సాక్షి, అనంతపురం: ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫొటోలను ప్రచురించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని రామోజీ రావు కుట్ర పన్నినట్లు తెలిపారు.
151 స్థానాలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రతి రోజూ ప్రయత్నిస్తోందని అమర్ మండిపడ్డారు. పట్టాభి విషయంలో పాత ఫోటోలను ప్రచురించి.. ఆ తర్వాత చింతిస్తున్నామంటూ సవరణ రాసిన ఈనాడు వైఖరి సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని.. ఏ ఒక్క రోజూ ఎల్లో మీడియా మంచిని చూడలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, దేశరాజకీయాలు తన చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ కోరుకుంటారని దుయ్యబట్టారు.
చదవండి: 'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?'
Comments
Please login to add a commentAdd a comment