆదాయ క్షీణత అంతక్రితమే మొదలైందన్నమాట. ఈమధ్య ఫిక్కీ సంస్థ రూపొందించిన బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ(బీసీఐ)ని కూడా ప్రస్తావిం చుకోవాలి. వర్తమాన పరిణామాలు చూశాక వ్యాపార సంస్థల్లో ఆత్మవిశ్వాసం బాగా సన్నగిల్లిం దని ఆ సర్వే చెబుతోంది. మూడు త్రైమాసికాలకు ముందున్న ఆత్వవిశ్వాసం వ్యాపా రుల్లో ఇప్పుడు కొరవడిందని అది వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ. 145 లక్షల కోట్లు కాగా, నిరుడు దీనికి పదిలక్షల కోట్ల మేర గండి పడింది. కనీసం 2019– 20నాటి స్థితికి చేరాలన్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు. మన జీడీపీ 2019–20నాటి స్థాయికెళ్లాలంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కావాలి. ఈ రెండో దశ కరోనాలో పరిమిత స్థాయిలో విధించిన లాక్డౌన్ల వల్ల నిరుడు కలిగినంత నష్టం వుండకపోవచ్చు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారి ఉపాధిని ఈ లాక్డౌన్లు పూర్తిగా ఊడ్చిపెట్టాయి. ఇదంతా మౌనంగా వీక్షిస్తున్న సాధారణ పౌరుల్లో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత, ఔషధాల కొరత, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి వగైరా కారణాలతో కళ్లముందు జనం పిట్టల్లా రాలిపో వటంచూశాక వారు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. రోజువారీ తప్పనిసరి అవస రాలు మినహా మరి దేనిపైనా వ్యయం చేసేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. కనుకనే విని యోగం భారీగా పడిపోయింది. ఆదాయ కల్పన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్యలు తీసుకుంది. వివిధ పథకాలకింద నగదు బదిలీ ద్వారా రూ. 95,528 కోట్లను...ఇతరేతర పథకాల ద్వారా పరోక్షంగా రూ. 36,197 కోట్లను ప్రజలకు అందజేసింది. అంటే రూ. 1,31,725 కోట్ల మొత్తం ప్రజానీకానికి చేరింది. ఈ గణాంకాలు గత రెండేళ్లలో అమలైన పథకాలకు సంబంధించినవే అయినా ఇందులో అధిక కాలం కరోనా ముట్టడిలోనే గడిచిందన్నది గుర్తుంచుకోవాలి. కేంద్రం చర్యలు కూడా దీనికి దీటుగా వుంటే ఆర్థిక వ్యవస్థకు అది మరింత తోడ్పడేది. కనీసం కరోనా టీకాలైనా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందు బాటులోకొస్తే పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకోవటం మొదలవుతుంది. 2019 సెప్టెంబర్‌లో జీడీపీ తగ్గినప్పుడు వృద్ధి ప్రక్రియలో అదొక భాగమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది కనుక కేంద్రం పునరాలోచించాలి. -
కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ రెండో దశలో దేశాన్ని అతలాకుతలం చేసింది. రికార్డు స్థాయిలో రోజుకు 4 లక్షలకుపైగా కేసులు నమోదైన తరుణంలోఅనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయంతో అనేక కుటుంబాలు చితికిపోవడే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) కీలక అంచనాలను వెలువరించింది. కరోనా రెండో దశలో ఉధృతి కారణంగా కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, గృహాల ఆదాయం 97 శాతం క్షీణించిందని తెలిపింది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌లో భారీగా ఉద్యోగ నష్టం జరిగిందని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. సుమారు10 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. గత సంవత్సరం మహమ్మారి ప్రారంభ మైనప్పటి నుంచి 97 శాతం గృహ ఆదాయం క్షీణించిందని, ఏప్రిల్‌లో ఇది 8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు మే నెలాఖరులో 12 శాతంగా నమోదు కావొచ్చన్నారు. అయితే లాక్డౌన్ల ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకాలాపాల ప్రారంభతరువాత ఆర్థిక పరిస్థతి బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి ఉపాధి పొందడం కష్టమేన్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగ ఉద్యోగాలు త్వరగానే తిరిగొచ్చినా, సంఘటిత, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుందన్నారు. గత ఏడాదికాలంలో ఆదాయాల తీరుపై 1.75 లక్షల గృహాలపై సీఎంఐఈ ఏప్రిల్‌లో దేశవ్యాప్త సర్వే పూర్తి చేసిందని వ్యాస్ చెప్పారు. ఈ కాలంలో కేవలం 3 శాతం మంది ఆదాయాలు మాత్రమే పెరిగాయని, కోవిడ్ వేవ్స్ కారణంగా దాదాపు 55 శాతం మంది ఆదాయాలు ప్రభావితమయ్యాయన్నారు. ఇక 42 శాతం మంది తమ ఆదాయాలు అంతకుముందు ఏడాది మాదిరిగానే ఉన్నాయని చెప్పారు. కరోనాత దేశంలో 97 శాతం కుటుంబాల ఆదాయాలు క్షీణించాయని, జాతీయ లాక్డౌన్ కారణంగా నిరుద్యోగిత రేటు 2020 మేలో రికార్డు స్థాయిలో 23.5 శాతానికి చేరుకుందన్నారు. అలాగే మహమ్మారి ముందు కాలంలో 42.5 శాతంగా కార్మిక భాగస్వామ్య రేటు ప్రస్తుతం 40 శాతానికి తగ్గిందని ఆయ పేర్కొన్నారు. చదవండి : Mamata Banerjee: బెంగాల్లో బీజేపీకి మరో షాక్! Petrol, Diesel Prices: వరుసగా రెండో రోజూ బాదుడు -
‘వేవ్’లో కొట్టుకుపోతున్న ఉపాధి
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్ వేవ్ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఒక్క ఏప్రిల్‌లోనే 70.35 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానవిు(సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌లో దేశంలో నిరుద్యోగిత 8 శాతానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్/కర్ఫ్యూ నిబంధనలతో ఏప్రిల్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. ► దేశంలో ఉపాధి కార్యకలాపాల్లో కార్మికుల భాగస్వామ్యం ఏప్రిల్‌లో 39.98శాతానికి తగ్గిపోయింది. గతేడాది లాక్డౌన్ ఎత్తేశాక దేశంలో కార్మికుల భాగస్వామ్యం ఇంత ఎక్కువగా తగ్గడం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చిలో 6.80 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఏప్రిల్‌లో 8 శాతానికి పెరిగింది. ► ఏప్రిల్‌లో దేశంలో 70.35 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ► వీరిలో ఏకంగా 60లక్షల మంది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఆయా రంగాల్లో మార్చిలో 12 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా, ఏప్రిల్‌లో 11.40 కోట్ల మందికే ఉపాధి అవకాశాలు లభించాయి. ► వ్యాపార రంగంలో రోజువారి కూలీలు 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. ► ఉద్యోగులు 3.40 లక్షల మంది తమ జాబ్‌లను కోల్పోయారు. మొత్తంమీద కరోనాతో ఏడాది కాలంగా 1.26 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. 2020 మార్చిలో దేశంలో 8.59 కోట్ల మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.33 కోట్లమందే ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయినవారిలో పట్టణ ప్రాంతాలకు చెందినవారు 68 శాతం, గ్రామీణ ప్రాంతాలవారు 32 శాతం మంది ఉన్నారు. -
రికార్డుస్థాయిలో ఉద్యోగాలు: సీఎంఐఈ నివేదిక
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటూ ఉండటం ఉద్యోగ అవకాశాలపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగాల కల్పనలో కొత్త ఏడాది 2021 సానుకూలంగా ప్రారంభమైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. 2021 జనవరిలో దేశంలో నిరుద్యోగిత 6.5 శాతానికి తగ్గిందని ఆ నివేదిక తెలిపింది. లాక్డౌన్ తరువాత నిరుద్యోగిత ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. సీఎంఐఈ నివేదికలోని ప్రధానాంశాలు.. ♦ 2020 డిసెంబర్లో దేశంలో నిరుద్యోగిత రికార్డుస్థాయిలో 9.1 శాతంగా ఉండగా, 2021 జనవరిలో నిరుద్యోగిత 6.5 శాతానికి తగ్గింది. ♦ 2021 జనవరిలో దేశంలో కొత్తగా 37.9 శాతం ఉద్యోగాలు లభించాయి. ♦ 2020 డిసెంబరులో దేశంలో 38.80 కోట్ల మంది ఉద్యోగులుగా ఉండగా, 2021 జనవరిలో ఆ సంఖ్య 40.07 కోట్లకు పెరిగింది. లాక్డౌన్ తరువాత ఇంతగా ఉద్యోగాలు పెరగడం ఇదే ప్రథమం. ♦ దేశంలో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండి ఉద్యోగం లేనివారు 2019–20లో సగటున 3.3 కోట్లమంది ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 2.8 కోట్లకు తగ్గింది. ♦ దేశంలో ఉద్యోగుల్లో అత్యధికులు పర్మినెంట్ ఉద్యోగాల్లో లేరు. వారి ఉద్యోగాలు దేశ ఆరి్థక పరిస్థితి, స్థానిక పరిస్థితులు, వ్యాపార కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. చదవండి: నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం -
6 నెలల గరిష్టానికి నిరుద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరునెలల్లో గరిష్టస్థాయికి చేరింది. గతేడాది డిసెంబర్లో నిరుద్యోగిత 9.06 శాతానికి చేరుకుంది. జూన్‌లో (10.99 శాతం) లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. నవంబర్‌లో 2.74 కోట్ల మంది నిరుద్యోగులుండగా... డిసెంబరులో ఇది అనూహ్యంగా 3.87 కోట్లకు పెరిగిం ది. ఫలితంగా ఒక్కనెలలోనే నిరుద్యోగిత 2.55% పెరి గిపోయింది. నవంబరుతో పోలిస్తే... డిసెంబర్లో 60 లక్షల మంది ఉద్యోగార్థులు పెరిగారని, ఇంతటి భారీ సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు లేక... నిరుద్యోగిత పెరిగిందని సీఎంఐఈ విశ్లేషించింది. ఫలితంగా నవం బర్లో 6.51 శాతమున్న నిరుద్యోగం డిసెంబర్ ముగి సేసరికి 9.06 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం పెరిగింది. గత రెండు, మూడు నెలలుగా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలు, ఆర్థిక, వాణిజ్య, ఇతర త్రా రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు పుంజుకుంటున్నా... నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి వివిధ ప్రాధాన్యతారంగాల్లో కార్యకలాపాలు పెరిగినా లేబర్ మార్కెట్ పూర్తిస్థాయిలో కుదుటపడలేదని స్పష్టమౌతోంది. కొద్దినెలలుగా ద్రవ్యోల్బణం 7 శాతం దరిదాపుల్లో ఉండటం, దానికి తోడు నిరుద్యోగం పెరగడం ఆందోళనకరమని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై భయాలను మరింత పెంచుతోందన్నారు. ( మధ్యప్రదేశ్, ఏపీలకు కేంద్రం రివార్డు) పెరిగిన గ్రామీణ నిరుద్యోగం... దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం డిసెంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో 9.15%, పట్టణప్రాంతాల్లో 8.84%గా న మోదైంది. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.51% నుంచి 9.15%కి పెరి గింది. అయితే గత కొన్ని నెలలుగా జాతీయ, గ్రామీణ నిరుద్యోగ సగటు కంటే ఎంతో ఎక్కువ శాతంలో కొన సాగిన పట్టణ నిరుద్యోగిత డిసెంబర్లో 8.84 శాతంగా నిలవడం గమనార్హం. ఇతర ›ప్రాంతాలలో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత మెరుగుపడు తున్నట్టు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పుంజుకోని లేబర్ మార్కెట్ ఈ తాజా గణాంకాల ప్రకారం దేశంలోని ఆర్థిక వ్యవస్థ ఇంకా మందకొడిగా సాగుతోందని, లేబర్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో తనలో ఇముడ్చుకునే ప్రయత్నాల్లోనే ఇంకా ఉన్నట్టుగా స్పష్టమౌతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి గ్రామీణ ఉపాధి హామీ, మౌలిక వసతుల కల్పన సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు రాబోయే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేటాయింపులు పెంచాల్సి ఉందని సూచిస్తున్నారు. ఆర్థికరంగం పూర్తిగా పుంజుకోని నేపథ్యంలో మరిన్ని అవకాశాల కల్పనతో పాటు ఉపాధికి దూరమౌతున్న మహిళా వర్కర్లను తిరిగి పనుల్లో నిమగ్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని అజీమ్ ప్రేమ్‌జీ వర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ సూచిస్తున్నారు. ‘జాతీయ ఉపాధి హామీకి కేటాయింపుల పెంపుదల గ్రామీణ భారతానికి మేలుచేస్తుంది. అంతేకాకుండా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజేస్ను (ఎంఎస్ఎంఈ) మరింత బలోపేతం చేసి... మళ్లీ ఈ రంగాన్ని పట్టాలు ఎక్కిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి’అని అమిత్ పేర్కొన్నారు. సీఎంఐఈ డిసెంబర్ గణాంకాలు అత్యధిక నిరుద్యోగమున్న రాష్ట్రాలు (శాతాల్లో) హరియాణా 32.5 రాజస్తాన్ 28.2 త్రిపుర 18.2 జమ్మూ,కశ్మీర్ 16.6 యూపీ 14.9 అత్యల్ప నిరుద్యోగమున్న రాష్ట్రాలు తమిళనాడు 0.5 కర్ణాటక 1.4 మహారాష్ట్ర 3.9 ఏపీ 6.7 తెలంగాణ 7 -
పెరిగిన గ్రామీణ నిరుద్యోగం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పంటల కోతల సీజన్ ఊపందుకుంటున్నా గ్రామీణ నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో 5.86 శాతమున్న ఉపాధి లేమి, నిరుద్యోగం అక్టోబర్ నెలాఖరుకు 6.9 శాతానికి పెరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో పనిదినాలు తగ్గడమూ నిరుద్యోగం పెరుగుదలకు కారణం కావొచ్చని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. నరేగా కింద సెప్టెంబర్‌లో 26.5 కోట్ల పనిదినాలు కల్పించగా... అక్టోబర్‌లో 17.3 కోట్ల పనిదినాలకు తగ్గిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ‘ప్రస్తుతం పంట కోతలు మొదలైనందున అది కొంతమేర లేబర్ మార్కెట్‌ను ఆకర్షించే అవకాశమున్నా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సీజన్ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. తమ వృత్తి నైపుణ్యాలు, చేయగలిగే పనికి తగ్గట్టు పనులు దొరక కపోవడమూ నిరుద్యోగం పెరగడానికి కారణం కావొచ్చు’ అని ఆర్థికవేత్తలు అనూప్ మిత్ర, కేఆర్ శ్యాంసుందర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో నిరుద్యోగ శాతం (గ్రామీణ, పట్టణాల్లో కలిపి) సెప్టెంబర్‌లో 6.67 నుంచి అక్టోబర్‌లో 6.98కి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పట్టణాల్లో నిరుద్యోగ శాతం సెప్టెంబర్‌లో 8.45 నుంచి అక్టోబర్‌లో 7.15కి తగ్గింది. -
వణికిస్తున్న నిరుద్యోగ భూతం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మరింత పెరుగుతున్న ఈ తరుణంలో ఇది మరింత ఆందోళనకు దారితీస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్ పాయింట్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం కాస్తా ఆగస్టు చివరినాటికి మొత్తంగా 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూ తం మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఇటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది. ఈనెలా అంతేనా..? ఇక ఈ నెల (సెప్టెంబర్) లోనూ వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఇదే విధంగా కొనసాగడంతో పాటు ఆగస్టుతో పోల్చితే స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదీగాకుండా కరోనా వైరస్ దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు జనవరిలో 7.76 శాతం, ఫిబ్రవరిలో 7.22 శాతమున్న నిరుద్యోగం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండటం, అది క్రమక్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కేంద్రం కఠినమైన లాక్డౌన్ నిబంధనల తర్వాత ఆగస్టు నెలలో వివిధ వాణిజ్య, వ్యాపార ఇతర ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినా కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోవడం ఆందోళనకరమేనని పలువురు ఆర్థికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. కోవిడ్ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్ సెక్టార్) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతమే రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► హరియాణా–33.5 శాతం ► త్రిపుర–27.9 శాతం ► రాజస్తాన్–17.5 శాతం ► గోవా–16.2 శాతం ► హిమాచల్‌ప్రదేశ్–15.8 శాతం ► పశ్చిమబెంగాల్–14.9 శాతం ► ఉత్తరాఖండ్–14.3 శాతం ► ఢిల్లీ–13.8 శాతం ► బిహార్–13.4 శాతం ► సిక్కిం–12.5 శాతం తక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► కర్ణాటక–0.5 శాతం ► ఒడిశా–1.4 శాతం ► గుజరాత్–1.9 శాతం ► తమిళనాడు–2.6 శాతం ► మధ్యప్రదేశ్–4.7 శాతం ► అస్సాం–5.5 శాతం ► తెలంగాణ–5.8 శాతం ► యూపీ–5.8 శాతం ► మహారాష్ట్ర–6.2 శాతం ► ఆంధ్రప్రదేశ్–7.0 శాతం -
నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగభూతం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో అది 9.1 శాతానికి చేరుకుంది. గత తొమ్మిది వారాల్లో జాతీయస్థాయిలో ఇదే అత్యధికం. ఆగస్ట్ 16తో ముగిసిన వారాంతానికి జాతీయస్థాయిలో చూస్తే... పట్టణాల్లో 9.61 శాతం, గ్రామాల్లో 8.86 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. ఆగస్టు 9 తేదీ నాటికి 8.67 శాతమున్న దేశ నిరుద్యోగ శాతం ఆగస్టు 16 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ఈ నెలలో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పట్టడం నిరుద్యోగ శాతం పెరగడానికి కారణాలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గుదలతో ఉద్యోగ అవకాశాల్లో కోత పడినట్టు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ట్రెండ్ కావచ్చని మరికొందరు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ప్రభావం.. వేతనాలు, ఉద్యోగాల (శాలరీడ్ జాబ్స్)పై అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌తో ముగిసిన నెలకు 6.84 కోట్ల శాలరీడ్ జాబ్స్ తగ్గగా, జూలై మాసాంతానికి 6.72 కోట్లకు చేరుకున్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ఏవిధంగా ఉందంటే.. ► తెలంగాణలో 9.1 శాతం నిరుద్యోగం నమోదైంది ► ఛత్తీస్‌గఢ్‌లో 9, తమిళనాడులో 8.1, జార్ఖండ్‌లో 8.8 శాతం ► ఆంధ్రప్రదేశ్‌లో 8.3 శాతం, కేరళలో 6.8 శాతం ► పశ్చిమబెంగాల్లో 6.8 శాతం, యూపీలో 5.5 శాతం నిరుద్యోగం అగ్రస్థానంలో హరియాణా ► హరియాణా 24.5 శాతం నిరుద్యోగంతో టాప్‌ప్లేస్‌లో ఉంది ► పుదుచ్చేరి 21.1, ఢిల్లీ 20.3 శాతంతో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి ► హిమాచల్ ప్రదేశ్ 18.6 శాతంతో నాలుగోస్థానం, గోవా 17.1 శాతంతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రాలివే... ► ఒడిశా, గుజరాత్‌ల్లో 1.9 శాతం చొప్పున అత్యల్ప నిరుద్యోగం ► మేఘాలయ 2.1, అస్సాం 3.2, మధ్యప్రదేశ్, కర్ణాటక 3.6 శాతం చొప్పున ► మహారాష్ట్ర 4.4, సిక్కింలో 4.5 శాతం నిరుద్యోగం 10 శాతానికిపైగా నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► త్రిపురలో 16.4, రాజస్తాన్‌లో 15.2, ఉత్తరాఖండ్‌లో 12.4 శాతం నిరుద్యోగం ► బిహార్‌లో 12.2, జమ్మూ,కశ్మీర్లో 11.2, పంజాబ్‌లో 10.4 శాతం నిరుద్యోగం -
గుడ్‌న్యూస్ : భారీగా కొత్త కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్-19తో ఉద్యోగాల కోతల కాలం సాగుతుండటంతో ఉపాధి రికవరీ రేటు ఇప్పట్లో కోలుకోలేదనే ఆందోళనల నడుమ జులైలో నూతన ఉద్యోగాల డేటా ఆశలు రేకెత్తిస్తోంది. జులైలో కొత్తగా పలు ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. నగరాల్లో ఉపాథి అవకాశాలూ గణనీయంగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. జూన్‌తో పోలిస్తే నికర నియామకాలు తగ్గినా జులైలోనూ కొత్త నియామకాలు మెరుగ్గానే ఉన్నాయని, జులై 19 వారాంతానికి ఉద్యోగిత రేటు 38.4 శాతానికి పెరిగిందని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు. జూన్, జులైలో ఉపాధి రేటు పెరుగుదల నగర ఉద్యోగార్ధుల్లో ఆశలు పెంచుతోంది. జులై నెల తొలి మూడు వారాల్లో సగటు ఉపాధి రేటు 37.5 శాతం కాగా, జులై 19 వారాంతానికి నగరాల్లో ఉద్యోగిత రేటు ఏకంగా 35.1 శాతంగా నమోదైంది. గత రెండు వారాలుగా నగర ప్రాంతాల్లో నియామకాలు ఊపందుకోవడం ఉద్యోగార్ధులకు సానుకూల పరిణామం. నిత్యావసర వస్తువులే కాకుండా సేవల రంగంలోనూ నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే జాబ్ మార్కెట్లోనూ భారీ రికవరీ చోటుచేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతేనేం..