మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌పై పలువురు సినీతారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్స్ సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా దీనిపై మాట్లాడారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజాగా హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ సినిమాల్లో కూడా ఉందని వెల్లడించింది. ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే తప్పా.. నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని తెలిపింది.
సనమ్ శెట్టి మాట్లాడుతూ..'హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నా. ఇలాంటి నివేదికను రూపొందించినందుకు జస్టిస్ హేమకు, కేరళ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తమిళ సినీ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ఎవరూ బయటికి చెప్పలేరు. నేను నా స్వంత అనుభవంతో దీనిపై మాట్లాడుతున్నా. తాను వ్యక్తిగతంగా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నేను నమ్ముతా" అని అన్నారు. కాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హేమ కమిటీ రిపోర్ట్ ఏంటంటే?
మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను ఆగస్ట్ 19న కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు కమిట్ అవ్వాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం సంచలనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది.
Comments
Please login to add a commentAdd a comment