సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నేతృత్వంలో రచించిన ‘ప్రతి దినం ప్రజాహితం' పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఏడాదికాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే వైఎస్ జగన్ 90శాతం హామీలను అమలు చేశారని అభినందించారు. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అమర్, విజయమ్మతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఏపీని అగ్రస్థానంలో నిలిపారు : వైఎస్ విజయమ్మ
Published Fri, Jun 19 2020 11:59 AM | Last Updated on Fri, Jun 19 2020 12:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment