సూర్య 'రెట్రో' మెలోడీ సాంగ్‌ విడుదల | Suriya Retro Movie Lyrical Video Song Out Now | Sakshi
Sakshi News home page

సూర్య 'రెట్రో' మెలోడీ సాంగ్‌ విడుదల

Published Tue, Mar 4 2025 8:53 AM | Last Updated on Tue, Mar 4 2025 9:57 AM

Suriya Retro Movie Lyrical Video Song Out Now

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా సాంగ్‌ విడుదలైంది. కాసర్ల​ శ్యామ్‌ రచించిన ఈ పాటను కపిలన్‌ ఆలపించారు. రెట్రో నుంచి రిలీజ్‌ అయిన ఈ మెలోడీ సాంగ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. సూర్య జైలులో ఉన్న సీన్లతో ఈ పాట ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్‌ అంశాలతో తన కొత్త సినిమా రెట్రోను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్‌తో పాటు ఈ సాంగ్‌ను చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement