false news
-
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్‌గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. ఎంవీవీ సత్యనారాయణ సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్, తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు.‘‘నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా.. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్‌కు ఖరీదైన కార్లు, బంగాళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. ‘‘నేను, నా వియ్యంకుడు 12 స్థలాలు హేమంత్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నా పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు. -
గౌరవాన్ని ఇచ్చిన పార్టీని మేమేందుకు వదిలేస్తాం
-
‘రాజీనామా గోప్యత’ కథనంపై భూమన అభినయ్ సీరియస్
తిరుపతి, సాక్షి: మున్సిపల్ కార్పొరేషన్‌కు తన రాజీనామా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందులో ఎలాంటి గోప్యతా లేదని.. తాను రాజీనామా ఎప్పుడు చేశానో, దానికి ఎప్పుడు ఆమోదం లభించిందో.. తదితర విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన నాల్గో డివిజన్ కార్పొరేషన్ పదవికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుపతి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ఖరారైన వెంటనే, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆ పదవుల్ని వద్దనుకున్నా. నా రాజీనామాను మేయర్ డాక్టర్ శిరీష గారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. .. నేను పదవులకు రాజీనామా చేసిన విషయం ఎన్నికలకు ముందు అన్ని పత్రికల్లో వచ్చింది. తాజాగా ఒక పత్రికలో నా రాజీనామాల విషయాన్ని గోప్యంగా వుంచానని రాయడం ఆశ్చర్యం అనిపించింది. .. నా రాజీనామా లేఖను బయట పెట్టొద్దని ఒత్తిడి చేసానని రాయడం వారి ఆలోచనల సంకుచితాన్ని బయట పెడుతున్నదే తప్ప, అందులో నిజం లేదని అందరికీ తెలుసు. పచ్చకామెర్లోళ్లకి లోకమంతా అట్లే కనిపిస్తుందని పెద్దలన్నట్టుగా, రాజీనామాపై గోప్యత పాటించడం వెనుక అనుమానాలున్నాయని రాయడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది. .. ప్రజాతీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హుందాగా స్వీకరించాను. ప్రజాతీర్పును గౌరవించి కొత్తగా ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. .. డిప్యూటీ మేయర్ పదవి కోసం కక్కుర్తి పడే స్వభావం నాది కాదని మరోసారి చెబుతున్నాను. తిరుపతిలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పుట్టడం, ఈ నగరానికి డిప్యూటీ మేయర్‌గా రెండేళ్ల పాటు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంతే తప్ప, దాన్ని అలంకారంగా నేనెప్పుడూ వాడుకోలేదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా తిరుపతి ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామాపై నిజానిజాలు చెప్పడానికే ఈ వివరణ’’ అని భూమన అభినయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పత్రికలో తాజాగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు అభినయ్ రాజీనామా అంటూ తాజాగా కథనం వచ్చింది. పోలింగ్‌కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచిందని అందులో పేర్కొంది. టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే! -
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
-
టోటల్ డర్టీ పాలిటిక్స్!
సాక్షి, పుట్టపర్తి: అధికారం కోసం ‘తమ్ముళ్లు’ నానా తంటాలు పడుతున్నారు. అధినేత ఆదేశాల మేరకే తప్పుదోవ పడుతున్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు. రోజురోజుకూ టీడీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు అసత్య వార్తలను ఎల్లో మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. టీడీపీలో ఉన్న వారికే కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. కొత్తగా పార్టీలో చేరినట్లు వార్తలు రాయిస్తున్నారు. ఒకరిద్దరికి కండువాలు వేసి వందల కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరినట్లు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఇటీవల పుట్టపర్తి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అయితే వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు, చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా నేతల తీరుపై మండిపడుతున్నారు. పార్టీ క్రెడిబులిటీ పోతుందని వాపోతున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకే.. టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది. పార్టీ వీ డుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ధర్మవరంలో వార్డుల వారీగా ఆ పార్టీ ఖాళీ అవుతోంది. పరిటాల ఇలాకాలోని గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీలోకి వె ల్లువలా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న వారిని కాపాడుకునే క్రమంలో టీడీపీ నేతలు వాళ్లకే మళ్లీ మళ్లీ కండువాలు వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా లేకే.. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారు. అందుకు ఎల్లో, సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు. -
‘మాతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా పాచిక పారదు’
విడపనకల్లు/రాయదుర్గం/దేవరాపల్లి/కొయ్యలగూడెం/వలివేరు: తాము సమ్మెలోకి వెళ్తున్నామంటూ తప్పుడు రాతలు రాసిన ఎల్లో మీడియాపై వలంటీర్లు కన్నెర్ర చేశారు. తప్పుడు వార్తలు రాయవద్దని హెచ్చరిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. తమతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా కుట్రలు సాగవని చెప్పారు. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో అవాస్తవ కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను తగులబెట్టారు. ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటివద్దకే చేరేవిధంగా సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారని చెప్పారు. సీఎం ఏ ఉద్దేశంతో అయితే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. తామంతా అందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ ఎల్లోమీడియా తమకు లేనిపోనివి ఆపాదించి కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో పత్రికలకున్న విలువను పోగొట్టుకుంటున్నాయని చెప్పారు. రాయదుర్గంలో వలంటీర్ల సంఘం నాయకులు జబివుల్లా, సునీల్, వంశీ, ప్రవీణ్, జునీయాద్బాష తదితరులు మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు సమ్మె చేస్తారంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తమను వేగులని, సంఘవిద్రోహ శక్తులని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ అన్నారని, ఆ వ్యాఖ్యల్ని ఈ పచ్చపత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయని గుర్తుచేశారు. గతంలో తమపై అంతలా విషం చిమ్మిన పత్రికలు ఇప్పుడు కొందరితోనైనా సమ్మె చేయించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కానీ ఆరునూరైనా వారి పాచిక పారదని చెప్పారు. తప్పుడు రాతలు మానుకోవాలంటూ నినాదాలు వలంటీర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారంటూ అసత్య కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై అనకాపల్లి జిల్లా దేవరాపల్లి గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోని వలంటీర్లు నిరసన తెలిపారు. సేవాభావంతో పనిచేస్తున్న తమపై విషప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మరోసారి తప్పుడు రాతలు ప్రచురిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో ఈనాడు పత్రికలు చేతపట్టి పచ్చమీడియాకు వ్యతిరేకంగా ‘ఈనాడు డౌన్‌డౌన్, తప్పుడు రాతలు మానుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. దేవరాపల్లి ప్రధాన రోడ్డులో పచ్చ పత్రికలను దహనం చేశారు. వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పనచేసి తమకు సేవచేసే భాగ్యాన్ని కల్పించిన సీఎం జగన్ అంటే తమకెంతో గౌరవభావం ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని దేముళ్లు, పోతురాజు, జోష్, ఉమ, దేవి, రాజు, ఎర్రినాయుడు స్పష్టం చేశారు. సమ్మె చేయం బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామ సచివాలయం వద్ద గురువారం వలంటీర్లు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సమ్మె చేయకుండా చేస్తున్నారని ఈనాడు పేపరులో రాయడం దారుణంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవచేసేందుకే గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ సమ్మె చేయబోమని వలంటీర్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పచ్చ పత్రికలు పచ్చ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని, మీడియా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ సచివాలయం వద్ద వలంటీర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వలంటీర్ల అసోసియేషన్ నాయకుడు జొన్నకూటి పట్టియ్య ఆధ్వర్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లతో దిష్టిబొమ్మను తయారుచేసి దహనం చేశారు. తాము విధులకు హాజరై బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్య కథనాలతో తమపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను దేశమంతా కొనియాడుతుంటే అంపశయ్యపై ఉన్న తెలుగుదేశం, దాని తోకపార్టీ జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి రామోజీ, రాధాకృష్ణ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల ఐక్యత వర్థిల్లాలని, పచ్చ పత్రికల నీతిమాలిన రాతలు మానుకోవాలని నినాదాలు చేశారు. -
బానిసగా మారిన గురువు
పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా అని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం సరిగ్గా ఈనాడు మీడియాకు అది వర్తిస్తుంది. రాసిందే, రాసి, చూపిందే చూపి ఈనాడు మీడియా వారి పాఠకులను, ప్రేక్షకులను నానా విధాలుగా హింసిస్తోంది. ఈనాడు రామోజీరావు దశకంఠుడుగా అంటే రావణాసురుడిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబట్టాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై అనునిత్యం వార్తలు రాసి ప్రజలకు బోరు కొట్టిస్తున్నారు. పదే, పదే ఒక వార్తను ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది అభినవ గోబెల్స్ గా మారిన రామోజీరావు నమ్మకం. ✍️టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఆయన గురువుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన బానిస పాత్రకు మారినట్లు అనిపిస్తుంది. అందుకే టీడీపీ కరపత్రం కన్నా హీనంగా ఈనాడు పత్రికను మార్చేశారు. ఈటివిని టీడీపీ యూట్యూబ్ ఛానల్ కన్నా అధ్వాన్నంగా మార్చారు. డిసెంబర్ 19వ తేదీన ఈనాడు దినపత్రికలో రాసిన బానర్ చూస్తే, ఛీ.. ఈనాడు ఇంతగా దిగజారిందేమిటా అనిపిస్తుంది. ఇప్పటికి ఈ నాలుగేళ్లలో ఒక వంద సార్లు ఈ వార్త రాసి ఉంటారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎన్నికలలోగా ఇంకెన్ని సార్లు రాస్తారో! ముఖ్యమంత్రి జగన్ కారికేచర్ వేసి తొమ్మిది తలలు తగిలించి రుణకంఠుడు అని ఒక చెత్త కథనం వండారు. ✍️నిజానికి పది తలలు ఉన్న దశకంఠుడు రామోజీరావే. రావణాసురుడుగా మారింది ఆయనే. రోజూ ఒక పది పేజీలలో పచ్చి అబద్దాలు రాస్తూ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది రామోజీరావే. ఏ మాత్రం జర్నలిజం విలువలతో నిమిత్తం లేకుండా పత్రికలు కూడా వ్యభిచారం చేయవచ్చని ఈనాడు మీడియా నిరూపిస్తోంది. రాష్ట్ర విభజన నాటి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వం అప్పులన్నట్లుగా ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా, ఇంత అప్పులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ హామీలు ఆచరణ సాధ్యం కావని, అది ప్రజలను మోసంచేయడమేనని చెప్పగలదా? ✍️చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయరని మాజీ ఐఎఎస్ జయప్రకాష్ నారాయణ చెప్పినదానితో ఈనాడు మీడియా ఏకీభవిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మితి మీరి అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. కాని ఈనాడు రాసిన వైనం చూస్తే జగన్ ప్రభుత్వమే అప్పులు తీసుకువచ్చినట్లు, వాటిని ఎక్కడా ఉపయోగించకుండా వృధా చేశారన్న భావన కలిగించేట్లు దిక్కుమాలిన వార్తను వండింది. రాష్ట్రం అప్పులు సుమారు నాలుగున్నర లక్షల కోట్లు అని కేంద్రం ఎన్నిసార్లు పార్లమెంటులో చెప్పినా, వీరు మాత్రం వినిపించుకోరు. పది లక్షల కోట్లపైనే అప్పులని దుష్ప్రచారం చేస్తారు. పోనీ దానిని అయినా పద్దతిగా రాస్తారా అంటే అదీ ఉండదు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది రాయకుండా, మొత్తం అప్పు అంతా జగన్ ప్రభుత్వమే చేసినట్లు పిక్చర్ ఇస్తుంటారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ✍️చంద్రబాబు ప్రభుత్వం సుమారు రెండు లక్షలకు కోట్లకు పైగా అప్పు ఎందుకు తెచ్చిందో చెప్పమనండి. అప్పట్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకున్నారో వివరించమనండి. ఆ డబ్బు దేనికి వాడారో ఎన్నడైనా రాశారా? ఊహూ.. వాటికి జోలికే వెళ్లరు. ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే పడి ఏడుపు. పోనీ జగన్ ప్రభుత్వం ఏ, ఏ కార్యక్రమాలకు అప్పులు చేసిందో చెబుతారా?అంటే అదీ ఉండదు. చంద్రబాబు టైమ్‌లో సివిల్ సప్లైస్ కార్పొరేష్ ద్వారా అప్పులు తీసుకుని ఆ డబ్బును పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు పంచిపెడితే అప్పుడు ఈనాడు, తదితర ఎల్లో మీడియా కు అందులో ఎంతో విజన్ కనిపించింది. జనం మాత్రం అది విజన్ కాదు.. వికృతం అని గమనించి టీడీపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారు. ✍️టీడీపీ హయాంలో 1.60 లక్షల కోట్ల మేర అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో అప్పుల శాతం 15 శాతం అయితే, జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 12.4 మాత్రమే. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్యుతూ ప్రభుత్వంపై బురద చల్లుతుంది. చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చవలసి వచ్చింది. చంద్రబాబు దిగిపోతూ వంద కోట్లే మిగిల్చారని అప్పట్లో ఈనాడు మీడియా రాయలేదా! అసలు జగన్ ముఖం చూసి అప్పులు ఎవరు ఇస్తారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానిస్తే ఆనందంగా ప్రచురించింది కూడా ఈ మీడియానే. ఈ సంగతిని పక్కనబెడితే రామోజీరావుకు ఒక సవాల్ విసరదలిచాను. ✍️రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేయాలని అనుకుంటున్నారు కదా! వీరు రాసిన లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తే ఆయన ఇచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది? ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. చంద్రబాబు కేవలం ప్రజలను మోసం చేయడానికే అంతటి భారీ వాగ్దానాలు ఇస్తున్నారని ఈనాడు రాయగలదా?. తెలుగుదేశం అధికారంలోకి రాలేదని తెలిసే, ఈనాడు మీడియా ఆ పార్టీని జాకీలు పెట్టి లేపడానికే ఇలాంటి చెత్త కథనాలు ఇస్తోంది. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏడాదికి నలభైఐదు వేల కోట్లు వ్యయం చేస్తోంది. దీనికే ఇంత భారీగా అప్పులు అయ్యాయని రాశారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ లు కలిసి ఇస్తున్న హామీలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? ✍️చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలకే ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయి. వాటిని సమకూర్చుకోవడం అసాధ్యం కాబట్టి యథా ప్రకారం చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికే ఈ హామీలన్ని ఇచ్చారని ఈనాడు రాస్తే అప్పుడు ఆ పత్రికను నమ్మవచ్చు. లేకుంటే టీడీపీకి అమ్ముడు పోయి ఇలాంటి దారుణమైన నీచ కథనాలను ఇస్తోందని ప్రజలు అనుకోరా! ఒకపక్క ఆయా స్కీములలో కోత పెడుతున్నారని రాసేది వీరే. వాటికి నిధులు తెచ్చి అమలు చేస్తుంటే, అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసేది వీరే. ✍️అదే చంద్రబాబు టైమ్‌లో బాండ్ల ద్వారా అప్పులు తీసుకున్నా, ఆహా.. చంద్రబాబు కాబట్టి అప్పులు వచ్చాయని భాజా వాయించారు. ఈనాడు మీడియాకు ఏపీ ప్రజలపై ఎలాంటి మమకారం లేదు. చిత్తశుద్ది అసలే లేదు. వారిది వ్యాపార, రాజకీయ ప్రయోజనమే. రామోజీ ఎప్పుడో ఏపీతో సంబంధం వదలుకున్నారన్నది వాస్తవం. చంద్రబాబు కోసం ఆయన ఏపీ ప్రజలను చెరబట్టాలని చూస్తున్నారు. పోనీ ఆయన అంత నిపుణుడైతే తన గ్రూపు సంస్థలు ఎందుకు నష్టాలు పాలవుతున్నాయి?. మార్గదర్శి వ్యవహారంలో అప్పులు తీర్చడానికి ఆయన తన టివీ చానళ్లను ఎందుకు అమ్ముకున్నారు?. న్యూస్ టైమ్, సోమా తదితర కంపెనీలను ఎందుకు మూసివేశారు? ✍️మార్గదర్శిలో ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎదుర్కుంటున్నారు? అందులో నల్లధనం తిప్పుతున్నారన్న విమర్శలకు ఎందుకు గురి అవుతున్నారు?. మార్గదర్శి చిట్స్ సంస్థ లెక్కలను పారదర్శకంగా ఎందుకు చూపించడం లేదు? ఈయనేమో తన సంస్థల కోసం ఎంత అప్పు అయినా డిపాజిట్ల రూపంలో తీసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం నిర్ణీత నిబంధనల ప్రకారం అప్పులు చేస్తే మాత్రం చండాలపు స్టోరీలు రాస్తుంటారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్నాయి. అంతవరకు ఈనాడు మీడియా అరాచకపు దాడిని జగన్ ఎదుర్కోవలసిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘ఈనాడు’ రోత రాతలు.. రామోజీ ఇక మారవా?
ఒకప్పుడు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వార్తలు ఇవ్వాలంటే సంపాదకులు ఒప్పుకునేవారు కారు. కాని ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వం ఉందని ఉగ్రవాద మీడియాగా మారిన ఈనాడు ఎంత నీచానికి అయినా పాల్పడుతోంది. ఏపీ ప్రజలపై రోజూ కక్ష కట్టి ఇలాంటి దారుణమైన వార్తలను ఇవ్వడానికి సిగ్గుపడడం లేదు. తమ అంతేవాసి అయిన చంద్రబాబు నాయుడును మళ్లీ పఠం ఎక్కించాలన్న తాపత్రయంలో ఉచ్చనీచాలు మరిచి రాస్తోంది. టీవీలో ప్రచారం చేస్తోంది. రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య అంటూ కొద్ది రోజుల క్రితంం ఇచ్చిన వార్త చదివితే కడుపు మండుతుంది. ✍️ఏపీ ప్రజల మీద ఇంతలా ఈనాడు రామోజీరావు పగ పట్టాలా అన్న ఆవేదన కలుగుతుంది. ఎల్లో మీడియాగా, ఎల్లో జర్నలిజంగా వస్తున్న విమర్శలను ఆయన సార్ధకం చేసుకుంటున్నారు. నిజానికి కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏపీలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది. చంద్రబాబు పాలన టైమ్‌లో ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉంటే, వైఎస్ జగన్ పాలనలో అది 33కి తగ్గింది. ఈ వార్త రావడంతోనే ఈనాడు మీడియాకు కడుపు ఉబ్బి పోయింది. ఎలా దీనిని చెడగొట్టాలని ఆలోచించింది. వెంటనే ఓ కథ అల్లేసింది. ✍️దేశ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలపై కేంద్రం ఏదో నివేదిక ఇచ్చిందంటూ దాని ప్రకారం 364 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అంటే ప్రతి రోజూ ఒక నిరుద్యోగి ఇలా చనిపోయారని అంటూ రాసేసింది. అంతేకాదు. పరిశ్రమలు తరిమేస్తున్నారట. అమరావతిని వదలివేశారట. ఇలా ఏవేవో అసత్యాలతో అతి దారుణమైన కథనాన్ని వండి వార్చారు. ప్రభుత్వపరంగా వైఎస్ జగన్ వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఒకేసారి లక్షాపాతికవేల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ దే. ✍️దమ్ముంటే ఈనాడు మీడియా చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలన టైమ్‌లో కాని, అంతకుముందు ఎన్.టి.ఆర్.పాలించిన ఏడేళ్ల టైమ్ లో కాని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు ఇవ్వాలి. గత టరమ్‌లో చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపి ఏభై వేలు లేకపోయినా, ఆయన నిరుద్యోగ సమస్యను తీర్చేశారని ఈనాడు రామోజీరావు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అసలు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ✍️ఆయన హయాంలోనే ఏభైనాలుగు కార్పొరేషన్లను మూసివేశారు. వాటిలో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. ఆ సంగతి జనం మర్చిపోతారన్నది వారి నమ్మకం. జగన్ టైమ్ లో వివిధ రకాల ఉద్యోగాలు అన్నీ కలిపి రెండు లక్షలకు పైగా ఇచ్చినా అసలేమీ ఇవ్వలేదన్నట్లు పచ్చి అబద్దపు వార్తలను సృష్టిస్తున్నారు.ఇక వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి నెలకు ఐదువేల రూపాయల చొప్పున ఇస్తున్నది కూడా జగన్ ప్రభుత్వమే. తద్వారా ఎవరైనా ఇంకా ఉద్యోగం రాని వారికి ఒకపక్క ప్రజలకు సేవ చేస్తూ ,మరో వైపు ఇది భృతిగా ఉపయోగపడుతోంది. ఇలా సుమారు ఇంకో రెండున్నర లక్షల మందికి మేలు కలుగుతోంది. ✍️చంద్రబాబు నాయుడు టీడీపీ మానిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల చొప్పున భృతి ఇస్తానని నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా మోసం చేసినా, రామోజీరావు, వారి సంపాదక బృందానికి, విలేకరులకు కనిపించనే కనిపించదు. వారు అప్పుడు కళ్లు మూసేసుకున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువత కొందరితో భేటీ అయ్యారు. ఆంధ్రలో రెండుసార్లు గ్రూప్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణలో మాత్రం ఒక్కటి కూడా చేయలేదని ఒక యువతి చెప్పినప్పుడు దానిని ఆయన అంగీకరించిన సంగతి ఈనాడుకు వినిపించి ఉండదు. ఆరోగ్య శాఖలో సుమారు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి వీరికి పట్టదు. ✍️ఎస్.ఐ.తదితర పోలీసు ఉద్యోగాలను ఎంపికలు జరుగుతున్న సంగతి హైకోర్టు సాక్షిగానే తెలిసింది కదా! అయినా రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఈనాడు నీచంగా రాస్తూ యువత పట్ల పాపం చేస్తోంది. ఈ మధ్యనే ఒక యువకుడు సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం తలపెట్టడం ద్వారా తనకు ఉద్యోగం వచ్చిందని, అందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ధాంక్స్ అని పేర్కొన్నాడు. అక్కడ సుమారు రెండుఉవేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలా మరో మూడు పోర్టుల నిర్మాణం జరుగుతోంది. విశాఖలో అనేక పరిశ్రమలు వస్తుంటే, ఐటి కంపెనీలు వస్తుంటే ఈనాడు కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. ✍️అక్కడ వాటిని ఎలా పాడు చేయాలా? వారు రాకుండా ఎలా భయపెట్టాలా అని చంఢాలపు కథనాలు ఇస్తోంది. కేవలం ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకునేవారు చాలా తక్కువ ఉంటారు. వారి ఆత్మహత్యలకు వేరే కారణాలు ఉండవచ్చు. ఇలాంటి ఘటనలను ఒక్కొక్కటి పరిశీలించి రాస్తే ఫర్వాలేదు. కాని గంపగుత్తగా ప్రభుత్వం మీద బురద చల్లే లక్ష్యంతో ఇష్టారీతిన రాసేస్తూ, పైగా తమకు స్వేచ్చ లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. గత కొద్ది నెలల్లోనే సుమారు అరవైవేల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటైతే వాటి గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు, ఇలాంటి అబద్దాలను ప్రజలపై రుద్ది వారి మనసులను కలుషితం చేయాలని విశ్వయత్నం చేస్తోంది. అందుకే ఈనాడు మీడియా ఉగ్రవాద సంస్థ మాదిరే తయారైందన్న వాదనలో వాస్తవం ఉందనిపిస్తుంది. ✍️దేశవ్యాప్తంగా 15783 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 2.3 శాతం ఎపివారని, వైకాపా పాలన రికార్డు అని రాసింది. బీహారు, బెంగాల్ లో నిరుద్యోగుల ఆత్మహత్యలు తక్కువని లెక్కలు చెబుతున్నాయట.ఆత్మహత్యలు తక్కువ ఉంటే నిరుద్యోగం లేనట్లేనా? ఆ రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో తెలంగాణ, ఏపీలోని వివిధ పట్టణాలలో చిన్న, చిన్న పనులు చేసుకుని ఎందుకు బతుకుతోంది. తెలంగాణలో ఆత్మహత్యల పరిస్థితి, నిరుద్యోగ శాతం ఎంత పెరిగిందో కూడా కేంద్ర నివేదికలలో ఉంటుంది కదా! దాని గురించి ఎందుకు రాయలేదు? కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక కారణం కాదా?. టీపీపీఎస్సీ లో జరిగిన గందరగోళం గురించి ఎన్నడైనా ఈ పత్రిక ధైర్యంగా కేసీఆర్‌ను విమర్శిస్తూ వార్తలు ఇచ్చిందా? ✍️ఏపీలో అసలు ఉద్యోగాలే లేనట్లు, పరిశ్రమలే రానట్లు ఈనాడు గుడ్డిగా రాసినంత మాత్రాన ప్రజలంతా గుడ్డివాళ్లుగా ఉండరు. పుంగనూరులో నాలుగువేల కోట్లతో విద్యుత్ బస్ ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతుంటే దానిని చెడగొట్టడానికి ఈనాడు ఎంతలా ప్రయత్నిస్తోంది కనిపించలేదా? అక్కడ కొద్ది మంది రైతులు తమ భూములు ఇవ్వబోమని చెబుతున్నారట. అయినా ప్రభుత్వం వారినుంచి స్వాధీనం చేసుకుంటోందని ఇదే పత్రిక రాసింది. ✍️పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా రాకుండా చేయాలా అని భూములు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టాలని ఒక వైపు, పరిశ్రమలు రావడం లేదని మరో వైపు ప్రచారం చేస్తూ ఈనాడు నికృష్టమైన రీతిలో వ్యవహరిస్తోంది. డిసెంబర్ ఆరో తేదీ ఈనాడు మొదటి పేజీ చూస్తే ఆ పత్రిక ఎంత రోతగా తయారైంది అర్ధం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు 31 వేల కోట్ల రూపాయల అంచనాకు కేంద్రం ఒకే చేస్తే దాని గురించి రాయకుండా, ఎవరో అధికారి ఏదో అన్నారని పెద్ద అక్షరాలతో ఎల్లో మీడియా రాస్తుంది. నిత్యం ఈనాడుది ఇదే రొద, ఇదే సొద. వీటన్నిటికి ప్రభుత్వం సిద్దపడాల్సిందే. ఎందుకంటే నిజంగానే ఈనాడు తదితర ఎల్లో మీడియా వారు దుష్టులుగా మాత్రమే కాదు.. ఏపీ ప్రజలకు శత్రువులుగా మారారు కనుక. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: దిగజారుడు అబద్ధాన్ని జనం నమ్ముతారనేనా! -
అక్కడకంటే.. ఇక్కడే తక్కువ
సాక్షి, అమరావతి: తెలంగాణతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నమ్మించబోయిన ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. మన రాష్ట్రంలో స్పినింగ్ మిల్లులకు తెలంగాణకంటే తక్కువకు విద్యుత్ సరఫరా చేస్తున్నా, అక్కడే తక్కువంటూ ఓ తఫ్పుడు కథనం ఇచ్చింది. ‘చిక్కుల్లో దారం.. సర్కారు చోద్యం’ శీర్షికన సోమవారం ఈనాడు ప్రచురించిన కథనం పచ్చి అబద్దమని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మాజనార్ధనరెడ్డి చెప్పారు. ‘స్పిన్నింగ్ మిల్లులకు గతంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండేది. ఇప్పుడూ అదే రేటు వసూలు చేస్తున్నాం. యూనిట్‌కి రూ.8.35 వసూలు చేస్తున్నారని ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. ఇది ఈనాడు పత్రిక అవగాహన లేమికి నిదర్శనం. ఇలాంటి అసత్య కథనాలు విద్యుత్ సంస్థలు, పారిశ్రామిక వినియోగదారుల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తాయి. నిజానికి రాష్ట్రంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండగా తెలంగాణలో యూనిట్‌కు రూ.7.15 పైసలు వసూలు చేస్తున్నారు. ఇది తెలంగాణకంటే తక్కువకు సరఫరా చేస్తున్నట్లా? ఎక్కువకా? ఇలా తప్పుడు కథనాలతో ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? కేవలం స్పిన్నింగ్ మిల్లులకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఆ పరిశ్రమలపై ఏమాత్రం భారం లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.5.85 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. అలాగే విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలు, ఆదేశాల మేరకు వసూలు చేస్తాము. స్పిన్నింగ్ మిల్లులు మూతపడటానికి విద్యుత్ చార్జీల భారమే కారణమనడం కూడా సత్యదూరం. వాస్తవానికి ముడిసరుకు అందుబాటులో లేకపోవడం, మార్కెట్ దెబ్బతినడం, ఇతర దేశాల్లో యుద్ధ, అనిశ్చితి పరిస్థితులు, ఆర్ధిక ఇబ్బందులు వంటి కారణాలు స్పిన్నింగ్ పరిశ్రమల మనుగడపై ప్రభావం చూపి ఉండవచ్చు. దీనికి కరెంటు బిల్లులను ముడిపెట్టి రామోజీ తన పత్రికలో అర్ధం లేని కథనం ప్రచురించారు’ అని ఆయన తెలిపారు. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
Fact Check: ఆర్టీసీపై ఇవేం అబద్ధాలు రామోజీ.. వాస్తవాలు ఇవిగో..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్‌పై ‘ఈనాడు’ విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరో మారు తన నైజాన్ని చాటుకున్నారు. ఆర్టీసీకి ప్రతీ నెలా రూ.275 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్న ప్రభుత్వంపై ‘డొక్కు బస్సులే దిక్కా’ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన అవాస్తవ కథనాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. 2020 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు రూ. 11,711 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా సమయంలో దేశంలోని అన్ని ఆర్టీసీల ఉద్యోగులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతోనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాలంలో ఆకలితో అలమటించే పరిస్థితి తప్పింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఏపీఎస్ ఆర్టీసీలో 693 కారుణ్య నియామకాలు జరిగాయి. విలీనం వల్ల ఏపీఎస్ఆర్టీసీలోని ఖాళీల మేరకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా మరణించిన కుటుంబాలకు కారుణ్య ఉపాధి లభించింది PRC-2022 అన్ని ఇతర ప్రభుత్వ శాఖలతో సమానంగా అమలు చేయబడింది. విలీనం కారణంగా ఇప్పటి వరకూ 2,760 కోట్ల అప్పు తీరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ అత్యుత్తమ సేవలు అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 4,781 కోట్లు. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 5,574 కోట్లు. దసరా,సంక్రాంతి పండుగల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే ఆదాయం వచ్చింది. 2019-20 సంవత్సరంలో 406 కొత్త బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీ.. పాత బస్సుల స్థానంలో 900 కొత్త డీజిల్ అద్దె బస్సులను ప్రవేశపెట్టింది. తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి సమీప నగరాలకు నడపడానికి 2022-23లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కొత్తగా 1,500 డీజిల్ బస్సుల కొనుగోలు పురోగతిలో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తైన 214 బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. 2024 మార్చిలోపు మరో 52 బస్సులను రద్దు చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రజల రవాణా కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అధ్వాన్న స్థితిలో నడుపుతోందని చెప్పడం సరికాదు. ప్రస్తుత సంవత్సరంలో ప్రజల ఆదరణ పెరిగింది. గతేడాది కంటే169 కోట్ల మేర అదనపు రాబడి వచ్చింది. డిపోలకు విడిభాగాల సరఫరాపై ఖర్చు భారీగా తగ్గిందని చెప్పడం సరికాదు. 2019-20 సంవత్సరంలో 163.11 కోట్లు చేసిన ఆర్టీసీ.. 2020-21 సంవత్సరంలో 91.65 కోట్లు, 2021-22 సంవత్సరంలో 168.51 కోట్లు, 2022-23 సంవత్సరంలో 231.29 కోట్లు విడిభాగాల సరఫరా కోసం ఆర్టీసీ ఖర్చు చేసింది. 110 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్ల పునరుద్ధరణ,కొత్త డిపోల నిర్మాణం ఆర్టీసీ చేపట్టింది. గతంతో పోలిస్తే ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని చెప్పడం సరికాదు.. 2019-20 లో జరిగిన ప్రమాదాలు 974.. 2020-21లో జరిగిన ప్రమాదాలు 392.. 2021-22 లో జరిగిన ప్రమాదాలు 617.. 2022-23 లో జరిగిన ప్రమాదాలు 907. ఈ నెల 6వ తేదీన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన ఘోర ప్రమాదంపై చర్యలు తీసుకున్నాం. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల కమిటీ విచారణ చేపట్టింది. డ్రైవర్ గేర్‌ను తప్పుగా ఎంచుకోవడం, యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదించింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు.. ఒకరికి గాయాలయ్యాయి. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేశాం. డ్రైవర్‌కు తగిన శిక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారనే కారణంతో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ను సస్పెండ్ చేశాం. మృతులకు ఒక్కొక్కరికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. గాయాలపాలైవన వారి పూర్తి వైద్య సంరక్షణ బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుంది. ఆర్టీసీ బస్టాండ్ లో ప్లాట్ ఫారానికి ఆనుకుని ఉన్న ప్రతి బస్ బేకు స్టాపర్ వాల్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆర్టీసీ పేర్కొంది. అసత్యాన్ని ప్రచురించడం బాధ్యతారాహిత్యమే కాకుండా సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఆర్టీసీ సంస్థతో పాటు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచురించి, సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ హెచ్చరించింది. చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే.. -
అమర్త్యసేన్ ఆరోగ్యంగానే ఉన్నారు
ప్రముఖ ఆర్తికవేత్త, నోబెల్ గ్రహీత.. భారతరత్న అమర్త్య సేన్(89) కన్నమూశారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కాస్త ఆంగ్ల మీడియాలో టెలికాస్టింగ్ దాకా వెళ్లింది. అయితే.. అదంతా ఫేక్ సమాచారం అని ఆయన కూతురు నందనా సేన్ స్పష్టత ఇచ్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీగా ఉన్నారంటూ కూతురు నందనా దేబ్ సేన్ స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన కుటుంబంతో కేంబ్రిడ్జిలో వారంపాటు గడిపారని, హర్వార్డ్లో తరగతులు చెప్పడంలో మునిగిపోయారని ఆమె వెల్లడించారు. Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్(2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత కూడా).. తాజాగా తన ఎక్స్ అకౌంట్లో అమర్త్యసేన్ కన్నుమూశారని ట్వీట్ చేశారంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే.. అది ఫేక్ అకౌంట్ అని తర్వాతే తేలింది. హర్వార్డ్ యూనివర్సిటీలో చదివిని అమర్త్య సేన్ కూతురు నందనా దేవ్ సేన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే కాదు.. బాలల హక్కుల ఉద్యమకారిణి కూడా. -
చట్టం మీ చుట్టమా రామోజీ ?
-
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్‌డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు
ప్రసార మాద్యమాలలో అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడం ఎలా?.. అన్నది నేర్చుకోవాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పాలో అయితే సరిపోతుంది. ఒకప్పుడు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈనాడు పత్రికలో రాసుకునేవారు. కాని వారు అసలు హృదయం, ఆత్మ రెండూ లేకుండా రోజూ పచ్చి అబద్దాలను రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విషం కక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు.. ✍️ బుధవారం నాడు ఈనాడులో వచ్చిన కధనం చూడండి. విజయవాడ మెట్రోకి ఉరి అని బానర్ కధనాన్ని ఇచ్చారు. ఆ వార్త మొత్తం చదివితే ఈనాడు రాతలు ఎంత విషపూరితమో, వికృతమో అర్ధం అయిపోతుంది.విజయవాడ నగరానికి మెట్రో రైలు వేసే అవకాశం పై పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు టైమ్ లోనే మెట్రో మాన్ గా పేరొందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆయన పరిశీలన చేసి విజయవాడకు ఇది వయబలిటీ కాదని స్పష్టం చేశారు.అయినా చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలను గమనించిన ఆయన చెప్పాపెట్టకుండా ఏపీ నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను మూలపడేసింది. అది నిజం. ఒకవేళ విజయవాడకు మెట్రో రైలు అవసరం అని, ఇప్పుడు హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు లలో ఉన్నంత జనాభా లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో పెరుగుతుందని ఈనాడు భావిస్తే తదనుగుణంగా వార్త ఇవ్వవచ్చు. లేదూ.. చంద్రబాబు పిలుపు మేరకు ప్రజలు ఇక పిల్లలను ఎక్కువమంది కంటారని ఈనాడు రామోజీరావు అనుకుంటే కూడా ఆ విషయమే చెప్పవచ్చు. అవేమీ కాకుండా గుడ్డ కాల్చి మీద వేసినట్లుగా ఈనాడు చెత్త కధనాన్ని వండి వార్చింది. ఆ కథనంలో ఇంతకీ విషయం ఏమిటంటే ఎనికే పాడు వద్ద గత ప్రభుత్వ హయాంలో 2017లో 3,272 గజాల స్థలం సేకరణకు ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చారట. దానిని ఇప్పుడు రద్దు చేశారట!!. ✍️ చంద్రబాబు ప్రభుత్వం 2017లో ముసాయిదా జారీ చేస్తే మరి ఆ తర్వాత రెండేళ్లు ఆయనే అధికారంలో ఉన్నారు కదా!. మరి ఎందుకు భూ సేకరణ చేయకుండా వదలివేశారు?. ఆ సంగతి మాత్రం రాయరు. పోనీ ఆ ఒక్క చోట భూ సేకరణ చేస్తే మెట్రో వచ్చేస్తుందా? అలాగే శ్రీధరన్ కమిటీ చెప్పిన విషయాలను ప్రస్తావించరు. 2019లోనే ముసాయిదా నోటిఫికేషన్ గడువు ముగిసిందని, అయినా దానిపై తగు నిర్ణయం చేయకపోవడం వల్ల స్థల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ అవసరమైతే సేకరిస్తామని జిల్లాకలెక్టర్ పేర్కొంటే దానిని వక్రీకరించి ఈనాడు ఈ వార్త ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ స్కీమ్ ఆగిపోతే ,దానిని జగన్‌కు అంటగట్టడమేమిటి?.. ✍️ విజయవాడ అంటే ఈ ప్రభుత్వానికి కక్ష అంటూ విద్వేషపూరిత కధనాన్ని ఇచ్చారు. విజయవాడలో కీలకమైన బెంజ్ సర్కిల్లో రెండో వంతెనను ప్రారంభించి ఈ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తే.. దానిని ఈ పత్రిక గుర్తించదు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన కనకదుర్గమ్మ గుడి వద్ద వంతెను జగన్ ప్రభుత్వం పూర్తికావిస్తే.. దానికి క్రెడిట్ ఇవ్వరు. కృష్ణానదిలో ప్రజల రక్షణార్దం ఒక భారీ వాల్ నిర్మిస్తుంటే అది వీరికి కనిపించదు. పైగా గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఆపివేయడం ,మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన ఎజెండాగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని నీచమైన వ్యాఖ్య చేశారు. ✍️ ఆ ప్రభుత్వం ఆరంభించిందేమిటి? వీళ్లు ఆపిందేమిటి? ఇలా రాసినవారు జర్నలిస్టులు అవుతారా? పార్టీ కార్యకర్తలు అవుతారా? రాజకీయపార్టీలవారు కూడా ఇంత ఘోరంగా అబద్దాలు చెప్పలేరేమో!. జార్ఖండ్ , ఒడిషాలలో కూడా మెట్రో ప్రతిపాదనలు లేవని, అవి వెనుకబడిన రాష్ట్రాలని ,వాటి సరసన ఏపీ చేర్చారని ఒక చెండాలపు కామెంట్. విజయవాడ కన్నా రాంచీ, భువనేశ్వర్ లు పెద్ద నగరాలు, అక్కడే ప్రాజెక్టు వయబిలిటి లేకపోతే ఇక్కడ ఎలా అవుతుందన్నది ప్రశ్న. ✍️ కోటి మంది ఉన్న హైదరాబాద్ లోనే మెట్రో భారీ నష్టాలను చవిచూస్తోంది. తమకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని మెట్రో కోరుతోంది. ఈ సంగతులు ఈనాడువారికి తెలియవా!. చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ ప్రధాన రహదారికి నలభై కిలోమీటర్ల దూరంలో పల్లెటూళ్లలో ఎందుకు పెట్టారు?ఆయన ఏకంగా అమరావతికి రైలు, అదేదో గొట్టపు రైలు ప్రాజెక్టు అని, బులెట్ ట్రైన్ అని చాలా చెప్పారు కదా!. మరి వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? టీడీపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన భూ సేకరణ అంతా పూర్తి చేసిందా? అదేమీ జరగలేదే? ఒక్క ఎనికేపాడులో అది కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. టిడిపి హయాంలోనే అది సాద్యం కాదని ప్రాజెక్టును పక్కనబెడితే, రాని ప్రాజెక్టు కోసం స్థల యజమానులు అటు భూమి లేక, ఇటు పరిహారం రాక ఇబ్బంది పడాలా? ✍️ ఈనాడు విలేకరి ఈ కథనంలో తన పైత్యం అంతా చూపించి చెత్త వార్తలు ఎలా రాయవచ్చో ప్రజలకు తెలియచేశారన్నమాట. ఈనాడు పత్రికలోనే అదే రోజు మార్గదర్శి ఆస్తుల అటాచ్ మెంట్ గురించి పెద్ద వివరణ ఇచ్చారు. వారు తమకు ఏ చట్టం వర్తించదని చెబుతున్నారు. తాము కార్పొరేట్ ఆఫీస్ కు తరలిస్తున్నది కంపెనీకి వచ్చే ఆదాయం అని బుకాయించే యత్నం చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు సెక్యూరిటీ కోసం చందాదారులు డిపాజిట్ చేస్తున్నారట. అసలు డిపాజిట్లే తీసుకోరాదని చట్టం చెబుతుంటే దానికి కొత్త భాష్యం. ప్రభుత్వ ఆర్ధిక ఆరాచకం అని నిత్యం రాసే ఈనాడువారు ముందుగా మార్గదర్శిలో అర్ధిక అరాచకం లేకుండా చూసుకుంటే మంచిది కదా!. అలాగే వేరే వారి భూమి డ్రాప్ట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడాన్ని తప్పుపడుతున్న ఈనాడు.. మార్గదర్శి ఆస్తుల విషయంలో మాత్రం ఎవరూ చర్య తీసుకోకూడదని అంటోంది. ఇతరుల ఆస్తి ఏమైపోయినా ఫర్వాలేదు తమ ఆస్తుల జోలికి రావద్దని ఈనాడు అంటున్నట్లుగా ఉంది. తమను ప్రశ్నించరాదని, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామని ఈనాడు రామోజీ చెప్పగలుగుతున్నారంటే అది ఆయనకే చెల్లుతుందనుకోవాలి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘ఈనాడు’పై వివేకా పీఏ ఫైర్
సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా? -
జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ దినపత్రిక అసత్యాలతో దుష్ప్రచారం సాగిస్తోందని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘విద్యా కానుక బూట్లు కాళ్లకు పట్టవు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని ఖండించింది. ‘ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేముల కోట జడ్పీ ఉన్నత పాఠశాలను ఈనెల 15న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. 7వ తరగతికి వెళ్లి విద్యార్థులు ధరించిన షూలను పరిశీలించారు. కొంత మంది విద్యార్థులు షూ ధరించలేదు. ఇందుకు వారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోవడంతో వారికి ఇచ్చిన షూలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. జి.సందీప్ కుమార్, కె.శివపార్వతి ఇళ్ల వద్ద ఉన్న వారి షూలను పరిశీలించారు. అవి ఆ విద్యార్థులకు సరిగ్గా సరిపోయాయి. ఎలాంటి డ్యామేజీ కూడా లేదు. దీంతో ఆ షూలను విద్యార్థులకు తొడిగించారు. ప్రతి రోజూ పిల్లలతో షూ ధరింపచేసి స్కూళ్లకు పంపాలని వారి తలిదండ్రులకు సూచించారు. ఆ తర్వాత ఆ పిల్లలను తన వెంట స్కూలుకు తీసుకెళ్లారు. అక్కడి టీచర్లతో సమావేశమై 100 రోజుల పాటు అలవాటు చేస్తే విద్యార్థులు తప్పకుండా షూ వేసుకొని వస్తారని సూచించారు. ప్రకాశం జిల్లాలో 21 వేల మంది విద్యార్థులకు సంబంధించిన షూ లను ఎక్స్ఛేంజ్ చేసి అందించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని స్కూళ్ల హెచ్ఎంల నుంచి విద్యార్థులందరికీ షూలు సరిపోయాయని డిక్లరేషన్ కూడా తీసుకుంది. ఈ వాస్తవాలను విస్మరించి, విద్యా కానుక బూట్లు విద్యార్థులకు పట్టవు అంటూ ‘ఈనాడు’ అసత్యాలతో వార్త ప్రచురించడం దారుణం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఈనాడు తప్పుడు కథనాలపై దేవులపల్లి అమర్ ఫైర్..
సాక్షి, అనంతపురం: ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫొటోలను ప్రచురించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని రామోజీ రావు కుట్ర పన్నినట్లు తెలిపారు. 151 స్థానాలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రతి రోజూ ప్రయత్నిస్తోందని అమర్ మండిపడ్డారు. పట్టాభి విషయంలో పాత ఫోటోలను ప్రచురించి.. ఆ తర్వాత చింతిస్తున్నామంటూ సవరణ రాసిన ఈనాడు వైఖరి సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని.. ఏ ఒక్క రోజూ ఎల్లో మీడియా మంచిని చూడలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, దేశరాజకీయాలు తన చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ కోరుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: 'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?' -
ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ మండిపడ్డారు. రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలను సత్వరమే అందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలతో లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘రైతుకు భరోసా ఏది’.. శీర్షికతో ప్రచురించిన వార్తను తీవ్రంగా తప్పుబట్టారు. చదవండి: Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్‌గా తీసుకుని అమలుచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి నాణ్యమైన ఉత్పాదకాలు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని వాటి ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశాం. ♦1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించాం. ♦ఎరువుల లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోంది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయింది. ♦ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ, 2,356 ఉద్యాన, 378 మంది పట్టు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా చర్యలు చేపట్టాం. ♦9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ♦ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ♦4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. ♦34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాం. ..ఇలాంటివెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నా ‘ఈనాడు’ పత్రిక వాటిని పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని హరికిరణ్ హితవు పలికారు. -
విశాఖ రైల్వే జోన్ తధ్యం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్ ప్రభుత్వంపై వివక్షపూరిత కథనాలు