రాజకీయాల్లో కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఉంటుందని.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీనియర్ జర్నలిస్టు దేవుపల్లి అమర్ చురకలు అంటించారు. నాటకాలు, సినిమాల్లో కాసేపు కనిపించి మెరుపులా వచ్చి వెళ్లిపోయే అతిథి పాత్రలు ఉంటాయి. రాజకీయాల్లో అటువంటి పాత్రే పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలనివ్వను. మొత్తం అందరిని కలుపుకునిపోతాను. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కానివ్వను.. ఇది నా శాసనం. వారహిపై రాష్ట్రం అంతా తిరుగుతా అని చెప్పిన పవన్.. మళ్లీ మాయం అయిపోయాడు. రెండు, మూడు మాసాలు కనిపించలేదు. నిన్న మళ్లీ హఠాత్తుగా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన ఒక వ్యాఖ్యపై పలువురు ఏపీ మంత్రులు రియాక్షన్‌పై వీడియో చేశారు. మంత్రులు రియాక్ట్ కావడాన్ని పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్‌రావు ఏ సందర్భంలో ఆ వాఖ్యలు చేశారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇలా రియాక్ట్ కావాల్సింది కాదంటారు పవన్..
ముందు హరీష్‌రావు ఏ సందర్భంలో ఏం మట్లాడారో తెలుసుకుని పవన్ మాట్లాడితే బాగుండేది. రాజకీయాల్లో గెస్ట్ అప్పిరియన్స్‌లా ఉంటే ఇలానే ఉంటుంది. విషయాలు సరిగ్గా తెలియకుడా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. హఠాత్తుగా తెలంగాణ ప్రజలపై పవన్ కల్యాణ్ ప్రేమ కురిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఏపీ మంత్రులపై కన్నెర్ర చేస్తున్నాడు. హరీష్ వ్యాఖ్యలకు రియాక్షన్‌గా ఏపీ మంత్రులు వారి అభిప్రాయాలు వారు చెప్పారు. మధ్యలో పవన్ కల్యాణ్ వచ్చి ఏపీ మంత్రులే తప్పు చేశారన్నట్లు మాట్లాడుతున్నారు. కారణం ఉన్నా లేకపోయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించాలన్నది పవన్ వైఖరిగా కనబడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తుకువచ్చాయి.
గతంలో తెలంగాణ ప్రజల మనోభావాలను పవన్ కల్యాణ్ దెబ్బ తీశాడు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు, విభజన తర్వాత పవన్ ఏపీకి వెళ్లి అక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజుల పాటు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నానంటూ చేసిన వ్యాఖ్యల సంగతి ఆయన మరిచిపోయారా?. తెలంగాణ ప్రజల మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదా?. పవన్ కల్యాణ్‌ది అపరిపక్వ రాజకీయ పరిణితి.
చదవండి: ఆయనే ఓ పెద్ద లాబీయిస్ట్.. దానికి తోడు పిచ్చి రాతలు
పవన్ ఆలోచనలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడానికి కాదు.. ఆయన అవసరానికి మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానంటూ చంద్రబాబు తిరుగుతున్నాడు. ఆయనతో పాటు తెలంగాణలో లబ్ధి పొందడానికి తెలంగాణ భజన చేస్తున్న పవన్.. డ్రామాను తెలంగాణ, ఏపీ ప్రజలు అర్థం చేసుకోగలరని అమర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment