సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్‌సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.
తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
Comments
Please login to add a commentAdd a comment