economist
-
ధనవంతులపై.. భారత్ మరింత పన్ను విధించాలి: ఫ్రెంచ్ ఆర్థికవేత్త
భారతదేశంలో సంపన్నులు, సంపన్నులుగానే ఉన్నారు, పేదవారు.. పేదవారుగానే ఉన్నారు. ఈ అసమానతలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిని నివారించాలంటే.. ఇండియాలోని ధనికులపైన అధిక పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'థామస్ పికెట్టీ' (Thomas Piketty) పేర్కొన్నారు.10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులున్న వ్యక్తులపైన 2 శాతం సంపద పన్నును విధిస్తే.. భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుంది. అదే విలువగల ఆస్తిపైన 33 శాతం వారసత్వ పన్ను విధించవచ్చని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధించేందుకు.. కలిసి పని చేసేందుకు 20 ప్రధాన దేశాల ఆర్థిక మంత్రులు వాగ్దానం చేసారు. దీనిని భారత్ కూడా అనుసరించాలని ''21వ శతాబ్దంలో రాజధాని'' (Capital in the 21st Century) పుస్తక రచయిత కోరారు.ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో.. ధనవంతులపై పన్ను విధించడంలో భారతదేశం చురుకుగా ఉండాలని పికెట్టీ పేర్కొన్నారు. ఒక శాతం అగ్రశ్రేణి సంపన్న భారతీయులు కలిగి ఉన్న జాతీయాదాయ నిష్పత్తి.. అమెరికా, బ్రెజిల్ దేశాల సంపన్నులను మించిపోయిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?2022 - 2023లో.. భారతదేశంలోని ధనవంతులైన 1 శాతం మంది దేశానికి చెందిన సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఇండియాలోని 100 మంది ధనవంతుల సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసినట్లు తెలిసింది. -
పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూత
ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ 'బిబేక్ దెబ్రాయ్' (69) శుక్రవారం ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. ఈయన మృతికి నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ.. దేబ్రాయ్ ఉన్నత పండితుడని అభివర్ణించారు.డా. బిబేక్ దెబ్రాయ్ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. తన రచనల ద్వారా భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆనందాన్ని పొందారని మోదీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బిబేక్ దెబ్రాయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆయన విశిష్ట ఆర్థికవేత్త, నిష్ణాతులైన రచయిత, అద్భుతమైన విద్యావేత్త. ఆర్థిక సమస్యలను అవలీలగా పరిష్కరిస్తూ.. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈయన ప్రశంసనీయులని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr— Narendra Modi (@narendramodi) November 1, 20242019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యులుగా పనిచేసిన దెబ్రాయ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE)కి ఛాన్సలర్‌గా పనిచేసిన ఈయన.. అనేక పుస్తకాలు, పేపర్లు, ప్రముఖ కథనాలను రచించారు. అంతే కాకుండా అనేక వార్తాపత్రికలతో కన్సల్టింగ్/కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు.నరేంద్రపూర్‌లోని రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్న దెబ్రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో పనిచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.Deeply saddened by the passing of Dr. Bibek Debroy. He was a distinguished economist, a prolific author as well as an excellent academician. He will be admired for his policy guidance on economic issues and noteworthy contributions to India’s development. His columns in… pic.twitter.com/y1niSMlxU7— Dharmendra Pradhan (@dpradhanbjp) November 1, 2024 -
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
‘నోబెల్’ ఆర్థికవేత్త కన్నుమూత..
దిగ్గజ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కాహ్నెమాన్ కన్ను మూశారు. బిహేవియరల్ ఎకనామిక్స్‌లో క్రమశిక్షణను ఎక్కువగా ప్రభావితం చేసే సిద్ధాంతాలను రూపొందించిన కాహ్నెమాన్ 90 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ప్రిస్టన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికన్ విద్యావేత్త అయిన కాహ్నెమాన్ మరణించే వరకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అత్యధికంగా అమ్ముడైన "థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో" అనే పుస్తకాన్ని రాసిన కాహ్నేమాన్, మనుషుల ప్రవర్తన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాతుకుపోయిందనే భావనకు వ్యతిరేకంగా వాదించారు. అది తరచుగా ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్ర రంగాలలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా కాహ్నెమాన్కు 2002లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతి లభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన సిద్ధాంతం సాంప్రదాయ ఆర్థిక విధానాలను వ్యతిరేకించింది. మనుషులు తమ భావనలను మార్చుకునే విచక్షణను కలిగి ఉంటారని వాదించింది. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
300 ఏళ్లలో 200 కోట్లకు!
జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుంచి 50 ఏళ్లలోపే ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత? అలా పెరుగుతూనే పోతుందా? పెరగకపోగా, బాగా తగ్గుముఖం పడుతుందట. ఎంతగా అంటే, ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితమైపోతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది! ఇంకా మాట్లాడితే అంతకంటే భారీగా తగ్గినా ఆశ్చర్యం లేదంటోంది. కారణమేమిటో తెలుసా? ప్రాకృతిక విపత్తులనుకుంటున్నారా? కాదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శరవేగంగా తగ్గిపోతుండటమే! ఈ జాబితాలోని దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం... గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచి్చంది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటూ ఇటుగా ఉన్నది కాస్తా ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా! మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్ స్పియర్స్ లోతైన అధ్యయనం చేశారు. జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. ‘‘2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది’’ అని బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్–టీఎఫ్ఆర్)లో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు. పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్ వాదనను బలపరిచేలానే ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్లు ఎక్కువ సమయం పట్టనుంది! ఏమిటీ టీఎఫ్ఆర్...? ప్రతి మహిళ తన పునరుత్పత్తి సామర్థ్యం ముగిసేదాకా జీవించి, ఇతరత్రా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే కనగలిగిన పిల్లల సంఖ్యే టీఎఫ్ఆర్. జనాభాలో పెరుగుదల నమోదు కావాలంటే ఇది కనీసం 2 కంటే ఎంతో కొంత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం గ్లోబల్ టీఎఫ్ఆర్ 2.1గా ఉంది. 2026కల్లా ఇది 2కు తగ్గుతుందని అంచనా. అక్కణ్నుంచి స్థిరంగా తగ్గుతూ 2081 నాటికి ఏకంగా 1.4కు పడిపోనుంది. భారత్ విషయమే తీసుకుంటే, 2020 నాటికి టీఎఫ్ఆర్ 2కు దిగొచ్చింది. ప్రస్తుతం 1.8కి తగ్గిందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల్లో చాలావరకు టీఆఎఫ్ఆర్ ఇప్పటికే 2 కంటే దిగువకు వచ్చేసింది. గ్లోబల్ టీఎఫ్ఆర్ మున్ముందు ఏ 1.5 దగ్గరో స్థిరపడుతుందని, అంతకంటే తగ్గదని భావించినా జనాభా నానాటికీ తగ్గడమే తప్ప పెరిగే ప్రసక్తే ఉండదన్నది స్పియర్స్ అంచనా. ఆయన అధ్యయనంలో వెల్లడైన విశేషాలు... ► ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న 29 దేశాల్లో 2022 నాటికే 20 దేశాల్లో పునరుత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2 కంటే తగ్గింది. ►జనాభాపరంగా పెద్ద దేశాల్లో టీఎఫ్ఆర్ 2కు పైగా ఉండేవాటి సంఖ్య 2050కల్లా 3కు తగ్గుతుంది. అవి కాంగో, నైజీరియా, టాంజానియా. ►2081 నాటికి అన్ని దేశాల్లోనూ టీఆఎఫ్ఆర్ 2 కంటే తగ్గిపోతుంది. ►జననాల విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానం భారత్‌దే. దేశంలో ఏటా 2 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. ఈ శతాబ్దాంతానికల్లా అది ఏకంగా నాలుగో వంతుకు, అంటే 50 ►చైనాలో 85 లక్షలుగా ఉన్న వార్షిక జననాల సంఖ్య కేవలం శతాబ్దాంతానికి 12 లక్షలకు పరిమితం కానుంది. ►ఒకసారి తగ్గుముఖం పట్టాక జనాభా మళ్లీ పెరగాలంటే గ్లోబల్ టీఎఫ్ఆర్ 2 కంటే పెరగాలి. కానీ అందుకు అవకాశాలు చాలా స్వల్పం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ దేశంలోనూ అలా జరగలేదు. ►ఏ దేశంలో చూసినా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్న వారు పెరుగుతున్నారు. ►జీవన శైలి, ఆహారపుటలవాట్ల వంటి కారణాలతో పిల్లలు పుట్టని దంపతుల సంఖ్యా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో తగ్గిన పునరుత్పత్తి రేటు మన దేశంలో చూసుకుంటే 40 ఏళ్ల క్రితం కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పునరుత్పత్తి రేటు కనీసం 3 నుంచి 5 దాకా ఉండేది. ఇప్పుడది విపరీతంగా తగ్గిపోయింది. హరియాణానే తీసుకుంటే 5 నుంచి ఏకంగా 2కు తగ్గింది! ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్ (3), మధ్యప్రదేశ్ (2.6), యూపీ (2.7), రాజస్థాన్ (2.4), అస్సాం (2.1) మాత్రమే. పశి్చమబెంగాల్, తమిళనాడుల్లో 1.4 శాతం, మహారాష్ట్ర , పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో 1.5, కర్ణాటకలో 1.6, ఒడిశాలో టీఎఫ్ఆర్ 1.8గా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
అన్నీ ఉండీ ధరలు పెరగడమా?
దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్నప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్ –సరఫరా సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం వల్ల వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, కొరతలను సృష్టిస్తూ, ధరలను పెంచే వీలు ఏర్పడుతోంది. పైగా ప్రభుత్వమే తన వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతోంది. ఈ లాభాపేక్ష లేకుండా... నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తే ధరల పెరుగుదల నుంచి ప్రజలను కాపాడవచ్చు. గత సంవత్సర కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గోధుమల ధర ఈ కాలంలో సుమారు 22 శాతం పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి 2.5 మిలియన్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అనంతర వారంలోనే వాటి ధర 10 శాతం మేరకు తగ్గింది. ఇది సాధారణ మార్కెట్ సూత్రం. సరఫరా పెరిగితే డిమాండ్ తగ్గడం ఈ ధర తగ్గుదల వెనుకన పనిచేస్తోంది. గత సంవత్సర కాలంగా ఇతరత్రా నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగిపోతోంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఎందుకు ఉండిపోయింది? 2022 ఆగస్టు నాటికే అంతకు ముందరి సంవత్సర కాలంతో పోలిస్తే గోధుమల ధర 14 శాతం మేరన పెరిగి ఉంది. అయినా ప్రస్తుతం చేస్తున్నట్లుగా బహిరంగ మార్కెట్లోకి ధాన్యాన్ని విడుదల చేయలేదు. ఫలితంగా ధరల పెరుగుదల అలాగే కొనసాగింది. దీనికి కారణం, అప్పట్లో ప్రభుత్వం గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను విదేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ ధాన్యం కొరతలు, ముఖ్యంగా గోధుమల కొరత, విదేశీ మారక ద్రవ్య సముపార్జనకు బాగా కలిసి వచ్చింది. కానీ, ఇదే భారత ఆహార సంస్థ వద్ద గోధుమల కొరతకు దారి తీసింది. ఫలితమే అప్పుడు మార్కెట్లో ధర పెరిగినా గోధుమ గింజల సరఫరాను పెంచి, ధరలను తగ్గించలేని స్థితి. నేడు నడుస్తున్నది ఎన్నికల సంవత్సరం. ప్రజలను పెరిగే ధరల పాలు చేసి, వారిలో అసంతృప్తి పెరిగి అది తన ఎన్నికల పరాజయానికి దారి తీయకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గత సంవత్సరం జరిగిన భారీ ఎగుమతుల నేపథ్యంలో అది నిల్వల కొరతకు దారి తీసిన తర్వాత... ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని మార్పు చేయించేందుకు, అమెరికా నుంచి ఒత్తిడులు కూడా వచ్చాయి. చైనా మాత్రమే దేశీయ కొరతల నేపథ్యంలో, ఎగుమతులను నిషేధించాలన్న మన నిర్ణయాన్ని సమర్థించింది. 2022 సంవత్సర కాలంలో మన దేశం బియ్యాన్ని కూడా రికార్డు స్థాయిలో ఎగుమతి చేసింది. వాస్తవానికి నాడు దేశంలో బియ్యం నిల్వలు తగినంత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ బియ్యం ఎగుమతుల నిర్ణయం దేశీయంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమయ్యింది. గత సంవత్సర కాలం పైబడి నిత్యావసరాల ధరలు తీవ్ర స్థాయిలో పెరిగిన స్థితి మనకు తెలిసిందే. దీనికి కొంత మేరకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకొనే వంటనూనెలు, చమురు వంటి వాటి ధరలు అంతర్జాతీయంగానే పెరగడం కారణం కావచ్చును. అయితే, ఇది పాక్షిక సత్యం మాత్రమే. దేశీయంగా వివిధ సరుకుల ధరలను ప్రధానంగా నిర్ణయించే మార్కెట్ శక్తులయిన ‘డిమాండ్ – సరఫరా’ల యాజమాన్యంలో జరుగుతోన్న లోపాలు ధరల పెరుగుదలకు ముఖ్య కారణం. దీనికి, యూపీఏ హయాం నుంచి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు యూపీఏ పాలనా కాలంలో దేశంలో ధరలు పెరుగుతోన్న తరుణంలోనే... భారత ఆహార సంస్థ గోడౌన్లలోని ధాన్యాన్ని ఎలుకలు తినేయడం, లేదా అవి ముక్కిపోవడం జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఆ ప్రభుత్వం ‘ఉచిత భోజనం లేదు’ అంటూ గోడౌన్ల లోని ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు తిరస్కరించింది. మరో పక్కన అదే ధాన్యాన్ని విదేశాలకు... అక్కడ జంతువుల దాణాగా వాడకానికి ఎగుమతి చేసింది. దేశీయ ప్రజలను పెరుగుతోన్న ధరల నుంచి ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదా వారి క్షుద్భాదకు పరిష్కారం చూపడం ప్రభుత్వానికి లక్ష్యాలుగా లేవు. దాని ప్రధాన లక్ష్యం విదేశీ మారక ద్రవ్య సముపార్జన మాత్రమే! యూపీఏ అయినా, ఎన్డీయే అయినా అమలు జరుగుతోన్న విధానాలు ఒకటే. కాకుంటే యూపీఏలో సంస్కరణల పేరిట ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడంలో కొంత వెనుకా ముందు, లేదా మొహమాటాలు ఉన్నాయి. అలాగే, యూపీఏ ప్రభుత్వం కాస్తలో కాస్త నయంగా కొన్ని ప్రజానుకూల సంక్షేమ పథకాలను తెచ్చింది. దానిలో భాగమే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టాల వంటివి. ప్రస్తుతం ఎటువంటి మొహమాటం లేకుండా... కార్పొరేట్, ధనవంతులు, వ్యాపార వర్గాల అనుకూల విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనంతటి ఫలితమే నేడు దేశంలో మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల! ప్రభుత్వం ధరల నియంత్రణకు చిత్తశుద్ధితో పూనుకొని తగిన విధానాలను అనుసరిస్తే ఇంత స్థాయిలో పెరిగి ఉండేవే కాదు. ప్రస్తుతం జరిగిన విధంగా మార్కెట్లోకి గోధుమల నిల్వలను విడుదల చేసి ప్రైవేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధర పెంచగల అవకాశాన్ని కట్టడి చేయగలగడం ఒక ఉదాహరణ. మరింత ప్రాధాన్యత గల మరో ఉదాహరణ కేరళ వంటి రాష్ట్రాలది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన సందర్భాలలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇది అతి తక్కువ స్థాయిలో ఉంటూ రావడం గమనార్హం. దీనికి కారణం ఆ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలు అమలు జరుగుతోన్న తీరు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, దరిదాపు కుటుంబాలకు అవసరమైన అన్ని నిత్యావసరాలు పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లోని వ్యాపారులకు, ప్రజా పంపిణీ వ్యవస్థతో పోటీ ఏర్పడి, వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, వాటి కొరతలను సృష్టిస్తూ, తద్వారా ధరలను పెంచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా పోయింది. అత్యంత సాధారణంగా కనపడే ఈ ఇంగితాన్ని ఆచరణలో అమలులో పెట్టి అటు రైతాంగానికీ, ఇటు వినియోగదారుడికీ ప్రయోజనాన్ని చేకూర్చే విధానాల అమలు సాధ్యమేనని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తూ పోతే ధరల పెరుగుదల బెడద నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడడం సాధ్యమే. ఎన్నికల సంవత్సరంలో మాత్రమే ధరల తగ్గింపును సవాలుగా తీసుకుంటూ, మిగతా నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజానీకాన్ని... వ్యాపారస్తులకూ, దొంగ నిల్వలకూ, కొరతలకూ బలిచేస్తూ పోవడం అత్యంత అసహజమైనది. అది కనీసం డిమాండ్ సరఫరాల తాలూకూ మార్కెట్ సూత్రం పరిధిలో కూడా ఇమడదు. నిజానికి మన దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు (పాలకుల నిర్లక్ష్యంతో ఉత్పత్తి పెరుగుదల లేని వంటనూనె గింజల వంటి కొద్దిపాటివి మినహా) మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్న స్థితిలో కూడా నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్– సరఫరాను సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం... పైగా, స్వయంగా తానే ఒక వ్యాపారిగా తయారై భారత ఆహార సంస్థ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతూ పోవడం... ఫలితంగా అధిక ధరల పరిస్థితి ఏర్పడింది. ఆహార పదార్థాల నిల్వలపై పరిమితులు విధించే చట్టాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ పోవడం వంటి చర్యలు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు, మొబైల్: 98661 79615 -
ధరల స్పీడ్‌కు వడ్డీ రేటు పెంపు బ్రేక్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ స్పష్టం చేశారు. 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు. వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో మనం బెస్ట్ డాలర్ మారకంలో భారత్ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్ సమాధానం చెబుతూ, ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది. అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు. ఫెడ్ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. వాల్యుయేషన్ ప్రభావాల వల్లే భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్బీఐ సెప్టెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్ ఖాతా (భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మందగమనం ప్రతికూలమే, కానీ... ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం చెబుతూ, ప్రపంచ మందగమనం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్ తెలిపారు. ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు. డిసెంబర్లో మరో అరశాతం పెంపు అవకాశం అషిమా గోయల్ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. -
ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇక లేరు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం అర్థరాతత్రి కన్నుమూశారని అభిజిత్ సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ ప్రకటించారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు పలువురు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్ ప్రముఖంగా నిలిచింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్ బోధించారు. వ్యవసాయ ఖర్చులు అండ్ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్(దివైర్ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు. Prof Abhijit Sen was a fine economist with both his head & heart in the right place. His work, interventions benefitted many lives & families. I’m sure that my friend had much more to say & contribute at this difficult time India is going through. His passing is a big loss to us. pic.twitter.com/Jxb0V4BZFU — Sitaram Yechury (@SitaramYechury) August 30, 2022 -
ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ప్రాజెక్ట్ ఎకనామిస్ట్ మాల్వీ మెహ్రోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బీఈఈ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పాట్) పథకంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భారీ పరిశ్రమల్లో ‘పాట్’ అమలు చేయడం ద్వారా సాధించిన ఫలితాలను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దశాబ్దకాలంలో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనం(బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్) ఆదా అయిందని తెలిపారు. 2.464 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని.. భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగిందని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పాట్ పథకాన్ని భారీ పరిశ్రమలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను బీఈఈ మంజూరు చేస్తుందని, వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చన్నారు. పరిశ్రమల కోసం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించి మరింత బలోపేతం చేయాలని సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని విజయానంద్ పేర్కొన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 65 ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఐఓటీ పవర్ మానిటరింగ్ పరికరాలను అమర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సంస్థ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, ఈఈఎస్ఎల్ అసోసియేట్ మేనేజర్ కిషోర్ సింగ్ పాటిల్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు
‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్‌కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) గోడ (వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్స్)పై ఆ సంస్థ తరపున పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్తల ఫోటోలు వరుసగా కనిపిస్తాయి. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతుంటే ఆర్థికరంగంలో వారి మేధోకృషి గుర్తుకు వస్తుంటుంది. అపురూపమైన చిత్రాలు అవి. ఇప్పుడు ఆ ఫొటోల వరుసలో ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఫోటో చేరింది. ఐఎంఎఫ్ వాల్ ఫొటోల వరుసలో కనిపించిన తొలి మహిళా ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ తనప్రత్యేకతను చాటుకుంది. ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ ప్రఖ్యాత ఆర్థికవేత్తల ఫొటోల వరుసలో తన ఫోటో ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసింది గీత. ఇండియన్–అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీతా గోపినాథ్ కోల్‌కతాలో జన్మించింది. మైసూర్‌లోని నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీలో లేడి శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బీఏ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎం.ఏ. చేసింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డి పట్టా అందుకుంది. Breaking the trend 👊💥…I joined the wall of former Chief Economists of the IMF 😀 pic.twitter.com/kPay44tIfK— Gita Gopinath (@GitaGopinath) July 6, 2022 చదువు పూర్తయిన తరువాత హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఏడవ తరగతి వరకు గీతకు 45 శాతం లోపు మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులెప్పుడూ మార్కుల విషయంలో ఒత్తిడి తెచ్చేవారు కాదు. అయితే ఏడవ తరగతి తరువాత మాత్రం గీత చదువులో దూసుకుపోయింది. మార్కులే మార్కులు! అంతమాత్రాన చదువే లోకం అనుకోలేదు. హాయిగా ఆటలు ఆడేది. పాటలు పాడేది. గిటార్ వాయించేది. ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. గణితం నుంచి సైన్స్ వరకు ఎంత జటిలమైన విషయాన్ని అయిన నాన్న గోపీనాథ్ ఇంట్లో ఉన్న వస్తువులను ఉదహరిస్తూ సులభంగా అర్థమయ్యేలా చెప్పేవాడు. బహుశా గీతకు ఆ లక్షణమే వచ్చి ఉంటుంది. జటిలమైన ఆర్థిక విషయాలను వేగంగా అర్థం చేసుకోవడంలోనే కాదు, వాటిని సులభంగా బోధించడంలో పట్టు సాధించింది. గీత పరిశోధన పత్రాలు టాప్ ఎకనామిక్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ (2011) పురస్కారాన్ని అందుకుంది. 2014లో ‘టాప్ 25 ఎకనామిస్ట్స్ అండర్ 45’ జాబితాలో చోటు సంపాదించింది. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకుంది. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీత ప్రస్తుతం ఐఎంఎఫ్–డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉంది. -
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్ ప్రస్తుతం తన శాంతినికేతన్ నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్ కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆయన డాక్టర్లను సంప్రదించడంతో వైద్య పరీక్షల్లో కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. వాస్తవానికి అమర్త్యసేన్ కోల్‌కతాలోని పెళ్లికి హాజరు కావల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది కూడా. ఐతే ప్రస్తుతం ఆ ప్రయాణాలన్ని రద్దయ్యాయి. అమర్త్యసేన్ ప్రస్తుతం తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతని కటుంబం వెల్లడించింది. (చదవండి: యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్ షాక్) -
యుద్ధంతో మనకు ఇబ్బందే: జయంత్ వర్మ
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలకు సవాళ్లను విసురుతాయని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. విధాన నిర్ణేతలు తాజా పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని సూచించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండగా, ఇప్పటికే ఇది ఎగువ స్థాయిలో ఉందన్న విషయం గమనించాల్సిన కీలక అంశమన్నారు. బ్యారల్ క్రూడ్ ధర 75 డాలర్ల అంచనాలతో 2022–23 బడ్జెట్ రూపొందగా, యుద్ధంతో ఇది 110 డాలర్ల స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. మూడేళ్లగా మందగమనంలో ఉన్న ఎకానమీ ఇంకా ఊపందుకోలేదని, ప్రైవేటు పెట్టుబడుల్లో పురోగతి లేదని, ప్రైవేటు వినియోగం కూడా పుంజుకోలేదని అన్నారు. ఆ నేపథ్యంలోనే తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తత ఆందోళనకరమని అన్నారు. అమెరికా వడ్డీరేట్లు పెంచిన పక్షంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ 2013కన్నా ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల పర్భావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. కరెంట్ అకౌంట్ (దేశానికి వచ్చీ పోయే విదేశీ మారకం మధ్య నికర వ్యత్యాసం) లోటును నిర్వహించగలిగిన స్థాయిలో భారత్ ఉందన్నారు. డాలర్–రూపాయి మారకపు విలువల కదలికలపై తక్షణం ఆందోళన పడాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. -
ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం
నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి చాలా దేశాలు ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2022–23 ఆర్థిక సంవత్సరం తాలూకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మౌలిక ఆకాంక్షలు దేశ ప్రజలలో అప్ప టికే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యతాంశాల గురించిన పలు రకాల ఒత్తిడులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి: 1. సంవత్సర కాలం పైబడి సాగిన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్లు. 2. కోవిడ్ రెండో వేవ్ కాలంలో కోల్పోయిన తన ప్రాధాన్యాన్ని తిరిగి ఎంతోకొంత పొంద వలసిన ఆగత్యం ప్రధాని మోదీకి ఉండటం. 3. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక, నిజానికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన స్థితి. రికార్డు స్థాయి నిరు ద్యోగానికి ఎంతో కొంత ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత. 4.కోవిడ్ ముందరి 2018 జనవరి–మార్చి కాలం నుంచే పతనమవుతూ, కోవిడ్ కాలంలో అగాథంలోకి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తి గణాంకాన్ని తిరిగి నిలబెట్టగలగడం. 5. యూపీఏ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ద్రవ్యోల్బణం నేడు మరల తీవ్రస్థాయిలో పెరుగుతున్న స్థితి. దీనికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి పరిష్కారాల ఆవశ్యకత. 6. కోవిడ్ కాలంలో భారీ సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన, అప్పుల పాలైన, పేదరికంలోకి జారిపోయిన కోట్లాదిమంది మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే అవసరం. స్థూలంగా మింట్ సి ఓటర్ సర్వేలో బడ్జెట్ నుంచి ప్రజలు కోరుకుంటున్న అంశాలుగా ఈ నాలుగు ప్రస్ఫుటమైనాయి. (ఎ) విద్యా వైద్యానికి కేటాయింపును భారీగా పెంచడం. (బి) నిరుద్యోగ భృతి వంటి అంశంపై దృష్టి పెట్టడం. (సి) దేశంలో రైతాంగ వర్గానికి చెందనివారు కూడా కోరుకుంటున్న విధంగా రైతు అనుకూల విధానాలు. (డి) సంక్షేమ రాజ్యాన్ని భారీగా విస్తరించాలన్న ఆకాంక్షకు రూపాన్ని ఇవ్వటం. ముందుగా రైతు ఉద్యమ నేపథ్యంలో ముందుకు వచ్చిన రైతాంగ ఎజెండా బడ్జెట్లో ఎలా ప్రతిఫలించిందో చూద్దాం. సంవ త్సరం పాటు ఉద్యమం నడిపి ఇరకాటంలో పెట్టిన రైతాంగం పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి చూపిందనే ఆరోపణ ఉంది. పంటల సేకరణను అన్ని పంటలకూ విస్తరించి, లబ్ధిదారుల సంఖ్యను పెంచా లనే రైతుల కోరికకు భిన్నంగా... పంటల సేకరణకు కేటాయించిన మొత్తాన్ని 2021–22 బడ్జెట్లోని 2.48 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 2.37 లక్షల కోట్లకు తగ్గించారు. పంటల సేకరణ తాలూకు లబ్ధిదారుల సంఖ్యను గతేడాదిలోని 1.97 కోట్ల మంది నుంచి 1.63 కోట్ల మందికి కుదించారు... అదీ కథ! ఎరువులపై ఇచ్చే సబ్సిడీ 2021–22 బడ్జెట్ తాలూకు 1,40,122 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 1,05,222 కోట్లకు అంటే 25 శాతం మేరకు తగ్గింది. మరో పక్క గ్రామీణ పేదలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉపాధి పథకానికి 73 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 74 వేల కోట్లు (అదనపు కేటాయింపులతో ఈ మొత్తం లక్ష కోట్ల మేరకు చేరుకుంది.) ఉపాధి హామీ చట్ట ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, వారు పని చేయాలని కోరుకుంటే, సంవత్సరానికి కనీసం వంద పని దినాలకు హామీ ఇవ్వాలి. కానీ చాలా ఏళ్లుగా ఈ పథకానికి కేటా యింపులు తగినంతగా లేవు. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాలు 34.76 మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి మరింతగా దిగజారి 27.16కు పరిమితమయ్యాయి. అంతకు ముందటి కాలంలో ఇవి సగటున 42గా ఉన్నాయి. ఉపాధి పనులకు ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం సంతృప్తికర అమలు కోసం 2.64 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక ప్రఖ్యాత సంస్థ లెక్కించింది. స్థూలంగా 2013–2019 మధ్యకాలంలో సాగుబడి ద్వారా రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఒక రైతు కుటుంబానికి వారి ఆదాయంలో 48 శాతంగా ఉన్న సాగుబడి ఆదాయ వాటా ప్రస్తుతం 37 శాతానికి తగ్గింది. పేద ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీపై కోత పడ్డది. 2,86,469 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత బడ్జెట్లో 2,06,831 కోట్లకు తగ్గింది. ప్రపంచ క్షుద్బాధ సూచీలో 2021 సంవత్సరానికి మొత్తం 116 దేశాలలో భారతదేశం ర్యాంకు 94 నుంచి 101కి దిగజారింది. కోవిడ్ కాలంలో మరింత తీవ్రమైన ఆకలి సమస్యను ఈ ఆహార సబ్సిడీల కోత మరింత పెంచుతుంది. దీన్ని మరింత జఠిలం చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీని వెనుక అంతర్జాతీయంగా కమోడి టీల ధరల పెరుగుదల, దేశీయంగా విపరీతమైన పన్నుల భారం వలన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఎస్మా వంటి చట్టాల రద్దు వలన పట్టపగ్గాలు లేని వ్యాపారస్తులు, దళారుల చేతివాటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడం వలన ధరలపై నియంత్రణ ఉంచ గల సమాంతర వ్యవస్థ దెబ్బతినడం వంటివి అన్నీ ఉన్నాయి. ఈ కారణాలలో మొదటిదాన్ని వదిలేస్తే, మిగతావన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డు రావడం వలన గత రెండు నెలలుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎన్నికల తరువాత పైకి ఎగసేందుకు సిద్ధంగానే ఉంది. ఈ నిర్వాకం చాలద న్నట్లు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ శ్లాబులలో మార్పు చేస్తామంటూ ప్రస్తుతం 0 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని సరుకులపై పన్నును విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా, నిరుద్యోగం దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగా లిస్తామనే హామీని తుంగలో తొక్కి... రానున్న కాలంలో 60 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవిని అందుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చుతున్న బీజేపీ ప్రభుత్వం, నగర ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకం కావాలనే డిమాండ్‌కు సహజంగానే అనుకూలంగా స్పందించలేదు. ఈ మొత్తం క్రమంలో దేశ స్థూల జాతీయోత్పత్తి దిగజారింది. అనేకమంది అంతర్జాతీయ ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం, భారతదేశపు జీడీపీ గణాంకాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో మోదీ ఘనంగా ప్రకటించిన జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్ళడం అనేది వట్టి నీటిమూటే కాగలదు. పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వంటి నిర్ణయాలకు తోడుగా కోవిడ్ వల్ల దిగజారిన పరిస్థితులను పునరుజ్జీవింప జేసేందుకు ఆర్థిక ఉద్దీపన ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ప్రపంచమంతటా కూడా వామపక్ష ఆలోచనా విధానం బల పడుతోంది. ఫలితంగానే మింట్ సి ఓటర్ సర్వేలో మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగా లంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఈ దిశగా, అమెరికా, యూరోప్ దేశాలూ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా కొంత ప్రయత్నం మొదలైంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం ద్రవ్య లోటును పట్టించుకోకుండా (14% పైగా ఉంది) ప్రజల కొనుగోలు శక్తిని, మార్కెట్ డిమాండ్‌ను పెంచేందుకు భారీ వ్యయాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా కూడా అదే పని చేస్తున్నాయి. అంటే ఈ దేశాలు ప్రజలకు నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. వ్యాసకర్త ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ‘ 98661 79615 -
ఇండియా ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లు కావాలంటే.. ఇలా జరగాలి
ముంబై: 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.375 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, జీడీపీ వృద్ధి ఏటా 8 శాతానికి పైనే నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ‘‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందుకు 5–6 శాతం వృద్ధి కచ్చితంగా సరిపోదు. 8 శాతం కంటే ఎక్కువే వృద్ధి సాధించాలి’’ అంటూ ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో భాగంగా అన్నారు. 8 శాతానికి మించిన వృద్ధి కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. తక్కువ పన్ను రేట్ల అమలుతో ప్రజలు, కార్పొరేట్ల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభతరం కావాల్సి ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించినందున ఈ విషయంలో వేలెత్తి చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసినప్పటికీ, జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడలేదని రజనీష్‌కుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు, కఠిన సంస్కరణలు తీసుకునే ధోరణి ఉన్నా కానీ, అమలు పరంగా బ్యూరోక్రసీ వైపు నుంచి సమస్యలు నెలకొన్నట్టు పేర్కొన్నారు. ‘‘నేడు నేను కానీ, మీరు కానీ జిల్లా స్థాయిలో ఒక యూనిట్ పెట్టాలనుకుంటే భయానక అనుభవాన్ని ఎదుర్కోవాల్సిందే. జిల్లా స్థాయికి వెళితే అధికారుల తీరుతో వ్యాపార సులభతర నిర్వహణ అంతా కనిపించకుండా పోతుంది’’ అని రజనీష్ వాస్తవ పరిస్థితులను వివరించారు. -
లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు. బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది... 1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది. ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్. పెడచెవిన వాస్తవాలు ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం. అధిగమించడం ఎలా..? పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం. తాజా అంశాలపై దృష్టి ‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు. నష్టాలకు కారణం పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు. ఏకపక్ష ధోరణి మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది. నష్టపోకూడదనే తత్వం ‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు. -
పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించాలా? ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు సవాళ్ల నుంచి గట్టెకేందుకు నగదు ముద్రణ సరికాదని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి స్పష్టం చేశారు. అలాంటి చర్య ద్రవ్య అస్థిరతకు దారితీస్తుందని విశ్లేషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందని కూడా తాను భావించడం లేదన్నారు. ఈ మేరకు 1996లో కేంద్రం–ఆర్బీఐ మధ్య జరిగిన ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇకముందు కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడవ వేవ్ లేకపోతే భారత్ ఆర్థిక రికవరీ వేగంగా ఉంటుందని చక్రవర్తి పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) డైరెక్టర్ కూడా అయిన చక్రవర్తి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ముఖ్యాంశాలు.. - పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు కూడా తీవ్రంగా పెరుగుతుందన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్య నిర్వహణ విషయంలో ఇది చాలా క్లిష్టమైన అంశం. - ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ద్రవ్యోల్బణం ఆందోళనకరం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2 నుంచి 6 శాతం శ్రేణిలో ధరల స్పీడ్‌ను కట్టడి చేయాలి. - కోవిడ్–19 మొదటి వేవ్‌తో పోల్చితే ప్రస్తుతం భారత్ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. - ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఆర్థిక వ్యవస్థ పురోగతే కీలకం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. - ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకూ సామాన్యుని జీవన భద్రతకు కొన్ని ద్రవ్య పరమైన చర్యలు అవసరం. - కరోనా సవాళ్ల నేపథ్యంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. - 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.5 శాతంకాగా, 2021–22లో ఈ లోటు 6.8 శాతం ఉంటుందని బడ్జెట్ అంచనావేసింది. అయితే ఇది మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్‌తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి -
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచర్ తాజాగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా (డెవలప్మెంట్ పాలసీ అండ్ ఫైనాన్స్ విభాగం) చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మానవ వనరుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన కొచర్ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో చేరతారు. గడిచిన 33 ఏళ్లుగా సంస్థ పట్ల ఆమె అంకితభావంతో పనిచేశారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి లక్ష్యాల సాధనకు ఎంతో కృషి చేశారని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా ప్రశంసించారు. 1988లో ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్‌లో కొచర్ కెరియర్ ప్రారంభించారు. -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
విషాదం: ‘కాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు’
న్యూఢిల్లీ: పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఇషర్ జడ్జ్ అహ్లువాలియా(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి పవన్, అమన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇషర్ జడ్జ్ అహ్లువాలియా ఐసీఆర్ఐఈఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) చైర్‌పర్సన్‌గా పనిచేశారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.(చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!) కాగా ఇషర్ జడ్జ్ అహ్లువాలియా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అహ్లువాలియా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆర్థికవేత్త, తన హయాంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఆమె ఎనలేని కృషి చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనియాడారు. ఇక బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా అహ్లువాలియాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో ప్రతిభావంతురాలైన తన స్నేహితురాలు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్నారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్సర్‌తో పోరాడి ఓడిన శ్రీమతి అహ్లువాలియా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, భారత విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ్ మీనన్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. (కరోనాతో అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ మృతి) Isher Ahluwalia who just passed away, was one of India’s distinguished economists, a MIT PhD, and author of an influential book ‘Industrial Growth in India’. She built up ICRIER, a fine economic think tank. She had her own distinctive identity apart from being Montek‘s wife. — Jairam Ramesh (@Jairam_Ramesh) September 26, 2020 -
విదేశీ పత్రిక కథనంపై ‘ట్వీట్ల’ హోరు!
న్యూఢిల్లీ : ‘ఇంటాలరెంట్ ఇండియా–హౌ మోదీ ఈజ్ ఎన్‌డేంజరింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ (అసహన భారత దేశం–ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మోదీతో ముచ్చుకొస్తున్న ముప్పు)’ అన్న శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆర్థిక అంశాల విశ్లేషణ పత్రక ‘ది ఎకనమిస్ట్’ జనవరి 23 నాటి సంచికలో కవర్ పేజీ వార్త రాయడం భారత్‌లో అలజడి రేపింది. ప్రధానంగా ఆ పత్రికను తిడుతూ ట్వీట్లు వెలువడుతున్నాయి. (తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..) ‘మందిర్, సీఏఏ, ఎన్ఆర్సీ తదితర అంశాలపై కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులపై దష్టి సారించాల్సిందిగా వీరంతా ఎందుకు కోరుకుంటున్నారంటే, వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని’ అంటూ పంకజ్ మిశ్రా స్పందించారు. ‘దేశం పెద్దదా ? దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దదా? ఆర్థిక పరిస్థితితి అడ్డం పెట్టుకొని ప్రపంచం ముందు భారత్ పరువు ఎందుకు తీస్తారు? మనం దీన్ని సహించ వద్దు!’ అంటూ పంకజ్ మిశ్రా మరో ట్వీట్ చేశారు. ‘ఆర్థిక అంశం పాశ్చాత్యుల దక్పథం. ఆ మాయలో భారతీయులు పడకూడదు’ అంటూ నిర్మలా థాయ్ హల్వేవాలీ ట్వీట్ చేశారు. ‘మోదీ వద్దు, రాహుల్ గాంధీ కావాలని ది ఎకనమిస్ట్ చెప్పింది. రాహుల్ గాంధీయే వద్దు, మోదీ కావాలని భారత్ చెప్పింది. వారెందుకు రైటో, భారత్ ఎందుకు తప్పో వారు ఇప్పటికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ రామ్ ట్విట్టర్లో స్పందించారు. ‘పండోరా బాక్స్ తెరచుకుంది. యాంటీ నేషనల్ ఎకనమిస్ట్ నోరు మూసుకోవడానికి ఏం తీసుకుంటుందో’ అని సుమన్ జోషి స్పందించారు. (హసీనా వ్యాఖ్యల అంతరార్థం) 2010లో మన్మోహన్ సింగ్ నేతత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ది ఎకనమిస్ట్ పత్రిక ‘హౌ ఇండియాస్ గ్రోత్ విల్ అవుట్పేస్ చైనాస్ (భారత్ పురోగతి చైనా ప్రగతిని ఎలా అధిగమిస్తుంది)’ అనే శీర్షికతో కవర్ పేజీ వార్తా రాసింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రామ్ స్పందించినట్లున్నారు. మోదీని లేదా మోదీ ప్రభుత్వాన్ని విదేశీ పత్రికలు విమర్శించడం ఇదే మొదటి సారి కాదు. మోదీని ఉద్దేశించి ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ ‘టైమ్’ మాగజైన్ ఇంతకు ముందు ఓ వార్తను ప్రచురించింది. అప్పుడు ‘బాయ్కాట్టైమ్’ అనే హాష్‌ట్యాగ్‌తో భారతీయులు స్పందించారు. ఈ సారి కూడా అలాంటి ట్యాగ్‌తో స్పందించబోయి తప్పులో కాలేశారు. బాయ్‌కాట్ ది ఎకనమిస్ట్ అనబోయి ‘బాయ్కాట్ఎకానమి’ హ్యాప్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘ఎకానమి వేరు ది ఎకనమిస్ట్ వేరనే విషయాన్ని దయచేసి గ్రహించండి, బాయ్‌కాట్ ఎకానమిని ట్రెండ్ చేయకుండా మోదీకి మంచి ఆర్థిక సలహాలు ఇవ్వండి’ అంటూ మెల్విన్ లూయీ ట్వీట్ చేశారు. (సీఏఏ : హింస చల్లారంటే అదొక్కటే మార్గం!) ‘ఈ టేల్ ఆఫ్ టూ కవర్స్ 2010–2020... అంతకన్నా చెప్పేదేమీ లేదు. ఏమన్నంటే యాంటీ నేషనల్ అనే ప్రదం ఉంది’ అంటూ ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందించారు. ఆయన దశాబ్దం కిందటి, ఇప్పటి ‘ది ఎకనమిస్ట్’ కవర్ పేజీలను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. చార్లెస్ డికెన్స్ రాసిన ‘టేల్ ఆఫ్ టు సిటీస్’ చారిత్రక నవలను దష్టిలో పెట్టుకొని రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. (సీఏఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు) -
5 శాతం వృద్ధి కోసం కష్టించాల్సిందే...
న్యూఢిల్లీ: భారత్ 2020లో 5 శాతం వృద్ధి రేటు కోసం కష్టపడాల్సి ఉంటుందన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హంకే. ‘‘గత కొన్ని త్రైమాసికాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోవడం అన్నది రుణాల లభ్యత నిలిచిపోవడం వల్లే. ఇది సైక్లికల్ సమస్యే కానీ, నిర్మాణపరమైనది కాదు. ఈ పరిస్థితుల్లో 2020లో 5 శాతం జీడీపీ వృద్ధిని సాధించాలంటే కష్టపడాల్సి ఉంటుంది’’ అంటూ జాన్ హప్కిన్స్ యూనివర్సిటీలో అప్లయిడ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హంకే పేర్కొన్నారు. భారత్ నిలకడలేని రుణాల బూమ్‌ను చవిచూసిందని, భారీగా పెరిగిపోయిన ఎన్పీఏ సమస్య నుంచి బయటపడేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. భారత్ ఎంతో రక్షణాత్మకంగా వ్యవహరించే దేశమని గుర్తు చేశారు. అవసరమైన గట్టి సంస్కరణలను చేపట్టే విషయంలో మోదీ సర్కారుకు ఆసక్తి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని హంకే అభిప్రాయపడ్డారు. -
‘నోబెల్ రావాలంటే.. భార్య ఫారినర్ కావాలేమో’
కోల్‌కతా: దేశానికి వన్నె తెచ్చే అంశమైనా సరే.. దాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు సర్వసాధరణం. తాజాగా ఇలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్నారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రవాస భారతీయుడు అయిన అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డును అందుకుంటున్నారు అభిజిత్. అయితే డఫ్లో విదేశి వనితే కాక అభిజిత్‌కు రెండో భార్య. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా అభిజిత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నోబెల్ ప్రైజ్ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అభిజిత్ వామపక్షివాది అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ సిన్హా సమర్థించారు. వామపక్షవాదులం అనే ముసుగులో జనాలు.. ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. వామపక్ష విధానంలో ఆర్థిక వ్యవస్థ నడవాలని వారు కోరుకున్నారు. కానీ నేడు దేశంలో వామపక్ష విధానాలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ ఒకరు కావడంతో బీజేపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది.