notes canceled
-
ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ రేటులో రావాలి. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు రావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువుగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతేకాదు స్థిరాస్తి మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలా మంది డాబా ఇల్లా? ఫ్లాటా? అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు? లేదంటే స్థలాలనా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్తికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్‌కి ఉంటుంది కానీ స్థలాన్నో, ఇంటినో అమ్ముకోవాలనే వారికెందుకనే భావన చాలామందికి ఉంటుంది. కానీ, మార్కెట్ గురించి తెలుసుకోవటం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికి వాస్తవమైన రేటు, అమ్మే రేటు ఎంతో తెలుస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు. ⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాస్తి ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట. ⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ⇒ స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం ఏ చిన్న పొరపాటు ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి. -
అది మన్మోహన్ కళ
• స్కాంల హయాంలోనూ అవినీతి మచ్చ పడలేదు • మాజీ ప్రధానిపై మోదీ విసుర్లు • నోట్ల రద్దుపై విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని • కాంగ్రెస్ అభ్యంతరం.. సభ నుంచి వాకౌట్ న్యూఢిల్లీ: నోట్ల రద్దును లూటీ, దోపిడీ అని ఇటీవల రాజ్యసభలో తీవ్రంగా విమర్శించిన మాజీ ప్రధాని మన్మోహన్పై ప్రధాని మోదీ అదే సభ సాక్షిగా తీవ్రమైన ఎదురుదాడి చేశారు. ఎంత అవినీతి జరిగినా మచ్చపడకుండా చూసుకోవడం ఆయనకే చెల్లిందని వ్యంగ్య బాణాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ప్రసంగించిన మోదీ నోట్ల రద్దును సమర్థించుకుంటూ మన్మోహన్, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘స్వాతంత్య్రం వచ్చాక 70 ఏళ్లలో సగం కాలం..అంటే 35 ఏళ్లపాటు సాగిన ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. ఆర్థిక నిర్ణయాల్లో ప్రత్యక్ష అనుబంధం ఉంది.. ఆర్థిక రంగంలో ఇలాంటి వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. ఎన్నో కుంభకోణాలు జరిగాయి. రాజకీయ నేతలమైన మనం మన్మోహన్ అనుభవం నుంచి చాలా నేర్చుకోవాలి. ఎంతో జరిగింది.. కానీ ఆయనపై ఒక్క మచ్చా పడలేదు. రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేసే కళ ఒక్క డాక్టర్ సాబ్‌కే తెలుసు’ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. ‘మీరు మర్యాద తప్పితే సమాధానం వినే దమ్ము మీకుండాలి. బదులు తీర్చుకునే సత్తా మాకుంది. మర్యాద, రాజ్యాంగ హద్దుల్లోనే ఆ పని చేస్తాం. అంత ఉన్నతమైన పదవి(ప్రధాని) చేపట్టిన వ్యక్తి లూటీ, దోపిడీ అని సభలో మాట్లాడారు. వారు(కాంగ్రెస్) అలాంటి పదాలు వాడేముందు 50 సార్లు ఆలోచించి ఉండాల్సింది..’ అని మోదీ అన్నారు. నోట్ల రద్దు వ్యవస్థీకృత నేరం, చట్టబద్ధ దోపిడీ, భారీ వైఫల్యం అని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో మన్మోహన్ అనడం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘మన్మోహన్జీ ఇక్కడ ప్రసంగించారు. మన్మోహన్ ముందుమాట రాసిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. ఆయన ప్రముఖ ఆర్థికవేత్త కనుక అందులో ఆయన కృషి ఉంటుందని మొదట భావించాను. అయితే ఆ పుస్తకం వేరొకరు రాసిందని, ముందుమాట మాత్రమే మన్మోహన్ రాశారని వెంటే గుర్తుకొచ్చింది. ఆయన ప్రసంగమూ అలాంటిందే’ అని అన్నారు. మోదీ ప్రసంగ సమయంలో మన్మోహన్ సభలోనే ఉన్నారు. నేను 10 మంది పేర్లను చెప్పగలను నోట్ల రద్దును వ్యతిరేకించిన ఆర్థికవేత్తల పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించగా మోదీ బదులిస్తూ.. ‘మీరు పదిమందిని ఉటంకిస్తే నేను 20 మంది పేర్లు చెప్పగలను. ప్రపంచంలో ఇలాంటిది(నోట్ల రద్దు)ఎన్నడూ జరగలేదు ఇదొక అధ్యయన అంశం అవుతుంది’ అని అన్నారు. మాజీ హోం శాఖ కార్యదర్శి మహదేవ్ గోద్బోలే రాసిన పుస్తకంలో 1971లో నోట్ల రద్దుచేయనందుకు ఇందిరపై విమర్శలున్నాయన్నారు. ‘నల్లధనం, అవినీతిపై పోరాటం రాజకీయ పోరాటం కాదు. ఇది అందరి బాధ్యత. ’ అని అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌ను లాగడమెందుకు? ‘నన్ను, ప్రభుత్వాన్ని విమర్శించండి. ఆర్బీఐని, దాని గవర్నర్‌ను ఎందుకు ఇందులోకి లాగుతారు? ’ అని మోదీ అన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్బీఐ విషయాల్లో జోక్యం చేసుకునేవారని అన్నారు. 1972లో నోట్ల రద్దును జ్యోతి బసు సమర్థించారంటూ వామపక్షాలు తనతో కలసి రావాలని కోరారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. మోదీ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కొన్ని విపక్షాలూ వారిని అనుసరించాయి. మొత్తం 651 సవరణలూ వీగిపోయాయి. ముందుచూపు లేని బడ్జెట్:విపక్షం లోక్‌సభలో బుధవారం కోరమ్ లేక సభాకార్యక్రమాల కాసేపు ఆగిపోయాయి. తర్వాత సభ్యులు రాగానే కేంద్ర సాధారణ బడ్జెట్‌పై చర్చ మొదలైంది. బడ్జెట్లో ముందుచూపు కొరవడిందని, సామాన్యులకు, దేశానికి ఒరిగేదేమీ లేదని విపక్షం ఆరోపించింది. నోట్ల రద్దు విషయంలో మోదీ పాకిస్తాన్ దారిలో సొంత ప్రజలపై సర్జికల్ దాడులు చేశారని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ మండిపడ్డారు. రాజ్యసభలో మన్మోమహన్పై మోదీ చేసిన విమర్శలు ఘోరంగా ఉన్నాయని, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ ఆక్షేపించింది. చర్చను మోదీ దిగజార్చారని,∙సభకు క్షమాపణ చెప్పాలంది. -
పసిడిపై నోట్ల రద్దు ఎఫెక్ట్
• 2016లో 21 శాతం తగ్గిన డిమాండ్ • 675.5 టన్నులకు క్షీణత • వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక • జ్యుయలర్ల సమ్మె, పాన్ కార్డ్ నిబంధనలు కారణం ముంబై: పెద్ద నోట్ల రద్దు, జ్యుయలర్ల సమ్మెలు, భారీ స్థాయి కొనుగోళ్ల కోసం పాన్ కార్డు తప్పనిసరి చేయడం తదితర అంశాలతో గతేడాది దేశీయంగా పసిడికి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 21 శాతం మేర క్షీణించి 675.5 టన్నులకు పడిపోయింది. 2015లో పుత్తడి డిమాండ్ 857.2 టన్నుల మేర నమోదైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2016లో జ్యుయలరీ డిమాండ్ 22.4 శాతం క్షీణించి 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు తగ్గింది. విలువపరంగా ఆభరణాల డిమాండ్ 12.3 శాతం తగ్గి రూ. 1,58,310 కోట్ల నుంచి రూ. 1,38,838 కోట్లకు క్షీణించింది. ’దీపావళి, పెళ్లిళ్ల సీజన్ మొదలైన కారణాలతో నాలుగో త్రైమాసికంలో పసిడి డిమాండ్ 3 శాతం వృద్ధితో 244 టన్నులకు పెరిగినప్పటికీ.. మొత్తం ఏడాదికి చూస్తే మాత్రం గణనీయంగా క్షీణించింది. కొనుగోళ్లకు పాన్ కార్డు తప్పనిసరి, జ్యుయలరీపై ఎక్సయిజ్ డ్యూటీ, డీమోనిటైజేషన్, ఆదాయ వెల్లడి పథకానికి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైన అంశాలతో పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొనడంతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది’ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే, ఈ ధోరణి పుత్తడికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా వ్యాపారాల్లో కూడా కనిపించిందని చెప్పారు. పెట్టుబడి అవసరాలకు సంబంధించి పుత్తడి డిమాండ్ 17 శాతం తగ్గి 194.9 టన్నుల నుంచి 161.5 టన్నులకు తగ్గింది. ఈసారి 650–750 టన్నులు.. ప్రభుత్వ విధానాలు రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయగలవని, పసిడి పరిశ్రమలో పారదర్శకత పెరిగేందుకు దోహదపడగలవని.. ఫలితంగా కొనుగోలుదార్లకు చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రయోజనాలు చేకూరగలవని సోమసుందరం వివరించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలు తదితర అంశాల ఊతంతో 2017లో పసిడి డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయంగా 2 శాతం వృద్ధి.. గతేడాది అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2 శాతం పెరిగి 4,309 టన్నులుగా నమోదైంది. అమెరికాలో బంగారం ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల వెల్లువ, నాలుగో త్రైమాసికంలో చైనాలో పసిడి కడ్డీలు.. నాణేలకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని డబ్ల్యూజీసీ తెలిపింది. 2015లో డిమాండ్ 4,216 టన్నులుగా నమోదైంది. పెట్టుబడుల కోణంలో చైనాలో పుత్తడికి డిమాండ్ 70 శాతం పెరిగిందని.. నాలుగేళ్ల గరిష్ట స్థాయి 1,561 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ తెలిపింది. మొత్తం మీద పెట్టుబడి అవసరాలకు సంబంధించి బంగారానికి డిమాండ్ పెరగడానికి .. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు (ముఖ్యంగా బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికలు) కారణమని వివరించింది. దేశాలవారీగా చూస్తే వినియోగం అత్యధికంగా ఉండే చైనా, భారత్‌లో 2016లో ఆభరణాల డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది. అధిక ధరలు, సరఫరా పరిమితులు వంటి వాటి కారణంగా చైనాలో డిమాండ్ 7 శాతం తగ్గింది. -
జనవరిలో పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కష్టాల నుంచి వాహన కంపెనీలు తేరుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, , టయోట, నిస్సాన్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు 9 శాతం చొప్పున పతనం కాగా, టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 21 శాతం ఎగిశాయి. -
పెద్ద నోట్ల రద్దు దెబ్బ నుంచి ‘కోలుకున్న’ పరిశ్రమ: నికాయ్
పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురయిన పారిశ్రామిక రంగం తిరిగి కోలుకుందని నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. తయారీ రంగ క్రియాశీలతను వివరించే ఈ సూచీ డిసెంబర్లో 49.6 శాతంగా ఉంటే, జనవరిలో 50.4 శాతం వృద్ధికి మారింది. సూచీ 50 శాతం దిగువున ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగిన ధోరణి కనబడుతుండడంతో, వృద్ధి ధోరణి కొనసాగే వీలుందని నెలవారీ సూచీ సూచించింది. అయితే ఎగుమతి ఆర్డర్లు మాత్రం తగ్గుతున్నట్లు సూచీ తెలిపింది. -
చిన్న వాహన రుణాలకు నోట్ల రద్దు దెబ్బ!
ఫిచ్ రేటింగ్స్ నివేదిక... ముంబై: దేశంలో పెద్ద నోట్ల రద్దు చిన్న వాహన పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసిందని అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. చిన్న ఆటో రుణ గ్రహీతలు పునఃచెల్లింపుల సామర్థ్యాన్ని కోల్పోయారని పేర్కొంటూ, నోట్ల రద్దు వల్ల వారి ఆదాయాలు గణనీయంగా పడిపోవడమే దీనికి కారణమని తన తాజా నివేదికలో వివరించింది. దీనితోపాటు పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందని కూడా నివేదిక పేర్కొంది. ఇది ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగించిందని విశ్లేషించింది. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో రెండు, మూడు నెలలు పడుతుందని తాము భావిస్తున్నట్లు వివరించింది. మార్చి నాటికి సర్దుకుంటుంది: నోమురా ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు గందరగోళం మార్చినాటికి సర్దుకుం టుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా పేర్కొంది. కరెన్సీ–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి మార్చినాటికి 9 శాతానికి చేరుకుం టుందని, దీనివల్ల మనీ సర్క్యులేషన్లో ఇబ్బం దులు తప్పుతాయని విశ్లేషించింది. నోమురా తెలిపిన సమాచారం ప్రకారం– 2016 నవంబర్ 4న జీడీపీలో కరెన్సీ సర్క్యులేషన్ పరిమాణం 11.8 శాతంగా ఉంది. అటు తర్వాత జనవరి 6 నాటికి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 5.9 శాతానికి పడిపోయింది. ఆపైక్రమంగా పెరుగుతూ జనవరి 20వ తేదీ నాటికి 6.9 శాతానికి చేరింది. మార్చి నాటికి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని నోమురా పరిశోధనా నివేదిక వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతిష్టంభన ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, తిరిగి వృద్ధి రికవరీ మెరుగుపడుతుందని భావిస్తున్నామని కూడా వివరించింది. -
‘నోట్ల రద్దు’ ప్రభుత్వ సలహానే!
• నకిలీ నోట్లు, నల్లధనం అంతానికి • నోట్లరద్దు అవసరమన్న ప్రభుత్వం • పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై నెలకొన్న అనుమానాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరదించింది. పెద్ద నోట్ల చలామణిని నిలిపేయాలన్న సలహాను కేంద్ర ప్రభుత్వమే తమకు ఇచ్చిందని స్పష్టం చేసింది. నకిలీ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం.. దేశాభివృద్ధికి అడ్డుగా మారిన ఈ మూడింటిని అంతమొందించేందుకు నోట్ల రద్దు ఆవశ్యకమని ప్రభుత్వం పేర్కొందని ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 7న ప్రభుత్వం తమకిచ్చిన ఆ సలహా మేరకు.. ఆ మర్నాడు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దును తాము ప్రభుత్వానికి సిఫారసు చేశామని తెలిపింది. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి ఈ మేరకు ఆర్బీఐ 7 పేజీల నివేదికను అందజేసింది. ‘రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దుపై నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం మాకు సలహా ఇచ్చింది. ఆ తర్వాతి రోజున ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశమై పెద్ద నోట్ల రద్దును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశా’ అని కాంగ్రెస్ నేత ఎం.వీరప్ప మెయిలీ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ తెలిపింది. నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు అభిప్రాయం కోరిందని, నకిలీ నోట్లు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, నల్లధనానికి చెక్ పెట్టేందుకు రూ. 500, రూ. వెయ్యినోట్ల చెల్లుబాటును రద్దు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తమకు సూచించిందని పేర్కొంది. ప్రభుత్వ సూచనపై సుదీర్ఘ చర్చల అనంతరం పెద్ద నోట్ల చెల్లుబాటు రద్దయ్యేలా వాటిని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి సమాధానం పంపినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ సిఫార్సు అందిన కొద్ది గంటల్లోపే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సిఫార్సుల మేరకే నోట్ల రద్దుపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు కేబినెట్లోని పలువురు మంత్రులు భావించడం గమనార్హం. కొత్త కరెన్సీపై చాన్నాళ్లుగా కసరత్తు ‘నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రతా ప్రమాణాలతో కొత్త కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం నల్లధనం, ఉగ్రవాదంపై పోరులో చర్యలు చేపట్టిందని’ కమిటీకి పంపిన నివేదికలో వెల్లడించింది. భారీగా పెద్ద నోట్ల లభ్యతతో నల్లధనం కూడబెట్టడం సులభంగా మారిందని, ఉగ్రవాదులకు సాయం చేసేందుకు పెద్ద నోట్ల రూపంలో నకిలీ కరెన్సీ వాడుతున్నట్లు నిఘా, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నివేదికలు స్పష్టం చేశాయని చెప్పింది. పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనం, నకిలీ నోట్ల చలామణీ, ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం అడ్డుకునేందుకు అరుదైన అవకాశం దొరికిందని, ఆ అదృష్టం కేంద్రానికి, తమకు దక్కిందంటూ ఆర్బీఐ వ్యాఖ్యానించింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లు సిఫార్సు చేసిన ఆర్బీఐ రూ. 5 వేలు, రూ 10 వేల నోట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరముందంటూ అక్టోబర్ 7, 2014న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచించిందని, ద్రవ్యోల్బణం నేపథ్యంలో, చెల్లింపుల్ని సులభతరం చేసేందుకు, సమర్ధంగా కరెన్సీ సరఫరా నిర్వహణ కోసం అప్పట్లో ఆ సూచనలు చేసినట్లు తెలిపింది. ‘అయితే ప్రభుత్వం మాత్రం మే 18, 2016న రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది. మే 27, 2016న కొత్త నమూనా, సైజు, రంగు, థీమ్‌తో కొత్త సీరిస్ కరెన్సీ విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. కొత్త కరెన్సీ సీరిస్‌లో రూ. 2 వేల నోటు కూడా ఉంది’ అని వెల్లడించింది. జూన్ 7, 2016న కొత్త సీరిస్ కరెన్సీ విడుదలకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని, జూన్ 2016లో ముద్రణ ప్రారంభించాలంటూ కరెన్సీ ప్రెస్సులకు సూచించామంది. నోట్ల రద్దుపై ఆర్బీఐ మొదటి నుంచి గట్టి నిర్ణయం తీసుకోనప్పటికీ... కొత్త సీరిస్ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మాత్రం కొనసాగించిందని, అది తప్పనిసరి పక్రియని నోట్లో వెల్లడించింది. కొత్త నోట్ల ముద్రణ తగిన స్థాయికి చేరుకున్నాక... నోట్ల రద్దు నిర్ణయం చేయవచ్చంటూ ప్రభుత్వానికి చెప్పామంటూ మెయిలీ కమిటీకి తెలిపింది. -
మద్యంపై కనిపించని నోట్ల ప్రభావం
తిమ్మాజీపేట: నోట్ల రద్దు తర్వాత నగదు లేక రైతులు, కూలీలు, సామాన్యులు ఇబ్బందులకు గురవుతుంటే మద్యం ఖజానా ఫూల్ అవుతుంది. మద్యంపై నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని అంతా భావించినా మద్యంపై మాత్రం నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపించలేదు. మండల కేంద్రంలోని ఐఎంఎల్(మద్యం) డిపో నుంచి ప్రతిరోజూ నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలతోపాటు షాద్‌నగర్, కొడంగల్, కల్వకుర్తి నుంచి విడిపోయిన మండలాల నుంచి సైతం మద్యం షాపుల యజమానులు తిమ్మాజీపేట గోదాం నుంచే మద్యాన్ని తీసుకెళ్తారు. ఇక్కడి నుంచే పూర్వ జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతుంది. ప్రతినెలా వచ్చే ఆదాయం కన్నా నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. ప్రతినెలా రూ.70 నుంచి రూ.80కోట్ల మధ్య మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నోట్లు రద్దయిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.160 కోట్ల విక్రయాలు జరిగాయి. రూ.15నుంచి రూ.20 కోట్ల ఆదాయం పెరిగింది. నోట్లు రద్దయ్యాక మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించినట్లయింది. -
క్యూలో నిల్చోలేక 'పెద్ద' ప్రాణాలు హరి!
-
'పెద్ద' ప్రాణాలు హరి!
ఇప్పటి దాకా 22 మంది మృతి • క్యూలో నిల్చోలేక అస్వస్థత.. ఆపై గుండెపోటు • అలసి సొమ్మసిల్లిన వందలాది మంది • పెద్ద నోట్ల రద్దుతోనే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటున్న మృతుల కుటుంబ సభ్యులు సాక్షి నెట్వర్క్ పెద్ద నోట్ల రద్దు పండుటాకుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పింఛన్ సొమ్ము తెచ్చుకునేందుకు వెళ్లి ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది వృద్ధులు పిట్టల్లా రాలిపోయారు. వీరిలో ముగ్గురు బుధవారం మృతి చెందారు. ఇన్నాళ్లూ పెద్దగా కష్టపడకుండానే చేతికందిన పింఛన్ సొమ్ము.. ఇపుడు చుక్కలు చూపిస్తోంది. నోట్ల రద్దుదెబ్బకు పింఛన్ సొమ్మును నగదుగా చేతికివ్వ లేక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దీంతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి, జమ అయిన డబ్బు తీసుకోవడానికి వెళ్లి తీవ్ర ఇక్కట్ల నడుమ తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం తూంపాయనపల్లెకు చెందిన బి.రామన్నబోయుడు భార్య లక్షుమమ్మ(66) రెండేళ్లుగా సామాజిక పింఛన్ తీసుకుంటోంది. ఖాతా ప్రారంభించేందుకు 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. బుధవారం కుమారుడు సుబ్రమణ్యంతో కలసి బంగారుపాళెంలోని సిండికేట్ బ్యాంకు వద్దకు వచ్చింది. బ్యాంకు మెట్లు ఎక్కుతూ కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదే రోజు గుంటూరు జిల్లా మాచర్లలోని రామాటాకీస్ లైనులో ఉన్న ఎస్బీఐలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి షేక్ మౌలాలి(73) నగదు కోసం క్యూలో నిల్చొని అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి డేరంగుల రంగయ్య (67) పింఛన్ కోసం బుధవారం నూనెపల్లె ఆంధ్ర బ్యాంకుకు వచ్చాడు. డబ్బు పొందలేక దిగాలుగా వెళుతూ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లగానే అస్వస్థతకు గురై మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ‘నో క్యాష్’ బోర్డు పెట్టడంతో గత నెల 25వ తేదీన బాలరాజు(68) అనే వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అంతకు ముందు మూడు రోజులుగా ఇతను డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన కనకమేడల విజయలక్ష్మి (71) రూ.500 నోట్లు మార్చుకునేందుకు నవంబర్ 25వ తేదీన ఉయ్యూరులోని ఎస్బీఐ వద్దకు వచ్చి గుండెపోటుతో మృతి చెందింది. గత నెల16న చిత్తూరులో రత్న పిళ్లై (62)అనే రిటైర్డు ఉపాధ్యాయులు ఇండియన్ బ్యాంకు వద్ద కిందపడి మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ అడ్డతీగల మండలం వేటమామిడి సమీపాన పణుకురాతిపాలేనికి చెందిన మామిడిలక్ష్మి(72) ఈ నెల 6వ తేదీన పింఛన్ కోసం వస్తూ కన్నేరువాగులో పడి మృతి చెందింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆంధ్రాబ్యాంకు వద్ద ఫిరంగిపురంకు చెందిన రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ పూలంకి ఇన్నయ్య (63) గతనెల 15వ తేదీన నగదు కోసం క్యూలో నిల్చొని గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంత’కు చెందిన ముగ్గురు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారితండాకు చెందిన లక్ష్మీబాయి (65) ఈ నెల ఐదో తేదీన పింఛన్ కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ధర్మవరం పట్టణంలోని తేరువీధికి చెందిన కె.లక్ష్మినారాయణ (68) నవంబర్ 15న హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో నగదు కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మృతి చెందాడు. రాయదుర్గం పట్టణంలోని ముచ్చిగవీధికి చెందిన ఎం.బసమ్మ (80) ఈనెల 7న ఎన్టీఆర్ భరోసా పింఛన్ బ్యాంకు ఖాతా ద్వారా అందలేదన్న బెంగతో చనిపోయింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగుంటపల్లెకు చెందిన నాగలింగప్ప ఈ నెల 7న పింఛన్ డబ్బులు తీసుకొనేందుకు బ్యాంకుకు వస్తూ ఆటో ఢీకొట్టడంతో మృతిచెందాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేటకు చెందిన మహాలక్ష్మమ్మ(70) గుండెపోటుతో మృతి చెందింది. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన ఎస్కె షరీఫ్(43) నెల్లూరు బారకాస్ ఎస్బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేసేవారు. నవంబర్ 19వ తేదీన పనిఒత్తిడితో గుండెపోటుకు బలయ్యారు. నాయుడుపేట పట్టణానికి చెందిన నయనప్పగారి నారాయణరావు(63) ఈ నెల 2న పింఛన్ కోసం ఎస్బీఐ చుట్టూ తిరిగుతూ గుండెపోటుతో చనిపోయాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం బత్తివానిపాలెం గ్రామానికి చెందిన బత్తి పెదకొండడు(70) ఈనెల 7న పింఛను కోసం వచ్చి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పింఛన్ రాలేదని తెలిసి.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పాతవరక గ్రామానికి చెందిన ఖగో బెహరా (69) వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఇదే మండలంలోని బొరివంక గ్రామంలోని ఏపీజీవీబీకి వెళ్లారు. క్యూలైన్లో అతి కష్టంపై లోనికి వెళ్లాడు. పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో బ్యాంకు బయటకువచ్చి కుప్పకూలి చనిపోయాడు. వీరఘట్టం జనావీధికి చెందిన జన వీరమ్మ (85)కు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. కుటుంబ సభ్యులు స్థానిక స్టేట్‌బ్యాంకుకు వెళ్లి పింఛన్ డబ్బు గురించి ఆరా తీయగా.. సిబ్బంది రాలేదని చెప్పారు. ఆదే విషయాన్ని ఆమెకు చెప్పగా మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన చనిపోయింది.వీరఘట్టం పట్టణం బర్నాల వీధికి చెందిన గేదెల నారాయణమ్మ (93)కు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. కుటుంబ సభ్యులు స్థానిక స్టేట్‌బ్యాంకుకు వెళ్లి పింఛన్ డబ్బులు వచ్చాయో లేదా అని ఈ నెల 8న ఆరా తీయగా..రాలేది సిబ్బంది చెప్పారు. ఈ విషయం నారాయణమ్మ చెప్పగానే ఆమె మనస్తాపంతో చనిపోయింది. ⇔ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లమూడి రాములమ్మ (65)అనే వృద్ధురాలు ఈ నెల 1న పింఛను సొమ్ము కోసం కన్నాపురం ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లింది. గంటల తరబడి క్యూలో నిలబడినా పింఛను అందలేదు. ఇంటికి రాగానే అస్వస్థతకు గురై మృతి చెందింది. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బైనే ఏసేబు (75) పింఛను డబ్బు కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగి.. ఈనెల 9న గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన బొర్రా వెంకట్రావు (65) పింఛను కోసం అదే గ్రామంలోని ఎస్బీఐ కియోస్క్ బ్రాంచ్ వద్ద క్యూలో నిలబడగా.. గుండెపోటు రావడంతో ఈనెల 13న కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మరణించాడు. పెద్ద నోట్ల రద్దు వల్లే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని ఆయా ప్రాంతాల్లో మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వందలాది మంది వృద్ధులు క్యూలో నిల్చోలేక అనారోగ్యం పాలయ్యారు. -
నల్లకుబేరుడు..శేఖర్ రెడ్డి పదవిపై వేటు
-
శేఖర్‌రెడ్డి కేసు సీబీఐకి..!
-
శేఖర్‌రెడ్డి కేసు సీబీఐకి..!
• చెన్నైలో రెండోరోజూ కొనసాగిన సోదాలు • రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం స్వాధీనం సాక్షి ప్రతినిధి, చెన్నై/ న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగారుు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి రెండురోజుల పాటు జరిగిన దాడుల్లో మొత్తం రూ.170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం పట్టుబడినట్లు సమాచారం. కాగా చెన్నైలోని వివిధ ప్రాంతా ల్లో జరిపిన దాడుల్లో లెక్కల్లోకి రాని రూ.142 కోట్లకు పైగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసు ను ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ డీఐజీ తేన్మొళి నేతృత్వంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. నగదు అక్రమ రవా ణా, అవినీతి కోణంలో తదుపరి విచారణ కొనసాగించేందుకు ఈ కేసు వివరాలన్నిటినీ తాము ఈడీ, సీబీఐలకు ఇస్తామని ఢిల్లీలోని ఐటీ విభాగం చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది. డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను పూర్తిస్థారుు లో పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉన్నాయంది. పట్టుబడిన నగదు, బంగారం తనదేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపారుు. ఆరు నెలలుగా నిఘా... 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంచి పలుకుబడి కలిగి ఉండటంమే కాకుండా అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న శేఖర్‌రెడ్డితో పాటు ఇతరుల కార్యకలాపాలను నిఘా వర్గాలు సుమారు ఆరు నెలల పాటు పరిశీలించినట్టు తెలుస్తోంది. సెల్‌ఫోన్ సంభాషణలను రికార్డు చేశారని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, శేఖర్‌రెడ్డి హైదరాబాద్ వచ్చిన ప్పుడు ఒక ప్రముఖ హోటల్లో టీడీపీ ముఖ్య నేతతో భేటీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించారని చెబుతు న్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు కాట్పాడిలో సీల్ చేసిన శేఖర్‌రెడ్డి ఇంటిని తనిఖీ చేసి వెళ్లారు. ఆయన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని శేఖర్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదు, బంగారం. -
కొనుగోళ్లకు తరుణమిదే
• ఏడాదిలో 20 శాతం ధరలు పెరిగే అవకాశం • క్రెడాయ్ తెలంగాణ అంచనా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంలో ప్రత్యేకించి అపార్ట్మెంట్ విభాగానికి ఎలాంటి ప్రభావం లేదని.. కొద్ది కాలం మాత్రం స్థలాలు, ప్లాట్స్ విభాగాలపై పడుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు జి రాంరెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా, ప్రభుత్వం, ఇతర కార్పొరేట్ ఉద్యోగులే మా కస్టమర్లు. వీరందరూ 90 శాతం లావాదేవీలు చెక్కులు, ఆన్లైన్ ద్వారానే జరుపుతారని పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా) అమలులోకి వచ్చాక ధరలు పెరిగే అవకాశముందని చెప్పారు. ఆయా చట్టాల్లోని నిబంధనలతో అసంఘటిత బిల్డర్లు/డెవలపర్లు నిలదొక్కుకోలేరన్నారు. పెద్ద బిల్డర్లు మార్కెట్లో ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదముందని ఏడాది కాలంలో 20 శాతం మేర ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కాబట్టి స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని సూచించారు. దేశంలో పాత నోట్ల మార్పిడితో కోట్లాది సొమ్ము ప్రభుత్వానికి చేరుతోంది. దీంతో మౌలిక వసతులు, సదుపాయాలపై ఖర్చు చేసే అవకాశముందని సెక్రటరీ సీహెచ్ రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్ధ కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతారుు. దీంతో స్థిరాస్తి రంగానికి డిమాండ్ వస్తుందని అంచనా వేశారు. ఇంటి అందం రెట్టింపు ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అరుుతే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ తళతళ మెరిసిపోతుంది. కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తారుు. వీటిని తరుచుగా వాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తారుు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తారుు. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యుమ్ క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశాక చూడండి కార్పెట్లు మెరిసిపోతారుు. గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలిగిపోతారుు. గోడలపై పానియాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అరుుతే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు. మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం.. సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతారుు. వంటింట్లో..: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్ పూతతో వస్తున్నారుుప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తారుు. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి. -
క్యాష్‌లెస్‌పై కసరత్తు
► నగదు రహిత లావాదేవీలు ► వయోజనులకు ఖాతాలు.. డిజిటల్ చెల్లింపులు.. ► జన్‌ధన్ ఖాతాలు, జీరో అకౌంట్స్ వివరాల సేకరణ ► జిల్లాలో 82 బ్రాంచ్‌లు.. 7 లక్షలకుపైగా ఖాతాలు.. ఆదిలాబాద్ అర్బన్ :కరెన్సీ వినియోగం పాతమాట.. క్యాష్‌లెస్ విధానం కొత్త బాట. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం క్యాష్‌లెస్(నగదు రహిత) విధానం అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించింది. క్యాష్‌లెస్ లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వంతోపాటు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలతోపాటు బ్యాంకు ఖాతాలు లేని వియోజనులందరికీ ఖాతాలు తెరిపించడం, క్యాష్‌లెస్ విధానంపై అవగాహన కల్పించడం, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడం వంటివి చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయా బ్యాంక్ బ్రాంచిల పరిధిలో ఖాతాలు తెరిపించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు వాణిజ్య పన్నుల చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇందుకు రేషన్ డీలర్లు, వ్యాపారులను ప్రోత్సహించనున్నారు. అత్యసవరంగా క్యాష్లెన్ విధానాన్ని ప్రోత్సహించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్, న్యూఢిల్లీ నుంచి ఆయా ప్రభుత్వ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స ద్వారా సూచించారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ సైతం మూడు రోజుల్లోనే రెండుసార్లు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. క్యాష్‌లెస్ విధానం ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని మండల స్థారుు అధికారులకూ సూచించారు. జిల్లాలో 7.50 లక్షల ఖాతాలు.. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 29 బ్యాంకులు ఉన్నారుు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 82 బ్యాంకు బ్రాంచిలు ఉన్నారుు. వీటి పరిధిలో సేవింగ్స అకౌంట్స్‌తోపాటు, జన్‌ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స ఖాతాలు ఉన్నారుు. జిల్లాలో జీరో బ్యాలన్స అకౌంట్లు 2.50 లక్షలు ఉండగా, జన్‌ధన్ ఖాతాలు ఐదు లక్షల వరకు, రెండు కలిపి దాదాపు 7.50 లక్షల ఖాతాలు ఉంటాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. నోట్ల రద్దుకు ముందు ఈ రెండు రకాల ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగేవి కావు. ప్రస్తుతం జన్‌ధన్, జీరో బ్యాలెన్స ఖాతాలపై బ్యాంకు అధికారులు దృష్టి సారించారు. రద్దుకు ముందు ఎప్పుడూ నగదు లావాదేవీలు జరగని ఖాతాలు, రద్దు తర్వాత నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలు వివరాలను సేకరించేలో పనిలో నిమగ్నమయ్యారు. ఖాతాలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చారుు. ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు.. ఎక్కడ డ్రా చేస్తున్నారనే వివరాలు సేకరించాల్సి ఉందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. జన్‌ధన్, జీరో బ్యాలెన్స ఖాతాదారులకు ఖాతా తెరిచే సమయంలో కొత్తగా రూపే ఏటీఎం కార్డులు అందజేశారు. కానీ చాలా చోట్ల పిన్ ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖాతాలను ఎక్కువగా వినియోగించకపోరుునా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అమలైతే కొంత మందికి కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా పోరుుందని చెప్పవచ్చు. వయోజనులందరికీ ఖాతాలు.. జిల్లాలో చాలామందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అందరికీ రూపే కార్డులు లేవు. 18 ఏళ్లు ఆపై వయసున్న వయోజనులందరికీ బ్యాంకు ఖాతాలు ఇప్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాల తెరిచే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి అందరినీ డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని నిర్ణరుుంచారు. ఇందుకోసం అధికారులు, బ్యాంకర్లు బిజీబిజీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇలా తెరిచిన బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తారు. ఖాతా నంబర్ తెలియకపోరుునా ఆధార్ నంబర్ సాయంతో సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఎక్కడి నుంచైనా చెల్లింపులు జరిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓ బ్యాంకు కోఆర్డినేటర్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు లీడ్‌బ్యాంకు మేనేజర్, మీ సేవ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు అలవాటు పడాలి - ప్రసాద్, లీడ్‌బ్యాంకు మేనేజరు, ఆదిలాబాద్ జిల్లాలో కొంతమందికి ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నా ఇంకొంత మంది కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంది. ప్రజలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. నగదు రూపంలోనే కాకుండా చాలా సౌకర్యాలు ఉన్నారుు. స్వైపింగ్ మిషన్, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు ప్రజలు అలవాటు పడాలి. డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. -
అమ్మో ఒకటోతారీఖు
► నెలవారీ ఖర్చుల కోసం ఉద్యోగుల దిగాలు ► నేటి నుంచి ఏటీఎంల వద్ద భారీ బందోబస్తు ► రాష్ట్రంలో ఆందోళనలు పెద్ద నోట్లు రద్దరుున తరువాత వస్తున్న తొలి ఒకటో తేదీని తలచుకుని ప్రజలు వణికిపోతున్నారు. నెలవారీ ఖర్చులను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదని వారువాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు కేంద్రం ఈనెల 8వ తేదీ ప్రకటించిన తరువాత ప్రజలు అల్లకల్లోలానికి గురయ్యా రు. ఈ 20 రోజులపాటూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాసి బిక్కచచ్చిపోరుున ప్రజలు డిసెంబరు 1వ తేదీ సమీపించడాన్ని చూసి జడుసుకుంటున్నారు. బ్యాంకు ల్లో డబ్బులు లేవు, ఏటీఎంల నుంచి రావు...మరి నెలవారీ అవసరాలకు ఎక్కడికి పోవాలని వాపోతున్నారు. నెల పుట్టగానే ఇంటి బాడుగ, పాలు, ఫలసరుకులు తదితర సామన్లు తెచ్చుకుంటేగానీ ఇల్లు గడవని పరిస్థితిలో డబ్బు కోసం ఎక్కడికి పోవాలనే ఆలోచన అందరినీ భయపెడుతోంది. బ్యాంకు ఖాతాలో తమ డబ్బు ఉన్నా, జీతం సొమ్ము పడినా డ్రా చేసుకోలేని చిత్రమైన సమస్యను ఎదుర్కోవాలని ఆందోళన చెందుతున్నారు. అనేక ఏటీఎంల వద్ద ఇంకా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండగా, పనిచేస్తున్న పరిమితమైన ఏటీఎంలలో రూ.2వేల నోట్లు మాత్రమే రావడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది. కొన్ని రోజులుగా ఏటీఎంలు మూతపడి ఉండడం, శని, ఆది, బ్యాంకులకు సెలవు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నిచోట్ల బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిల్చుని తీరా ఏటీఎంలలోకి వెళ్లితే చిల్లర నోట్లు రావడం లేదు. నవంబరు నెల జీతాలు డ్రా చేసుకునేందుకు వీలుగా బుధ, గురువారాల్లో ఏటీఎంలలో నగదు నింపే అవకాశం ఉండడంతో భారీ పోలీసు బందోబస్తుకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. కరెన్సీ కొరత కారణంగా రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనూ ఖాతాదారుడు కోరుతున్నట్లుగా రూ.24వేలు ఇవ్వడం లేదు. అలాగే వివాహాది శుభకార్యాలకు రూ.2.50 లక్షలు పొందలేక పోతున్నారు. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరెంట్ అకౌంట్ కలిగి ఉన్నవారు రూ.50వేలు డ్రా చేసుకోవచ్చనే అవకాశం ఉత్తిమాటగానే మిగిలింది. రిజర్వు బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ, రోజుకు రూ.10 లక్షల కంటే తక్కువగా చెలామణిలోకి వస్తోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలుచున్నా డబ్బు అందడం లేదు. రూ.24వేలు కోరిన వారికి రూ.4వేలుగా సర్దిపంపుతున్నారు. డబ్బులేకుండా బ్యాంకులు ఎందుకంటూ అధికారులతో ఖాతాదారులు ఘర్షణ పడడం నిత్యకృత్యమైంది. కరెన్సీ నోట్ల రద్దుతో చెన్నై విమానాశ్రయంలో కారు పార్కింగ్ వసూళ్లను కొన్నాళ్లు ఆపారు. కరెన్సీ కష్టాలు తీరకున్నా, చిల్లర సమస్య తీవ్రరూపం దాల్చి ఉన్నా లెక్కచేయకుండా సోమవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ పునరుద్ధరించారు.ఏటీఎం క్యూలో పుదుచ్చేరీ సీఎం: పుదుచ్చేరీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మంగళవారం అక్కడి ఏటీఎం వద్ద క్యూలో నిల్చుని డబ్బును డ్రా చేశారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా మంగళవారం కాంగ్రెస్ తరఫున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. వాణిజ్య సంఘాల ఆందోళన: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ, బ్యాంకుల్లో కరెన్సీ కొరతను దుయ్యబడుతూ తమిళనాడు వాణిజ్య సంఘాల సమ్మేళనం కార్యదర్శి విక్రమ్‌రాజా అధ్వర్యంలో చెన్నైలో మంగళవారం ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 50 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగదు నిల్వలేని బ్యాంకులు తెరవడం ఎందుకని దుయ్యబడుతూ వన్నార్పేటలో ఖాతాదారులు రాస్తారోకో నిర్వహించారు.ఈ పరిస్థితిపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పురసవాక్కం శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలరాజ్ మాట్లాడుతూ తమ శాఖకు రోజుకు రూ.1.5 కోట్లు అవసరం కాగా రూ.10 లక్షలు మాత్రమే వస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌కు సప్లరుుకి మధ్య ఇంత తేడా ఉంటే ప్రజలకు ఎలా నచ్చజెప్పాలని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నకిలో నోటీసులతో జాగ్రత్త : ఆదాయపు పన్ను శాఖ నల్ల ధనం నిర్మూలనకు పెద్ద కరెన్సీని రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అవకాశం తీసుకునేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది. నకిలీ నోటీసులను నమ్మవద్దని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. 044-28338314/52 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కోవైలో రూ.1.4 కోట్ల కరెన్సీ స్వాధీనం: మూడు కార్లలో తీసుకువెళుతున్న రూ.1.4 కోట్ల రద్దరుున కరెన్సీని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు జిల్లా కునియపుత్తూరులోని ఒక ప్రరుువేటు కాలేజీలో 30 శాతం కమీషన్‌పై కొత్త నగదు ఇచ్చి పాత నగదు మార్పిడికి తీసుకెళుతుండగా పట్టుపడింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం మాట్లాడరేం: స్టాలిన్ ప్రజల కరెన్సీ కష్టాలు ఆకాశాన్ని అంటినా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. ఎన్నికలు, ఇతర సమస్యలపై ఆసుపత్రి నుంచే జయ తగిన ఆదేశాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్న అన్నాడీఎంకే శ్రేణులు తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసగిస్తున్న మోదీ: కాంగ్రెస్ నల్లధనాన్ని రూపుమాపేందుకే తాను పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజలను ప్రధాని మోసం చేస్తున్నాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ విమర్శించారు. -
దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మొరుునాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన సోదరుడు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. మొరుునాబాద్ మండల పరిధిలోని శ్రీరాంనగర్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమానికి వచ్చిన ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యమని, నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజలు సంతోషంగానే ఉన్నారని ఆయన చెప్పారు. -
పసిడికి డాలర్ కష్టాలు..
ముంబై: అటు అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, ఇటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు సమస్యలతో స్టాకిస్టులు, జ్యుయలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం వంటి అంశాలు సమీపకాలంలో పుత్తడిపై ప్రభావం చూపనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ గానీ ఊహించినట్లుగా వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో ఇన్వెస్టర్లు పసిడిని పక్కన పెట్టి డాలర్ల వైపు మళ్ళొచ్చని వారి అభిప్రాయం. డాలర్ పెరుగుతున్న కొద్దీ బంగారానికి డిమాండ్ మరింత తగ్గొచ్చని అంచనాలున్నారుు. ఇప్పటికే డాలర్ ఇండెక్స్ దాదాపు దశాబ్ద గరిష్ట స్థారుులో తిరుగాడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి రేట్లు గత వారం తొమ్మిది నెలల ఇంట్రా డే కనిష్ట స్థారుుని తాకారుు. శుక్రవారంతో ముగిసిన వారంలో పుత్తడి రేటు తగ్గింది. ముంబైలో మేలిమి బంగారం (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ. 305 (1.04 శాతం) క్షీణించి రూ. 29,005 వద్ద ముగిసింది. ఇక ఆభరణాల బంగారం కూడా దాదాపు అంతే తగ్గుదలతో రూ. 28,855 వద్ద ముగిసింది. వెండి కిలో ధర రూ. 500 (11.97 శాతం) క్షీణించి రూ. 41,265 వద్ద క్లోజ రుు్యంది. అటు అంతర్జాతీయంగా న్యూ యార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,208.7 డాలర్ల నుంచి 1,179 డాలర్లకు తగ్గింది. -
డిజిటల్ వాలెట్లు ఎంత భద్రం?
దేశంలో ఇటీవల డిజిటల్ వాలెట్ల వాడకం జోరందుకుంది. దీనికి నోట్ల రద్దు అంశం కూడా బాగా కలిసొచ్చింది. డిజిటల్ వాలెట్లు ఉపయోగిస్తూ క్యాష్‌లెస్ ఎకానమీ వైపు అడుగులేస్తున్న మనం వాటి భద్రత గురించి కూడా ఆలోచించాలి కదా. చాలా మందికి ఇప్పటికీ కూడా డిజిటల్ వాలెట్లపై పూర్తి విశ్వాసంతో లేరు. అంటే ఫోన్ ద్వారా లావాదేవీలు జరపడంపై అభద్రతాభావంతో ఉన్నారు. హ్యాకింగ్, వైరస్, ఫోన్ తస్కరణ వంటి అంశాలు వీరిని భయాందోళనలకు గురిచేస్తున్నారుు. బలమైన ఎన్క్రిప్షన్ వల్ల హ్యాకింగ్, వైరస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆయా కంపెనీలు ఈ అంశంపై తీవ్రంగా శ్రమిస్తున్నాయని వివరించారు. ఇక మొబైల్ ఫోన్ జారిపోరుునా కూడా డిజిటల్ వాలెట్లకు వచ్చిన కష్టం ఏమీ ఉండదని, ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చని తెలిపారు. అలాగే వాలెట్లను ప్రత్యేకమైన పిన్ ఉపయోగించి లాక్ వేసుకోవచ్చన్నారు. కొంతమేర భద్రతా పరమైన అనుమానాలు ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పోలిస్తే మాత్రం డిజిటల్ వాలెట్లు ఉత్తమమని నిపుణుల అభిప్రాయం. క్రెడిట్ కార్డును ఎవరన్నా కొట్టేసినా, ఆన్లైన్ ఐడెంటిటీని తస్కరించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాగా క్రెడిట్ కార్డు మోసాలను నిత్యం చూస్తునే ఉన్నాం. ఈ మధ్యనే భారీగా డెబిట్ కార్డుల డేటా తరస్కరణకు గురవ్వడం పలు బ్యాంకులు వాటిని బ్లాక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
రిజిస్ట్రేషన్ల శాఖకు పెరిగిన రాబడి
-
రిజిస్ట్రేషన్ల శాఖకు పెరిగిన రాబడి
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లతో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 24 వరకు వెసులుబాటు కల్పించిన ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి గణనీయంగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా తగ్గిపోయారుు. వినియోగదారులు అప్పటికే కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవడం పైనా నోట్ల రద్దు ప్రభావం చూపింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పన్ను చెల్లింపు పరిధిలోకే వస్తున్నందున పాత నోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు వెసులుబాటు కల్పించింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు పెరిగి రోజువారీ రాబడి పెరిగింది. కాగా, కొన్ని రకాల పన్నులను పాత నోట్లతోనే చెల్లించేందుకు కేంద్రం డిసెంబర్ 15 వరకు వెసులుబాటు కల్పించగా రిజిస్ట్రేషన్లకు వర్తింప జేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలే దని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు పంచాయ తీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
28న లెఫ్ట్‌పార్టీల నిరసన
నేడు హైదరాబాద్‌లో మోటర్ సైకిల్ ర్యాలీ సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ చేపట్టాలని, అనంతరం అక్కడే బహిరంగ సభను నిర్వహించాలని వివిధ వామపక్ష పార్టీలు నిర్ణరుుంచారుు. మరో పక్క ఈ పార్టీలు శనివారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్రోడ్స నుంచి కోఠి వరకు మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారుు. రద్దుచేసిన పెద్ద నోట్లను డిసెంబర్ 31 వరకు మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారుు. ఈ నిర్ణయంతో పేదలకు అన్యాయం చేసి సంపన్నులు, కార్పొరేట్లకు ప్రధాని మోదీ మేలు చేశారని ఆరోపించారుు. పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, గ్రామీణుల ఆర్థిక వ్యవస్థ కుదేలై పోరుుందని ధ్వజమెత్తారుు. శుక్రవారం సాయంత్రం మగ్దూం భవన్లో జరిగిన వామపక్షాల సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు (సీపీఎం), డి.వి.కృష్ణ, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), తాండ్రకుమార్ (ఎంపీసీఐ-యూ), జానకి రాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), గుర్రం విజయ్‌కుమార్ (సీపీఐ-ఎంఎల్ కమిటీ), రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నాయకులు చర్చించారు. ఆర్థిక సమస్యల్లో 90% ప్రజలు: చాడ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో 90 శాతం ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పాల ప్యాకెట్ మొదలుకుని చిల్లర వస్తువుల కొనుగోలు వరకు పేదలు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. ఇప్పటివరకు నోట్ల చెలామణిని బట్టి 80 శాతం రూ.500 నోటును వినియోగిస్తున్నారని, భూములు అమ్మినవారు, పెళ్లిళ్ల కోసం డబ్బు పెట్టుకున్నవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా క్యూలో నిలబడి డబ్బులు తీసుకుంటుంటే అంబానీ, అదానీ క్యూలో నిలబడ్డారా అని సీపీఎం నేత జి.నాగయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని న్యూడెమోక్రసీ నేత డి.వి.కృష్ణ అన్నారు. -
రియల్టీపై తీవ్ర ప్రభావం!
-
టీఆర్ఎస్ సర్కారుపై పోరుకిదే సమయం
• బీజేపీ పదాధికారుల సమావేశంలో లక్ష్మణ్ • నోట్ల రద్దుపై అవగాహనా కార్యక్రమాలకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పదాధికారులు, పార్టీ జిల్లా శాఖల అధ్య క్షులు, ముఖ్యులతో గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగు తున్నదన్నారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై పోరాడటానికి ఇదే సమయ మన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ప్రజా ఉద్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. వెంటనే జిల్లా కమిటీలను పూర్తిచేయాలని అన్నారు. డిసెంబర్ 15లోపు పార్టీ సంస్థాగత వ్యవహారాలను పూర్తిచేయాలన్నారు. రాష్ట్రం లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మ కాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని లక్ష్మణ్ సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పి.మురళీధర్‌రావు, పి.కృష్ణ దాసు, రాజా, జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభా కర్, ఎన్.రామచందర్ రావు, నాగం జనా ర్దన్ రెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, నల్లు ఇంద్ర సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తగ్గుతున్న సానుకూలత
పెద్ద నోట్ల రద్దుపై వినియోగదారుల సెంటిమెంట్‌పై సీఎంఐఈ సర్వే ముంబై: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన వారంలో దేశంలో వినియోగదారుల సెంటిమెంట్ పెరగడమే కాదు, నిరుద్యోగ రేటు కూడా తగ్గిందట. వినియోగదారుల సెంటిమెంట్ 210 బేసిస్ పారుుంట్లు ఎగసి 96.65 నుంచి 98.75 శాతానికి... నిరుద్యోగ రేటు 150 బేసిస్ పారుుంట్లు తగ్గి 6.10 శాతానికి పడిపోరుునట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా పేర్కొంది. నిర్ణయం ప్రకటించిన తర్వాతి వారంలో మాత్రం సెంటిమెంట్ కొంత బలహీనపడి 98.60 శాతానికి తగ్గినట్టు సీఎంఐఈ పేర్కొంది. -
రియల్టీపై తీవ్ర ప్రభావం!
• 30 శాతం పడిపోనున్న ఇళ్ల ధరలు.. • రూ. 8 లక్షల కోట్ల విలువ ఆవిరి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశం గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. రాబోయే 6-12 నెలల కాలంలో దేశీయంగా 42 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు 30 శాతం మేర పడిపోనున్నారుు. 2008 తర్వాత అమ్ముడైన, అమ్ముడవని రెసిడెన్షియల్ ప్రాపర్టీల మార్కెట్ విలువ సుమారు రూ. 8 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఈ మేరకు అధ్యయన నివేదిక విడుదల చేసింది. ’రియల్ ఎస్టేట్ రంగంపై డీమోనిటైజేషన్ దెబ్బతో వచ్చే 6-12 నెలల కాలంలో రూ. 8,02,874 కోట్ల మేర రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోనుంది’ అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 42 నగరాల్లో 22,202 మంది డెవలపర్లకు చెందిన 83,650 ప్రాజెక్టులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గణాంకాలు, విశ్లేషణను ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన ప్రాప్‌ఈక్విటీ అందిస్తోంది. పీఈ ఆనలిటిక్స్ దీనికి మాతృ సంస్థ. అధ్యయన నివేదిక ప్రకారం 42 టాప్ నగరాల్లో ప్రస్తుతం రూ. 39,55,044 కోట్ల స్థారుులో ఉన్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ దాదాపు రూ. 8,02,874 కోట్ల మేర తగ్గి రూ. 31,52,170 కోట్లకు పడిపోనుంది. ఆయా నగరాల్లో 2008 తర్వాత నుంచి నిర్మాణం పూర్తరుున, నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మాణం ప్రారంభమవుతున్న దాదాపు 49,42,637 యూనిట్ల విలువను ప్రాప్‌ఈక్విటీ లెక్కగట్టింది. లెక్కల్లో చూపని ఆదాయాలను హడావుడిగా రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుండటంతో గడచిన 15 రోజుల్లో ఈ రంగంలో అసాధారణ స్థారుులో లావాదేవీలు జరిగాయని తెలిపింది. ముంబైలో అత్యధికంగా క్షీణత.. అన్ని నగరాలకన్నా అత్యధికంగా ముంబైలో ప్రాపర్టీల విలువ పతనం కానుంది. ముంబైలో మొత్తం మార్కెట్ వేల్యుయేషన్ గరిష్టంగా రూ. 2,00,330 కోట్లుగా ఉండనుంది. సుమారు రూ. 99,983 కోట్లతో బెంగళూరు, రూ. 79,059 కోట్ల క్షీణతతో గుర్గావ్ తర్వాత స్థానాల్లో ఉండనున్నారుు. ’భారత రియల్టీ మార్కెట్ ముందు ప్రస్తుతం సబ్-ప్రైమ్ స్థారుు సంక్షోభం ఉంది. ఇది అసంఘటిత రియల్ ఎస్టేట్, బ్లాక్ మనీ మొదలైన వాటి మూలాలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ప్రాప్‌ఈక్విటీ వివరించింది. రాబోయే రోజుల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల (రీసేల్స్) పరిమాణం కూడా గణనీయంగా తగ్గొచ్చని సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ జసూజా పేర్కొన్నారు. లావాదేవీ మొత్తాన్ని పూర్తిగా చెక్ రూపంలో ఇచ్చేందుకు ప్రతి అరుుదుగురు కొనుగోలుదారుల్లో ఒక్కరు మాత్రమే సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పారు. సాధారణంగా కనీసం 20 నుంచి 30 శాతం దాకా నగదు రూపంలో చాలా మంది నిర్వహించాలనుకుంటారని, కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం పాటు ఈ ధోరణి కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. ’ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకుని సర్దుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి కొంత సమయం పడుతుంది కనుక రాబోయే వారాల్లో రీసేల్స్ దాదాపు నిల్చిపోవచ్చు’ అని జసూజా అభిప్రాయపడ్డారు. రియల్టీ పెట్టుబడులకు బెంగళూరు, ముంబై టాప్: పీడబ్ల్యూసీ వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో రియల్టీ పెట్టుబడులకు సంబంధించి బెంగళూరు, ముంబై టాప్ నగరాలుగా నిల్చారుు. పీడబ్ల్యూసీ-అర్బన్ ల్యాండ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం ఫిలిప్పీన్‌స రాజధాని మనీలా మూడో స్థానం దక్కించుకుంది. అటు వియత్నాంలోని హో చి మిన్ సిటీ, చైనాలోని షెంజెన్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారుు. మెరుగైన రాబడులనిచ్చే అధిక విలువ ప్రాపర్టీల అందుబాటు, కిరారుుకి డిమాండ్ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతుండటం వంటివి భారత్ రియల్టీ మార్కెట్‌కు ఊతమివ్వగలవని నివేదిక వివరించింది. -
ఇక్కడితో ఆగిపోతే ఒరిగేదేమీ ఉండదు
పెద్ద నోట్ల రద్దుపై ప్రముఖ ఆర్థికవేత్త లారియన్స్ వాషింగ్టన్: నల్లధనం సమస్య పరిష్కారం దిశలో ఒక్క పెద్ద నోట్ల రద్దు చర్య సరిపోదని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త లారెన్స ‘లారీ’ సమ్మర్స్ పేర్కొన్నారు. భారత్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దుపై ప్రపంచబ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త, అమెరికా అధ్యక్షుడి మాజీ ఆర్థిక సలహాదారు అరుున సమ్మర్స్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక బ్లాగ్ ద్వారా ఆయన ఏమన్నారంటే.. ⇔ నల్లధనం నిరోధంలో కొత్త చర్యలు ఏవీ తీసుకోకుండా... పెద్ద నోట్ల రద్దు ఒక్కటే ఫలితాన్నివ్వబోదు. గందరగోళం, ప్రభుత్వానికి సంబంధించి ‘విశ్వాస రాహిత్యం’గా ఇది మిగిలిపోతుంది. ⇔ అందరిలానే మేం కూడా ప్రధాని నరేంద్ర మోదీ చర్య పట్ల ఆశ్చర్యపోయాం. ఇలాంటి భారీ కసరత్తు ప్రపంచంలో బహుశా ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ⇔ నేరస్తులు ఎంతమంది తప్పించుకున్నా... ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది స్వేచ్ఛాయుత సమాజంలో పాటించే ముఖ్యాంశం. అరుుతే ఇక్కడ కారణమేదైనా... అమాయకుల హక్కులను హరించడం సమస్యాత్మక అంశం. -
నేటి నుంచి పార్లమెంటు భేటీ
-
వాడి వేడిగా ‘శీతాకాలం’
నేటి నుంచి పార్లమెంటు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు, నల్లధనం, అవినీతి అంశాలపై ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడి చేసేందుకు విపక్షాలు ఏకమవ్వాలని నిర్ణయించగా.. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ అఖిలపక్షాన్ని కోరారు. మరోవైపు, విపక్షాలు మూకుమ్మడి దాడిని దీటుగా ఎదుర్కొని విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. నెలరోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో నోట్ల రద్దుతో పాటు సర్జికల్ దాడులు, జమ్మూకశ్మీర్, ఓఆర్ఓపీ, రైతుల సమస్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ, పార్లమెంట్ సమావేశాలలో తొలుత పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ప్రజల అవస్థలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపజేయనున్నాయి. సహకరించండి, చర్చిద్దాం: ప్రధాని నల్లధనం, అవినీతి తదితర అంశాలపై పార్లమెంట్ లోపల, బయట ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని మోదీ అన్ని పార్టీలను కోరారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు పార్లమెంట్లో తాము లేవనెత్తే అంశాలను వెల్లడించగా.. అన్ని సమస్యలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమమని, ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరించాలని మోదీ కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి సహకరించాలన్నారు.విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సర్కారు సిద్ధమేనని అఖిలపక్షం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ఇదో పెద్ద కుంభకోణం: ఆజాద్ అఖిలపక్ష భేటీ తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్‌పక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ బాధ పడుతున్నారని, దేశంలో ఇది అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో సహా పలు సమస్యలపై ప్రతిపక్షాలన్ని ఐక్యంగా ఉన్నాయని, కలసి కట్టుగా పార్లమెంట్లో సమస్యలను లేవదీస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదని, తొందరపాటుతనంతో, ఏమాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా దేశంలో ఆర్థిక గందరగోళాన్ని ప్రభుత్వం సష్టించిందని ఆజాద్ చెప్పారు. సమరమే: విపక్షాలు అఖిలపక్షం తర్వాత విపక్షాలు (తృణమూల్, సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ, డీఎంకే, ఇతర పార్టీలు) సమావేశమయ్యాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. అటు, మరోవైపు, 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. పార్లమెంటు సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుతో జీఎస్టీలో నాలుగు శ్లాబులు (28 శాతం వరకు) ప్రవేశపెడితే వ్యతిరేకించాలని నిర్ణయించారు. సోనియా ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. -
రియల్టీకి నోటు దెబ్బ!
జిల్లాల విభజనతో తెలంగాణలో.. అమరావతితో ఏపీలో రియల్ బూమ్ • తాజాగా పెద్ద నోట్ల రద్దుతో స్తంభించిన రియల్టీ రంగం • నగదు రూపంలో జరిగే స్థిరాస్తి లావాదేవీలన్నీ కుదేలే • స్థలాలు, విల్లాలు, ప్రీమియం ప్రాజెక్ట్‌లపై తీవ్ర ప్రభావం • వాణిజ్య, కార్యాలయ, రీసేల్ ప్రాపర్టీలపైన కూడా.. • అఫడబుల్ హౌజింగ్‌కు మాత్రం కలిసొస్తుంది: నిపుణులు ‘‘తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో స్థిరాస్తి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చారుు. కొన్ని జిల్లా కేంద్రాల్లో అరుుతే హైదరాబాద్‌తో సమానంగా ధరలున్నారుు’’ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రకటనతో ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు రాత్రికి రాత్రే పెరిగారుు. అమరావతిలో అరుుతే ఏకంగా హైదరాబాద్ కంటే ఎక్కువే ధరలున్నారుు’’ .. అరుుతే తాజాగా కేంద్రం తీసుకున్న రూ.1,000, రూ.500 నోట్ల రద్దు నిర్ణయం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటివరకు నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయారుు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం!! సాక్షి, హైదరాబాద్ తెలంగాణలో సగటున రోజుకు 3 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతారుు. పెద్ద నోట్ల రద్దుతో బుధవారం కేవలం 150, గురువారం 300 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగారుు. ఇవి చాలవూ పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంపై ఎంతలా ఉందో చెప్పడానికి! రియల్టీ రంగంలో నగదు లావాదేవీలు జరిగేది స్థలాలు, విల్లాలు, ప్రీమియం ఫ్లాట్ల కొనుగోళ్లలోనే. అందుకే ఆయా విభాగాలపై స్వల్ప కాలంలో ప్రభావం పడుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి చెప్పారు. డెవలపర్, స్థల యజమాని మధ్య జరిగే జారుుంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇందులో నగదు లావాదేవీలుండవు. బిల్డర్ నిర్మించే నిర్మాణంలో కొన్ని ఫ్లాట్లు ఓనర్‌కు అప్పగిస్తాడు. అంటే వాటిని యజమానే విక్రరుుంచుకోవచ్చు. ఇది 40:50 లేదా 60:40 శాతంగా ఉంటుంది. అలాకాకుండా బిల్డర్లే ఒకేసారి డబ్బు చెల్లించి స్థలాన్ని కొంటాడో ఆయా ప్రాజెక్ట్‌లపై ప్రభావముంటుంది. నివాస సముదాయాలు: ఈ విభాగంలో ప్రీమియం, లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆయా కస్టమర్లు చెక్స్ కంటే నగదు రూపంలో సొమ్ము చెల్లించేందుకే ఇష్టపడతారు. ఉదాహరణకు అఫడబుల్ హౌజింగ్ విభాగంలో నగదు-చెక్ నిష్పత్తి 10:90 శాతంగా ఉంటే.. కోటి ఆపైన విలువ ఉండే స్థిరాస్తి కొనుగోళ్లలో ఈ నిష్పత్తి 40:60 శాతంగా ఉంటుంది. వాణిజ్య సముదాయాలు: కార్యాలయాలు, ఇండస్ట్రియల్ లీజింగ్, లావాదేవీల మీద ప్రభావం ఉంటుంది. వాణిజ్య సముదాయాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) లుండటం వల్ల పెద్దగా ప్రభావముండదు. రిటైల్: నగదు లావాదేవీలు స్వల్పకాలం తగ్గటం వల్ల రిటైల్ రంగంపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. లగ్జరీ విభాగంలో మాత్రం దీర్ఘకాలం ప్రభావం ఉంటుంది. నల్లధనం ప్రవాహం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అరుుతే డెబిట్, క్రెడిట్, ఈ-వాలెట్ వినియోగంపై ఎలాంటి పరిమితి లేకపోవటం లగ్జరీ విభాగానికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. భూమి కొనుగోళ్లు, లీజులు: భూమి లావాదేవీలు, జారుుంట్ వెంచర్లు, జారుుంట్ డెవలప్మెంట్స్, కార్పొరేట్ పెట్టుబడుల మీద కూడా ప్రభావం తప్పదు. ఇందులో భూమి లావాదేవీలు ప్రత్యేకించి వ్యవసాయ భూముల కొనుగోళ్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆయా కొనుగోళ్లు పూర్తిగా నగదు రూపంలోనే జరుగుతారుు మరి. జారుుంట్ వెంచర్స్, డెవలప్‌మెంట్స్‌లో సంస్థాగత పెట్టుబడులుండటం కలిసొచ్చే అంశం. అందరి దారి అఫడబుల్ హౌజింగ్ వైపు పెద్ద నోట్ల రద్దు అందుబాటు గృహాలు (అఫడబుల్ హౌజింగ్)కు అంటే రూ.30-60 లక్షల మధ్య ధరలుండే అపార్ట్మెంట్లకు మాత్రం కలిసొస్తుందని గిరిధారి కన్స్ట్రక్షన్స ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఈ విభాగంలో నగదు రూపంలో లావాదేవీలు జరిగేది కొంతే. 20-25 శాతం మాత్రమే ముందస్తు చెల్లింపులుగా నగదు రూపంలో తీసుకుంటాం. మిగిలినదంతా బ్యాంకు రుణంగా ఇస్తుంది. అందుబాటు గృహాల నిర్మాణదారులకు ప్రధాన పోటీదారులు పంచాయతీ లే-అవుట్లు, వెంచర్లు చేసే అసంఘటిత డెవలపర్లే. కానీ, ఇప్పుడు నోట్ల రద్దుతో లావాదేవీలు, బదిలీలు లేక వారందరూ తెరమరుగైపోతారు. దీంతో ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులకు మిగిలిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదు కాబట్టి అపార్ట్మెంట్ విభాగంలో పెట్టుబడులు పెడతారని ఆయన వివరించారు. ప్రస్తుతం నగరంలో 40-60 శాతం అందుబాటు గృహాలున్నారుు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, శ్రీనగర్‌కాలనీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌లు, కొత్త జిల్లాల్లోని వెంచర్లు, స్థలాల క్రయవిక్రయాలకు కొంత కాలం ప్రభావం తప్పదని పేర్కొన్నారు. వడ్డీ రేట్ల, రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గింపు, వాస్తవ, మార్కెట్ విలువకు మధ్యనున్న వ్యత్యాసాన్ని తగ్గించడం వంటి చర్యల వల్ల ఈ రంగంలో నల్లధనాన్ని అరికట్టవచ్చని సూచించారు. విలువ ఎక్కువేస్తారు.. • నల్లధనం ఎక్కువ ప్రవహించే రంగం స్థిరాస్తి రంగమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే ప్లాట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణరుుంచిన ధరలకు, యజమాని చెప్పే ధరలకు పొంతనుండదు. ఫ్లాట్ల సంగతి చూసినా అంతే.. రిజిస్ట్రేషన్ విలువకు, చెల్లించే విలువకూ మధ్య భారీ వ్యత్యాసమే ఉంటుంది. అసలేమవుతుందంటే.. • కస్టమర్ సాధ్యమైనంత వరకూ సొమ్మును బ్యాంకు నుంచి రుణం రూపంలో తీసుకోవాలనే చూస్తాడు. ఫ్లాట్ ధర రూ.40 లక్షలు, ఆ తర్వాత రూ.5 లక్షలు ఇంటీరియర్ ఖర్చులనుకుందాం. కానీ, కస్టమర్ చేతిలో ఉండేది కేవలం రూ.8-10 లక్షలే. అప్పుడు కస్టమరేం చేస్తాడంటే.. బిల్డర్‌తో అగ్రిమెంట్లో విలువ ఎక్కువేయమంటాడు. ఉదాహరణకు ధర చ.అ.కు రూ.2,700 అరుుతే రూ.3,000లుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. దీంతో బ్యాంక్ నుంచి రుణం ఎక్కువొస్తుంది. దీంతో ఇంటీరియర్ ఖర్చులు కూడా రుణం రూపంలో వచ్చేస్తుందన్నమాట. ⇔ స్థలాలు, వ్యవసాయ భూముల వంటి స్థిరాస్తులను నగదు రూపంలోనే ఎందుకు జరుగుతాయంటే.. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ రీజియన్‌లో ప్రభుత్వం భూమి విలువను ఎకరానికి రూ.25 లక్షలుగా విధించింది. కానీ, ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటు మాత్రం రూ.2-4 కోట్లుంది. దీంతో కొనుగోలుదారుడు ప్రభుత్వానికి ఫీజులు, పన్నులు కేవలం రూ.25 లక్షలకే చెల్లిస్తాడు. అమ్మేవాళ్లూ ఆదాయ పన్నులో ఈ లెక్కలు చూపించరు. కావాలంటే ఆదాయ పన్ను కూడా కొనుగోలుదారుడ్నే కట్టమంటారు. దీంతో కొనుగోలుదారుడు చేసేదేం లేక నగదు రూపంలోనే సొమ్మును చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి. దీంతో ఆయా కొనుగోళ్లలో మిగిలిన సొమ్ము అంటే సుమారు రూ.1.75-3.75 కోట్లు నల్లధనంగా మారిందన్నట్టేగా! -
ఫీజులు చెల్లించకపోయినా పిటిషన్ల స్వీకారం
-
వైన్ షాపు.. వెల వెల..
• ‘గ్రేటర్’లో 60% పడిపోరుున మద్యం అమ్మకాలు • పాత నోట్ల కారణంగా బోసిపోయిన వైన్ షాపులు, బార్లు పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో మందుబాబులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. బుధ, గురువారాల్లో మహానగరం పరిధిలోని 300మద్యం దుకాణాలు, 571 బార్లలో మద్యం అమ్మకాలు 60% మేర పడిపోరుునట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు కోసం వస్తున్న వారు రూ.500, రూ.1,000 నోట్లను తీసుకువస్తుండడంతో దుకాణదారులు ఆ నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో 50 నుంచి 60 శాతం మంది మద్యం కొనకుండానే తిరిగి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కటాన్ల కొద్ది మద్యం కొనుగోలు చేసేవారు సైతం దిక్కులేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నారుు. కోఠి రంగ్‌మహల్ చౌరస్తాలోని బగ్గా వైన్సలో ఈ రెండు రోజుల్లో 40% అమ్మకాలు మాత్రమే జరిగినట్టు దుకాణం యజమానులు తెలిపారు. హైదరాబాద్ వైన్ షాపుల నిర్వాహకులు వంద నోట్లు ఉంటేనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అమ్మకాలు సాగుతున్నారుు. మద్యం ప్రియులకు డెబిట్, క్రెడిట్ కార్డుల వల్ల మద్యం సీసాలు దొరుకుతుండడంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. వైన్ షాపు నిర్వాహకులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రం ఆహ్వానించి కార్డు స్వైప్ చేసుకుని మద్యం బాటిళ్లను వారి చేతుల్లో పెడుతున్నారు. బార్లు సైతం వెలవెల.. పెద్ద నోట్ల రద్దుతో బార్లు కూడా వెలవెలబోతున్నారుు. బారు వద్ద పార్కింగ్ నుంచి మొదలుకుని వెరుుటర్ వరకు వంద నోట్లు ఉన్నాయా అని మందుబాబులను ముందే ప్రశ్నిస్తున్నారు. బారులో బిల్లు వందల నుంచి వేల రూపాయల వరకు అరుునా దర్జాగా కట్టి వెరుుటర్కు ఓ వంద టిప్పు ఇచ్చే వాళ్లను సైతం వంద నోటు ఉంటేనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా బార్లు మందుబాబులు లేక వెలవెలబోతున్నారుు. -
నోట్లు.. పాట్లు..
పరిగి: ఈ చిత్రంలో నిల్చుని వినయంగా వేడుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. సొంతూరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహి ద్‌పూర్ అనుబంధ దాశ్యనాయక్ తండా. శంకర్ సోదరుడు బాల్‌రాజ్ వివాహం శుక్రవారం జరగనుంది. పెళ్లి ఖర్చుల కోసం రూ.లక్ష సిద్ధం చేసుకుని ఇంట్లో దాచుకున్నారు. ఇంతలో రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏం చేయాలో పాలుపో లేదు. గురువారం ఇదిగో ఇలా పరిగి ఎస్బీహెచ్ (ఏడీబీ)కి వచ్చాడు. బ్యాంకు మేనేజర్‌ను కలసి రూ.లక్ష డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. నిబంధనలు దాటి తాను ఏమీ చేయలేనని..డిపాజిట్ చేసుకుని రూ.4 వేలు మాత్రమే ఇవ్వగలనని బ్యాంకు మేనేజర్ ఫకీరయ్య సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదిలేక శంకర్ ఇంటిముఖం పట్టాడు. -
ఫీజులు చెల్లించకపోయినా పిటిషన్ల స్వీకారం
నోట్ల రద్దు నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల దాఖలు సమయంలో కోర్టు ఫీజులు చెల్లించకపోరుునప్పటికీ సదరు పిటిషన్ల ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీతో పాటు ఉభ య రాష్ట్రాల్లోని అన్ని కోర్టులను ఆదేశించింది. నిర్ణీత కోర్టు ఫీజు చెల్లిస్తామని అఫిడవిట్ దాఖలు చేస్తే, సూట్లు, అప్పీళ్ల వ్యాజ్యాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. కాకపోతే వాటికి నంబర్ మాత్రం కేటారుుంచవద్దంది. రూ.20వేల లోపు ఫీజులను ఈ నెల 24వ తేదీ లోపు, అంతకు మించిన మొత్తాలను డిసెంబర్ 8 లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గడువులోపు ఫీజులు చెల్లిస్తేనే నంబర్ కేటారుుంచాలని పేర్కొంది. హైకోర్టులో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఆర్థిక కార్యకలాపాలకు దెబ్బే..
• స్వల్పకాలంలో వృద్ధి దెబ్బతింటుంది • నోట్ల రద్దుపై గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడి ముంబై: బ్లాక్ మనీని అడ్డుకోవటానికి ఇప్పటిదాకా చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటన వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ స్పష్టంచేసింది. ‘‘కేంద్రం చర్యతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. అది మంచిదే. కానీ రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తారుు. ఆర్థిక వ్యవస్థకిది ప్రతికూలం’’ అని సంస్థ ఒక నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆర్థిక కోణంలో చూసినపుడు నగదు సరఫరాపై, వినియోగ వ్యయంపై, ద్రవ్య విధానాలపై... ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం చాలావరకూ ఉంటుంది’’ అని సంస్థ పేర్కొంది. వ్యక్తులు తమ నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తారు కనక వచ్చే నెలలో ఆర్థిక కలాపాలు మందగిస్తాయని నివేదిక అభిప్రాయపడింది. వ్యక్తుల ఆర్థిక ఆస్తుల్లో దాదాపు 10 శాతం నగదు రూపంలోనే ఉన్నాయని, డిబెంచర్లు- ఈక్విటీల్లో ఉన్నదానికన్నా ఇది అధికమని వెల్లడించింది. ‘‘ఈ సంస్కరణ మధ్య కాలానికి సానకూలమైనదే. ఎందుకంటే దీనివల్ల పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతారుు. ఎలక్టాన్రిక్, బ్యాంకింగ్ వ్యవస్థద్వారా లావాదేవీలు అధికమవుతారుు. అప్రకటిత ధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను అధికారులు గమనిస్తూనే ఉంటారు కనక ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో 2016-17లో అంచనావేసిన 3.5 శాతం ద్రవ్యలోటు కన్నా తక్కువగా 2017-18లో లోటు 3 శాతమే ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. అరుుతే స్వల్ప కాలానికి చూస్తే నగదుపై ఆధారపడిన జ్యుయలరీ, రెస్టారెంట్లు, ఫుడ్-బెవరేజెస్, రవాణా వంటి రంగాలు బాగా దెబ్బతింటాయని... పలు ఇళ్లలో వీటిపై పెడుతున్న ఖర్చు 50 శాతందాకా ఉంది కనక ఈ రంగంపై ఆధారపడిన వారిమీద కూడా ఈ ప్రభావం ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది.