న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ దేశంపై ఒకే భాషను రుద్దాలని, రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది
బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఎంపీ సుధాన్షు త్రివేది, ఓం పాఠక్ ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదును సమర్పించింది. ఈసీ గతంలో రాహుల్ గాంధీకి నోటీసులు అందించిందని, అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని కమలం నేతలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కడమే కాకుండా పౌర అశాంతి, అసమ్మతిని ప్రేరేపించేలా ఉందని ఉదహరించింది.
Comments
Please login to add a commentAdd a comment