ఆర్మీ రిక్రూట్ మెంట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం పీఎంఓ కార్యాలయంలో రూపొందించారని ఆరోపించారు.
కేంద్రంలో భారత కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, అగ్నిపథ్ సైనిక పథకాన్ని రద్దు చేసి, పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
అగ్నిపథ్ పథకంపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకం భారత సైన్యాన్ని, దేశాన్ని రక్షించాలని కలలు కంటున్న వీర యువతను అవమానించడమేనని అన్నారు. ఈ పథకం భారత సైన్యం కాదు. నరేంద్ర మోదీ రూపొందించిన పథకం.
అమరవీరులను వేర్వేరుగా చూడలేమని, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసే ప్రతి ఒక్కరికీ అమరవీరుడి హోదా కల్పించాలని అన్నారు. ఇండియా కూటమి వెంటనే ఈ పథకాన్ని రద్దు చేస్తాము.పాత శాశ్వత నియామక ప్రక్రియను తిరిగి తీసుకువస్తాము అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment