
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment