ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అమానవీయం, నిరంకుశమని నోబెల్ అవార్డు గ్రహీత, భారత రత్న డాక్టర్ అమర్త్యసేన్ తీవ్రంగా విమర్శించారు. అధికారాన్ని ప్రదర్శించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని, అవినీతిని అదుపుచేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని భారతీయులు హర్షిస్తారు. కానీ దీని అమలులో తీసుకోవాల్సిన చర్యలు ఇవేనా అని మనం ప్రశ్నించాలి. కొద్ది ఫలితం సాధించేందుకు అత్యధికులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు’అని డాక్టర్ అమర్త్యసేన్ అన్నారు.