లోక్సభ ఎన్నికల వేళ భారతదేశ రాజకీయాలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనైక్యత కారణంగా దేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని, కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కుల గణన అనేది మంచి విషయమేనన్న ఆయన దేశానికి మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా వెనుకబడిన వారికి మరింత సాధికారత అవసరమని ఆయన అన్నారు. జేడీ(యు), ఆర్‌ఎల్‌డీలు ఎన్‌డీఏలో చేరడంతో ప్రతిపక్ష కూటమి ఇండియా పెద్దగా పట్టు సాధించలేకపోయిందని అమర్త్యసేన్ తెలిపారు.
ఎన్‌డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని విమర్శించిన అమర్త్యసేన్ విస్తృతమైన నిరక్షరాస్యత, అసాధారణ లింగ అసమానతల కారణంగా దేశంలోని పేదలకు పురోగతిని కష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment