
ఇక్కడితో ఆగిపోతే ఒరిగేదేమీ ఉండదు
పెద్ద నోట్ల రద్దుపై ప్రముఖ ఆర్థికవేత్త లారియన్స్
వాషింగ్టన్: నల్లధనం సమస్య పరిష్కారం దిశలో ఒక్క పెద్ద నోట్ల రద్దు చర్య సరిపోదని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త లారెన్‌స ‘లారీ’ సమ్మర్స్ పేర్కొన్నారు. భారత్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దుపై ప్రపంచబ్యాంక్ మాజీ ప్రధాన ఆర్థికవేత్త, అమెరికా అధ్యక్షుడి మాజీ ఆర్థిక సలహాదారు అరుున సమ్మర్స్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక బ్లాగ్ ద్వారా ఆయన ఏమన్నారంటే..
⇔ నల్లధనం నిరోధంలో కొత్త చర్యలు ఏవీ తీసుకోకుండా... పెద్ద నోట్ల రద్దు ఒక్కటే ఫలితాన్నివ్వబోదు. గందరగోళం, ప్రభుత్వానికి సంబంధించి ‘విశ్వాస రాహిత్యం’గా ఇది మిగిలిపోతుంది.
⇔ అందరిలానే మేం కూడా ప్రధాని నరేంద్ర మోదీ చర్య పట్ల ఆశ్చర్యపోయాం. ఇలాంటి భారీ కసరత్తు ప్రపంచంలో బహుశా ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు.
⇔ నేరస్తులు ఎంతమంది తప్పించుకున్నా... ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది స్వేచ్ఛాయుత సమాజంలో పాటించే ముఖ్యాంశం. అరుుతే ఇక్కడ కారణమేదైనా... అమాయకుల హక్కులను హరించడం సమస్యాత్మక అంశం.