అమర్త్యసేన్‌ ఆరోగ్యంగానే ఉన్నారు | Fact Check: Bharat Ratna Nobel Laureate Amartya Sen death news false | Sakshi
Sakshi News home page

అమర్త్యసేన్‌ ఆరోగ్యంగానే ఉన్నారు.. మృతి వార్తల్ని ఖండించిన కూతురు

Published Tue, Oct 10 2023 6:05 PM | Last Updated on Wed, Oct 11 2023 9:27 AM

Fact Check: Bharat Ratna Nobel Laureate Amartya Sen death news false - Sakshi

ప్రముఖ ఆర్తికవేత్త, నోబెల్‌ గ్రహీత.. భారతరత్న  అమర్త్య సేన్‌(89) కన్నమూశారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కాస్త ఆంగ్ల మీడియాలో టెలికాస్టింగ్‌ దాకా వెళ్లింది. అయితే.. అదంతా ఫేక్‌ సమాచారం అని ఆయన కూతురు నందనా సేన్‌ స్పష్టత ఇచ్చారు. 

ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.  ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీగా ఉన్నారంటూ కూతురు నందనా దేబ్‌ సేన్‌ స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన కుటుంబంతో కేంబ్రిడ్జిలో  వారంపాటు గడిపారని, హర్వార్డ్‌లో తరగతులు చెప్పడంలో మునిగిపోయారని ఆమె వెల్లడించారు. 


అమెరిక‌న్ ప్రొఫెస‌ర్ క్లాడియా గోల్డిన్‌(2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేత కూడా).. తాజాగా తన ఎక్స్‌ అకౌంట్‌లో అమర్త్యసేన్‌ కన్నుమూశారని ట్వీట్‌ చేశారంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే.. అది ఫేక్‌ అకౌంట్‌ అని తర్వాతే తేలింది.

హర్వార్డ్‌ యూనివర్సిటీలో చదివిని అమర్త్య సేన్‌ కూతురు నందనా దేవ్‌ సేన్‌ పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడమే కాదు.. బాలల హక్కుల ఉద్యమకారిణి కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement