బిగ్‌బాస్‌ అబద్ధం చెపుతున్నాడు..! | Raai Lakshmi Denies Latest Rumour | Sakshi
Sakshi News home page

May 13 2018 1:16 PM | Updated on May 13 2018 5:48 PM

Raai Lakshmi Denies Latest Rumour - Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సౌత్‌లో కూడా ఘనవిజయం సాధించింది. తమిళనాట లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. తొలి సీజన్‌కు మంచి ఆదరణ లభించినందున త్వరలోనే మరో సీజన్‌ను స్టార్ట్ చేసేందుకు బిగ్‌బాస్‌ యూనిట్ రెడీ అవుతోంది.

రెండో సీజన్‌కు కూడా కమల్‌ హాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారు వీరే అంటూ వికటన్‌ సోషల్‌ మీడియా పేజ్‌లో కొంత మంది సెలబ్రిటీ ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ లిస్ట్‌లో జననీ, నందితా, భరత్‌, అశోక్‌ సెల్వన్‌, ప్రియా ఆనంద్‌ వంటి వారితో పాటు రాయ్‌ లక్ష్మీకూడా షోలో పాల్గొననుందని వెల్లడించారు.

ఈ వార్తలపై స్పందించిన రాయ్‌ లక్ష్మీతాను బిగ్‌ బాస్‌లో పాల్గొనబోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై తన సోషల్‌ మీడియా పేజ్‌ స్పందించిన ఆమె ‘బిగ్‌బాస్‌ తమిళ్ ఎందుకు నా గురించి ప్రతీ సీజన్‌లో తప్పుడు వార్తలు సృష్టిస్తోంది..? ఎందుకు..?’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement