devulapalli Amar
-
ఏపీ ఎన్నికల ఫలితాలు,సర్వేలపై దేవులపల్లి అమర్ కామెంట్స్
-
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
-
సునీత వ్యాఖ్యల పై దేవులపల్లి అమర్ విశ్లేషణ
-
చంద్రబాబు,పురందేశ్వరికు దేవులపల్లి అమర్ కౌంటర్
-
ఫీల్మ్ సిటీలో ప్రమాదంపై రామోజీకి దేవులపల్లి అమర్ కౌంటర్
-
రేవంత్ రెడ్డి నీకు ఆ దమ్ముందా..? దేవులపల్లి అమర్ కౌంటర్
-
మీ నాన్నపై అంత పెద్ద కేసు...దేవులపల్లి అమర్ కామెంట్స్
-
ఎల్లో మీడియాపై దేవులపల్లి అమర్ కామెంట్స్
-
Delhi: సీఎం జగన్ దినచర్య డైరీ.. ‘ప్రతి దినం ప్రజాహితం’ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించిన "ప్రతిదినం ప్రజాహితం" వికాస వార్షిక-4వ సంవత్సరం ముఖ్యమంత్రి రోజువారి కార్యక్రమలను తెలియజేసే దినచర్య డైరీని గురువారం ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్లో ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ సీఎం జగన్ రోజువారీ అధికారిక కార్యక్రమాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో, సంకలనం చేసిన విధానం, జాతీయ మీడియా సలహాదారు కార్యాలయం దానిని డైరీ రూపంలో ప్రచురించడం అభినందనీయం అని అన్నారు. తన కార్యాలయ రోజువారీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి దినచర్యను కూడా అనుసరిస్తూ ఒక బాధ్యతగా తీసుకుని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ డైరీ ని రూపొందించడం జరుగుతున్నది అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ డైరీ ముద్రణకు సహకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పుస్తక రచయిత పాలెపు రాజశేఖర్‌లను సలహాదారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ బీఎస్ రామకృష్ణ, ఎపీఆర్వో కే. గురవయ్య పాల్గొన్నారు. -
‘శ్రీనివాస్‌రెడ్డి.. మీడియాపై చంద్రబాబు వేధింపులు మర్చిపోయారా?’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జర్నలిస్టుల గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కరెక్ట్ కాదు అంటూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సమస్యల గురించి శ్రీనివాస్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు. కాగా, దేవులపల్లి అమర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు చంద్రబాబును సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నారు. జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి. విజయవాడలో అఖిలపక్ష సమావేశం పత్రిక స్వేచ్ఛపై కాదు ప్రభుత్వాన్ని దూషించడానికే జరిగింది. జర్నలిస్ట్ సమస్యలకు రాజకీయ రంగు పులమొద్దు.. గాలికి మాట్లాడవద్దు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వాల పట్ల శ్రీనివాస్ రెడ్డి ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో నల్ల చట్టం తెచ్చింది శ్రీనివాస్ రెడ్డి మర్చిపోయారా?. తమకు అనుకూలంగా లేని మీడియాపై చంద్రబాబు వేధింపులు మర్చిపోయారా?. జర్నలిస్టులకు న్యాయం జరిగింది వైఎస్సార్ హయాంలోనే కదా. ఏపీ సర్కారుపై కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నది కనిపించడంలేదా? తెలంగాణలో జర్నలిస్ట్ ఇంటి స్థలాలపై సుప్రీం తీర్పు కూడా వచ్చింది. ఆలస్యం చేయకుండా జవహర్ హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు చనిపోయారు. వారి కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే ఆ భూములను జర్నలిస్టులకు అప్పగించాలి. జవహర్ సొసైటీ సభ్యులతో పాటుగా మిగతా జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలి అని తెలిపారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలు.. సజ్జల ఏమన్నారంటే.. -
ఎక్స్‌ట్రాలు వద్దమ్మా.. పవన్ కల్యాణ్‌కు ఎందుకంత దురద?
రాజకీయాల్లో కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఉంటుందని.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీనియర్ జర్నలిస్టు దేవుపల్లి అమర్ చురకలు అంటించారు. నాటకాలు, సినిమాల్లో కాసేపు కనిపించి మెరుపులా వచ్చి వెళ్లిపోయే అతిథి పాత్రలు ఉంటాయి. రాజకీయాల్లో అటువంటి పాత్రే పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలనివ్వను. మొత్తం అందరిని కలుపుకునిపోతాను. మళ్లీ జగన్మోహన్రెడ్డిని సీఎం కానివ్వను.. ఇది నా శాసనం. వారహిపై రాష్ట్రం అంతా తిరుగుతా అని చెప్పిన పవన్.. మళ్లీ మాయం అయిపోయాడు. రెండు, మూడు మాసాలు కనిపించలేదు. నిన్న మళ్లీ హఠాత్తుగా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన ఒక వ్యాఖ్యపై పలువురు ఏపీ మంత్రులు రియాక్షన్‌పై వీడియో చేశారు. మంత్రులు రియాక్ట్ కావడాన్ని పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్‌రావు ఏ సందర్భంలో ఆ వాఖ్యలు చేశారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇలా రియాక్ట్ కావాల్సింది కాదంటారు పవన్.. ముందు హరీష్‌రావు ఏ సందర్భంలో ఏం మట్లాడారో తెలుసుకుని పవన్ మాట్లాడితే బాగుండేది. రాజకీయాల్లో గెస్ట్ అప్పిరియన్స్లా ఉంటే ఇలానే ఉంటుంది. విషయాలు సరిగ్గా తెలియకుడా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. హఠాత్తుగా తెలంగాణ ప్రజలపై పవన్ కల్యాణ్ ప్రేమ కురిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఏపీ మంత్రులపై కన్నెర్ర చేస్తున్నాడు. హరీష్ వ్యాఖ్యలకు రియాక్షన్‌గా ఏపీ మంత్రులు వారి అభిప్రాయాలు వారు చెప్పారు. మధ్యలో పవన్ కల్యాణ్ వచ్చి ఏపీ మంత్రులే తప్పు చేశారన్నట్లు మాట్లాడుతున్నారు. కారణం ఉన్నా లేకపోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించాలన్నది పవన్ వైఖరిగా కనబడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తుకువచ్చాయి. గతంలో తెలంగాణ ప్రజల మనోభావాలను పవన్ కల్యాణ్ దెబ్బ తీశాడు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు, విభజన తర్వాత పవన్ ఏపీకి వెళ్లి అక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజుల పాటు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నానంటూ చేసిన వ్యాఖ్యల సంగతి ఆయన మరిచిపోయారా?. తెలంగాణ ప్రజల మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదా?. పవన్ కల్యాణ్‌ది అపరిపక్వ రాజకీయ పరిణితి. చదవండి: ఆయనే ఓ పెద్ద లాబీయిస్ట్.. దానికి తోడు పిచ్చి రాతలు పవన్ ఆలోచనలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడానికి కాదు.. ఆయన అవసరానికి మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానంటూ చంద్రబాబు తిరుగుతున్నాడు. ఆయనతో పాటు తెలంగాణలో లబ్ధి పొందడానికి తెలంగాణ భజన చేస్తున్న పవన్.. డ్రామాను తెలంగాణ, ఏపీ ప్రజలు అర్థం చేసుకోగలరని అమర్ అన్నారు. -
ఈనాడు తప్పుడు కథనాలపై దేవులపల్లి అమర్ ఫైర్..
సాక్షి, అనంతపురం: ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫొటోలను ప్రచురించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని రామోజీ రావు కుట్ర పన్నినట్లు తెలిపారు. 151 స్థానాలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రతి రోజూ ప్రయత్నిస్తోందని అమర్ మండిపడ్డారు. పట్టాభి విషయంలో పాత ఫోటోలను ప్రచురించి.. ఆ తర్వాత చింతిస్తున్నామంటూ సవరణ రాసిన ఈనాడు వైఖరి సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని.. ఏ ఒక్క రోజూ ఎల్లో మీడియా మంచిని చూడలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, దేశరాజకీయాలు తన చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ కోరుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: 'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?' -
పెట్టుబడులకు ఏపీ అనుకూలం - దేవులపల్లి అమర్
కొచ్చి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. శనివారం కొచ్చిలోని లేమెరిడియన్ లో జరిగిన మల్నాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ - ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. పారదర్శకంగా ఈ విధానం అమలవుతున్నందున పారిశ్రామికవేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అదేవిధంగా రైతులు, ఉత్పత్తిదారులకు లాభం కలిగే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అమర్ చెప్పారు. మల్నాడు టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్ జయేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు అద్భుతమని అభినందించారు. జర్నలిజం రంగంలో చేసిన సేవలకు టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022 పురస్కారాన్ని అమర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వీబీ రాజన్, అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కరోనా బారినపడి అనేకమంది జర్నలిస్టులు చనిపోయారు
-
ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నేతృత్వంలో రచించిన ‘ప్రతి దినం ప్రజాహితం' పుస్తకాన్ని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఏడాదికాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే వైఎస్ జగన్ 90శాతం హామీలను అమలు చేశారని అభినందించారు. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అమర్, విజయమ్మతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాతో ఎన్నో అనర్థాలు
విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోకవరం (జగ్గంపేట): విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజే యూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ, నేటి సమాజంలో సోషల్ మీడియా విస్తృతమైందన్నారు. సమాచారం వేగంగా అందజేయాలనే తపనలో మీడియా విశ్వసనీయతే ప్రమాదంలో పడిందన్నారు. సోషల్ మీడియా అసలు మీడియానే కాదన్నారు. పత్రికారంగంలో వేగం మంచిదే కానీ, ఆ తొందరలో పొరపాట్లకు తావీయకూడదని సూచించారు. మీడియాకు సామాజిక బాధ్యత ఉందని, ప్రతి అంశాన్నీ పరిశోధించి, వాస్తవాలను ప్రజల ముందుంచుతుందని చెప్పా రు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రెస్ అకాడమీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే ప్రెస్ అకాడమీకి చైర్మన్‌ను నియమించారని, త్వరలో సభ్యులను నియమించి విధివిధానాలను సిద్ధం చేస్తారని చెప్పారు. గతంలో ఓ వార్తను పత్రికా ప్రచురణ సంస్థకు పోస్టల్లో పంపించేవాళ్లమని, ఆ కవరు మూడు రోజుల తరువాత అందేదని, ఆ వార్త ప్రచురితమైన మూడు రోజుల తరువాత ఆ పత్రిక పట్టణాలకు చేరేదని పాత రోజుల పాత్రికేయ వృత్తిని గుర్తు చేశారు. తరువాత బస్సులు వచ్చాక, బస్సు డ్రైవర్‌కు రెండు రూపాయలు ఇచ్చి పంపించేవాళ్లమని, దీంతో వార్తల వేగం కొద్దిగా పెరిగిందని, ఇలా క్రమేపీ తన వేగా న్ని పెంచుకుంటూ నేడు జెట్ స్పీడుకు చేరిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తోందని, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చేస్తున్నాయని, దీంతో పత్రికల్లో తరువాత రోజు వచ్చిన వార్త పాచి వార్తగా తయారవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పత్రికలు అదే విషయాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి పోటీ పడుతున్నాయని, ఇది చాలెంజ్‌గా తయారైందని అమర్ అన్నారు. ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు బాధ్యత మీడియా పైనే ఉందని అన్నారు. గ్రామీణ పాత్రికేయులు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలుత కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండి, సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాత్రికేయులు కృషి చేస్తున్నారన్నారు. పాలనా వ్యవస్థలోని నాలుగు ఎస్టేట్లలో పత్రికా రంగం ఒక భాగమన్నారు. ప్రజలకు మరిన్ని సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయులు సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ అస్మీ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఏపి బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, చట్టాలపై పాత్రికేయులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదిత్య విద్యాసంస్థల తరఫున పాత్రికేయులకు జర్నలిజంపై శిక్షణ ఇచ్చేందుకు సహకారం అందిస్తామన్నారు. ఈ శిక్షణను ఐదు జిల్లాల్లోని తమ కళాశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ తదితరులు కూడా ప్రసంగించారు. అనంతరం దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డిలను నల్లమిల్లి శేషారెడ్డి, సతీష్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్మూర్తి తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు డీఎస్ఎస్ రామాంజనేయరావు, జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు పాల్గొన్నారు. -
ఇరువురు చంద్రులూ చింతాక్రాంతులే
తెలుగు రాష్ట్రాల సీఎంలకు అంతుబట్టని రాజకీయం ఇప్పుడు నడుస్తున్నట్లుంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీపై ఈగవాలినా సహించని వీరభక్తుడిలా ఉండిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడేమో ఈ దేశాన్ని మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడటానికి బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తానని దేశమంతా తిరుగుతున్నారు. మరోవైపున కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్ష పార్టీలను కూడగట్టే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరికెన్ని స్థానాలు వస్తాయో తెలీని స్థితిలో తెలుగు సీఎంల దేశ పర్యటనలు.. తమకు రేపు ఏమవుతుందన్న ఆందోళన ఫలితమే అని జనాభిప్రాయం. ‘‘మన దేశంలో ఇప్పటివరకు ఇంత గొప్ప ప్రధానమంత్రి ఎవరూ లేరని నేను కచ్చితంగా చెప్పగలను అధ్యక్షా’’అని ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నరేంద్రమోదీని వేనోళ్ళా పొగుడుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ఈ దేశాన్ని, వ్యవస్థలనూ, ప్రజాస్వామ్యాన్నీ మోదీ కబంధ హస్తాల నుంచి కాపాడటానికి బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తానని ప్రత్యేక విమానం వేసుకుని పిలవని పేరంటానికి దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల్లో మోదీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం బీజేపీని ఎక్కడా పల్లెత్తు మాట అనకపోవడం (కాంగ్రెస్ నాయకులూ, వారి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయం గమనించారో లేదో పాపం). చంద్రబాబుకు బీజేపీతో ఏ తగాదా లేదు, ఇప్పటికింకా ఆయన బీజేపీ మిత్రుడే. మోదీ, అమిత్ షా లేని.. వెంకయ్య నాయుడు, గడ్కారిలు ఉన్న బీజేపీ ఆయనకు కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్న ముగిసి ఇంకా ఫలితాలు వెలువడని లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చంద్రబాబు సూచించిన విధంగా వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకే కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారని ఆ పార్టీ రాష్ట్ర నేతలే ప్రైవేటు చర్చల్లో చెపుతున్నారు. చంద్రబాబు కూడా తన పార్టీ సహచరులతో ప్రైవేటు చర్చల్లో కేంద్రంలో మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్తున్నారు తప్ప ఆ ‘మన’ ఎవరు అనే స్పష్టత ఇవ్వడం లేదట. దానితో తెలుగు తమ్ముళ్ళు బయటికొచ్చి ఈ ‘మన’కు రెండు మూడు అర్థాలు ఊహించుకుంటూ ఉన్నారట. ఒకటేమో అందరూ నేనంటే నేను అని కొట్లాడుకొని కాంప్రమైజ్ అభ్యర్థిగా మన బాబు గారినే ప్రధాన మంత్రిని చేస్తారేమో, అందుకే ఆయన మన ప్రభుత్వం అని చెప్పారు. పైగా మన పత్రికలూ, చానళ్ళు కూడా రాశాయి, మాట్లాడాయి కదా చంద్రబాబే ప్రధాని అని. రెండవది బీజేపీ నాయకత్వంలోనే మోదీ లేని ప్రభుత్వం ఏర్పడితే అది మనదే కదా అని. మూడోది బీజేపీయేతర కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చినా మన ప్రభుత్వమే కదా అని. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు ఫలానా అన్నట్టుగా ఉంది ఈ ఊహాగానాలన్నీ వింటుంటే. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏ మాత్రమూ కనిపించడం లేదు. దేశమంతటా సర్వేలన్నీ ఘోషించడం ఒక ఎత్తు అయితే ఈవీఎంల మీద చంద్రబాబు చేస్తున్న యాగీ స్పష్టం చేస్తోంది ఆయన అధికారాన్ని కోల్పోబోతున్నారని. ఒక్క ఆఖరి మంత్రివర్గ సమావేశం అయినా నిర్వహించి తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఆయన పడ్డ తిప్పలు కూడా స్పష్టం చేస్తూనే ఉన్నాయి ఆయన అధికారంలోకి రాబోవడం లేదని. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఖాయం అని తెలిశాక కనీసం కేంద్రంలో మోదీని నిలువరించడం మీద దృష్టి పెట్టాలన్నది బాబు పట్టుదల. రాజకీయ ప్రత్యర్థుల పట్ల మోదీ, అమిత్ షా ద్వయం ఎట్లా వ్యవహరిస్తారో పొరుగు రాష్ట్రం తమిళనాట శశికళ ఉదంతం ఒక మంచి ఉదాహరణ. మోదీ కేంద్రంలో మళ్ళీ రాకూడదు అనడానికి బాబు చెప్తున్న దేశ సమగ్రత, వ్యవస్థల సంరక్షణ వంటివేవీ కారణాలు కాదు. మళ్ళీ మోదీ వస్తే తాను స్టేల మీద కాలం వెళ్ళదీస్తున్న కేసులన్నీ తెరిపించి జైలుపాలు చెయ్యడం ఖాయం అన్న భయంతోనే ఆయన మోదీ వ్యతిరేక జపం మొదలు పెట్టారు. అయినా మోదీని నిలువరించడం గానీ, కాంగ్రెస్ కూటమిని గద్దె నెక్కించడంగానీ బాబువల్ల అయ్యే పనేనా? కూట్లో రాయి ఏరలేని వాడు ఏట్లో రాయి ఏరతానన్నాడనే సామెత బాబుకు బాగా వర్తిస్తుంది. ఏపీలో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలు. అందులో ఆయన పార్టీ ఎన్ని గెలవబోతుందో ఆయనకే తెలియదు. తాను వేసిన ఓటు తనకు పడిందో లేదో తెలియని అయోమయం తనది. ఇదంతా చూస్తుంటే 1989లో జరిగిన ఎన్నికల తదనంతర పరిణామాలు గుర్తొస్తున్నాయి. అవి బాబుకు గుర్తు లేవని ఎట్లా అనుకుంటాం. 1989 ఎన్నికలకు ముందు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే బోఫోర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశమంతా పర్యటించి ప్రచారం చేశారు. ఫలితాలు చూస్తే నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడి పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో చిత్తుగా ఓడిపోయింది. 42 లోక్‌సభ స్థానాలు ఏపీలో ఉంటే రెండు మాత్రమే తెలుగుదేశంకు దక్కాయి. నేషనల్ ఫ్రంట్‌లో భాగం అయిన వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ఫ్రంట్ అధ్యక్షుడయిన ఎన్టీఆర్ వైపు కన్నెత్తి అయినా చూసిందా? నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా గౌరవం ఇవ్వకపోతేపోయారు కనీసం టీడీపీ ఎంపీ పర్వతనేని ఉపేంద్రను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్న సమాచారం అయినా ఇచ్చారా టీడీపీ అధ్యక్షుడికి? కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్ధాంతాలు, నైతిక విలువలు ప్రధానం.. అంకెలు కాదు అనుకోవడానికి ఇది వాజ్‌పేయి జమానా కాదు మోదీ కాలం అని చంద్రబాబుకు తెలియదా? కొనగలిగి ఉండి కూడా ఒక్క ఓటు తక్కువయిందని అధికారాన్ని వదులుకున్న వాజ్‌పేయితో ఇప్పటి నాయకులను ఎట్లా పోల్చగలం? రాష్ట్రంలో అధికారం కోల్పోయి, సంఖ్యాపరంగా లోక్‌సభలో తగిన బలం లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? అన్నీ 1996 రోజులు కావు కదా. అప్పుడంటే మామ దగ్గరి నుంచి లాక్కున్న అధికారం ఉంది, ఆయన మృతి వల్ల కలిసొచ్చి గెలిచిన లోక్‌సభ స్థానాల సంఖ్యా ఉంది. ఇప్పుడవి ఉంటాయన్న గ్యారంటీ ఉందా? ఇంకెంత.. 23వ తేదీ దాకా ఆగితే తెలిసిపోతుంది. మరి చంద్రబాబు జాతీయ రాజకీయాల విషయంలో ఎందుకిన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ స్థితి నుంచి తనను తాను బయట పడేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. రాష్ట్రంలో అయిదేళ్ళు అధికారం గ్యారంటీ అయిన తెలంగాణా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తీవ్ర ఆందోళన లోనే ఉన్నారు. గుళ్ళూ గోపురాలు తెగ చుట్టేస్తున్నారు. ఇంటర్వెల్లో రాజకీయ నాయకులను కలుస్తున్నారు. ఎక్కడా ఆయనకు అనుకూలమయిన హామీ లభించడం లేదు. మొన్ననే అంటే గతేడాది డిసెంబర్ లోనే కదా రెండో సారి మంచి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ఏలుతుంటే ఆయనకు ఆందోళన ఎందుకు అనొచ్చు ఎవరయినా. ఎందుకో చూద్దాం. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటయి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు సాధించుకోవడం తన లక్ష్యం అన్నది ఆయన చెపుతున్న మాట. కానీ ఆయన కూడా చంద్రబాబు లాగానే బయటికి చెపుతున్నది ఈ మాట అయితే అసలు మనసులో ఉన్నది వేరే ఆందోళన. ఓ ఏడాది కిందట ఆయన ఫెడరల్ ఫ్రంట్ రాగం మొదలు పెట్టగానే అందరూ కేసిఆర్ కేంద్రంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం కోసమే కొన్ని పార్టీలను జమ చేసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బయలుదేరాడని అన్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఈ ఫ్రంట్‌లోకి ఎన్డీఏలో లేని పక్షాలనే తెచ్చే ప్రయత్నం చేయడాన్ని చూపారు. నిజమే మొన్నటిదాకా కేసీఆర్ కూడా మోదీ భక్తుడే. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మొదలయిన పలు నిర్ణయాలను బహిరంగంగానే సమర్ధించారు. అనాయాసంగా లభించే ప్రధాని అపాయింట్మెంట్లతో మోదీకి శాలువాలు కప్పి సన్మానించి వచ్చారు. లోక్‌సభలో రాష్ట్రంలోని 17కు 16 స్థానాలు సంపాదించి మోదీ జతన చేరి రాజ్యాన్ని, క్షమించాలి రాష్ట్రాన్ని, కొడుక్కు అప్పగించి ఢిల్లీకి మకాం మార్చాలనుకున్నారు. అందుకోసం తనకు రోజూ మందులు ఇచ్చే బంధువును రాజ్యసభ సభ్యుడిని చేశానని ఆయనే స్వయంగా చెప్పారు. ఎక్కడో మోదీతో స్నేహంలో తేడా వచ్చింది. తనతో సహా తన పార్టీకి చెందిన పలువురు ఎంఎల్ఏలకు ఆదాయపు పన్ను నోటీసులు రావడం మోదీతో సంబంధాలు చెడటమేనని అనుకుంటున్నారు. పనిగట్టుకుని నిజామాబాద్ నుంచి రైతులు వారణాసి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించడం వెనక కేసీఆర్ ఉన్నాడని మోదీ అనుమానిస్తున్నారు. వెరసి చంద్రబాబు అంత కాకపోయినా కేసిఆర్‌కు కూడా మోదీతో స్నేహంలో తేడా వచ్చినట్టే కనిపిస్తున్నది. ఈలోగా చంద్రబాబు కేంద్రంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శిబిరంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చెయ్యడంతో తానూ వెనక పడిపోతాననే ఆందోళన కేసిఆర్‌ది. మోదీ వ్యతిరేక కాంగ్రెస్ అనుకూల శిబిరంలో చంద్రబాబునాయుడు ఉంటే తనకు ప్రవేశం కష్టం అని కేసీఆర్ భావన. పైగా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో తానూ చేరితే తెలంగాణాలో తన ప్రధాన శత్రువు కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీలో ఏదో ఒక ప్రధాన పాత్ర లేకుంటే కొడుక్కు రాజ్యం అప్పగించి కాళ్ళు ఊపుకుంటూ కాలక్షేపం చెయ్యడం ఎలా అన్నది ఆయన ఆందోళన. అందుకే కుడి పక్కన బోయినపల్లి వినోద్ కుమార్, ఎడమ పక్కన జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను వెంట పెట్టుకుని ఎక్కి దిగే రాజకీయ గడపలు అన్నట్టు తిరుగుతున్నారు . కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాల్సిందే, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చి గౌరవంగా చూడాల్సిందే. దాని కోసం ఫలితాలవరకూ వేచి ఉండాల్సిందే కదా, ఎవరికెన్ని స్థానాలు లభిస్తాయో చూడాలి కదా. ఇద్దరు చంద్రులు ఇంత ముందు నుంచే ఆందోళన చెందితే ప్రయోజనం ఏముంటుంది? దేవులపల్లి అమర్ -
గాంభీర్యం మాటున ఓటమి భయం
ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని, ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్‌తో, ఇటు పవన్ కల్యాణ్‌తో, వీరూ సరిపోరని కేఏ పాల్‌తో కూడా లోపాయికారీగా పొత్తు కుదుర్చుకుని రహస్య ఎజెండాలతో గట్టెక్కాలని విఫలయత్నం చేస్తున్నా తన విజయంపై నమ్మకం కలగడం లేదు. అందుకే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా ఆయన మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్న బాబు చేస్తున్నది సంధిప్రేలాపనే. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్లో ఒక మంచి మాట చెప్పారు.. ‘ఓటమి తప్పనిసరి అని తెలిసిపోయినప్పుడు ఎంతటి అనుభవశాలి అయినా ఉలికిపడతాడు, వణికిపోతాడు, కాబట్టి చంద్రబాబునాయుడి ప్రస్తుత నిరాధార ప్రకటనల పట్ల నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు’ అని. ‘అయ్యా బిహార్ రాష్ట్రం పట్ల మీకున్న వ్యతిరేకతను చాటుకునే అభ్యంతరకర భాషను వాడటం కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీకు మళ్ళీ ఎందుకు ఓట్లు వెయ్యాలి అనే అంశం మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని కూడా పీకే (ప్రశాంత్ కిశోర్) చంద్ర బాబుకు హితవు చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో 60 ఏళ్ళుగా కష్టపడుతున్నానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వచ్చే మూడు వారాల్లో జరగబోయే ఎన్నికలలో ఘోర పరాజయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నట్టున్నది. అందుకే అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతు న్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేర రాజకీయాలు చేస్తున్నాడని, ప్రశాంత్ కిషోర్ బిహార్ బందిపోటు అని మొన్న ఒంగోలులో మాట్లా డుతూ అన్నారు. ఇదే కేసీఆర్ పార్టీతో పొత్తు కోసం తాను స్వయంగా వెంపర్లాడిన విషయం, ఇదే ప్రశాంత్ కిశోర్ తన తాజా మిత్రులు కాంగ్రెస్ వారి కోసం ఇటీవలే పంజాబ్ ఎన్నికల్లో పని చేసిన విషయం, అక్కడ పీకే టీం చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిన విషయం మరిచిపోయి మాట్లాడుతారు బాబు. మరిచిపోతారు అనడం కంటే జనమే అన్నీ మరిచిపోతారులే అనుకుని మాట్లాడుతారు అనాలి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా బాబు మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో పనులు చేస్తున్నారు. సౌమ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు కనీసం సంతాపం తెలపలేదు. పైగా తన ప్రభుత్వమే నియమించిన సిట్ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగానే వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డే చంపేశాడని బహిరంగ సభలో ఆరోపణ చేసి, అది జనం నమ్మాలని అనుకునే మనిషి చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర సీఎం ఇట్లా మాట్లాడితే దర్యాప్తు చేస్తున్న ఆయన కింది అధికారుల మీద ఆ మాటల ప్రభావం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ముద్రగడ ఆందోళన సందర్భంలో తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో, ఆ తరువాత విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద హత్యాప్రయత్నం సంఘటనలో కూడా ఆయన వాటిపట్ల కనీస విచారం వ్యక్తం చెయ్యక పోగా దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేశారు. తుని రైల్ ఘటనకు కడప రౌడీలు కారణం అని, విమానాశ్రయంలో దాడికి వైఎస్ఆర్సీపీ అభిమానే బాధ్యుడని, ఇప్పుడు వివేకానందరెడ్డిని జగన్ చంపేసాడని అలవోకగా అబద్ధాలు ఆడేస్తారు ఆయన. ఎన్ని అబద్ధాల యినా అది జనాన్ని నమ్మించాలి, అట్లాగే పదేపదే అవే అబద్ధాలు ఆడితే జనం నమ్మేస్తారు అన్నది ఆయన అభిప్రాయం. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది, జనం తనను నమ్మడం లేదు అని అర్థం అయి నట్టుంది బాబుకు. వియ్యంకుడు, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో తన ఇమేజ్ను గొప్పగా చూపించేందుకు ఓ సినిమా తీయించి అది జనానికి ఎక్కకపోవడంతో తన అసలు స్వరూపం బయటపెట్టే రాంగోపాల్ వర్మ సినిమా బయటికి రాకుండా చూడటానికి సకల ప్రయత్నాలు చేస్తున్నా రాయన. ఎన్నికల సముద్రంలో మునిగిపోతూ ఈ గడ్డిపోచను ఆధా రంగా పట్టుకొని ఈదాలనుకున్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. రాజకీయ జీవితంలో ఎన్నడూ తాను ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. ఈసారి మాత్రం బయటకి కనిపించడానికి ఒంటరిగా పోటీ చెయ్యక తప్పని పరిస్థితి. తమకు వ్యతిరేకులు అనిపించిన వారందరి ఓట్లూ తొలగించే ప్రయ త్నంతో బాటు, వాళ్ళను బెదిరించి, భయపెట్టి ఓట్లు వెయ్యకుండా చూసేందుకు పోలీసుల సాయంతో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు.. మరోవైపు రాజకీయ పక్షాలతో రహస్య ఒప్పందాలు. మొదటినుండి అన్ని ఎన్నికలలో స్నేహం చేసిన బీజేపీతో ఇప్పుడు కలిసిపోయే పరిస్థితి లేదు కాబట్టి బయటికి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు నమ్మిస్తూ లోపాయికారీగా ఢిల్లీలో కమలం పెద్దలతో దోస్తీ కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రయోగం బెడిసికొట్టడంతో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష సంబం ధాలు పెట్టుకుంటే ఏపీలో పుట్టి మునుగుతుంది కాబట్టి ఆ పార్టీతో రహస్య ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగమే అరకు నుండి కిషోర్ చంద్ర దేవ్, కర్నూల్ నుండి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, తిరుపతి నుండి పనబాక లక్ష్మిని లోక్‌సభకు తెలుగు దేశం తరఫున పోటీ చేయించడం. ఇది కొత్త తరహా పొత్తు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటిస్తున్నా నని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఈ కొత్త తరహా పొత్తులు బహుశా చంద్రబాబు ఒక్కరికే సాధ్యం అనుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఎత్తుగడ పవన్ కల్యాణ్ జనసేన. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం బాధ్యుడిగా కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఊడదీస్తానని ప్రగల్భాలు పలికి పార్టీ ఘోర పరాజయం తరువాత కనుమరుగు అయిపోయిన పవన్ 2014లో మళ్ళీ మోదీ బాబుల మిత్రుడిగా ప్రత్యక్షం అయ్యాక నాలుగేళ్ల పాటు అక్కడ క్కడ, అప్పుడప్పుడు కనిపించి నాలుగు మాటలు మాట్లాడిపోయేవారు. రాష్ట్రాన్ని విడగొడితే పదకొండు రోజులు అన్నం తినలేదన్న దగ్గరి నుండి తన సినిమా పనుల కోసం కేసీఆర్ గొప్ప నాయకుడు, తెలం గాణ ఉద్యమం అద్భుతం అని పొగిడి, మళ్ళీ ’అయ్యా కేసీఆర్ మా ఆంధ్రప్రదేశ్‌ను వదిలెయ్యండి’ అనే వరకూ జనసేన నేత రాజకీయ విన్యాసాలు చూశాం. చంద్రబాబు, ఆయన సుపుత్రరత్నం అవినీతి పరులు అన్న నోటితోనే అయ్యో చంద్రబాబును ఒంటరిని చేసి అందరూ వేధిస్తారా అనేవరకూ పవన్ రహస్య ఎజెండా జనానికి అర్థం కాదను కున్నట్టున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుందట. 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకూ ఒకేసారి ఇడుపులపాయ నుండి అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార క్షేత్రంలోకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోతే తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలు ఇంకా పూర్తి జాబితాలు ప్రకటించలేని స్థితిలో ఎందుకు ఉన్నాయి? ఇంకా ఎక్కడ ఎవరిని నిలబెడితే వైఎస్ఆర్ సీపీకి నష్టం చెయ్యగలమా అనే ఆలోచనల్లో ఉన్నట్టున్నారు. జనసేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి పార్టీ బీఎస్పీ వచ్చి ఆ కూటమిలో చేరింది. ఏపీకి సంబంధించినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఇంగువ కట్టిన గుడ్డలే అయినా ఒకప్పుడు బలమయిన శక్తి. మాయావతి పార్టీ ఉనికే ఏపీలో కానరాదు. అయినా పవన్ జనసేన పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఎక్కువ స్థానాలు బీఎస్పీకి ఇచ్చారు. పాపం కమ్యూనిస్ట్‌లు కిక్కురుమనకుండా సర్దుకుపోయే స్థితి. జనసేన కూటమిలోకి మాయావతిని తన జాతీయ సంబంధాల ద్వారా చంద్ర బాబే తీసుకువచ్చారని చెపుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను ప్రయోగించి కాపుల ఓట్లు, మాయావతిని ప్రయోగించి దళితుల ఓట్లు చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం చెయ్యాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ వర్గాల ఓట్లు తనకు ఎట్లాగూ రావన్న విషయం ఆయనకు అర్థం అయిపోయింది మరి. మరో పక్క ప్రజాశాంతి పార్టీ పేరిట చంద్రబాబు మరో బినామీ మత ప్రచారకుడు కేఏపాల్‌ను క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పోకుండా నిరోధించేందుకు తెర మీదకు తెచ్చారు. ఇన్ని చేస్తున్నా బాబుకు ఎన్నికల అనంతర దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నట్టున్నది, తాజాగా జేడీ లక్ష్మీనారాయణను తెర మీదకు తెచ్చారు. జేడీ ఆయన ఇంటి పేరు కాదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రపూరితంగా జగన్‌ని కేసులలో ఇరికించినప్పుడు ఆ కేసుల విచారణకు సీబీఐ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణది అందులో జాయింట్ డైరెక్టర్ హోదా. అందుకే జేడీ అంటారు. భారతదేశ పౌరులు ఎవరయినా రాజకీయాల్లోకి రావచ్చు, అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ కూడా. కానీ ఆయన గురించి చర్చ ఎందుకంటే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల బోధనలను గురించి మాట్లాడి సమాజానికి విలువలను గురించి ఉపన్యాసాలు ఇచ్చి, రాజకీయాల్లో అవినీతిని తూర్పారబట్టి సొంత పార్టీ పెడతానని చెప్పి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. చివరి నిమిషం దాకా టీడీపీలోనే చేర తారని ప్రచారం జరిగినా అది వ్యతిరేక ప్రభావం చూపేటట్టుంది కాబట్టి జనసేనలోకి పంపించి అక్కడి నుంచి పోటీకి దింపుతున్నారు అని అర్థం అయిపోయింది. చంద్రబాబు నాయకత్వంలో రాహుల్‌గాంధీ, పవన్ కల్యాణ్, కమ్యూనిస్ట్‌లు, కేఏ పాల్, జేడీ లక్ష్మీనారాయణలతో కూడిన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం అవుతూనే ఉన్నది. ఏపీ ప్రజలకు ఈ విషయం అర్థం కాలేదనుకుందామా? ప్రజలకు అర్థం అయింది కాబట్టే ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ మాటలు అన్నాడు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవం కదా ఆయనది కూడా. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జగన్, కేటీఆర్ భేటీపై ఎందుకీ రచ్చ?
ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసుకుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొని, అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, దాని అధినేత చంద్రబాబు కేటీఆర్ జగన్‌ను కలవడంతో ఆయనను అప్రతిష్టపాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు. పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయన కుమా రుడు, టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు కే.టీ. రామారావు మరికొంతమంది పార్టీ నాయకులతో కలిసి లోటస్ పాండ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసే మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రావు ఒక సంవత్సర కాలంగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ లేని ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేద్దాం కలిసి రండి అని దేశంలో పలువురు నాయకులను కలు స్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌ను, బీఎస్పీ నాయకురాలు మాయావతిని, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను స్వయంగా వెళ్లి కలిశారు. రాష్ట్రాల పరిధిలో ఉండాల్సిన అంశాలను కేంద్రం తన అధీనంలో ఉంచుకుని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది కాబట్టి ఆ అధి కారాలను సాధించుకోవడానికి కేంద్రం మీద పోరాటానికి అవసరమైన శక్తిని సమకూర్చుకుందాం రండి అని కేసీఆర్ ఈ నాయకులను కోరారు. ఆయనా, ఆయన కలిసిన నాయకులూ కూడా ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమే, ముందు ముందు మళ్ళీమళ్ళీ కలిసి చర్చించుకుంటాం, సమాఖ్య స్ఫూర్తికి ఉపయోగపడే విధంగా రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సాధించుకునే క్రమంలో ఈ చర్చలు తోడ్పడతాయి అని చెపుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలు ఈ లక్ష్యం సాధించుకోలేక పోతున్నాయి కాబట్టి ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరం అని చాలామంది నాయకులు భావిస్తున్నారు. అది నిజం కూడా. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీల నాయకత్వాల మీద ఒత్తిడి తెచ్చి తమ తమ రాష్ట్రాలకు కావలసిన మొత్తంలో నిధులు కానీ ఇతర సౌకర్యాలు కానీ రాబట్టుకోలేవు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొద్దిమంది సమర్థులయిన నాయకులు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వాలను ప్రభావితం చేసి కావలసిన పనులు చేయించుకోవడం చూశాం. కానీ అన్నివేళలా అది సాధ్యం కాదు. అందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం ఒకటి ఈ దేశానికి అవసరమే. అయితే ఆ దిశగా గతంలో జరిగిన ఒకటి రెండు ప్రయత్నాలు విఫలం అయిన మాట నిజం. అట్లాంటి ఒక ప్రయత్నం యునైటెడ్ ఫ్రంట్ (యుఎఫ్)ను నట్టేట ముంచి పోయిన నాయకుడు చంద్రబాబు. ఆ ఫ్రంట్ కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చెయ్యకుండానే బీజేపీతో జతకట్టిన నాయ కుడు ఆయన. ఒక ప్రయత్నం విఫలం అయిందని, ఒక నాయకుడు మోసం చేశాడని వదిలెయ్యకూడదు కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెపుతున్నారు. ఇంకా దానికి ఒక స్వరూపం అంటూ రాలేదు. అందులో భాగంగానే ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కి స్వయంగా ఫోన్ చేసి తన పార్టీ ప్రతినిధి బృందాన్ని పంపుతున్నానని చెప్పారు. జగన్, కేటీఆర్ బృందాల సమాలోచనలు జరుగుతున్న సమ యంలోనే మళ్ళీ ఒకసారి కేసీఆర్ జగన్‌కు ఫోన్ చేసి తాను స్వయంగా అమరావతికి వచ్చి మరొకసారి జగన్‌తో చర్చలు జరుపుతాననీ, ఇవి ప్రాథమిక సమాలోచనలు మాత్రమే అని చెప్పారు. ఇంటికి వస్తామన్న కేటీఆర్ బృందాన్ని జగన్ భోజనానికి ఆహ్వానించారు. అమరావతికి వస్తానన్న కేసీఆర్నీ జగన్ తన నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. భేటీలో ఏం మాట్లాడుకున్నారో జగన్, కేటీఆర్‌లు మీడియాకు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు, సమస్యలు పరిష్కారం కావని, దాన్ని సాధించుకోవడానికి ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు మరింత సంఖ్యాబలం తోడైతే బాగుంటుంది కాబట్టి, అందుకు తాము సిద్ధంగా ఉన్నాం అని టీఆర్ఎస్ కూడా చెపుతున్నది కాబట్టి వాళ్ళతో ఆ పరిమితుల్లో కలిసి పనిచేసే విషయం పరిశీలిస్తామని జగన్ చెప్పారు. రాజ్యసభలో తమ నాయకుడు కేశవరావు, లోక్‌సభలో తమ సభ్యురాలు కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారనీ, కేసీఆర్ కూడా ప్రధానికి లేఖ రాయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారనీ కేటీఆర్ చెప్పారు. ఇదీ జరిగింది. వేర్వేరు పార్టీల నాయకులు తమ తమ పార్టీల ప్రయోజనం కోసం, తమ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచెయ్యడం కొత్త విషయం ఏమీ కాదు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తొలి సమావేశాన్ని ఆ కోణంలో నుండే చూడాలి. రెండు రాష్ట్రాల ప్రజలూ అలాగే చూస్తారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణ కాకుండా సహజీవనం కోరుకుంటున్నారు కాబట్టి. ఈ సమావేశం ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున తెలుగు దేశం నాయకులు విరుచుకు పడ్డారు ఎందుకని? ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తు న్నారు? అధికారం శాశ్వతం చేసుకోవాలన్న దుగ్ధ. ప్రతిపక్ష నాయకుడు జగన్ 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసు కుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామనిపేర్కొని అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, బాబు ఈ భేటీని అడ్డు పెట్టుకుని అప్రతిష్ట పాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు. చంద్రబాబు, ఆయన మంత్రులూ, నాయకులూ, వాళ్ళ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్నట్టుగా జగన్ టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడటమే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పని అయితే ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఆ పని చేసింది చంద్రబాబు, ఆయన పార్టీ వారే. రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే కదలిక వచ్చింది. బాబు లేఖ, సోనియా గాంధీ దురాలోచనా కలిసి తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేశాయి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నవాడని గెలిపించి అధికారం కట్ట బెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం పని చెయ్యకపోగా... అధికారంలోకి వచ్చిన కొద్దిరోజు ల్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చెయ్యడం కోసం కుట్ర పన్ని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి వెళ్లి ఆంధ్ర ప్రజల ప్రతిష్ఠను దిగజార్చిన ఘనత చంద్రబాబుది. ఆ కేసు ముందుకు సాగకుండా సంధి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది బాబు. తెలంగాణ సీఎంని అమరావతి శంకు స్థాపనకు ఆహ్వానించి శిలాఫలకం మీద ఆయన పేరు చెక్కించినప్పుడు దెబ్బతినని ఆత్మాభిమానం జగన్ ఒక్కసారి కేటీఆర్‌ను కలిస్తే దెబ్బతిన్నదా? పదేళ్ళు హైదరాబాద్‌లో ఉండటం కోసం కోట్లాది రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు ఖర్చు చేసి విలాసవంతంగా మరమ్మతులు చేయించిన కార్యాలయాలూ, వసతి గృహాలు, సొంత ఇల్లూ అన్నీ వది లేసి పారిపోవడం ఏ ఆత్మాభిమానాన్ని రక్షించడం కోసం? కేసీఆర్ దుర్గ గుడి దర్శనానికి వస్తే, తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే అడుగులకు మడుగులొత్తిన మంత్రులు ఇప్పుడు జగన్‌ని ఏ ముఖం పెట్టుకుని నిందిస్తున్నారు? కేసీఆర్ నిర్వహించిన యజ్ఞ యాగాదులకు జగన్ కాదు వెళ్ళింది చంద్రబాబు ఆయన అనుచరులు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ పనిగట్టుకుని కేసీఆర్‌ను కానీ ఆయన ప్రభుత్వంలో మరేవరి నయినా కానీ కలవలేదే! బావమరిది మృతదేహం దగ్గర కూర్చుని తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారకుడయిన ఆయన మరణానికి చింతించకుండా టీఆర్ఎస్తో పొత్తు కోసం వెంపర లాడింది చంద్ర బాబు కానీ జగన్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానం చంద్రబాబు కారణంగానే కదా పదేపదే దెబ్బతింటున్నది. అధికారం చేజారిపోతుందని స్పష్టంగా తెలిసిపోయాక ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు సంపా దించుకోవాలన్న దురాలోచనతో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ కలిసి పోతాయని నమ్మించే విఫలయత్నం బాబుది. బీజేపీతో కలిసినా, టీఆర్ ఎస్తో కలిసినా, కాంగ్రెస్‌తో కలిసినా అధికారం కోసం నీతిబాహ్యమైన పొత్తులు కుదుర్చుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత అవసరం అయిన ప్రత్యేక హోదాను నాలుగేళ్ళకు పైగా బీజేపీకి తాకట్టుపెట్టి, తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆ నినాదాన్ని అందుకుని కొద్ది రోజుల్లోనే అది మరిచిపోయి దేశాన్ని, వ్యవస్థలనూ కాపాడటం పేరుతో కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి పదేపదే భంగం కలిగిందనే విషయం గుర్తించాలి. తెలంగాణలో ఇంకో అయిదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచకుండా సామరస్యం పెంచే పక్షం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఎన్నికల వైపు అడుగు వెయ్యాలి. - దేవులపల్లి అమర్ -
రాజువయ్యా..!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడియా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాడు ప్రతిపక్ష నేత. 2004 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈసారి, అంటే ఆ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయాలు విరమించుకోవచ్చునని సన్నిహితుల దగ్గర అప్పటికే చాలాసార్లు అన్నారు. కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్రతో ఆయనకు ప్రజల నాడి తెలిసింది. అందుకే పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. లెక్కపెట్టి 175 స్థానాలు గెలుస్తాం అని చెబుతున్నారు. మీడియా మాత్రం మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావ డం ఖాయమని ఘోషిస్తూనే ఉంది. పత్రికలూ, టీవీ చానళ్లూ సర్వేలు చేయిం చాయి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని సర్వేలలో తెలిసినా అధికారంలో ఉన్న తెలుగుదేశం ఆగ్రహానికి వెరచో, అనుగ్రహం కోసమో ఆ ఫలితాలను బయటపెట్టని మీడియా సంస్థలూ ఉన్నాయి. ఒక ఆంగ్ల దినపత్రిక అయితే తెల్లవారితే ఓట్ల లెక్కింపు అనగా కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో తేలిన 175 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని పతాకశీర్షికలో అచ్చేసి అభాసు పాలైంది కూడా. ఒక్కోసారి అనుమానం కలుగుతుండేది. కట్టకట్టుకుని మీడి యా ఇంతగా చెబుతూంటే డాక్టర్ వైఎస్ అంత ధీమాగా ఎలా చెబుతారని! ఎక్కడో లెక్కలు తప్పుతున్నాయేమోననిపించేది. 2004లో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని ఒకటి రెండు పత్రికలు మాత్రమే రాసిన ట్టు గుర్తు. అయినా వైఎస్ విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ వార్తల గురించి ప్రస్తావిస్తే; ‘ఫలితాలు వచ్చాక మాట్లాడదాం, మీ మీడియా వార్తల గురించి!’ అనేవారు. అదేరోజు మళ్లీ ప్రచారానికి వెళ్లిపోయారు. ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ యాజమాన్యం మారింది. ఆ పత్రికను సొంతం చేసుకున్నాయన కాకినాడ శాసనసభ స్థానా నికి కాంగ్రెస్ అభ్యర్థి. పాత యాజమాన్యం కింద పని చేసిన జర్నలిస్ట్‌లకూ నాన్ జర్నలిస్ట్‌లకూ చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఆయనతో మాకు వివాదం నడుస్తున్నది. కొత్త యజమాని మొండి వైఖరితో ఉన్నాడు. కార్మి కులు రోడ్డున పడ్డారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నుంచి కొంత మందిమి కాకినాడ చేరుకున్నాం. ఆరోజు రాజశేఖరరెడ్డి అక్కడ ప్రచారానికి వచ్చారు. ఆయన సమక్షం లోనే తేల్చుకోవాలనుకున్నాం. ఆయన ప్రచార రథం వెళ్లే దారిలోనే ఒక హోట ల్లో దాగి ఉన్నాం. సరిగ్గా వైఎస్ ప్రచార రథం రాగానే ఒక్క ఉదుటున రోడ్డు మీదికి వచ్చి ఆ వాహనానికి అడ్డంగా పడుకుని నినాదాలు మొదలుపెట్టాం. రథం మీద రాజశేఖరరెడ్డి, ఆయన పక్కన పత్రిక కొత్త యజమాని, కాంగ్రెస్ అభ్యర్థి. ప్రచారానికి అడ్డొచ్చామని రాజశేఖరరెడ్డి ఆగ్రహిస్తారేమోనని మాలో కొంతమంది సందేహించారు. ఆయన గురించి తెలిసిన వాళ్లం కాబట్టి మా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, నేనూ మరి కొంతమంది ధీమాగానే రోడ్డు మీద పడుకున్నాం. వైఎస్ ఏదో చెప్పగానే సూరీడు మా దగ్గరకొచ్చి శ్రీనివాస్‌రెడ్డినీ, నన్నూ సార్ పిలుస్తున్నారని చెప్పాడు. మేం రథం దగ్గరికి వెళ్లాం. మీదికి రమ్మన్నారు. ఆయనే మా చేతికి మైకు ఇచ్చి, మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నారు. మేమిద్దరం మాట్లాడాం. కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాం. వాళ్ల రథం మీద నుంచే, వారి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ఆ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడటం నాకైతే ఎప్పటికీ ఊహకు అం దని విషయం. వైఎస్‌లో ఏమీ మార్పులేదు. ఆ అభ్యర్ధి మా మాటలకు ఏదో జవాబు ఇస్తానంటే కూడా అవసరం లేదని మైకు తీసుకుని ఎన్నికలైన వెం టనే సమస్య పరిష్కరించే బాధ్యత తనదని ప్రకటించారు. ఫలితాలు వచ్చా యి. వైఎస్ అన్నట్టే అన్ని స్థానాలూ వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంత తీరికలేని స్థితిలో కూడా కాకినాడలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శాసన సభ్యుడిగా ఎన్నికైన ఆ యజమానిని పిలిపించి కార్మికుల సమస్య పరిష్కరిం చారు. ఇది నేను కాకినాడ వీధుల్లో జర్నలిస్ట్ యూనియన్‌కు ఇచ్చిన హామీ. నెరవేరి తీరాల్సిందేనని ఆనాటి సమాచారశాఖ కమిషనర్ రమణాచారిని పిలిచి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఈ చిన్న విషయం గుర్తుంచుకోనవసరం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకులు చాలా అరుదు. అందుకే ఇదంతా చెప్పడం. ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరరెడ్డి కొన్ని పత్రికల యాజమాన్యా లతో తీవ్రంగా విభేదించారు. ఆ పత్రికలు కూడా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేని విధంగా వెంటబడి కాం గ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం ప్రారంభించాయి. అందుకే ‘ఆ రెం డు పత్రికలూ..’ అంటూ విమర్శిస్తూ ఉండేవారు వైఎస్. కానీ వాటిలో ఉద్యో గాలు చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులను ఏ నాడూ చిన్నచూపు చూడలేదు. అన్ని వర్గాలకు ఇచ్చినట్టే, వైఎస్ మొదటిసారి అధికారంలోకి రాగానే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. మెడిక్లెయిమ్ పాలసీ, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు- ఇట్లా. పత్రికలు ఏం రాస్తున్నాయి, న్యూస్ చానళ్లు ఏం చూపిస్తున్నాయి అనే అంశంతో సంబంధం లేకుండా పాత్రికేయుల సంక్షేమానికి ప్రతిపాదన ఆయ న ముందు పెట్టడం ఆలస్యం, ఆమోదం పొందుతూ ఉండేది. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన రాతలకు కినుక వహించి ఆ పత్రిక కార్యాలయం మీద దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల యూనియన్ పిలుపు మేరకు మేమంతా ఎంఆర్పీఎస్ దాడిని వ్యతిరేకిస్తూ ఆందోళన జరి పాం. ఆ పత్రిక సంపాదకుడిని పోలీసులు అరెస్టు చెయ్యడానికి వస్తే అడ్డుకు న్నాం. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని నిరసన తెలిపాం. నేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఎంఆర్పీఎస్ ఆందోళన వెనక ప్రభుత్వం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ైచైర్మన్‌గా నాది కేబినెట్ మంత్రి హోదా. ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బంది కలిగించే విష యమే. అప్పటికే ఒకరిద్దరు అధికారులూ, కాంగ్రెస్ నాయకులూ ముఖ్య మంత్రికి నామీద ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదనిపించి ముఖ్యమంత్రిని కలిసి, నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఆయన తన సహజసిద్ధమైన చిరునవ్వుతో ‘ఎందుకు స్వామి?’ అన్నారు. విషయం చెప్పాను. ‘నువ్వు యూనియన్ నాయకుడివి. ఇట్లా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తావని నేను ఎట్లా అనుకుంటాను? వెళ్లి నీపని చేసుకో!’ అని కాగితం తిరిగి నా చేతికిచ్చి కాఫీ ఇచ్చి పంపేశారు. ఆ తరువాత చాలా రోజులకు ఆయన ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్’ కార్యక్రమం రికార్డింగ్ సం దర్భంగా కలిసినప్పుడు అధికారులకు చెప్పారాయన ఈ విషయం. ప్రజా జీవితంలో రాజశేఖరరెడ్డితో కలసి నడిచిన వాళ్లు ఇలాంటి అనుభవాలు ఇంకా ఎన్నో పంచుకోగలరు. 1978లో మొదటిసారి ఆయన శాసనసభకు ఎన్నికైన నాటి నుంచి మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రెండుసార్లు పీసీసీ అధ్యక్షు డిగా, ప్రతిపక్ష నాయకుడిగా, చివరికి ముఖ్యమంత్రిగా-వరుసగా రెండవ సారి ఎన్నికయ్యే వరకూ రాజకీయాలలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర కన బరచడం నేను జర్నలిస్ట్‌గా చూశాను. రిపోర్టు చేశాను. ఆపదలో ఉన్నవారు ఎవరైనా తన, మన అని చూడకుండా ఆదుకోవడంలో ఆయన ఎన్నడూ వెను కాడలేదు. కాకినాడ అనుభవం, ఆంధ్రజ్యోతి మీద దాడి వ్యవహారం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. జర్నలిస్టు ఉద్యమంలో ఆయనతో ఉన్న ఇటువంటి అనుభవాలు అనేకం ఏకరువు పెట్టొచ్చు. రాజశేఖరరెడ్డి వంటి విలక్షణ వ్యక్తిత్వం గల నాయకులు రాజకీయాలలో చాలా తక్కువ. ఒక దానికి ఒకటి ముడి పెట్టకుండా దేనికి దాన్ని వేర్వేరుగా చూడటం, ఆ పద్ధతిలోనే ఆ సమస్యను పరిష్కరించే యత్నం చేయడం డా॥వైఎస్ నుంచే నేర్చుకోవాలి. (నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి) datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
ఊరింపులు, గద్దింపులు చాలిక
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ సీఎం విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయి పరిశోధనా సంస్థల స్థలాలకు ఎసరు పెడతానంటుంటే... ఏపీ సీఎం వ్యవసాయాన్ని శాశ్వతంగా సమాధి చేసేలా మూడు పంటలు, నాలుగు పంటలు పండే భూములకు రాజధాని పేరిట ఎసరు పెట్టేస్తున్నారు. ఇదేమంటే, ఇద్దరూ తమ సొంత శైలిలో ‘ఏం తమాషానా?’ అని బెదిరిస్తున్నారు. ఇద్దరు తెలుగు సీఎంలు అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నది. ఇప్పుడిక వాళ్లు బెదిరింపులు కట్టిపెట్టాలి. ‘ఏం తమాషా చేస్తున్నారా?’ అని రెండు రాష్ట్రాల ప్రజలే పాలకులను నిలదీసే సమయం వ చ్చింది. కమ్యూనిస్టు మహాయోధుడు చండ్ర రాజేశ్వరరావు తుదిశ్వాస విడిచే ముందు రాసిన వీలునామాను ఆయన పోయాక పత్రికలన్నీ మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించాయి. ‘నా బట్టలు పేదవారికి, పుస్తకాలు లైబ్రరీకి’ అని దాని సారాంశం. ఆయన దగ్గర అంత కంటే ఏం లేవు మరి. శరీరం మీదున్న లాల్చీ, పైజామా, చేసంచిలో ఉన్న మరో జత బట్టలు. ఎక్కడికెళితే అక్కడ ఆ బట్టలు తానే ఉతుక్కుని, ఆరేసుకుని, మళ్లీ తొడుక్కునేవారు. స్వార్థం పెరిగి పోతుందేమోనని రాజేశ్వరరావులాగే పిల్లలు సైతం వద్దను కున్న మరో మహా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆ ఇద్దరూ తమ జీవితాలను కమ్యూనిస్టు ఉద్యమానికీ, ప్రజాజీవితానికీ అంకితం చేసిన వాళ్లే. అంత నిరాడంబరంగా జీవించిన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లూ కారు. కావాలనుకుంటే ఆ ఇద్దరూ తమ పలుకుబడితో కోట్లు సంపా దించు కోగలిగేవారే. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర రావు రష్యా పర్యటనకు వెళితే అక్కడి ప్రభుత్వం అధికారికంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సోవియెట్ యూనియన్‌లో బహుశా మరే భారత నేతకు అంతటి ఘన స్వాగతం లభించి ఉండదు. ఆ ఇద్దరు గొప్ప నేతలను స్మరిం చుకోవాల్సిన సందర్భం ఏమిటి? అని సందేహం రావచ్చు. ప్రజాజీవితంలో ఉన్న చాలామంది కమ్యూనిస్టులు, కమ్యూనిస్టేతరులు సంపన్నవర్గాల నుంచి వచ్చి కూడా ఇలాగే నిరాడంబరంగా జీవించారు. కరీంనగర్ జిల్లాలో ‘తోట పల్లి గాంధీ’గా ప్రఖ్యాతి చెందిన సర్వోదయ నాయకులు బోయినపల్లి వెంకట రామారావు వంటి వారు పలువురు ఉన్నారు. మన పాలకులు పోతున్న పోక డలను చూస్తే ఒక్కసారి అటువంటి వారిని గుర్తు చెయ్యాలని అనిపించింది. ఇద్దరు అధినేతల తీరే వేరు నేడు అధికార రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా కోట్లకు పడగలెత్తినవారే. ఆర్థి కంగా వారి గతం అంత చెప్పుకోదగ్గదీ కాదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు కూడబెట్టుకున్నారు. వ్యాపారాలు స్థిరపరచుకున్నారు. సరే, ఎవరి వ్యాపా రాలు వారివి, ఎవరి ఆస్తిపాస్తులు వారివి. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే ఆర్థిక నేపథ్యం. నేడు వారూ, వారి సంతానమూ ఆర్థికంగా బ్రహ్మాండంగా నిలదొక్కుకుని, విజయవంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నవారే. దాన్ని ఎవరూ ఆక్షేపించనక్కరలేదు. తప్పు లు జరిగితే ఓ కంట కనిపెట్టే వ్యవస్థలు వేరే ఉన్నాయి. ఈ ఇరువురి నేతృ త్వంలోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ అధికారంలోకి వచ్చాక గడచిన దాదాపు ఏడాది కాలంలో చేస్తున్న, చేస్తామని చెబుతున్న కార్యక్రమాలు ఆ పాత కాలపు నాయకుల నిజాయితీ, నిరాడంబరతలను, ఈ ఇరువురు నాయకుల ఆర్ధిక సౌష్టవాన్ని పోల్చి చూసేలా చేస్తున్నాయి. మినీ మోదీ ‘డబుల్’ ఊదర నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత వారం తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నట్టు.. అక్కడ మోదీ అయితే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మినీ మోదీ అవతారమెత్తారు. మంచిదే, హైదరాబాద్ వీధులు బాగుపడితే సంతోషమే. అదేమి పోలిక? అంటూ రాహుల్ విమర్శను తప్పుపడుతూ ఒకాయన ‘‘మోదీ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటున్నారు, మన సీఎం విదేశా లకే వెళ్లడంలేదు కదా?’’ అన్నారు. ‘‘మోదీకి పిల్లలు లేరు కాబట్టి ఆయనే తిరుగుతున్నాడు, మన మినీ మోదీకి ఇద్దరు పిల్లలు, తండ్రి బదులుగా వాళ్లు విదేశాలన్నీ తిరుగుతున్నారు’’ అని జవాబిచ్చారు ఒక సీఎం అభిమాని. ప్రధాని అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో 18 దేశాలు తిరిగి ఏం సాధిం చారు? తెలంగాణ, ఏపీ సీఎంల పిల్లలు విదేశాలు తిరిగి ఏమేం సాధించారు? భవిష్యత్తులో తేలుతుంది. మోదీని మెప్పించి కూతురికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకోడానికో (మోదీ ఆహ్వానిస్తే కేంద్రంలో చేరే విషయం పరిశీలిస్తానని ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత నిన్ననే ప్రకటించారు) లేక రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసమో గానీ తెలంగాణ సీఎం ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని తెగ ఉధృతంగా మొదలెట్టారు. ఇందులో భాగంగా ఆయన సికింద్రాబాద్ హమాలీ బస్తీ ప్రజల వద్ద మరోమారు పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇచ్చేసే విషయం పైకి మళ్లారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఖాయపరచిన నాటి నుంచి... అధికారానికి ముందు, అధికారంలోకి వచ్చాకా... ఏడాదిన్నరగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రెండు బెడ్రూంల ఇళ్ళ విషయం చెప్పి చెప్పి, తెగ ఊదరగొట్టి ఊరించేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కడితే ఒట్టు. ఒకసారి ఇళ్ల నిర్మాణానికి బోలెడు జాగా ఉందంటారు, ఇంకోసారి ఫ్లాట్లు మాత్రమేనంటారు. ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుంటామని చెబుతున్నారు. ‘ఏం తమాషానా?’ ఒక్క ఉస్మానియా వర్సిటీ నుంచే కాదు, ఓపెన్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ సంస్థల భూములతో రెండు లక్షల ఇళ్లు కడతామని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వవిద్యాల యాలూ, జాతీయస్థాయి అత్యద్భుత ఫలితాలనిస్తున్న పరిశోధనా సంస్థల స్థలాలకు ఎసరు పెడతానంటే.... అక్కడ ఏపీ సీఎం వ్యవసాయాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు మూడు పంటలు, నాలుగు పంటలు పండే భూములకు రాజధాని పేరిట ఎసరు పెట్టేస్తున్నారు. ఇదేమంటే, ఇద్దరూ తమ తమ శైలుల్లో ‘ఏం తమాషానా?’ అని బెదిరిస్తున్నారు. ఇద్దరు తెలుగు సీఎంలూ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నది. ఇప్పుడిక వాళ్లు బెదిరింపులు కట్టబెట్టాలి. ‘ఏం తమాషా చేస్తున్నారా?’ అని రెండు రాష్ట్రాల ప్రజలే పాలకులను నిలదీసే సమయం వ చ్చినట్టే. ఇక్కడే పాలకుల ఆస్తిపాస్త్తుల లెక్కలు ప్రస్తావన కొచ్చేది. ప్రజావసరా లకు ఎంతగానో ఉపయోగపడే ముఖ్యమైన భూముల్లో ఇళ్లు నిర్మిస్తామం టున్నారు... అందుకు బదులు మీ ఆస్తులు దానం చెయ్యొచ్చు కదా? అన్న మాట రాక తప్పదు. హైదరాబాద్‌కు 40 కిలో మీటర్ల దూరంలోనే తెలంగాణ సీఎం సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అధికారంలోకి రావడానికి బోలెడు త్యాగాలు చేశామనే పాలకులు పేదల ఇళ్ల నిర్మాణం వంటి బృహత్ కార్య క్రమాల కోసం సొంత ఆస్తులు త్యాగం చేస్తే తప్పేమిటి? విశ్వవిద్యా లయ భూముల ప్రస్తావన తెస్తూ ముఖ్యమంత్రి ‘‘అవేమన్న రాజ దర్బార్లా, మహారాజుల గదులా? తమాషానా? ఇది ప్రజాస్వామ్యం ప్రజాయుగం. ప్రజల సొత్తు, ప్రజలకు చెందాల్సిందే’’ అన్నారు. ఆయన ఒక విషయం మర చిపోతున్నారు. ఇప్పుడాయన హూంకరించి ఏ భూములనయితే లాక్కుని పేదలకు ఇల్లు కట్టిస్తానంటున్నారో అవి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలవే. ‘కొత్త మిత్రుల’ కబ్జా భూముల్లో కట్టండి ఇది ప్రజాస్వామ్యమని మరచి, వేలాది ఎకరాల ప్రజా భూముల చుట్టూ కోట గోడలు నిర్మించుకుని, రాజ మహళ్లలో భద్రత మధ్య జీవిస్తున్న మీ కొత్త మిత్రుల కబ్జాలోని భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు కట్టి చూపించండి. ఇటీవలే ఆ కొత్త మిత్రుడి కోటను స్వయంగా సందర్శించి, భూమి మీద ఇదో అద్భుతమని వేనోళ్ల పొగిడి వచ్చిన ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆ భూములను మరచిపోయి ఉండరు. ఆయనకు అలాంటి మిత్రు లింకా కొందరైనా ఉండే ఉంటారు. వారందరి కబ్జాలోని భూములను స్వాధీన పరచుకోండి. అప్పుడు ప్రజలు మీకు ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమను నమ్ముతారు, జేజేలు పలుకుతారు. అంతకంటే ముందు మీ సొంత ఆస్తులుగా ఉన్న విశాల ప్రాంగణాలను ప్రజల పరం చేయగలరేమో ఆలో చించండి. అంతేగానీ ప్రజల విద్యా, విజ్ఞాన వికాస అవసరాల కోసం అప్పు డెప్పుడో కేటాయించిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని బెదిరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు కొన్ని ఇప్పటికే కబ్జాదార్ల పాలయినాయి. వాటిని రక్షించాల్సిందిపోయి మరింత భూమికి ఎసరు పెడతామంటే విద్యార్థులు ఎందుకు ఊరుకుంటారు? email: datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
చావుతప్పినా తోవ మారని కాంగ్రెస్
ప్రతిపక్షమే లేదన్నట్టు వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉన్న వాటిని ఖతం చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా బీజేపీ తోనూ, టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొని నడవనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్లు నడిపినా ప్రయోజనం ఉండదు. డేట్లైన్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ గురించి మహాకవి శ్రీశ్రీ ఒకచోట రాసిన పంక్తులు గుర్తొ చ్చాయి- రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ వారం రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తుంటే. పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట తిరిగి పుంజుకునేదెప్పుడు... ఫలానా అప్పుడు, ఫలానా అప్పుడు అని అస్సలు సాధ్యం కాని విషయాలను గురించి ఆ పద్యంలో చెపుతాడు మహాకవి. ఒక సందర్భంలో కాంగ్రెస్ పరిస్థితి మీద శ్రీశ్రీ రాసిన కవిత అది. అయితే తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు ఆ పూర్వ వైభవం పలుమార్లు వచ్చింది. పోయింది కూడా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఆనాడు మహాకవి రాసినట్టే ఉంది, కనుకనే ఈ ప్రస్తావన. ఆ రోజుల్లో, అదీ మహాకవి శ్రీశ్రీ కాబట్టి ఏం రాసినా, అందులో ఎలాంటి భాష వాడినా చెల్లింది. కాని ఇప్పుడు వాటిని తిరిగి ఇక్కడ రాయ డం సభ్యత కాదని భావించడం వల్లనే ఆ పద్యం పూరించలేకపోతున్నాను. అది ప్రతిపక్షం కర్తవ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రెండు ప్రభుత్వాల మీదా ఇక పోరాటం మొదలుపెట్టాలని తీర్మానించుకుని తొలి దశ ఉద్య మాన్ని మొన్న ప్రకటించాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అయినప్పుడు వాటిని వ్యతిరేకించి పోరాడాల్సిన బాధ్యత ప్రతి పక్షాలదే. చట్టసభల్లోనూ, వాటి వెలుపలా ఈ పోరాటాలు జరగాలి. అయిన దానికీ, కానిదానికీ ప్రభుత్వాలను విమర్శించడం వాటి మీద విరుచుకు పడటం కాకుండా, ఎక్కడైతే ప్రజలకు నష్టం జరుగుతున్నదో, ఎక్కడైతే ప్రజా ధనం దుర్వినియోగం అవబోతున్నదో అక్కడ ఏ మినహాయింపులూ, వెనకకు తగ్గడాలూ లేకుండా ప్రతిపక్షాలు పోరాడవలసిందే. అన్ని వేళలా అన్ని సమ స్యల మీద ప్రజలే స్వయంగా వచ్చి ఉద్యమాలు చేయరు. ఆ పని చెయ్యాల్సింది ప్రతిపక్షాలే. మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకున్న ప్పుడు శాసన వ్యవస్థలో ప్రాతినిధ్యం దృష్ట్యా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షం. తెలంగాణ చట్టసభలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, మజ్లిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బీజేపీకి కొద్దిపాటి ప్రాతినిధ్యం ఉన్నా, మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం మాత్రం ఈ అయిదు సంవత్సరాల్లో లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన తీరు ప్రజా స్వామ్య బద్ధంగా లేకపోయినా, ఆ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతల పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నా, అక్కడి బీజేపీ నాయకుల చేతులు అధికార పగ్గాలతో కట్టేసినట్టే అయింది. మిత్రధర్మం అనండీ, సంకీర్ణ ధర్మం అనండీ! ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నోరు విప్పి మాట్లాడే స్థితిలో ఇవాళ లేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. నిజానికి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్ అయినా, బీజేపీ నిలబడకపోతే, గట్టిగా సమర్థించకపోతే తెలంగాణ రాష్ర్టం ఏర్పడేది కాదు. ‘చిన్నమ్మను, నన్నూ గుర్తుపెట్టుకోండి!’ అని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అభ్యర్థించినా చెలిమికి సిద్ధపడని టీఆర్ఎస్ సిద్ధపడలేదు. ఆ వైఖరితోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పట్ల బీజేపీకి ఉన్న మొహమాటాలు, తెలంగాణ విషయంలో లేకుండా చేశాయి. పైగా తనకు బద్ధ శత్రువైన మజ్లిస్‌కు అధికార పార్టీ అందిస్తున్న స్నేహహస్తం కూడా బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్‌లో లేని రాజకీయ అవకాశాలను ఇచ్చింది. తెలంగాణలో మెత్తబడుతున్న కమలం? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారతీయ జనతా పార్టీ రాష్ర్ట ప్రభుత్వం మీద కొంత విమర్శనాత్మకంగా వ్యవహరించినా, రాను రాను ఆ పార్టీ వైఖరిలో అధికార పక్షం పట్ల కొంత మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ నుంచి కొత్తగా వెలువడుతున్న దినపత్రికకు ఆది వారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం స్పష్టం చేసినట్టే కనిపించింది. ‘ప్రభుత్వాన్ని తొందరపడి విమర్శించం!’ అన్నారు కిషన్‌రెడ్డి. ఎవరైనా చెయ్యాల్సింది అదే. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షం, అందునా కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ వంటి పార్టీ బాధ్యతగా వ్యవహరించవలసిందే. కానీ అదే ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు మరోమాట కూడా అన్నారు, ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌వి మంచి నిర్ణయాలే’ అని. 2019లో స్వతంత్రంగా పోరాడి గెలవడం తమ పార్టీ లక్ష్యం అని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. అంటే ఈ అయిదు సంవత్సరాలూ బీజేపీ శక్తియుక్తులన్నీ పార్టీని బలోపేతం చెయ్యడం మీదనే కేంద్రీకరిస్తుందని అర్ధం. ఆ పని ప్రారంభించామని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. తప్పు లేదు. కానీ ఈ ఏడు మాసాల కాలంలో తెలంగాణ ముఖ్య మంత్రి అన్నీ మంచి నిర్ణయాలే తీసుకున్నారన్న కిషన్‌రెడ్డి మాటలు మాత్రం రాజకీయ పరిశీలకులలో పలు సందేహాలు కలిగించే విధంగా ఉన్నాయి. నాయకుల పరస్పర విరుద్ధ వైఖరులను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ బాట పట్టిందేమో అన్న సంశయం కలగక మానదు. బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి స్వరం ఒక లాగా వినిపిస్తే, ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వరం అందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ ఇంటర్వ్యూని బట్టి అర్థం అవుతున్నది. నిన్నటి దాకా కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, సమగ్ర సర్వే నుంచి మొదలై గోల్కొండ కోట మీద జెండా వందనం జరిపిన దగ్గర నుంచి నిన్నటి వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చే ప్రతిపాదన వరకు చేసిన తీవ్ర విమర్శలన్నీ ఏమయ్యాయి? తాము పొరపాటుగా విమర్శించాం, ఇప్పుడు ఆ పొరపాటును సరిచేసుకున్నాం అని కూడా చెబితే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చిన వాళ్లు అవుతారు. మంచిని ఆహ్వానిస్తాం, తప్పు చేస్తే విడిచి పెట్టం అనాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వానివి అన్నీ మంచి నిర్ణయాలే అనడం విడ్డూరం. చట్టసభలో సంఖ్య రీత్యా తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీ కాకపోవచ్చు కానీ, ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎది గిన పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న ఈ వైఖరి ఇతర పక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు లాభించేదే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మిత్ర పక్షంగా ఉండి అధికారంలో భాగస్వామి కూడా అయిన బీజేపీ తెలం గాణకు వచ్చే సరికి తన వైఖరి కొంత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకో వడం చూస్తే 2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో జెండా ఎగురవేయాలన్న మోదీ, అమిత్‌షా ద్వయం వ్యూహం భవిష్యత్తు ఏమిటో బీజేపీ పెద్దలే ఆలో చించుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకునే క్రమంలో బీజేపీ ప్రస్తావన వచ్చినందునే ఈ విషయాల ప్రస్తావన. అందరినీ కలుపుకుని పోవడమే మార్గం మరోసారి కాంగ్రెస్ పార్టీ గత వారం ప్రారంభించిన రెండు రాష్ట్రాల ఆందో ళనల దగ్గరికి వద్దాం. రాష్ర్ట విభజన భారాన్ని మోస్తూ నడవలేక నడుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో, తీవ్రమైన అనైక్యత, అంతర్గత కుమ్ములాటలను వెంట వేసుకుని కుంటుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనల బాట పట్టింది. తెలంగాణలో ప్రజావసరాలను లెక్క చెయ్యకుండా ఆస్పత్రిని 70 కిలోమీటర్ల దూరం తరలించి ఆ స్థలంలో రాష్ర్ట సచివాలయ నిర్మాణానికి సంకల్పించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో రాజభవన్, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభు త్వంలో భాగస్వామిగా ఉండి కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతి పత్తి సాధించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న సర్కార్ వైఖరికి నిరసనగా కోటి సంతకాల ఉద్యమం... ఈ రెండూ తప్పనిసరిగా ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రభుత్వ వైఖరుల పట్ల ప్రతిఘటనే. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలను ఇందుకు అభినందించాల్సిందే. ఇక్కడా అక్కడా ప్రతిపక్షాలను రవ్వంత కూడా ఖాతరు చేయని నాయకులే పాలకు లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచీ అక్కడి ప్రధాన ప్రతిపక్షం ప్రతి సమస్య మీదా తనదైన పద్ధతిలో స్పందిస్తూనే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి దాకా ఆందోళన సాగిస్తూనే ఉంది. 66 మంది శాసన సభ్యులు ఉన్నా; తమకూ, ప్రతిపక్షానికీ ఐదు లక్షల ఓట్లే తేడా ఉన్నా ప్రతిపక్షమే లేదని భ్రమల్లో నివసిస్త్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉన్న ప్రతి పక్షాలను ఖతం చేసే కార్యక్రమం ప్రధానంగా ఎంచుకున్న తెలంగాణ ముఖ్య మంత్రుల ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా రాజకీయంగా బీజేపీతోనూ టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొనిపోనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్లు నడిపినా ప్రయోజనం ఉండదు. datelinehyderabad@gmail.com -
దోషమంతా రాజయ్యదేనా?!
డేట్లైన్ హైదరాబాద్ మొదటి నుండీ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి తీరు కొంత అభ్యంతరకరమే. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ఆయనను అవమానించడం మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఎట్లా సాధ్యం? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని రాజయ్యను ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుండి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనలేకపోయిన తీరును జోడించి రాజయ్యకు ఉద్వాసన పలికారు. రాష్ర్ట గవర్నర్లు శాసనసభల్లో ప్రసంగించినా, రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనంలో మాట్లాడినా ‘నా ప్రభుత్వం’ అంటూ తమ ఉపన్యాసాలు మొదలు పెడతారు. మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మాత్రం ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ మాట్లాడే అవ కాశం లభించింది. జనవరి 26 ఉదయం ఆయన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొని, వెంటనే హైదరాబాద్ చేరుకొని అక్కడా తెలంగాణ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఆయనకు ఆ అరుదయిన అవకాశం లభించింది. శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగాలను రాష్ర్ట ప్రభుత్వమే తయారుచేసి మంత్రివర్గం ఆమోదం తీసుకుని మరీ ఖరారు చేస్తుంది. గవర్నర్ అదే ప్రసంగాన్ని శాసనసభలో చదువుతారు. రిపబ్లిక్ దినోత్సవం నాటి గవర్నర్ ప్రసంగాన్ని అట్లా ప్రభుత్వమే తయారు చేయక పోయినా, అది పంపిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాల ఆధారం గానే రాజభవన్లో రిపబ్లిక్ డే ప్రసంగం తయారవుతుంది. సాధారణంగా అది కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించేదిగానే ఉంటుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ తన ప్రభుత్వం అవినీతి రహిత బంగారు తెలంగాణను అందిస్తుందని చెప్పారు. అవినీతి అంశంపైనే ఉప ముఖ్య మంత్రి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన మరునాడే గవర్నర్ రాజకీయ అవినీతి నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని చెప్పడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ అది తెలంగాణ సమాజంలోకి కొన్ని సంకేతాలు వెళ్లడానికి దోహదపడిందనే చెప్పాలి. రాజకీయ అవినీతిని కచ్చితంగా పట్టిపల్లార్చవలసిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. పూర్తి అవినీతి రహిత పాలన నెలకొన్నప్పుడే దాన్ని సమర్థవంతమైన పాలనగా గుర్తించాల్సి ఉంటుంది. సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వరా? రాజకీయ అవినీతి రాజయ్యతోనే ఆరంభం అయిందా? ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడంతోనే అంతమైపోబోతున్నదా? దేశంలో, రాష్ర్టం లో ఎంతో కాలంగా రాజకీయ అవినీతివేళ్లూనుకుని ఉన్నది కాబట్టి రాజయ్య వంటి నాయకులు అవినీతికి పాల్పడితే క్షమించెయ్యాలని ఎవరూ అనరు. కాకపోతే ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుండానే, కనీసం వాటికి సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఒక ఉపముఖ్యమంత్రిని హఠాత్తుగా బర్తరఫ్ చేశారు. కాబట్టే ఈ ప్రశ్నలు అడగవలసి వస్తున్నది. మంత్రివర్గంలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని తొలగించాలి అన్న విష యంలో ముఖ్యమంత్రికి ఉన్న పూర్తి అధికారాన్ని ఎవరూ ప్రశ్నించడానికి లేదు. అయితే మంత్రివర్గంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఉన్నవాళ్లే. కాబట్టి వారిపై తీసుకునే చర్యల గురించి చర్చించే హక్కు ప్రజలకు ఉంటుంది. రాజయ్యను తొలగించడం నిర్దాక్షిణ్యమని ఎందుకు అనాల్సివ స్తోందంటే మంత్రి వాదన వినడానికి సమయం కూడా ఇవ్వకుండా ముఖ్య మంత్రి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధిని, ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, వారి తరఫున అడిగే హక్కు ప్రతిపక్షాల వారికీ ఉంది. అలా అని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లాగా ప్రతిపక్షాల వారు తలాతోకా లేని విమర్శలు చెయ్య కూడదు. 1999లో చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణల కారణంగానే కే చంద్రశేఖరరావును మంత్రి పదవి నుంచి తొలగించారనడం దయాకర్‌రావు రాజకీయ అనుభవానికి తగ్గ మాట కాదు. ఒక వేళ కేసీఆర్ నాడు ఆ కారణం గానే మంత్రి పదవిని కోల్పోయి ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ఎవరు అవినీతికి పాల్పడినా చూస్తూ ఊరుకోవాలని ఆయన చెప్పదల్చుకున్నారా? అదలా ఉంచితే, దయాకర్‌రావు మాటలు నిజమైతే అదే అవినీతిపరుడిని చంద్రబాబు తన ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్‌గా ఎలా ఉంచుకున్నారు? 1999లో జరిగిందేమిటో అందరికీ తెలుసు. కేసీఆర్ సామా జిక వర్గానికే చెందిన ఐపీఎస్ అధికారి, ిసీబీఐ మాజీ ైడెరైక్టర్ విజయ రామారావును మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగు తుందనేది నాటి చంద్రబాబు ఆలోచన. క్లిష్ట సమయంలో తన వెంట ఉన్న నాయకులను కాదని చంద్రబాబు ఆ రోజుల్లో తటస్థులను తెచ్చి అందలం ఎక్కించారన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు వ్యవహార శైలి దయాకర్‌రావుకు తెలియదనుకోవాలా? రాజయ్య రాజకీయ భవిత ప్రశ్నార్థకమే ఇంతకూ రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్యకు పిల్లల ైవైద్యుడిగా మంచి పేరు ఉండేది. రాజయ్య స్థానంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిని ఓడించి గెలుపొందారు. తరువాత టీఆర్ఎస్లో చేరి పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో కూడా శ్రీహరిపై గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన 2014లో మూడోసారి గెలుపొందారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడం కాదుగదా, కనీసం ఆయన వాదనైనా వినకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి, నిన్నటి దాకా ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడినే ఆ స్థానంలో నియమించడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ్ధకంగా మారడం నిజం కాదా? అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన రాజయ్యకు 2019లో తెలంగాణ రాష్ర్ట సమితి అసెంబ్లీ టికెట్ ఇస్తుందా? లేక అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన శ్రీహరికి టికెట్ ఇస్తుందా? ఇదేమీ లక్ష కోట్ల డాలర్ల ప్రశ్న కాదు. రాజీనామాలు, ఉప ఎన్నికలు అచ్చి వచ్చాయా? కడియం శ్రీహరి పరిపాలన అనుభవం ఉన్న నాయకుడే. ఆయన, ముఖ్య మంత్రి కేసీఆర్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా కలసి పనిచేసిన వారే. విద్య, భారీ నీటి పారుదల వంటి శాఖలను నిర్వహించిన అనుభవం శ్రీహరికి ఉంది. పైగా డాక్టర్ రాజయ్య సామాజిక వర్గానికే చెందిన దళిత నాయకుడు కూడా. కాబట్టి శ్రీహరిని తన మంత్రివర్గంలో ప్రధాన స్థానంలో చేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని ఆక్షేపించవల సిన అవసరం లేదు . కాకపోతే ఇప్పుడు శ్రీహరికి శాసన మండలి సభ్యునిగా స్థానం కల్పించాలి. ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో బాటు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా మండలి సభ్యులుగానే మంత్రి వర్గంలో ఉన్నారు. తెలుగుదేశం నుండి తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవిలో కూర్చోపెట్టిన తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే శాసనమండలి సభ్య త్వం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు శ్రీహరి కూడా ఆ వరుసలో నిలబడాలి. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంటు స్థానానికి అనవసరపు ఖర్చుతో కూడుకున్న ఉప ఎన్నిక ఇప్పుడు అవసరమా? రాజీనామాలు, ఉప ఎన్నికలు మాకు కొత్తేమీ కావు, పైగా అచ్చివొచ్చా యని టీఆర్ఎస్ నేతలు వాదించవచ్చు. కానీ వీటన్నిటికీ కారణమయిన డాక్టర్ రాజయ్య ఉద్వాసన తీరు మాత్రం సమర్థనీయంగా లేదు. ఆయన వాదనా వినలేదు. ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టి తప్పు చేశాడని నిర్ధారించనూ లేదు. మొదటి నుండీ డాక్టర్ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కొంత అభ్యంతరకరంగానే కొనసాగింది. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ముఖ్యమంత్రి రాజయ్యను అవమానిం చిన సంఘటన మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎట్లా సాధ్యం? అది అయ్యే పనేనా? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని డాక్టర్ రాజయ్యను ఆయన ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను సకాలంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన తీరును జోడించి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పదవిని ఊడగొట్టారు. ఈ ఉద్వాసనతో ముఖ్యమంత్రి అవినీతిని సహించని చండశాసనుడని కొద్ది రోజులు చెప్పుకోవచ్చు. కానీ బీరువాలో ఇంకెన్ని కంకాళాలు ఉన్నాయో! అవి బయటపడిన నాడు కింకర్తవ్యమ్. ఈ లోగా ఒక నాయకుడి రాజకీయ భవితవ్యాన్ని అగాధంలోకి నెట్టినట్టే కదా! datelinehyderabad@gmail.com -
ప్రకటనలతో పవనాలు వీచేనా!
డేట్లైన్ హైదరాబాద్ చంద్రబాబునాయుడు కొంతకాలంగా తమది జాతీయ పార్టీ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయినందున, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ఉన్నందున సాంకేతికంగా మాది జాతీయ పార్టీ అని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అంత తొందరగా బయటపడకపోవచ్చు. ప్రఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వ హించాలని తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు జనవరి 18న, అంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ దయాకర్‌రావు ప్రభుత్వాన్ని ఈ కోరిక కోరారు. ఆ మరునాడే తెలంగాణ జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలనూ, కిందిస్థాయి నాయకులనూ ఉత్సాహపరచాలని పార్టీ అధినేత, పక్క రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడును దయాకర్‌రావుతో పాటు అదే పార్టీకి చెందిన ఇతరులు కూడా కోరారని వార్తలు వచ్చాయి. చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమానికి ‘సరే’న న్నారట. ఫిబ్రవరి నుంచి నెలకు రెండు మూడు జిల్లాల చొప్పున చంద్రబాబు తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణులకూ, నాయకులకూ దిశా నిర్దేశం చేస్తారని దయాకర్‌రావు, ఎల్. రమణ చెప్పారు కూడా. ఏమి ఆశించి కోరుతున్నారు? ఈ దేశ పౌరసత్వం కలిగిన వారు ఎవరైనా సరే ఒక్క తెలంగాణ అని ఏమిటి? దేశంలోని ఏ రాష్ర్టంలోనైనా పర్యటించవచ్చు, ప్రజలను కలుసుకోవచ్చు, రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు, పోటీ చెయ్యవచ్చు. ప్రజలు గెలి పిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కూడా సాగించవచ్చు. ఒక్క జమ్మూ కశ్మీర్ మాత్రం దీనికి మినహాయింపు. కాబట్టి చంద్రబాబునాయుడి తెలంగాణ రాష్ర్ట పర్యటనను ఎవరూ అడ్డుకోనవసరంలేదు. అభ్యంతర పెట్ట డం కుదరదు కూడా. ఇక ఎన్.టి. రామారావు జయంతి, వర్ధంతి అధికారి కంగా జరపాలన్న డిమాండ్ విషయానికి వస్తే- ఎన్టీఆర్ ఒక అద్భుత నటుడు. కొన్ని మంచి ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో రాజ కీయాలలోకి వచ్చి, అనేక మలుపుల మధ్య అర్ధంతరంగా నిష్ర్కమించారు. కాబట్టి ఆయన పేరు మీద ఉత్సవాలు నిర్వహించమని కోరడంలో తప్పు లేదు. కానీ దయాకర్‌రావు ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో, ఎవరిని ఈ కోరిక కోరుతున్నారో ఒక్కసారి పరిశీలిస్తే ఇదంతా హాస్యాస్పదమనిపిస్తుంది. ఏ పరిస్థితులలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందో ఆయనకు బాగా తెలుసు. సమైక్యవాది అయిన ఎన్.టి. రామారావు జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపదనీ బాగా తెలుసు. మరి ఏమి ఆశించి ఆయన ఈ ప్రకటన చేసినట్టు? ఇంత రాజకీయ అనుభవం కలిగిన దయా కర్రావు పరిస్థితి ఏమిటి అని ఎవరైనా అనుమానించే అవకాశం అయితే కచ్చితంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏది డిమాండ్ చెయ్యాలో తెలి యని అగమ్యగోచర స్థితిలో పడిపోయి దయాకర్‌రావు ఎన్టీఆర్ పేరిట అధికా రికంగా వేడుకలు జరపండని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతు న్నారనుకోవాలా? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొన్ని దశాబ్దాలుగా శాసన సభకు వరుసగా ఎన్నికవుతున్న, ప్రజాదరణ కలిగిన నాయకుడని పేరు కలి గిన దయాకర్‌రావు మానసికస్థితి తెలంగాణ రాష్ర్టంలో ఆయన పార్టీ ఉన్న స్థితికి అద్దం పట్టేలా ఉంది. వర్ణించడానికి వీల్ల్లేనంత గందరగోళంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ, దాని నాయకులూ ఉన్నారన్నది స్పష్టం. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొంతకాలంగా తమది జాతీయ పార్టీ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలయినందున, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ఉన్నందున సాంకే తికంగా మాది జాతీయ పార్టీ అని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అంత తొందరగా బయటపడకపోవచ్చు. అక్కడ ఒక కోటరీ అధినాయకుడి చుట్టూ చేరి, ఇతరులెవరినీ, చివరికి సీనియర్ నాయకులు, మంత్రులను కూడా ముఖ్యమంత్రికి దూరంగా పెడుతున్నందుకు అసంతృప్తి అప్పుడే రాజుకుం టున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయం ఇంకోసారి మాట్లాడుకుందాం. తెలంగాణ విషయానికే వద్దాం. కంటోన్మెంట్ పాఠం కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో రాయి ఏరబోయిందన్న సామెతను గుర్తుకు తెస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఏడు మాసాలలో అధికారంలో ఉండి ఏమేమి పనులు చెయ్యగలిగారో వారికే అర్ధం కాదు. కానీ తెలంగాణ లో ఇప్పటి వరకు పర్యటించకపోవడానికి కారణం కొత్త ప్రభుత్వానికి ఆరు మాసాలయినా సమయం ఇవ్వాలన్న సంయమన ధోరణేనట. మొన్ననే జంటనగరాలలో కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి. నిజానికి చాలా చిన్న ఎన్నికలు ఇవి. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నంత పెద్ద ఎన్నికలేమీ కావు. ఎనిమిది డివిజన్లు, లక్షన్నర మంది ఓటర్ల్లు ఉన్న చిన్న బోర్డు. అందునా 40 శాతానికి మించి ఓట్లు పోల్ కాలేదు కూడా. రెండు స్థానాలలో తిరుగుబాటు అభ్యర్థులు గెలిస్తే వాళ్లను కూడా తమ ఖాతాలో వేసుకుని ఆరు మేమే గెలిచాం, కాబట్టి భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మాకు ఢోకా లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతోషపడిపోతున్నారు. అయితే అవి పూర్తిగా నగర ప్రాంతంలో జరిగిన ఎన్నికలు. 2014 ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం గెలిచినా 15 స్థానాలలో పది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాగా, మిగిలిన అయిదు మాత్రం నాలుగు జిల్లాల నుంచి గెలిచారు. తెలంగాణలో అయిదు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలలో బోణీ కూడా చెయ్య లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ లో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో కలసి పోటీ చేసినా ఆ పార్టీ అడ్రస్ లేకుండాపోయిన ఈ చిన్న కంటోన్మెంట్ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. నానాటికీ తీసికట్టు తెలంగాణ శాసనసభలో 119 స్థానాలకుగాను (బీజేపీతో పొత్తు పెట్టుకున్నా) 15 స్థానాలు మాత్రమే గెలిచిన తెలుగుదేశం వాటిని కూడా నిలబెట్టుకోలేని స్థితిని మనం చూస్త్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ముగ్గురు శాసన సభ్యులు ఆ పార్టీని విడిచి, అధికార పార్టీకి వలసపోయారు. సంఖ్య పన్నెండుకు తగ్గింది. ఆ ముగ్గురు శాసనసభ్యులు వలసపోయిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. వేరొక పార్టీ నుంచి గెలిచారు కాబట్టి శాసన సభ్యత్వాలకు రాజీనామాలు ఆమోదింపచేసుకుని అధికార పార్టీలో చేరితే అంతా హర్షించేవారు. వారిని ఆ విషయంలో నిలదీసే స్థితిలో తెలుగుదేశం అధినాయకత్వం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న పనీ అదే. కాబట్టి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ! అంటారన్న వెరపు. అధికార పార్టీలోకి వలసపోయిన ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ చేత ఆమో దింపచేసేందుకు ఒత్తిడి పెంచే పని మరిచిపోయి, దయాకర్‌రావు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి అధికారికంగా జరపాలని తెలంగాణలో డిమాండ్ చెయ్య డం హాస్యాస్పదం. శాసనసభా పక్షమైనా మిగిలేనా! ఇప్పుడు ఇంకో అయిదుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజా సమాచారం. తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం రోజురోజుకూ ఖాళీ అవుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. చంద్రబాబునాయుడు పర్యటనలతోనో, లోకేశ్ బాబు ప్రవచనాలతోనో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ర్టంలో ప్రజా సమ స్యల మీద పోరాటం చెయ్యగల సమర్థ నాయకత్వం ఎదిగి, ఆ నాయకత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరం డాలో పడిగాపులు పడే అవస్థ నుంచి తప్పించుకుంటేనే అది సాధ్యం. తెలంగాణ శాసన సభాపక్షాన్ని ఖాళీ చేసే పనిలో పడ్డ అధికార పార్టీ జోరుకు అడ్డుకట్ట వేసే స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం ఉన్న సూచనలేమీ కనపడటం లేదు. datelinehyderabad@gmail.com -
గతం మిథ్య.. విపక్షం మిథ్య
డేట్లైన్ హైదరాబాద్ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యానికీ ఉన్న అర్ధాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని, ఆయన మామగారు ఎన్.టి. రామారావు అసెంబ్లీలోకి అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్స రంలో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకైపైన ప్రతి శనివారం తమ పార్టీ శాసనసభ్యులను కలుసుకోవడానికే రోజంతా కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గత శనివారం ఆయన ఓ 30 మంది శాసనసభ్యులతో విడివిడిగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై వారి సమస్యలు విన్నారు. పనిలో పనిగా కొంత మంది నాయకులతో కలసి మేధోమథనం కూడా చేశారు. ఈ మేధోమథనానికి ప్రాతిపదిక ఆరునెలల తన ప్రభుత్వ పనితీరు మీద చేయిం చిన సర్వేలో వెల్లడైన ఫలితాలు. ఇందులో విశేషం ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన పనితీరు మీద ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇటువంటి సర్వేలు చేయించుకోవడం సహజం. అధికార పార్టీకి ఇది మరీ అవసరం. ఈ కార్యక్రమం అంతటినీ పత్రికలు నివేదించాయి. ఒకటి రెండు పత్రికలు ఈ సమావేశాల గురించి రిపోర్ట్ చేసిన తీరు, రాసిన వివరాలు చూసిన వారెవరయినా ప్రజాస్వామ్యం ఇట్లా ఉంటుందా లేక తెలుగు దేశం అధినేత, ఆయనను, ఆయన పార్టీని సమర్ధిస్తున్న మీడియా పెద్దలు ప్రజా స్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారా అని ఆశ్చర్యపోక మానరు. ఏపీలో ప్రతిపక్షం లేదట... ఇంతకూ ఆ పత్రిక ఏం రాసిందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదు, అట్లా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, స్వీయ సమీక్షలు చేసుకుందాం అని ముఖ్య మంత్రి తన పార్టీ నాయకులకు హితబోధ చేసినట్టుగా ఆ పత్రిక రాసింది. పైగా నేనట్లా అనలేదు అని ముఖ్యమంత్రి ఖండించలేదు కాబట్టి ఆయన అదే మాట అని ఉంటారన్నది ఖాయం. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి అందులో ఎనిమిది సంవత్స రాలకు పైబడిన పరిపాలనానుభవం కలిగి, ఢిల్లీ పీఠం మీద ప్రధానమంత్రు లను ప్రతిష్టించి మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం అంటే ఏమిటో ఎవరూ చెప్పనక్కరలేదనుకుంటా. కానీ ఆయన అట్లానే మాట్లాడుతున్నారు. 67 మంది శాసనసభ్యులు, 8 మంది పార్ల మెంట్ సభ్యులతో ఏకైక బలమైన ప్రతిపక్షం శాసనసభలో తన కళ్లెదుట కనిపి స్తున్నా కూడా చంద్రబాబు నాయుడూ, ఆయనను గుడ్డిగా సమర్ధించడమే ధ్యేయంగా పెట్టుకున్న మీడియాలోని ఒక వర్గం కళ్లు మూసుకుని ఇదే నిజం, ఇక్కడ ప్రతిపక్షం లేదు అని పదే పదే జపం చేస్తే ప్రతిపక్షం లేకుండా పోతుం దా? తమను తాము నమ్మించుకునే ప్రయత్నంలో ఆత్మవంచన చేసుకోగలరేమో కాని ప్రజలను నమ్మించలేరు కదా! నిజానికి ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్న అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుకే బాగా తెలిసి ఉండాలి ప్రతి పక్షం అంటే ఏమిటో? ఆ పక్షం బాధ్యత ఏమిటో? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఏమిటో? గతాన్ని మరచిపోయారా? 1989 నుంచి 1994 వరకు, ఆ తరువాత 2004 నుంచి 2014 వరకూ అంటే పది హేను సంవత్సరాల పాటు శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చున్న అనుభవా లను ఆయన, ఆయనను ఈ విషయంలో సమర్ధిస్తున్నవారు ఒక్కసారి నెమ రేసుకుంటే బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుభవం ఎంత? ఎన్ని సీట్లు గెలిచింది? చట్టసభలో దాని బలమెంత? అన్న విషయాలు పక్కన పెడితే, అసలు ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ఆయన సమర్ధకుల నిఘంటువులో ఏం రాసి ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, అభిమానించే, దానినే జీవన విధానంగా ఎంచు కుని బతుకుతున్న వారిలో కలగడం సహజం. అవసరాన్ని బట్టి అర్థాలు మారతాయా? అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యా నికీ ఉన్న అర్థాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని ఆయన మామగారు ఎన్.టి.రామారావు అసెంబ్లీలోకి అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. చాలా ఏళ్లు గడిచాయి కాబట్టి అది ఆయనకు గుర్తుండక పోవచ్చు. తాజాగా ఏడుమాసాల క్రితం వరకు కూడా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నిసార్లు ప్రతిపక్షం ప్రాధాన్యం గురించి, ప్రజాస్వామ్యంలో దాని అవసరాన్ని గురించి ఉపన్యాసాలు ఇచ్చారో అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయనను సమర్ధించే వారు ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థల పెద్దలు సమయానుకూలంగా నిర్వచనాలు మార్చేస్తూ ఉంటారనడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 1980, 1990 దశ కాలలో జరిగిన రెండు ఆగస్టు సంక్షోభాలు, రెండు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాలు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. 1984లో ఎన్.టి. రామారావు మీద తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కరరావు వీరి దృష్టిలో ప్రజాస్వామ్య హంతకుడు అవుతారు, అదే ఎన్.టి. రామారావును 1995 ఆగస్టులో పదవీచ్యు తుడిని చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడు అవుతారు. ఇట్లా అవసరాన్ని బట్టి అర్థాలు, నిర్వచనాలు మారిపోతుంటాయి. ఇప్పుడు రాష్ర్టంలో ప్రతిపక్షం లేదన్నది కూడా అట్లాంటి అవసరం కోసమే వారు మాట్లాడుకుంటున్నారని వేరే చెప్పనక్కర లేదు. విపక్షనేతకు మాత్రం స్వేచ్ఛ లేదు రాష్ర్టంలో ప్రతిపక్షం లేదు అన్నమాటకు కొనసాగింపుగా ఆయన ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. రాష్ర్టంలో ప్రతిపక్షం లేదనీ, కాంగ్రెస్‌కు ఉనికి లేదనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండదని ఆయన వ్యాఖ్యా నించడంతోపాటు, అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండడం తగదని చంద్రబాబు హితవు పలికారు. సోమ వారం ప్రభు త్వం రాజధాని నిర్మిస్తానం టున్న గ్రామాల రైతులు ప్రతి పక్ష నాయకుడు జగన్మో హన్ రెడ్డిని కలుసుకుని వారి గోడు వినిపించినప్పుడు ఆయన ఈ ప్రభుత్వం రెండు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని వ్యాఖ్యానించినం దుకు ఒక్క గంట కూడా గడ వకుండా రాద్ధాంతం మొద లు పెట్టిన తెలుగుదేశం పెద్దలు, వారిని సమర్ధిస్తున్న మీడియా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండదు అని చంద్రబాబు దిశానిర్దేశం చేసినప్పుడు అదెట్లా అని అడగలేదు ఎందుకని? ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్య తప్పయిన ప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఒప్పు ఎట్లా అయింది? అంకెల ప్రకారమే మాట్లాడుకున్నా అధికార తెలుగుదేశం పార్టీకీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఓట్ల తేడా 5 లక్షలు. అంటే రెండు శాతం మించలేదు. మరి ప్రతిపక్షం లేకుండాపోయింది ఎట్లాగో తెలుగుదేశం రాజకీయ పండితులు చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా! ప్రతిపక్షాన్ని లెక్కచెయ్యక పోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడ మన్న విషయం మన అధికార రాజకీయ నాయకులకూ, వారి పక్షం వహిస్తున్న పెద్దలకూ ఎన్నటికి అర్థం అవుతుందో? ఒక్క సీటు కూడా అసెంబ్లీలో గెలవ లేదు కాబట్టి కాంగ్రెస్‌కు ఉనికి లేదంటారు ముఖ్యమంత్రి. వామపక్షాల ఊసు లేనే లేదు. ఎన్నికల అవసరానికి వామపక్షాలతో స్నేహం చేసిననాడు వాటికి ప్రజలలో ఉండే ఆదరణ, ప్రజా సమస్యల మీద వారు చేసిన పోరాటాలు తమ అవసరానికి కావాలి, చట్ట సభలలో సీట్లు రాకపోతే మాత్రం ఆ పక్షాలు అస్తిత్వం లో లేనట్టే లెక్క. సీట్ల సంఖ్య మీద ఆధార పడి ప్రతిపక్ష పాత్ర ఉండదని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే స్పృహ, దీక్ష మీద ఆధారపడి ఉంటుందని ఆయనకు అర్థం కాదు. 1999లో మొదటిసారి ఎన్నికలలో వాజపేయి, కార్గిల్ ఇమేజ్‌తో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక శాసనసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి ఒక్క స్థానం కూడా లేదని ప్రజా సమస్యల మీద అఖిలపక్షానికి పిలవని నాయ కుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ర్ట విభజన జరిగి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడు మాసాలలో జరిగిన ఆ రాష్ర్ట శాసనసభ సమావేశమయిన మూడు పర్యాయాలు ప్రతిపక్షాన్ని గౌరవించే, అసలు దాని ఉనికిని భరించే స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదని తేటతెల్లమయింది. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న వ్యవహారం దాన్ని మరింత బలపరుస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పట్టించుకోను అంటే ప్రజలే ప్రతిపక్ష మయ్యే పరిణామం చోటు చేసుకుంటుందని ఏలినవారు ఎవరయినా గుర్తిం చడం బాగుంటుంది. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 98480 48536)