వైఎస్ జగన్‌పై పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలపై చర్యలు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల వెల్లువ
సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, వేధింపులు మానాలని పోలీసులకు వినతులు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్య పోస్టులు పెడుతున్న టీడీపీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులు, వేధింపులు నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం పోలీసులకు ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేశారు. విశాఖ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజితకు ఆ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్‌రాజు ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అదనపు ఎస్పీ భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డీఎస్పీ కార్యాలయంలో, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఫిర్యాదు చేశారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తూ..
కూటమి ప్రభుత్వం చేపట్టిన సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌కు ఆ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు తదితరులు వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్‌పై అసభ్య పోస్టులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీకి ఆ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మెంటాడ పద్మావతి ఫిర్యాదు చేశారు.
ఇవే అంశాలపై ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి డీఎస్పీ కార్యాలయంలోను, నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీకి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల బీజేంద్ర, ఎమ్మెల్సీ ఇసాక్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు సీపీకిు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్న హనిమిరెడ్డిలు ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు.
అక్రమ కేసులు, అరెస్టులపై ఫిర్యాదులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి టీడీపీ అధికారిక వెబ్‌సైట్లు, సోషల్ మీడియాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూనే.. మరోపక్క సోషల్ మీడియా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని గర్హిస్తూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి శ్రీనివాస్, నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఇవే అంశాలపై వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment