
తగ్గుతున్న సానుకూలత
పెద్ద నోట్ల రద్దుపై వినియోగదారుల సెంటిమెంట్‌పై సీఎంఐఈ సర్వే
ముంబై: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన వారంలో దేశంలో వినియోగదారుల సెంటిమెంట్ పెరగడమే కాదు, నిరుద్యోగ రేటు కూడా తగ్గిందట. వినియోగదారుల సెంటిమెంట్ 210 బేసిస్ పారుుంట్లు ఎగసి 96.65 నుంచి 98.75 శాతానికి... నిరుద్యోగ రేటు 150 బేసిస్ పారుుంట్లు తగ్గి 6.10 శాతానికి పడిపోరుునట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా పేర్కొంది. నిర్ణయం ప్రకటించిన తర్వాతి వారంలో మాత్రం సెంటిమెంట్ కొంత బలహీనపడి 98.60 శాతానికి తగ్గినట్టు సీఎంఐఈ పేర్కొంది.