సాక్షి, హైదరాబాద్: ఏపీలో జర్నలిస్టుల గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కరెక్ట్ కాదు అంటూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సమస్యల గురించి శ్రీనివాస్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు.
కాగా, దేవులపల్లి అమర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు చంద్రబాబును సీఎం చేయడానికి తాపత్రయపడుతున్నారు. జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి. విజయవాడలో అఖిలపక్ష సమావేశం పత్రిక స్వేచ్ఛపై కాదు ప్రభుత్వాన్ని దూషించడానికే జరిగింది. జర్నలిస్ట్ సమస్యలకు రాజకీయ రంగు పులమొద్దు.. గాలికి మాట్లాడవద్దు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వాల పట్ల శ్రీనివాస్ రెడ్డి ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో నల్ల చట్టం తెచ్చింది శ్రీనివాస్ రెడ్డి మర్చిపోయారా?. తమకు అనుకూలంగా లేని మీడియాపై చంద్రబాబు వేధింపులు మర్చిపోయారా?. జర్నలిస్టులకు న్యాయం జరిగింది వైఎస్సార్ హయాంలోనే కదా. ఏపీ సర్కారుపై కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నది కనిపించడంలేదా?
తెలంగాణలో జర్నలిస్ట్ ఇంటి స్థలాలపై సుప్రీం తీర్పు కూడా వచ్చింది. ఆలస్యం చేయకుండా జవహర్ హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు చనిపోయారు. వారి కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే ఆ భూములను జర్నలిస్టులకు అప్పగించాలి. జవహర్ సొసైటీ సభ్యులతో పాటుగా మిగతా జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలి అని తెలిపారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలు.. సజ్జల ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment