
లౌకిక పార్టీలతో విస్తృత వేదిక ఏర్పాటు కావాలి
సీపీఎం అగ్ర నేత ప్రకాశ్ కారత్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటైందే తప్ప, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాదని సీపీఎం నేత, పార్టీ మధ్యంతర సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష లౌకిక పార్టీలతో కూడిన విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి విస్తృత కూటమి మాత్రమే ఎన్నికల రాజకీయ ప్రయో జనాలకు పరిమితమై పోకుండా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శనివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మా ట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సా రథ్యంలోని ఎన్‌డీఏను దీటుగా ఎదు ర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడటం తెల్సిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని కారత్ వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నారు. కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో తమ సొంత రాజకీయ సమీకరణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమి ఏర్పాటు, అన్ని రాష్ట్రాల్లో కాకున్నా కనీసం కొన్ని చోట్లయినా సభ్య పార్టీల్లో సమన్వయం కుదరడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయేందుకు కారణమైందన్న విషయం మాత్రం వాస్తవమని కారత్ విశ్లేషించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మెరుగైన పనితీరు కనబరిచి, బీజేపీకి షాక్ ఇవ్వగలిగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కూటమిలో అనైక్యత కారణంగా ఫలితాలు తారుమారయ్యాయి’అని కారత్ చెప్పారు. ‘జార్ఖండ్‌కు వచ్చే సరికి ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు ఇక్కడ ఐక్యంగా పనిచేసి, బీజేపీని ఓడించాయి.
పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఫలితాలు మారుతూ వచ్చాయి’అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలు విశాల వేదిక ఏర్పాటు కోసం ముందుగా ఆయా పార్టీల అవసరాలను, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక రూపు తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, బిహార్, తమిళనాడుల్లో ఇటువంటి కూటములు కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ప్రకాశ్ కారత్.. పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. బెంగాల్‌లో టీఎంసీ, సీపీఎంలకు పొసగనట్లే ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆప్‌లు కలిసి సాగడం సాధ్యం కాని నేపథ్యముందని తెలిపారు.
అసలు ఇండియా కూటమి లక్ష్యం ఎన్నికలేనా? అదే అయితే, ఎన్నికల నుంచి ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగుతుందా?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కారత్ వ్యాఖ్యానించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఇండియా కూటమి వైఖరి ఎంతో సంక్లిష్టంగా తయారవుతుందని చెప్పారు. ‘ప్రతిపక్ష ఐక్య వేదిక పూర్తిగా ఎన్నికలకు సంబంధించింది అనుకోరాదు. మోడీ ప్రభుత్వం, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల వేదిక ఇది’అని కారత్ తెలిపారు.
లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పరిరక్షణ గురించి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నట్లయితే ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలున్నాయని, ఇదే ప్రాతిపదికగా ఈ ఉద్యమాన్ని తీసు కువెళ్లవచ్చునని పేర్కొన్నారు. మోదీ ప్ర భుత్వం, దాని విధానాలకు ప్రత్యామ్నా యమే లక్ష్యమైతే ఆ దిశగా ఇండియా కూ టమిని నిర్మించుకోవాల్సి ఉంటుందని కారత్ తెలిపారు.
బెంగాల్‌లో సీపీఎంను మళ్లీ నిలబెడతాం
పశ్చిమబెంగాల్‌లో సీపీఎంను మళ్లీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రకాశ్ కారత్ వివరించారు. ఇందులో భాగంగా, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా ఏకం చేస్తా మన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కారత్ వెల్లడించారు.
బెంగాల్‌లో పార్టీ పునాదులు బలహీనమయ్యాయని, అందుకే ఎన్నికల్లో ఫలితాలను సాధించలేక పోతోందని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును తిరిగి కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ విషయంలో కొంతమేర ఫలితాలు కనిపించాయన్నారు. అదే సమయంలో కేరళలో అనూహ్యంగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, దీర్ఘ కాలం అధికారంలో కొనసాగడంపై దృష్టి సారించిందని అన్నారు.
త్రిభాష సూత్రంపై కేంద్రం మొరటు ధోరణి
నూతన విద్యా విధానంలోని త్రిభాష సిద్ధాంతం అమలుపై కారత్ మాట్లాడు తూ..‘దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల విష యంలో కేంద్రం సున్నితంగా వ్యవహరించడం లేదు. అన్ని భాషలకు సమాన ప్రా ముఖ్యం ఇవ్వాలే తప్ప, ఒక భాషను బల వంతంగా అమలు చేసేందుకు ప్రయత్నించరాదు’అని కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో తమిళనాడు అభి ప్రాయాలకు తగు ప్రాతిపదిక ఉందని చె ప్పారు. హిందీని ప్రోత్సహించాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉందన్నారు. దక్షిణాది రా ష్ట్రాల అభ్యంతరాలకు కారణమిదేనని కార త్ తెలిపారు. విద్యావిధానంపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వా లని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రం పెత్తనమే కనిపిస్తోందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment