Amartya Sen
-
Amartya Sen: ‘జుక్తోసాధన’ భారత సంప్రదాయం
కోల్‌కతా: మతాలకతీతంగా హిందువులు, ముస్లింలు కలిసి జీవించడం, పనిచేసుకోవడం భారత సంప్రదాయమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. అలీపూర్ జైలు మ్యూజియంలో జరిగిన పుస్తక పఠన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశ చరిత్రను చూస్తే.. కొన్ని యుగాలుగా హిందువులు, ముస్లింలు మతసామరస్యంతో కలిసిమెలసి జీవిస్తున్నారు. క్షితిమోహన్ సేన్ దీనిని ‘జుక్తోసాధన’ అన్నారు. ఒకమతం వారు ఇంకో మతంపై విద్వేషాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత కాలంలో ఈ సిద్ధాంతంపై మనం దృష్టి పెట్టాల్సి ఉంది. పిల్లలు ఇలాంటి విషపూరిత భావజాల బారిన పడకపోవడం వల్లే వారు ఎలాంటి భేదభావాలు లేకుండా బతుకుతున్నారు. సమాజంలో పరమత సహనం విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. ‘జుక్తోసాధన’ సామాజిక సేవ, కళల్లో వ్యక్తమవుతోంది’’ అని ఆయన అన్నారు. ఉపనిషత్తులను పార్శీలోకి అనువదించిన ముంతాజ్ కుమారుడు దారా షికోను ప్రస్తావిస్తూ దేశంలోని బహుళ సంస్కృతిని గుర్తు చేశారు. -
‘ఇండియా’ కూటమిపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశ రాజకీయాలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనైక్యత కారణంగా దేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని, కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కుల గణన అనేది మంచి విషయమేనన్న ఆయన దేశానికి మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా వెనుకబడిన వారికి మరింత సాధికారత అవసరమని ఆయన అన్నారు. జేడీ(యు), ఆర్ఎల్డీలు ఎన్డీఏలో చేరడంతో ప్రతిపక్ష కూటమి ఇండియా పెద్దగా పట్టు సాధించలేకపోయిందని అమర్త్యసేన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని విమర్శించిన అమర్త్యసేన్ విస్తృతమైన నిరక్షరాస్యత, అసాధారణ లింగ అసమానతల కారణంగా దేశంలోని పేదలకు పురోగతిని కష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
అమర్త్యసేన్ ఆరోగ్యంగానే ఉన్నారు
ప్రముఖ ఆర్తికవేత్త, నోబెల్ గ్రహీత.. భారతరత్న అమర్త్య సేన్(89) కన్నమూశారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కాస్త ఆంగ్ల మీడియాలో టెలికాస్టింగ్ దాకా వెళ్లింది. అయితే.. అదంతా ఫేక్ సమాచారం అని ఆయన కూతురు నందనా సేన్ స్పష్టత ఇచ్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీగా ఉన్నారంటూ కూతురు నందనా దేబ్ సేన్ స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన కుటుంబంతో కేంబ్రిడ్జిలో వారంపాటు గడిపారని, హర్వార్డ్లో తరగతులు చెప్పడంలో మునిగిపోయారని ఆమె వెల్లడించారు. Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్(2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత కూడా).. తాజాగా తన ఎక్స్ అకౌంట్లో అమర్త్యసేన్ కన్నుమూశారని ట్వీట్ చేశారంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే.. అది ఫేక్ అకౌంట్ అని తర్వాతే తేలింది. హర్వార్డ్ యూనివర్సిటీలో చదివిని అమర్త్య సేన్ కూతురు నందనా దేవ్ సేన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే కాదు.. బాలల హక్కుల ఉద్యమకారిణి కూడా. -
‘అమర్త్యసేన్ ఇంటిని కూలుస్తామంటే ఊరుకోం’
కోల్‌కతా: బుల్డోజర్ రాజకీయం పశ్చిమ బెంగాల్‌కు చేరింది. ఆర్థికవేత్త.. నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్(89) ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆ నోటీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందించారు. అలాంటి ప్రయత్నమే జరిగితే.. అడ్డుకునే యత్నంలో బుల్డోజర్ ముందుర ముందు తానే కూర్చుంటానంటూ ప్రకటించారామె. సేన్‌పై ప్రతీరోజూ దాడి జరుగుతోంది. కానీ, వాళ్లు(కేంద్రాన్ని ఉద్దేశించి..) మాత్రం వేడుక చూస్తున్నారు. ఆయన ఇంటిని ఎలా కూలుస్తారో నేనూ చూస్తా. అదే ప్రయత్నం జరిగితే.. అక్కడికి వెళ్తా. ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతా. బుల్డోజరా? మానవత్వమా? ఏది శక్తివంతమైందో తేల్చుకుంటా.. అని ఆమె వ్యాఖ్యానించారు. 👉 శాంతినికేతన్లో అమర్త్య సేన్ కుటుంబ సభ్యులుగా తరతరాలుగా ఉంటున్న నివాసం ‘ప్రతీచి’ ఉంది. ఆయన కుటుంబం తరతరాలుగా నివసిస్తోంది. అంతేకాదు.. ఆ ఇల్లు సేన్ తండ్రి అశుతోష్ పేరు మీదే ఉండేది. సేన్ తల్లిదండ్రులు మరణించాక.. అది ఆయన పేరు మీదకు బదిలీ అయ్యింది. అయితే.. అందులో అక్రమంగా కొంత స్థలాన్ని ఆక్రమించారని విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. 👉 ఈ ఏడాది జవనరిలో ప్రతీచికి చెందిన 6,600కు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను స్వయంగా సీఎం మమతా బెనర్జీనే శాంతినికేతన్లో సేన్‌ను కలసి అందించారు. అంతేకాదు.. ఆ స్థలం సేన్ కుటుంబానికే చెందుతుందని దీదీ కరాకండిగా చెబుతున్నారు. 👉 600 గజాల యూనివర్సిటీ జాగానే ఆయన ఆక్రమించారనేది విశ్వ భారతి యూనివర్సిటీ వాదన. ఈ మేరకు మే 6వ తేదీలోగా ఖాళీ చేయాలని, లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమిత ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని కూల్చేస్తామని విశ్వ-భారతి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది. 👉 ఆపై ఆయన్ని వివరణలు కోరుతూ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వరుసగా మూడుసార్లు నోటీసులు అంటించింది. దీంతో ఆయన స్పందించారు. 👉 అది తమ వారసత్వ నివాసమని, అందులో ఎలాంటి ఆక్రమిత స్థలం లేదని అమెరికా ఉన్న అమర్త్య సేన్ సైతం యూనివర్సిటీకి తాజాగా బదులు లేఖ రాశారు. 1943 నుంచి ఆ ప్రాంతం మా కుటుంబంతోనే ఉంది. ఆపై చుట్టుపక్కల కొంత స్థలం కొనుగోలు చేశాం. నా తల్లిదండ్రుల మరణానంతరం అది నా పేరు మీదకు వచ్చింది. జూన్‌లో నేను శాంతినికేతన్‌కు వస్తా. పూర్తి వివరాలు సమర్పిస్తా అని లేఖలో(మెయిల్) యూనివర్సిటీకి తెలియజేశారు. 👉 మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతీచి కేర్‌టేకర్ గీతికాంతా మజుందార్.. కోర్టుకు ఆశ్రయించారు. దీంతో.. జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. భీర్బూమ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసుల పహారా ఉంటోంది. కాబట్టి, కూల్చివేతకు తాము అనుమతించబోమని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకుని తీరతామని అంటోంది. 👉 కానీ, సేన్ వివరణ తీసుకున్నాక కూడా తాజాగా.. మే 6వ తేదీలోపు ఖాళీ చేయాలనే డెడ్‌లైన్ విధించింది యూనివర్సిటీ. లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి.. బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించింది. 👉 తాజాగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. వర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అయితే.. ప్రతీచి ప్లాట్‌లో ఆక్రమించుకున్న భాగాన్ని మాత్రం స్వాధీనపర్చుకుని తీరతామని ఓ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. ప్రతీచికి వాయవ్యంలో మూలన 600 గజాలను ఆక్రమించుకున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాబట్టి, ఆ స్థలానికి గనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే.. బౌండరీ ఫెన్సింగ్‌ను పగలకొట్టి అక్కడ ఇనుప కంచె వేయాలనుకుంటున్నాం అని ఓ అధికారి పేర్కొన్నారు. 👉 ఈ వ్యవహారంలో విశ్వభారతి తీరుపై మేధావులు మండిపడుతున్నారు. ఇది పూర్తి రాజకీయ వ్యవహారం. సేన్‌ను వేధించడానికి బీజేపీ విశ్వభారతి యూనివర్సిటీని ఓ పావుగా వాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. ఆయన నివాసం ప్రతీచి ముందర డ్రామా నడిపించేందుకు సిద్ధమైంది. బుల్డోజర్ రాజకీయాలు సరికాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: చిన్నమ్మా.. ఎవరీ జ్యోతిష్కుడు? -
ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్ ప్రస్తుతం తన శాంతినికేతన్ నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్ కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆయన డాక్టర్లను సంప్రదించడంతో వైద్య పరీక్షల్లో కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. వాస్తవానికి అమర్త్యసేన్ కోల్‌కతాలోని పెళ్లికి హాజరు కావల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది కూడా. ఐతే ప్రస్తుతం ఆ ప్రయాణాలన్ని రద్దయ్యాయి. అమర్త్యసేన్ ప్రస్తుతం తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతని కటుంబం వెల్లడించింది. (చదవండి: యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్ షాక్) -
విశ్వమానవుడు: అమర్త్యసేన్ (1933)
మహాత్మాగాంధీ గురించి ఎరిక్ ఎరిక్సన్ అన్న మాటలు అమర్త్య సేన్‌కు కూడా వర్తిస్తాయి. ఇతర ప్రపంచ దేశాల ప్రజలను దిగువ నుంచి లేదా పైనుంచి కాక సమాంతరంగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడగల సామర్థ్యం ఆయనది. అమర్త్యసేన్ వయసు స్వతంత్ర భారతదేశ వయసు కన్నా కేవలం 14 ఏళ్లు ఎక్కువ. కాబట్టి సహజంగానే ఆయనకున్న స్థాయి స్వతంత్ర యువ భారత ఆశలు, ఉద్వేగాలతో ముడివడి ఉంటుంది. విస్తృత స్థాయిలో చూస్తే ఆయన వ్యక్తిగత విజయాలన్నీ జాతీయ విజయాలే. ఇతర రంగాల వృత్తి నిపుణులను ఆయన పేదరికం, అసమానత్వం, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించేలా చేశారు. అందుకే ఆయన విజయాలు భారతదేశానికి, భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. అంతకుముందు ఆ అంశాలను ఏదో పైపైన పట్టించుకునేవారు. ఆయన భారతదేశ పాస్‌పోర్టును వదులుకోని ప్రపంచ పౌరుడు. దేశభక్తి కలిగిన విశ్వమానవుడు. సంక్లిష్టతను ప్రాచుర్యంతో మేళవించిన సేన్‌ను జాన్ మేనార్డ్ కీన్స్‌తో మాత్రమే పోల్చగలం. ఆయనకు ప్రాచుర్యం లభించడానికి చాలా కారణాలే ఉన్నాయి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదువుకున్న సేన్ 22 ఏళ్లకే జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు! ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీలలో వివిధ హోదాలలో పని చేశారు. ఎన్నో సత్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్న సేన్ 1998లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన చరిత్రను, నైతిక, రాజకీయ తత్వ శాస్త్రాలను కూడా బాగా అధ్యయనం చేశారు. హార్వర్డ్‌లో తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్‌గా ఉన్నారు. సేన్ కృషికి తగినట్లుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతదేశం ఆయనకు అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది. స్వతంత్ర భారత ప్రజ్ఞావంతుల చరిత్రలోని ముఖ్యులలో ఒకరైన సేన్ ఈ స్థాయిని అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన వైయక్తిక ఆలోచనా విధానంతో విద్యా సంబంధమైన వాతావరణంలో ఒక ఆర్థికవేత్తగా వికసించడమే. ఆర్థిక శాస్త్రమనేది సామాజిక శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి మధ్యలో ఉంటుందని చెప్పాలి. ఇది సాధారణంగా గణితశాస్త్ర పద్ధతిలో హేతుబద్ధమైన సంక్లిష్టమైన క్రమశిక్షణను ఉపదేశి స్తుంది. కానీ, సేన్ రచించిన పుస్తకాలు ప్రజాదరణ పొందిన ఇతర ఆర్థికవేత్తల్లాగా వ్యక్తుల విశ్లేషణకు పరిమితం కాలేదు. ఆయన తన రచనల్లో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రధానంగా చర్చించారు. – ఎస్. సుబ్రహ్మణ్యన్, ఆర్థిక శాస్త్రవేత్త, అమర్త్యసేన్ శిష్యుడు -
కోవిడ్ వినాశనానికి ప్రభుత్వ వైఖరే కారణం
ముంబై: భారత ప్రభుత్వ అయోమయ ధోరణి దేశంలో కోవిడ్ వినాశనం సృష్టించడానికి కారణమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిని కట్టడి చేయడం మాని, భారత ప్రభుత్వం పేరు సంపాదించడంపై దృష్టి పెట్టడం వల్లే ఈ దారుణ పరిస్థితులు దాపురించాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘అయోమయ వైఖరితో ప్రభుత్వం సరిగా స్పందించలేకపోయింది ఫలితంగా ఈ మహమ్మారిని దేశం ఎదుర్కోలేకపోయింది’ అని చెప్పారు. మంచి పనుల ద్వారా ఖ్యాతిని ఆర్జించడం మాని, కేవలం పేరును మాత్రమే ఆశించడం అనే మేథో అమాయకత్వం తగదు. కానీ, భారత్‌లో జరుగుతోందిదే’ అని ఆయన పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, ఆర్థిక వృద్ధి మందగమనం, పెచ్చుమీరిన నిరుద్యోగం వంటి వాటికి ఈ మహమ్మారి తోడైందని పేర్కొన్నారు. విద్యపై ఉన్న పరిమితుల కారణంగానే మహమ్మారిని పసిగట్టటంలోనూ, సరైన చికిత్సా విధానా లను అంచనా వేయడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. -
నన్ను మీ సోదరిలా భావించండి: మమత లేఖ
కోల్‌కతా: భారత ప్రముఖ ఆర్థిక నిపుణులు, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘీభావం ప్రకటించారు. ఓ సోదరిలా ఆయన వెంట ఉంటానని, అంతా కలిసి సమస్యలను అధిగమిద్దామంటూ అండగా నిలిచారు. కాగా చారిత్రక నేపథ్యం గల విశ్వభారతి యూనివర్సిటీ ప్రాంగణంలోని భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఈ అంశంతో అమర్త్యసేన్‌కు సంబంధం ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ బీజేపీ నేతల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారి తీరు తనను విస్మయానికి గురిచేసిందన్నారు. ఈ క్రమంలో అమర్త్యసేన్‌కు మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీ శుక్రవారం లేఖ రాశారు. ‘‘శాంతినికేతన్ విషయంలో మీరు పేరును లింక్ చేస్తూ ఇటీవల పరిణామాల గురించి మీడియాలో వస్తున్న వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. మీ కుటుంబానికి శాంతినికేతన్‌తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. మీ తాతయ్య, ప్రఖ్యాత మేధావి క్షితిమోహన్ సేన్, మీ నాన్న, ప్రముఖ విద్యావేత్త, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ అశుతోష్ సేన్ చేసిన సేవ మరువలేనిది. కానీ కొంతమంది ఇప్పుడు పనిగట్టుకుని మరీ మీ ఆస్తుల గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అవి నన్ను బాధిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ధైర్యంగా మీరు మాట్లాడిన మాటలు కొంతమందికి శత్రువును చేశాయి. అయితే ఆ శక్తులపై యుద్ధంలో నేను మీకు తోడుగా ఉంటాను. నన్ను మీ సోదరిలా, ఓ స్నేహితురాలిలా భావించండి. వారి నిరాధార ఆరోపణలు, దాడులను మనం కలిసి అధిగమిద్దాం’’ అని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ సహా బీజేపీ సీనియర్ నేతలు మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. ఆమె దీటుగా బదులిస్తున్నారు.(చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ ) WB CM Mamata Banerjee writes to Nobel laureate Amartya Sen;says,"Some nouveau invaders in Visva Bharati have started raising surprising&baseless allegations about your familial properties...I want to express my solidarity with you in your battles against bigotry of majoritarians" pic.twitter.com/NXspA4VLgC — ANI (@ANI) December 25, 2020 -
పొద్దునే ఫోన్.. బ్యాడ్‌న్యూస్ అనుకున్నా కానీ
న్యూఢిల్లీ: ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ మోగుతుంది.. ఇంత పొద్దునే ఎవరా అనే అనుమానంతో పాటు.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో అనే భయంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాం. అవతలి మనిషి కంఠం గుర్తుపట్టి.. విషయం విన్నాక కానీ స్థిమితపడం. ఇదే పరిస్థితి తనకు ఎదురయ్యింది అంటున్నారు నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్య సేన్. కానీ ఆ ఫోన్ కాల్ తన జీవితంలోని అత్యంత ఆనందమైన.. వెలకట్టలేని శుభవార్తను తెలిపింది అన్నారు. తాను నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నానని తెలిపే కాల్ అది అన్నారు. ఆ నాటి మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు అమర్త్య సేన్. (చదవండి: నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి) ‘అక్టోబర్ 14, 1998 ఉదయం ఐదు గంటలకు ఫోన్ మోగుతుంది. అప్పుడు నా మొదటి ఆలోచన ఏంటంటే.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా.. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అనే అనుమానాలు మనసులో మెదిలాయి. రిసివర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాను. అకాడమీ నుంచి వచ్చిన ఫోన్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాను. కాల్ మాట్లాడిన తర్వాత శుభవార్త అని అర్థం అయ్యింది. నాకు నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పడానికి అకాడమీ వారు కాల్ చేశారు. ఆ తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అన జ్ఞాపకాలను పంచుకున్నారు అమర్త్య సేన్. సోషల్ చాయిస్, వెల్ఫేర్ మెజర్మెంట్ అండ్ పావర్టి రిసర్చ్ అంశంలో పరిశోధనలకు గాను 1998లో అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుంది. View this post on Instagram What would you think has happened if you receive a phone call early in the morning? "My first thought was that something terribly tragic must have happened; somebody has turned ill or you know something worst than that. So I was concerned, so I was first relieved that it wasn't any of that and then when I examined that news, the examined news seemed good cause this is the academy calling." Around 5 a.m. on 14 October 1998 Amartya Sen's telephone rang. He was worried and fairly sure that something tragic had happened. But after the news sank in, Sen felt that "it was a good piece of news" and started the day with a cup of coffee. Stay tuned to find out who will be receiving the phone call this year. Photo: Stephanie Mitchell/@harvard university. . . . #NobelPrize #Nobel #announcements #science #discovery #research #economicsciences #economic #amartyasen #scientist #researcher A post shared by Nobel Prize (@nobelprize_org) on Sep 21, 2020 at 7:20am PDT -
కనీసం నాలుగు లక్షల కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌లో ఆహారం కొరత కారణంగా కరువు కాటకాలు ఏర్పడటం లేదు. కార్మికులకు కొనే శక్తి కరువైనప్పుడు కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కరువు కాటకాలను ప్రభుత్వాలు తలచుకుంటే పరిష్కరించవచ్చు’ అని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్యసేన్ చెప్పారు. కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వారందరి కుటుంబాలకు తిండి పెట్టేంత ఆహార ధాన్యాల నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. (వలస కార్మికులు.. వాస్తవాలు) దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు రెండు నెలల పాటు దినసరి కార్మికులు ఉపాధి కోల్పోవడం వల్ల నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, ఇది భారత జీడీపీలో రెండు నుంచి మూడు శాతమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలో ఎకనామిక్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న జయన్ జోస్ థామస్ తెలిపారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ 2018, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం పురుషుల సగటు వేతన రోజుకు 282 రూపాయలు, మహిళల సగటు వేతనం రోజుకు 179 రూపాయలని ఆయన చెప్పారు. (‘వైరస్ కాదు.. ఎకానమీ ధ్వంసం’) గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనం, మగవారికి నెలకు సరాసరి సగటు 14,024కాగా, మహిళలకు 9,895 రూపాయలని, అదే పట్టణ ప్రాంతాల్లో పురుషులకు 18,353 రూపాయలుకాగా, మహిళలకు 14,487 రూపాయలని థామస్ చెప్పారు. ఈ లెక్కన రెండు నెలల కాలానికి కార్మికులు కనీసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉపాధి కింద నష్టపోయారని ఆయన అంచనా వేశారు. (ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు) -
ఆ పదాలకు కూడా కట్ లేకుండా సెన్సార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ డాక్యుమెంటరీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో నిషేధించిన ఆ నాలుగు పదాలకు కూడా సీబీఎఫ్సీ (కేంద్ర చిత్ర సెన్సార్ బోర్డు) ఓకే చెప్పింది. అమర్త్యసేన్ జీవితం-సేవలపై 'ది ఆర్గుమెంటేటివ్ ఇండియన్' పేరిట జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ డైరెక్టర్ సుమన్ ఘోష్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. దాదాపు గంటపాటు ఉండే ఈ డాక్యుమెంటరీ గత ఏడాది వివాదంలో చిక్కుకుంది. ఇందులో నాలుగు పదాలు (ఆవు, గుజరాత్, హిందుత్వ, హిందూ) అనే పదాలు తొలగించాలని, లేదంటే సర్టిఫికెట్ ఇవ్వబోమంటూ కోల్‌కతా సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. దీంతో గత ఏడాది నుంచి ఇది విడులకు నోచుకోలేదు. అయితే, 'ఇటీవలె సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి ఈ డాక్యుమెంటరీ ముంబయిలో ఇతర బోర్డు సభ్యులతో చూశారు. అనంతరం ఎలాంటి కట్లు చెప్పకుండా డాక్యుమెంటరీ విడుదల చేసుకోవచ్చని అన్నారు' అని ఘోష్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి తనకు వ్రాత పూర్వక అనుమతి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రెండు పార్టులుగా తీశారు. -
వర్సిటీల్లో భయానక వాతావరణం ప్రమాదకరం
నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శనాత్మక ప్రసంగాలు చేసే ప్రొఫెసర్లు తదితరులపై చర్యలు తీసుకోవడం సమకాలీన భారత్‌లో స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తన ‘సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక హక్కులు ఉన్నంత మాత్రానా ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించరాదని సూచించారు. విధాన రూపకల్పనల్లో సమానత్వం కోసం చేయాల్సిన ప్రయత్నాలు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారని, దీని వల్ల సోదరభావం పెంపొందించడం అవరోధంగా మారిందన్నారు. ఆరోగ్య రంగం వృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. చైనా తన జీడీపీలో 2 శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుంటే భారత్‌లో మాత్రం 1 శాతం కన్నా తక్కువ వెచ్చిస్తున్నారని అమర్త్యసేన్ తెలిపారు. -
‘రద్దు’.. గురిలేని క్షిపణి
నోట్ల రద్దుపై అమర్త్యసేన్ ముంబై: పెద్ద నోట్ల రద్దు లక్ష్యం లేకుండా ఏకపక్షంగా ప్రయోగించిన క్షిపణి అని, ఎన్డీఏ సర్కారు ప్రజాస్వామిక సంప్రదాయాలను తుంగలో తొక్కి ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ విమర్శించారు. ‘ఇది హడావుడిగా నిరంకుశత్వంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం తరచూ గురిలేని క్షిపణులను ప్రయోగిస్తోంది. నోట్లరద్దు అందులో ఒకటి..’ అని ఆయన శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చైనాలో కొద్దిమంది ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని, కానీ భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఆర్బీఐ పాత్ర నామమాత్రమేనా?: అమర్త్యసేన్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వతంత్రతపై నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోందని.. ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అమలుచేసేందుకే పరిమితమైందని ఓ ఇంటర్వూ్యలో అన్నారు. నోట్లరద్దు వల్ల నల్లధనాన్ని నిర్మూలించాలనే ప్రక్రియలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారన్నారు. ‘నోట్లరద్దు నిర్ణయం ఆర్బీఐది కాదని అర్థమవుతోంది. ఇది కేవలం ప్రధాని ఆలోచనే’ అని విమర్శించారు. దేశంలో దొంగనోట్లు పెద్ద సమస్యే కాదని.. రఘురామ్ రాజన్ ఉన్నంతకాలం ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించిందని అమర్త్యసేన్ తెలిపారు. -
మోదీది అమానవీయ, నిరంకుశ నిర్ణయం!
-
అమానవీయ, నిరంకుశ నిర్ణయం!
నోట్ల రద్దుపై అమర్త్యసేన్ ధ్వజం.. తెలివితక్కువ ఆలోచనన్న ఆర్థికవేత్త న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అమానవీయం, నిరంకుశమని నోబెల్ అవార్డు గ్రహీత, భారత రత్న డాక్టర్ అమర్త్యసేన్ తీవ్రంగా విమర్శించారు. అధికారాన్ని ప్రదర్శించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని, అవినీతిని అదుపుచేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని భారతీయులు హర్షిస్తారు. కానీ దీని అమలులో తీసుకోవాల్సిన చర్యలు ఇవేనా అని మనం ప్రశ్నించాలి. కొద్ది ఫలితం సాధించేందుకు అత్యధికులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు’అని డాక్టర్ అమర్త్యసేన్ అన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీనుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నవంబర్ 8న హఠాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయం ద్వారా 6 నుంచి 10 శాతం నల్లధనం మాత్రమే బయటపడుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం సాధించేది చాలా తక్కువని.. కానీ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని సేన్ స్పష్టం చేశారు. మోదీ నిర్ణయం మంచిదే అరుునా అమలుతీరు అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ‘నల్లధనంపై ముందడుగు పడాలని మనమంతా అనుకుంటున్నాం. కానీ ఈ నిర్ణయం మాత్రం తెలివైంది కాదు. మానవత్వంతో తీసుకున్నది అసలే కాదు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు’అని అన్నారు. ముఖాముఖి ఆయన మాటల్లోనే.. నిరంకుశత్వం అన్నారు. ఎందుకు?: ‘ప్రజల్లో కరెన్సీపై నమ్మకం పోతోంది. ప్రతి రూపారుు ఓ ప్రామీసరి నోటు లాంటిది. ఈ రూపారుుని గౌరవించకపోవటం ద్వారా ప్రభుత్వం తను చేసిన వాగ్దానాలను నిలుపుకోలేనని చెప్పటమే అవుతుంది. సర్కారు హఠాత్తుగా మీకు డబ్బులు చెల్లించలేమని ప్రజలకు చెప్పటం నిరంకుశం కాదా?’ ఆర్థిక వ్యవస్థ పరిస్థితేంటి?: ‘నేను పెట్టుబడిదారీ వ్యవస్థకు అభిమానిని కాను. కానీ ఈ వ్యవస్థలోనూ నమ్మకం చాలా కీలకం. మోదీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతోంది. రేపు బ్యాంకు అకౌంట్లతోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందేమో. కేంద్రం ఓ సంఖ్యను నిర్ణరుుంచి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అకౌంట్లోనుంచి తీసుకునేందుకు ప్రతీ పౌరుడు సచ్చీలుడినని నిరూపించుకోవాలని అడిగే పరిస్థితీ రావొచ్చు’ మోదీ ఏం చేసినా విమర్శిస్తున్నారు!: ‘నేను ప్రతి విషయంలో మోదీని విమర్శించటం లేదు. నల్లధనంపై ఎక్కుపెట్టిన అస్త్రాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకుని ఉంటే నేనే ప్రశంసించేవాణ్ని. ఈ నిర్ణయం వల్ల చట్ట ప్రకారం నడుచుకుంటున్న సామాన్య జనాలకు, తమ సంపాదనకు లెక్కలున్న వారికీ సమస్యలు ఎదురవుతున్నారుు. అదే నన్ను బాధిస్తోంది. మోదీతో నాకున్న అభిప్రాయభేదం దేశాన్ని మించిన అంశాలకు సంబంధించినవి. 31 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. తమను వ్యతిరేకించిన వారిని దేశ ద్రోహులుగా ప్రకటించే అధికారం లేదని స్పష్టంగా చెప్పదలచుకున్నా’ -
భారతదేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోనుంది
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రెండో సారి పదవి చేపట్టనని ప్రకటించడం దురదృష్టకరమని ప్రముఖ ఆర్ధిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ పేర్కొన్నారు. భారతదేశం, ప్రపంచం ఒక అత్యంత నైపుణ్యంతో ఆలోచించగల ఆర్థిక నిపుణున్ని కోల్పోనుందని సేన్ అవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమని ఆయన అన్నారు. ఆర్బీఐ అనేది పూర్తి స్వతంత్ర సంస్థ కాదని సేన్ అన్నారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అధికార పార్టీకి చెందిన వారు రాజన్ ను వ్యతిరేకించడం అత్యంత దురదృష్టకరమైన విషయం అని అన్నారు. రాజన్ నరేంద్రమోదీని ఆరాధించేవారు కాదని అన్నారు. రెండో సారి ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాద్యతలు చేపట్టనని తన పదవీకాలం పూర్తియిన తర్వాత పాఠాలు బోధిస్తానని రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘నలందా’ రాజకీయం
ఎనిమిది వందల ఏళ్ల నాటి విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడం, తద్వారా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక వారధిని పునర్ నిర్మించడం వంటి మహ దాశయాలతో ఆరంభమైన పథకం వివాదాలలో చిక్కుకోవడం పెద్ద విషాదమే. గడచిన సెప్టెంబర్ 1 నుంచి బోధన ప్రారంభించిన నలందా విశ్వవిద్యాలయం అప్పుడే పెద్ద కుదుపునకు గురైంది. ఆ విశ్వవిద్యాలయం చాన్సలర్, నోబెల్ బహు మతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్ రెండు రోజుల క్రితం ఆ పదవి నుంచి నిష్ర్కమి స్తున్నట్టు ప్రకటించడం సరికొత్త వివాదం మాత్రమే. మరోసారి తను కొనసాగడం ప్రభుత్వానికి సమ్మతం కాదని అనిపిస్తున్నందున పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు సేన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ జూలైతో ముగుస్తున్న ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పెంచుతూ విశ్వవిద్యాలయం పాలక మండలి తీర్మా నం చేసి పంపిన ఫైలు మీద రాష్ట్రపతి సంతకం చేయలేదు. ఇదే డాక్టర్ సేన్‌ను మన స్తాపానికి గురి చేసింది. నిజానికి ‘అర్థశాస్త్రం’ వంటి అసాధారణ రాజనీతిశాస్త్రాన్ని భారతదేశానికి అందించిన చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో పనిచేశాడు. ఆ గ్రంథమంతా వ్యూహప్రతివ్యూహాలకు ప్రతీతి. కానీ 21వ శతాబ్దంలో పునః ప్రారంభమైన నలందా విశ్వవిద్యాలయంలో అంతకు మించిన రాజకీయ వ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సులో (2009) నలంద పునరుద్ధరణ ప్రతిపాదన వచ్చింది. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి జార్జి ఎవో ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఇంగ్లండ్, చైనా, సింగపూర్ దేశాల నుంచి నిపుణులను ఇక్కడ బోధనకు నియమిం చాలని కూడా భావించారు. 2010 ఆగస్ట్‌లో భారత పార్లమెంట్ నలందా విశ్వవిద్యాలయం పునరుద్ధరణకు సంబం ధించిన బిల్లును ఆమో దించింది. ప్రస్తుతం పట్నాకు సమీపంలోని రాజగృహ అనే బౌద్ధకేంద్రం పరిసరాలలో, 800 ఏళ్ల నాటి పురాతన నలందా విశ్వవిద్యాలయం శిథిలాల దగ్గర 500 ఎకరాలలో కొత్త విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. పది బిలియన్ రూపాయలతో, 2020 కల్లా దీనికి ఒక రూపు తేవాలని పథక రచన కూడా జరిగింది. నాటి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇందుకోసం విశేష కృషి చేశారు. నిజానికి యూపీఏ-2 ప్రభుత్వమే ఈ పథకం పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పనికీ సకాలంలో నిధులు కేటాయించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 19, 2014న మన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ 15 మంది విద్యార్థులతో, ఆరుగురు ఆచార్యులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. భారతీయ పురాతన విజ్ఞానశాస్త్రాలు, పర్యావరణ అధ్యయనాలు మొదట ఆరంభమైనాయి. సామాజిక శాస్త్రాలు, తత్వం వంటి అంశాలను తరువాత ప్రవేశపెట్టాలని అనుకున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి అప్పటికి బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన నితీశ్‌కుమార్‌కు ఆహ్వానం వెళ్లలేదు. అధికారంలో ఉన్న జీతన్ రామ్ మాంఝీ మాత్రం హాజరయ్యారు. ఇది కూడా వివాదమైంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత విశ్వవిద్యాలయం వ్యవహారంలో రాజ కీయ జోక్యం మితిమీరిందని డాక్టర్ సేన్ ఆరోపణ. తనకు మరో సంవత్సరం అవ కాశం ఇవ్వకూడదని అనుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం పాలక మండలిని పునర్ నిర్మించాలని కూడా మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇది చట్ట వ్యతిరేక మని కూడా డాక్టర్ సేన్ చెబుతున్నారు. నిజానికి మోదీ అధికారంలోకి రాగానే డాక్టర్ సేన్ చాన్సలర్ పదవి మీద నీలినీడలు ప్రసరించాయని అనిపిస్తుంది. గడచిన మే మాసంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోనే మోదీ ప్రచారంలో ఉన్నపుడు ఆయన ప్రధాని కావడం సరికాదని డాక్టర్ సేన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో కూడా డాక్టర్ సేన్ చిరకాలంగా మోదీని తప్పు పడుతున్నారు. అయినా పునరుద్ధరించిన నలందా విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించడానికీ, దాని ఏర్పాటు ద్వారా సాధించ దలచిన ఫలితాల సాధనకూ డాక్టర్ సేన్ వంటి అంతర్జాతీయ విద్యావేత్త అవసర మని ఎందరో భావించారు. హార్వర్డ్‌లో పనిచేయడం, అర్థశాస్త్రంలో నోబెల్ పుర స్కారం తీసుకోవడం డాక్టర్ సేన్ నాయకత్వానికి బలాన్ని ఇచ్చాయి. పురాతన నలందా విశ్వవిద్యాలయం (క్రీస్తుశకం 413-1193) పరిపూర్ణమైన రూపు తెచ్చు కోవడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది. కానీ కొత్త విశ్వవిద్యాలయం పునాదులలోనే రాజకీయాలు చోటు చేసుకోవడం విషాదమే. రాజకీయాల కార ణంగా గొప్ప ఆశయం మీద నీలినీడలు ప్రసరించడం అందరినీ కలవరపరుస్తోంది. -
ఆమర్త్య సేన్‌కు బ్రిటన్ కేన్స్ అవార్డు
-
ఆర్థిక మానవతావాది!
నవంబర్ 3న ఆమర్త్య సేన్ జన్మదినం సత్వం: ఆర్థికశాస్త్రవేత్త పేదరికం గురించి మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు... అయితే పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా అని ఆయన అంటారు. సాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల న్యాయవాదిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్ పురస్కారం దక్కింది ఈ కారణంగానే! 1933లో శాంతినికేతన్లో రవీంద్రనాథ్ టాగూర్ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్ సేన్... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం. ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. కానీ ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు. రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్... ఇవేవీ ట్రాక్ 1లో అభివృద్ధి చెందలేదంటారు. ‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’ మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు. భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు. కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి? పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు. -
నోబెల్‌కే నిండుదనం
పురస్కారం అమర్త్యసేన్, రామకృష్ణన్, అబ్దుస్ సలామ్, నైపాల్, యూనస్ నోబెల్‌కే నిండుదనం నోబెల్ ఇండియా సామాజిక అర్థికవేత్త అమర్త్యసేన్‌కు 1998లోఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అమర్త్యసేన్ 1933 నవంబర్ 3న ఢాకా నగరంలో పుట్టారు. అమర్త్యసేన్ తల్లిదండ్రులు అసుతోష్ సేన్, అమితాసేన్. అమర్త్యసేన్ తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, తల్లి శాంతినికేతన్లో పనిచేసేవారు. ‘అమర్త్యసేన్’కు రవీంద్రనాథ్ ఠాగూర్ నామకరణం చేశారు. శాంతినికేతన్ నుంచి కేంబ్రిడ్జి వరకు... అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన ఆర్థికశాస్త్రంలో చేసిన అధ్యయనాలకు గుర్తింపుగా అత్యున్నతమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. అమర్త్యసేన్ హైస్కూల్ విద్య శాంతినికేతన్లో, గ్రాడ్యుయేషన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు. ఉన్నత విద్యభ్యాసం కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, ట్రినిటీ కళాశాలలో చేరారు. అర్థశాస్త్రానికి కొత్త అర్థం! అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో పాతవిధానాలకు స్వస్తి చెప్పి సామాజిక దృక్పథంలోను, సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల పరంగా ప్రజలను మనస్తత్వాల ఆధారంగాను అర్థశాస్త్రాన్ని అభ్యసించాలని ప్రతిపాదించారు. జీవరసాయన వైతాళికుడు వేంకటరామన్ రామకృష్ణన్ 2009లో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రజ్ఞుడు. ఆయన తమిళనాడు, కడలూర్ జిల్లా చిదంబరంలో 1952వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సి.వి.రామకృష్ణన్, తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మి. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రవేత్తలే. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా వేంకటరామన్ రామకృష్ణన్ విద్యాభ్యాసమంతా వడోదరలోనే జరిగింది. ఆయన 1971లో బరోడా విశ్వవిద్యాలయంల నుంచి బీఎస్ పట్టా పొందారు. భారతదేశంలో ఆయనకు పైచదువులకు ప్రవేశం లభించలేదు. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో 1976లో పీహెచ్డీ పొందారు. రామకృష్ణన్‌కు డాక్టరేట్ వచ్చేనాటికి వయస్సు 24. 1976లో రామకృష్ణన్ తన పరిశోధనలను భౌతిక శాస్త్రం నుంచి బయో కెమిస్ట్రీలోకి మార్చుకున్నారు. డాన్ ఎంగెల్మన్, పీటర్ మూర్లు ప్రచురించిన రైబోజోమ్‌లపై పరిశోధన పత్రం ప్రభావంతో రైబోజోమ్‌ల నిర్మాణంపై పరిశోధనలు ప్రారంభించారు. రైబోజోమ్‌ల నిర్మాణంపై జరిపిన పరిశోధనలకు గాను రామకృష్ణన్ 2009లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. దైవకణ ఉనికి నిర్ధారకుడు అబ్దుస్ సలామ్‌కు 1979లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఆయన అవిభక్త భారతదేశంలోని పంజాబ్‌లో 1926, జనవరి 29న జన్మించారు. ఈయన తండ్రి చౌదరి మహమ్మద్ హుస్సేన్ తల్లి హజీరా హుస్సేన్. అబ్దుస్ సలామ్ 1944లో గణితశాస్త్రంలో బీఏ, 1946లో ఎం.ఎ. పట్టా సాధించారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితం, భౌతిక శాస్త్రాలు ప్రధానంగా 1949లో ఉత్తీర్ణత చెందారు. అదే విశ్వవిద్యాలయంలో థీరిటికల్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్ అంశంలో 1951లో పీహెచ్డీ పట్టా సాధించారు. అబ్దుస్ సలామ్ పార్టికిల్ ఫిజిక్స్‌లో గణనీయమైన పరిశోధనలు జరిపి పరమాణువులోని వివిధ కణాలు ఏ విధంగా సంయుక్తంగా ఉండగలుగుతాయో సిద్ధాంతీకరించారు. అబ్దుస్ సలామ్ జరిపిన నాలుగు దశాబ్దాల పరిశోధనల ఫలితంగానే ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన బోసాన్ అనబడే దైవకణం యొక్క ఉనికి నిర్ధారించబడింది. పార్టికిల్ భౌతిక శాస్త్ర పరిశోధనలకు గుర్తింపుగా 1979వ సంవత్సరపు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ప్రపంచసాహితీ వేత్త అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో విద్యాధర సూరజ్ ప్రసాద్ నైపాల్ (వి.ఎస్.నైపాల్) ఒకరు. ఆయనకు 2007లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. సర్ విద్యాధర సూరజ్ ప్రసాద్ ట్రినిడాడ్‌కు చెందిన భారత సంతతివారు. ఈయన బ్రిటన్ పౌరసత్వం పొందారు. వీరు ట్రినిడాడ్ టొబాగోలో 1932వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జన్మించారు. మొదటి నుంచి ఆయనకు ఆంగ్లభాషలో ప్రావీణ్యత ఉండడం చేత అనేక గ్రంథాలు చదివారు. ఆ స్ఫూర్తితో కథలు, వ్యాసాలు రాశారు. తన భావాలను సులభంగా వ్యక్తీకరించారు. ఆయన రచనలు వలస సంప్రదాయం కలిగిన వెస్ట్ ఇండీస్ దీవులలో ముఖ్యంగా ఆక్రమణలకు గురైన దీవులలో ఎంతో ప్రబోధాత్మకాలై అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. విద్యాధర సూరజ్ నైపాల్ తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారే. ఈయన మొదటి భార్య పాట్రీషియా నైపాల్ 1996లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆ తర్వాత ఆయన 1996లో నాదిరా అనే భారతి సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. నైపాల్ పురస్కారాలలో కొన్ని: 1971వ సంవత్సరపు బుకర్ బహుమతి 2007లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం. మేధో దార్శనికుడు మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఈయన అసోమ్ రాష్ట్రం, చిట్టగాంగ్‌లో 1940 జూన్ 28న జన్మించారు. చిట్టగాంగ్ ప్రస్తుత బంగ్లాదేశ్‌కు చెందినది. యూనస్ బాల్యం, విద్యాభ్యాసం చిట్టగాంగ్‌లోనే జరిగింది. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ, ఎమ్ఏ డిగ్రీలను పొంది స్కాలర్‌షిప్‌పై వాండర్ బిల్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి 1971లో డాక్టరేట్ సాధించారు. 1969 నుంచి 1972 వరకు మిడిల్ టెన్నిసీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో 1972, 73లో సంభవించిన కరవులో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి ఉద్యోగానికి రాజీనామా చేసి, 1974 నుండి కరవు, పేదరికం నిర్మూలన ఉద్యమాలు, ప్రజాహిత ఆర్థిక సంస్కరణలు చేపట్టి సమాజానికి మేలు చేశారు. గ్రామీణ బ్యాంకులు, జనతా బ్యాంకులు, సూక్ష్మ రుణ పథకాలు, సంక్షేమ ఆర్థిక విధానాలు ఇవన్నీ అబ్దున్ సలామ్ ప్రతిపాదనలే. 2006లో లభించిన నోబెల్ పురస్కారానికి ఆయనకు వచ్చిన సొమ్మునంతా అబ్దున్ సలామ్ ‘చౌక ధరలో అధిక పోషణ విలువలు’ గల ఆహారం తయారు చేసే కర్మాగారానికి, పేదల కోసం కంటి ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించారు. మహాత్ముడికి ఎందుకురాలేదు? భారత జాతిపిత మోహనదాస్ కరమ్‌చంద్ గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి 1937, 1938, 1939, 1947, 1948లలో ప్రతిపాదనకు వచ్చింది. అది ప్రతిపాదనలకే పరిమితమైంది తప్ప బహుమతి ప్రదానం జరగలేదు. దలైలామాకు నోబెల్ బహుమతి ఇచ్చినప్పుడు ‘ఈ శాంతి పురస్కారం ఒక విధంగా మహాత్మాగాంధీ అహింసాయుత పోరాటానికి జ్ఞాపిక’ అన్నారు నిర్వహకులు. 1937లో ప్రతిపాదించినప్పుడు నోబెల్ కమిటీకి సలహాదారు ప్రొఫెసర్ జాకబ్ వర్మ్ ముల్లర్ ‘ఆయన జనబాహుళ్యం మెచ్చిన నాయకుడే కానీ విధాన నిర్ణయంలో నియంత. ఆదర్శవాది అయినప్పటికీ సామాన్య రాజకీయవేత్త. అహింసావాదం గొప్పదే, అయితే అన్ని సందర్భాలలోనూ నిలుస్తుందా?’ అన్నారు. ఐరోపా దేశాలకు చెందిన ‘భారతమిత్రత్వ సంఘ సభ్యులు’ మూడేళ్లు ప్రతిపాదించినా ఫలితం లేకపోవటానికి బ్రిటిష్ ప్రభుత్వ వత్తిళ్లే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. 1947లో ‘ఈ అహింసాయుత పోరాటం బ్రిటిష్ వారిపై విజయం అనుకుంటే, భారత్‌లో హిందు, ముస్లిమ్‌ల మధ్య అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయింది’ అన్నారు. 1948లో మహాత్మాగాంధీ హత్య అనంతరం ప్రతిపాదించినప్పుడు మరణించిన వారి పేర్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించలేదని, గాంధీ వారసులను పేర్కొనలేదని సాకులు చెప్పింది. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు, విశ్రాంత రసాయనాచార్యులు -
కాంగ్రెస్‌ను ప్రజలు ఇష్టపడటం లేదు:అమర్త్యసేన్
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపించిందని, ప్రజలు ఆశించిదాన్ని ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఇష్టపడటం లేదనే విషయం ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందన్నారు. ఈ మేరకు ఆయన నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ధృఢమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ నాయకుడి ఎవరు అనే దానిపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేదన్నారు. ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందించాలంటే నాయకుడిపై పార్టీ వైఖరిని తెలియాజేయాలన్నారు. అలా చెప్పకపోతే రాజకీయంగా కాంగ్రెస్ నుంచి సరైన పోటీ ఉండదన్నారు. -
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
-
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా ఉత్తమ పరిష్కార మార్గం చర్చలేనని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. కులం దేశానికి పట్టిన అతిపెద్ద దెయ్యమని అభివర్ణించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు గురువారం డాక్టరేట్‌ను అందజేసింది. అనంతరం వర్సిటీలోని ఆడిటోరియంలో ‘విశ్వవిద్యాలయాల్లో కాఫీ షాపుల ఆవశ్యకత’ అనే అంశంపై అమర్త్యసేన్ ప్రసంగిస్తుండగా దళిత విద్యార్థులు అడ్డుతగిలారు. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్స్‌లర్, భద్రతా సిబ్బంది విద్యార్థులను బుజ్జగించారు. అనంతరం అమర్త్యసేన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అదే సరైన మార్గమని సూచించారు. తానూ అనేక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నానని.. ఆహార భద్రతా చట్టం, దళిత, మైనారిటీ హక్కులు, బాలల పోషకాహారం వంటి సమస్యలపై నేరుగా పోరాడానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో సమానత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘నిరసించు, చైతన్యపరచు, వ్యవస్థీకరించు’ అనే అంబేద్కర్ సూచనను అందరూ పాటించాలని నొక్కి చెప్పారు. విద్య, వైద్యం, పోషకాహారం వంటి కీలక అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో మూడో వంతు ప్రజలకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదని, ఇలాంటి సామాజిక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అందుకు ప్రసార మాధ్యమాలు సహకరించాలని అమర్త్యసేన్ కోరారు. చివరిగా విద్యార్థులడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్‌లర్ హనుమంతరావు, వైస్ చాన్స్‌లర్ రామకృష్ణ రామస్వామి, రిజిస్ట్రార్ రాజశేఖర్, ఆర్థికశాస్త్ర విభాగం డీన్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక చట్టాలపై మహిళలు అవగాహన కల్పించుకోవాలి
మూడేళ్ల క్రితం డిసెంబర్లో... మెడిసిన్ చదివే ఓ అమ్మాయికి ఒక ఐటీ స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ క్రమంలో వీరిద్దరూ నిరుడు డిసెంబరులో ఒకరోజు కలుసుకున్నారు. ఎప్పటిలా భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. ఆ వేళకు వీడ్కోలు తెలుపుకున్నారు. కాసేపయితే ఎవరి నివాసాలకు వాళ్లు చేరిపోయేవారే. కానీ అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. గమ్యస్థానాలు చేరేందుకు వారు ఎక్కిన బస్సే వారి పాలిట శాపమయ్యింది. అందులో ఉన్న కొందరు దుర్మార్గుల చేతుల్లో ఆ అమ్మాయి గ్యాంగ్‌రేప్‌కి గురయ్యింది. తర్వాత కొన్ని రోజులకు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. కానీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఆమె అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించింది. ‘ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను సంధించిపోయింది. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, మహిళా సంక్షేమం వంటి మాటలన్నిటినీ సమాధి చేసింది ఆమె మరణం. ప్రజాగ్రహం పెల్లుబికింది. మా రక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ మహిళాలోకం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫలితంగా నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు చేసి, స్త్రీల మానప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మహిళల చుట్టూ ఎన్నో రక్షణ రేఖలు గీసింది. కానీ ఆ రేఖలు ఎవరినీ ఆపలేదు. ఆ సంఘటన తర్వాత కూడా ఎన్నో గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. భారతదేశంలో ప్రతి ఇరవై నిమిషాలకొక అత్యాచారం జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ వీటిని అరికట్టడం మాత్రం అసాధ్యంగా ఉంది. మహిళలకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాచార భూతం ఆ స్వేచ్ఛను హరించేస్తోంది. ఉన్న చట్టాలను మార్చినా, కొత్తచట్టాలను చేర్చినా అవి ఆగకపోవడానికి కారణం... వాటి పట్ల ప్రజలకు సరయిన అవగాహన లేకపోవడం, వాటి అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవడం. కాబట్టి మొదట చేయాల్సింది నిర్భయ అయితేనేమి, ఇతర ఏ చట్టాలయితేనేమి... వాటి గురించి పూర్తి అవగాహన కల్పించాలి. దానివల్ల భయం అనేది కలుగుతుంది. తప్పు చేశారని తేలగానే జాప్యం లేకుండా శిక్షను అమలుపర్చాలి. దానివల్ల తప్పు చేయడానికి జంకే పరిస్థితి వస్తుంది. అవి చేయనంతవరకూ ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. వాటివల్ల మహిళలకు ఒరిగేదీ ఉండదు. - అమర్త్యసేన్ -
ప్రజాసంక్షేమానికి పెద్దపీట
నివేదిక: అభివృద్ధికి మానవీయ కోణం ఉండాలని అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తల నిశ్చితాభిప్రాయం. ఈ వాస్తవాన్ని ఆచరణలో చూపించిన రాజకీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మానవీయ కోణంతో సాగే అభివృద్ధితోనే ఏ ఫలితాలైనా అట్టడుగు వర్గాలకు చేరతాయి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెరిగిన ఆర్థిక హోదా ద్వారా వచ్చే ఫలితాలను అందుకోవడానికి ఆరోగ్యం తప్పనిసరి. నిజానికి అభివృద్ధి, ప్రజారోగ్యం పరస్పరాధారాలు. వైద్య వృత్తి నుంచి వచ్చిన వారు కాబట్టే వైఎస్ ఈ అంశాన్ని గుర్తించారు. 2005, 2006-2010 మధ్య గణాంకాలను పరిశీలిస్తే ఇది బోధపడుతుంది. అందుకే దేశంలో ముందంజలో ఉందని పేరు పొందిన గుజరాత్లో కూడా ‘ఆరోగ్యశ్రీ’ కనిపించదు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో వైద్యరంగానికి కేటాయించిన ఎక్కువ నిధులు కానీ, అదే సమయంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు కానీ గుజరాత్లో ఇప్పటికీ కానరావు. గుజరాత్లో ఆయుః ప్రమాణం 64 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రమాణం 64.4 శాతంగా గమనించవచ్చు. ప్రసూతి మరణాలు గుజరాత్లో 148 కాగా, మన రాష్ట్రంలో 134గా (ప్రతి లక్ష మందికి) నమోదైంది. ఇక్కడ శిశుమరణాలు (ప్రతి వెయ్యిలోను) 46 కాగా, ఇదే కాలంలో వాటి జాతీయ సగటు 47. రాష్ట్రం ఆరోగ్య రంగంపై1.20 శాతం ఖర్చు చేయగా, గుజరాత్ 0.73 శాతం మాత్రమే ఖర్చు చేసింది. 2007-08 మధ్య కాలంలో 5-14 సంవత్సరాల బాలబాలికలు 90 శాతం పాఠశాలలకు వెళ్లారు. జాతీయ సగటు, గుజరాత్ కంటే కూడా ఇదే ఎక్కువ. ఆరోగ్యం, విద్య, సామాజికరంగాలకు సంబంధించి ఇలా గుజరాత్ కంటే ముందంజలో ఉండటం వైఎస్ హయాంలోనే కనిపిస్తుంది. ఈ అంశాల మీద ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి అధ్యయన నివేదిక రెండవ భాగం ఇది. అభివృద్ధికి మానవీయకోణం ఉండాలనేది వైఎస్ ఫిలాసఫీ. సంక్షేమం లేని అభివృద్ధిని ఆయన కాంక్షిం చలేదు. అందుకే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇచ్చా రో అంతే ప్రాధాన్యం సంక్షేమానికీ ఇచ్చారు. సామా జికరంగాలైన విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ఇం దుకు సాక్ష్యం. గుజరాత్ అభివృద్ధి నమూనాతో పోల్చి నప్పుడు ఈ కోణాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అభి వృద్ధి- సంక్షేమం ఒకే నాణేనికి రెండు ముఖాలుగా భాసిల్లాయి. వైద్యరంగంపై ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీపైసా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా వారి ఆర్థికస్థితి మెరుగుపడటంతో పాటు మంచి ఆరోగ్యమైన సమాజం నిర్మితమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే స్వత హాగా డాక్టర్ అయిన వైఎస్ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. వైద్యరంగానికి నిధులు భారీగా కేటాయింపులు చేయ డమే కాకుండా... పేదలకూ కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ఆరో గ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశానికే రోల్‌మోడల్‌గా గుజరాత్‌ను చూపి స్తున్న మోడీ హయాంలో ఇటువంటి ఆరోగ్య పథకం లేదు. ఫలితంగా ఆరోగ్య రంగంలో గుజరాత్ కంటే వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో మెరుగ్గా ఉంది. శిశుమరణాల సంఖ్య, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మన రాష్ట్రం కంటే గుజరాత్లో అధికం కావడమే ఇందుకు దాఖలా. అదే విధంగా పిల్లల చదువులకు ఆర్థిక పరిస్థితి ఆటంకం కాకూడదని భావించారు వైఎస్. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదసాదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. సామాజికరంగాలైన విద్య, వైద్య, గ్రామీణ రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంతో పాటు పట్టణాభివృద్ధి వంటి రంగాలపై వైఎస్ శ్రద్ధ కనబరిచారు. తద్వారా సామాజికరంగాల అభివృద్ధిలో గుజరాత్‌ను మించి రాష్ట్రమే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. ‘సమ్మిళిత అభివృద్ధి- చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, నరేంద్రమోడీల విధానాల మధ్య తులనాత్మక విశ్లేషణ’ పేరుతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన కామర్స్ విభాగం ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి అధ్యయన నివేదిక నికార్సయిన గణాంకాలతో ఇదే అంశాన్ని నిగ్గు తేల్చింది. ఆరోగ్యం ఆయుః ప్రమాణం శాతం గుజరాత్లో కంటే ఆనాడు మన రాష్ట్రంలోనే ఎక్కువ. గుజరాత్లో ఇది 64 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 64.4 శాతంగా ఉంది. రాష్ట్రంలో 2006-10 మధ్యకాలంలో ప్రతి వెయ్యిమందికి శిశుమరణాల సంఖ్య 46 మంది ఉండగా ఇది జాతీయస్థాయిలో 47గా ఉంది. 2006-10 మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి ప్రసూతి మరణాల సూచీ 134 ఉండగా, గుజరాత్లో 148గా ఉంది. జాతీయ సగటు (212) కంటే ఆ నాడు రాష్ట్రం చాలా మెరుగని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణం రాష్ట్రంలో అందుతున్న మెరుగైన వైద్యసదుపాయాలే. ఆరోగ్యరంగంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చు గతంతో పోలిస్తే పెరగడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. 2006-10 మధ్యకాలంలో పోషకాహార లోపంతో జన్మిస్తున్న పిల్లల సంఖ్య రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 38.40 మంది ఉండగా, గుజరాత్లో ఇది ఏకంగా 49.20గా ఉంది. ఈ అంశాల్లో గుజరాత్ కంటేనే కాదు దేశం కంటే (45.8) కూడా రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2006-10 మధ్య కాలంలో గుజరాత్లో ఎక్కువగా ఉంది. గుజరాత్లో పోషకాహార లోపం తో బాధపడుతున్న పిల్లల సంఖ్య (ప్రతి వెయ్యి మందిలో) 43.6 నుంచి 49.20కు పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో 37.73 నుంచి 36.6కు తగ్గింది. ఒక్కో వ్యక్తిపై వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు చంద్రబాబు హయాం కంటే వైఎస్ హయాంలో పెరిగింది. తలసరి వైద్య ఖర్చు 1995-2000 మధ్యకాలంలో రూ.133.3, 2001-04 మధ్యకాలంలో రూ.166.4 ఉంది. అయితే, 2005-10 మధ్యకాలంలో ఇది ఏకంగా రూ.222.4కు పెరిగింది. మొత్తం రాష్ట్ర వ్యయంలో ఆరోగ్యరంగానికి చేస్తున్న ఖర్చు 2005-10 మధ్యకాలంలో రాష్ట్రంలో 1.20 శాతం ఉండగా, గుజరాత్లో ఇది కేవలం 0.73 శాతం మాత్రమే. విద్య 2007-08 సంవత్సరంలో 5-14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన రాష్ట్రంలోని పిల్లలలో 90 శాతం పాఠశాలలకు వెళుతున్నారు. ఇది జాతీయ సగటు కంటేనే కాదు గుజరాత్ కంటే కూడా ఎక్కువ. జాతీయస్థాయిలో రాష్ట్రం 7వ స్థానంలో నిలవగా గుజరాత్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని 6-14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలలో 3.3 శాతం మంది మాత్రమే పాఠశాలలకు దూరంగా ఉన్నారని తాజాగా 2010లో విడుదలైన ఏఎస్ఈఆర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) సర్వే తెలిపింది. పాఠశాల విద్యలో ప్రత్యేకంగా 2007-08 నుంచి రాష్ట్రం పురోగతిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రిడ్జి స్కూల్స్ కోర్సులతో పాటు గ్రామీణ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ వంటి పథకాలు ఇందుకు దోహదపడ్డాయి. అందువల్లే 2008-09 విద్యా సంవత్సరానికిగానూ ఈడీఐ (ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇండెక్స్) ఆధారంగా వెలువడిన నివేదిక ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాల్లో మన రాష్ట్రం 7వ స్థానాన్ని దక్కించుకోగలిగింది. మాధ్యమికస్థాయి విద్యలోనూ గుజరాత్ కంటే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉంది. 13-15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలలో రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య 55.4 శాతం ఉండగా, గుజరాత్లో ఇది కేవలం 42.3 శాతం మాత్రమే. పాఠశాలలకు వెళ్లే పిల్లలలో మగ, ఆడపిల్లల మధ్య వ్యత్యాసం 1995- 96తో పోలిస్తే 2007-08 నాటికి బాగా తగ్గింది. 1995-96లో ఈ వ్యత్యా సం 7.2 శాతం ఉండగా, 2007-08 నాటికి 4.3 శాతానికి తగ్గింది. అంటే పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందన్నమాట. సామాజికవర్గాల వారీగా చూసినప్పటికీ బాబు హయాం కంటే వైఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు పురోగమించాయి. 1995-96లో ఎస్టీ వర్గాల్లో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య కేవలం 47.7 శాతం ఉండగా, 2007-08 నాటికి 83.1 శాతానికి పెరిగింది. ఎస్సీ వర్గాల్లో ఇది 57.7 శాతం నుంచి 89.6 శాతానికి పెరిగింది. అంటే 21.9 శాతం పెరిగిందన్న మాట. ఇది కాస్తా 2009-10 నాటికి ఏకంగా 94.4 శాతానికి ఎగబాకింది. అదేవిధంగా పాఠశాలలకు వెళుతున్న ముస్లిం పిల్లల సంఖ్య 95.2 శాతా నికి చేరుకుంది. సామాజిక రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రణాళిక వ్యయం 2000-03లో 5.76 మాత్రమే ఉండగా, 2004-08 మధ్యకాలంలో 6.66 శాతానికి పెరిగింది. అయితే, వైఎస్ మరణానంతరం ఇది కాస్తా తగ్గింది. 2009-11 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రణాళిక వ్యయం 6.04 శాతానికి తగ్గిపోయింది. సగటు తలసరి వాస్తవిక పెట్టుబడి 2000-03 మధ్యకాలంలో రూ.594 ఉండగా, 2004-08 మధ్యకాలంలో రూ.991కు పెరిగింది. సామాజిక రంగాలకు ఖర్చు 2000-03 కంటే 2004-08 మధ్యకాలంలో భారీగా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెరగడమే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షే మం, భద్రతతోపాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వైఎస్ హయాంలో ప్రభు త్వం భారీగా చేపట్టడం ఇందుకు తోడ్పడింది. సామాజికరంగాలపై ఖర్చు పెట్టడంలో 2000-01 మధ్యకాలంలో గుజ రాత్ కంటే రాష్ట్రం వెనుకబడి ఉంది. అయితే, 2005-06 మధ్యకాలంలో మాత్రం గుజరాత్ కంటే రాష్ట్రం ముందంజలో ఉంది. మొత్తం ప్రభుత్వ వ్యయంలో సామాజికరంగాలకు గుజరాత్లో 2005-06లో 36.8 శాతం మాత్రమే కేటాయించగా, ఇదేకాలంలో రాష్ట్రంలో 41.6 శాతంగా ఉంది. మొత్తం ప్రణాళిక వ్యయంలో సామాజికరంగాలకు చేసిన వ్యయం కూడా 2000-01 కంటే 2008-09లో భారీగా పెరిగింది. 2008-09 ఆర్థిక సంవ త్సరంలో మొత్తం ప్రణాళిక వ్యయంలో సామాజికరంగాలకు చేసిన వ్యయం రాష్ట్రంలో 48 శాతం ఉండగా, గుజరాత్లో ఇది 38 శాతం మాత్రమే.