
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న తాజా చిత్రం రెట్రో. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుచన్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కంగువా తర్వాత సూర్య నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి
తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్‌టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది.
#RETRO CBFC REPORT.
Duration: 2hrs 48mins 30secs
Certified: U/A #RetroFromMay1 pic.twitter.com/s5T1N6uX8i— Karthik Ravivarma (@Karthikravivarm) April 17, 2025
#Retro (UA) - 2 Hours & 48 Mins 🔥 pic.twitter.com/xK96rp5S7I
— Kolly Corner (@kollycorner) April 17, 2025