'నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్‌బాస్‌ గొడవపై స్పందించిన నటి! | Kollywood Actress Vanitha Vijaykumar Reacts On Daughter Bigg Boss Fight | Sakshi
Sakshi News home page

Bigg Boss Tamil: 'తనకు నచ్చిన దారిలో వెళ్తోంది'.. బిగ్‌బాస్‌ గొడవపై స్పందించిన నటి!

Oct 8 2023 1:56 PM | Updated on Oct 8 2023 2:59 PM

Kollywood Actress Vanitha Vijaykumar Reacts On Daughter Bigg Boss Fight - Sakshi

ఇటీవలే మొదలైన తమిళ బిగ్ బాస్ మొదటి వారం నుంచే హాట్‌హాట్‌గా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్- 7లో ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కుమార్తె  జోవికా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లో మరో కంటెస్టెంట్‌ అయిన విచిత్రకు జోవిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. చదువు విషయంలో తలెత్తిన ఈ గొడవపై జోవికా తల్లి, మాజీ కంటెస్టెంట్ వనిత రియాక్ట్ ‍అయ్యారు. ఈ విషయంలో తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ఆమె ట్వీట్ చేశారు.  

వనిత తన ట్వీట్‌లో రాస్తూ.. 'తన ఆట తనను ఆడనివ్వండి. నా కూతురిని చూసి నేను గర్విస్తున్నా. తన కూతురు ధనిక కుటుంబం నుంచి రాలేదు. నేను కూడా నా జీవితంలో చాలా  కష్టపడ్డా. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతి బిడ్డ తన సొంత మార్గంలో వెళ్లాలనే ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. నేను ఒక తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. నా ఇద్దరు కుమార్తెలు వారి సొంత మార్గాల్లో రాణిస్తున్నారు' అని రాసుకొచ్చింది. 

అంతేకాకుండా తన కూతురు ప్రొఫెషనల్ యాక్టర్ అని.. రెండు సినిమాలకు సైన్ చేసిందని వనిత తెలిపింది. జోవిక తెలుగు, తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు పేర్కొంది. చిన్న వయస్సులో తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అంటూ రాసుకొచ్చింది. కాగా.. తొలివారంలో  ఐషు, అనన్య, చెల్లదురై, కూల్ సురేష్, జోవికా, ప్రదీప్, రవీనా దాహా, యుగేంద్రన్  నామినేట్ అయ్యారు. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో నుండి యుగేంద్రన్‌ ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement