సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.
సూర్య కెరియర్‌లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు.
చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.
ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్
రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు.
Comments
Please login to add a commentAdd a comment