
సాక్షి, అనంతపురం: పోలీసులపై తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడుపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. తప్పుడు కథనాలపై వివరణ కోరేందుకు ఫకీరప్ప.. బుధవారం ఈనాడు కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి నోటీసులు అందజేశారు.
అయితే, ఇటీవల ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాశ్‌పై ఇది వరకే పలుమార్లు సస్పెన్షన్ వేటు పడింది. అయినప్పటికీ ప్రకాశ్‌ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోగ్రామ్ సందర్భంగా ప్రకాశ్ నిరసన వ్యక్తం చేసినందుకే కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేశారని ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. అంతేకాకుండా పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ వార్తలు రావడంతో వివరణ కోరేందుకు ఈనాడు కార్యాలయానికి వెళ్లిన ఫకీరప్ప సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment