Karthik subbaraju
-
ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.సూర్య కెరియర్లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. -
మరో డైరెక్టర్ సాయం కోరిన శంకర్!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది రామ్‌చరణ్‌కు 15వ సినిమా కావడంతో ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ మూవీకీ సంబంధించిన అప్డేట్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మరో డైరెక్టర్ భాగస్వామ్యం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిని కార్తీక్ సుబ్బారాజుకు అప్పగించారట. ఓ స్ట్రాంగ్ లైన్‌ను కార్తీక్‌కు వివరించి దీనిపై పని చేయమని శంకర్ చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: RC 15: రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్! దీంతో కార్తీక్ సుబ్బారాజు స్క్రిప్ట్‌ను మరింత ఆసక్తిగా మలిచే పనిలో బిజీగా ఉన్నట్లు ఫిలిం దూనియాలో విడికిడి. అయితే దీనిపై డైరెక్టర్లు శంకర్ కానీ, కార్తీక్ కానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇందులో ఎంతమేర నిజముందనేది ఈ డైరెక్టర్లు స్పందించేవరకు వేచి చూడాలి. కాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్ఫణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా తారాగణంపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పై వెళ్లనుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి క్రేజీ అప్డేట్.. షూటింగ్ పూర్తి, కానీ.. -
పెంగ్విన్ మూవీ రివ్యూ
టైటిల్: పెంగ్విన్ జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నటీటులు: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నిత్య తదితరులు నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరాం రచన- దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ సంగీతం: సంతోష్ నారాయణ్ ఛాయాగ్రహణం: కార్తీక్ పళని బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ స్టూడియోస్ విడుదల: అమెజాన్ ప్రైమ్ (జూన్ 19) లాక్డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోగా మరికొన్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే "అమృతరామమ్" చిత్రం ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ కూడా ఓటీటీకే ఓటేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం.. కథ: రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిథమ్‌కు పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులిద్దరూ అడవిలో అంగుళం అంగుళం జల్లెడ పట్టినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్లో చూపినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు.. రిథమ్ తప్ప! ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్పటికీ ఆమె తన అన్వేషణ మానదు. ఈ క్రమంలో ఆమె గౌతమ్(రంగరాజ్)ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు సడన్‌గా రిథమ్‌కు అజయ్ కనిపిస్తాడు. ఇన్నిరోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితోపాటు అపహరణకు గురైన ఆరుగురు పిల్లలు బతికే ఉన్నారా? అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు? గర్భంతో ఉన్న కీర్తి అతడిని ఎలా ఎదుర్కొంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (లాక్డౌన్ ఎఫెక్ట్: అమెజాన్‌లో ఏడు సినిమాలు) విశ్లేషణ: ప్రారంభ సన్నివేశంలోనే దర్శకుడు కథను ముందుగా పరిచయం చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు స్టోరీ లైన్ అర్థమై కథలో లీనమయ్యేందుకు సిద్ధపడతాడు. తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ప్రథమార్థంలో పట్టును చూపించినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. ఎక్కువగా దర్శకుడు రిథమ్(కీర్తి)ని హైలెట్ చేయడానికే ప్రయత్నించాడని కొట్టొచినట్లు కనిపిస్తుంది. సినిమా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథ బాగానే ఉన్న కథనంలో కొన్ని లోపాలతో కొన్నిచోట్ల గజిబిజిగా అనిపిస్తుంది. ఇక సినిమాలో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులే ఉండటం కూడా ఓ మైనస్. (మిసెస్ సీరియల్ కిల్లర్: ఒక్కసారి చూడ్డమే ఎక్కువ) కథ చివర్లో వచ్చే ట్విస్ట్ చూసి ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం. పైగా మొదటి నుంచి సీరియల్ కిల్లర్‌ను భయంకరంగా చూపిస్తూ చివర్లో మాత్రం కీర్తి కోసం అతడి బలాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. అజయ్‌ను ఎత్తుకుపోవడానికి గల కారణం కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ అంశాలను పక్కపెడితే థ్రిల్లర్ చిత్రాలిష్టపడేవారు తప్పకుండా ఓ సారి "పెంగ్విన్"ను చూసేయొచ్చు. నటనా పరంగా చూస్తే ఈ సినిమాను కీర్తి సురేశ్ తన భుజాలమీద మోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ముందు మిగతా పాత్రలేవీ పెద్దగా కనిపించవు. ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాట.. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. (అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?) ప్లస్ పాయింట్స్ కీర్తి సురేష్ నటన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంకేతిక బృందం పనితీరు మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు -
నీలగిరి కొండల్లో...
కోలీవుడ్ బిజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ నిర్మానుష్య నీలగిరి కొండల్లో ఎవరి కోసమో వెతుకులాట ప్రారంభించనున్నారు. ఈ వెతుకులాట వెనక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఈ మిస్టరీ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల ‘కౌసల్య కృష్ణమూర్తి: దిక్రికెటర్ ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఐశ్వర్య. తాజాగా కోలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చారు. రతీంద్రన్ ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. మిస్టరీ, హారర్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ నిర్మాత. తమిళంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. నీలగిరి కొండల్లో ఈ చిత్రం మేజర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
రండి రండి.. దయ చేయండి
ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో మన దక్షిణాది చిత్రాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి, వివేక్ ఒబెరాయ్.. వంటì నటులు మన సౌత్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు హాలీవుడ్ నటులు వస్తున్నారు. అనుష్క, మాధవన్, షాలినీ పాండే, అంజలి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మరో హాలీవుడ్ స్టార్ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ‘బ్రేవ్ హార్ట్, ట్రాయ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు జేమ్స్ కాస్మో. ఆల్రెడీ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సౌత్ సినిమాలకు పని చేస్తున్న తరుణంలో ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ మన దక్షిణాది సినిమాలపై ఆసక్తి చూపించడం విశేషం. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని శశికాంత్, రామచంద్ర నిర్మిస్తున్నారు. -
తీపి కబురు
అభిమానులకు తీపి కబురు చెప్పారు రజనీకాంత్. తన తాజా చిత్రం ‘పేట్టా’ ట్రైలర్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ‘పేట’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, మాళవికా మోహనన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ఆడియోను ఆల్రెడీ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘పేట్టా’ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 51 నిమిషాలని కోలీవుడ్ టాక్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత వల్లభనేని అశోక్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. -
రజనీ ‘పేట్టా’ సంక్రాంతికి రావడం లేదు!
ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్.. యువ దర్శకులతో పనిచేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. కబాలి, కాలా వంటి సినిమాలు యువదర్శకుడైన పా. రంజిత్ తెరకెక్కించగా... ప్రస్తుతం తలైవాతో కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట్టా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసింది చిత్రయూనిట్. ‘పేట్టా’ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని టాక్. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయాలని మేకర్స నిర్ణయించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పటికే ‘2.ఓ’ను నవంబర్ 29న విడుదల చేసేందుకు రెడీ అవ్వగా.. మరీ అంత తక్కువ గ్యాప్‌తో ‘పేట్టా’ను తీసుకురావడానికి సుముఖంగా లేరని సమాచారం. అందుకే పేట్టాను సంక్రాంతి బరిలోంచి తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
యాక్షన్ పార్ట్‌ను కంప్లీట్ చేసిన తలైవా!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘కాలా’ అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇలా వరుసగా సూపర్‌స్టార్ రజనీ సినిమాలు నిరాశ పరచడంతో రాబోయే సినిమాతో అభిమానుల కోరిక తీర్చాలని ఆశిస్తున్నారు సూపర్‌స్టార్. అందుకే యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించాడు తలైవా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్గా రాబోతోందని సమాచారం. దాదాపు 25రోజుల పాటు డార్జిలింగ్‌లో జరిగిన ఈ షెడ్యుల్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించనున్న విషయం తెలిసిందే. -
కార్తీక్ సుబ్బరాజ్‌కు లక్కీచాన్స్!
తమిళసినిమా: దేనికైనా లక్కు ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి అదృష్టం ఎప్పుడు? ఎవరిని పడుతుందో ఊహించడం కష్టం. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చేయాలని ఆశపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పత్రి నటీనటుడికి, దర్శక నిర్మాతలకు అలాంటి కోరిక ఉంటుంది. ఇక వర్ధమాన దర్శకులకైతే అదో కలనే చెప్పవచ్చు. కే.బాలచందర్, ఎస్పీ.ముత్తురామన్ లాంటి సీనియర్ దర్శకుల నుంచి శంకర్ వంటి స్టార్ దర్శకుల చిత్రాల్లో నటించిన రజనీకాంత్ ఇటీవల అనూహ్యంగా వర్ధమాన దర్శకులపై దృష్టిసారిస్తున్నారని చెప్పవచ్చు. రెండు చిత్రాలనే చేసిన దర్శకుడు పా.రంజిత్‌కు అవకాశం ఇచ్చి కబాలి చిత్రంలో నటించి ఆశ్చర్యపరచిన సూపర్‌స్టార్ మళ్లీ వెంటనే కాలా చిత్రానికి ఆయన్నే ఎంచుకోవడం విశేషమే. కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అంతకు ముందు చిత్ర టీజర్‌ను మార్చి ఒకటో తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో నటించిన 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ నెక్ట్స్ అన్న ప్రశ్న తలెత్తినప్పుడు రజనీకాంత్ దృష్టిలో రెండు మార్గాలు కదలాడుతున్నాయి. అందులో ఒకటి రాజకీయరంగప్రవేశం. ఇందుకు ఇప్పటికే తెరవెనుక పనులు వేగంగా జరగుతున్నాయి. ఈ లోగా ఒక మంచి రాజకీయనేపథ్యంలో చిత్రం చేయాలన్నది సూపర్‌స్టార్ బలమైన భావన. అందుకు పావులను కదుపుతూ వచ్చారు. ఇందుకు కారణం లేకపోలేదు. మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశంచే ముందు ఈ తరహా చిత్రాలు చాలానే చేసి ప్రజల మనసులను దోచుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఆ తారకమంత్రాన్నే పఠించాలనుకుంటున్నారు. ఈయన ఆలోచనలకు తగ్గట్టుగా పలువురు కథలను రెడీ చేసుకుంటున్నారు. సమయం లేదు మిత్రమా అన్న చందాన సూపర్‌స్టార్‌తో ఒక్క చిత్రం అయినా చేసి తీరాలన్న తపనతో కథలను తయారు చేసుకున్న దర్శకుల్లో కేవీ.ఆనంద్, అట్లీ, మణికంఠన్ లాంటి దర్శకులు ఉన్నారు. వీరందరూ రజనీని కలిసి కథలను వినిపించినవారే. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రచారం జోరుగానే జరిగింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురికే కాదు ఆయనతో ఒక్క చిత్రం అయినా చేయాలని కలలు కంటున్న చాలా మందికి సూపర్‌స్టార్ షాక్ ఇచ్చేలా మరో యువ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్కు అవకాశం కల్పించారు. ఎస్. సూపర్‌స్టార్ బాల్ ఈ యువ దర్శకుడు కోర్టులో పడింది. ఈయన కథ రజనీకాంత్ రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందట. తొలి చిత్రం పిజ్జా తోనే విజయాన్ని తనవైపునకు తిప్పుకున్న ఈ దర్శకుడు జిగర్తండా చిత్రంతో తమిళసినిమానే తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఇరవి అంటూ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా మెర్కురి చిత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌తో చిత్రం చేసే అదృష్టం కలిసొచ్చింది. ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను శుక్రవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా ఎందిరన్ వంటి బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థనే అన్నది గమనార్హం. అయితే ఈ తాజా చిత్రం ఎప్పుడు సెట్‌పైకి వెళ్లేది ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
తలైవా@165
పక్కా... పొలిటికల్ ఎంట్రీకి ముందే రజనీ ఓ సినిమా చేయడం పక్కా అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. ‘కాలా’, ‘2.0’ చిత్రాల తర్వాత రజనీ నెక్ట్స్ చిత్రం ఏంటీ? అని వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఆయన నెక్ట్స్ చిత్రం ఫిక్సైంది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్ సమర్పణలో ఓ సినిమా రూపొందనుంది. ఇది రజనీకాంత్ కెరీర్లో 165వ సినిమా అట. తలైవా (నాయకుడు)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కార్తీక్ సుబ్బరాజుకు దక్కడం ఊహించని విషయమని అంటున్నారు కోలీవుడ్వాసులు. ‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. తలైవాతో సినిమా చేయాలనే నా కల నిజమైంది. తలైవాకి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజు. ‘పిజ్జా, జిగర్‌దండా, బెంచ్ టాకీస్, ఇరైవి, ‘మెర్క్యురీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు కార్తీక్ సుబ్బరాజు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యురీ’ ఏప్రిల్ 13 రిలీజ్ కానుంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘కాలా’ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీపావళికే విజయ్, సూర్య, అజిత్ సినిమాలతో పాటు బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. సో.. దీపావళికి గట్టి పోటీ అన్నమాట. -
కార్తిక్సుబ్బరాజు దర్శకత్వంలో కమలినీ
-
నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Whoever you are who aided in this dirty game, you can delay us you cannot stop us. A good film cannot be killed. #JIGARTHANDA — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 Karthik, our whole team and I worked really hard for Jigarthanda.With no respect for us, without even discussing it with us...postponed. — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 -
సమంత గురించి సిద్దార్థ్ ఏం చెప్పారంటే...
హీరో సిద్దార్ద్, హీరోయిన్ సమంతల మధ్య రిలేషన్ గురించి మీడియాలోనూ, వెబ్ సైట్లలోనూ అనేక రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి రిలేషన్ పై ఎన్నివార్తలు, కథనాలు వచ్చినా సమంత, సిద్దార్థ్ లు పెదవి విప్పలేదు. అయితే తాజాగా చిక్కడు దొరకడు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దార్ట్ నోట సమంత పేరు రావడంతో అభిమానుల్లో జోష్ కలిగించింది. చిక్కడు దొరకడు చిత్రంలో నటించిన హీరోయిన్ గురించి మాట్లాడుతూ... తెలుగు సినిమాల్లో వరుస విజయాలను సొంత చేసుకుంటూ సమంత ఎలా క్రేజీ హీరోయిన్ గా ఉందో.. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హిట్ పై హిట్ సాధిస్తూ లక్ష్మీ మీనన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారని సిద్దార్థ్ అన్నారు. సమంతపై సిద్దార్థ్ పై ప్రశంసలు కురిపించడంతో కార్యక్రమానికి హాజరైనందరూ ఇంకా ఏమైనా చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సమంతపై పొగడ్తల వరకే సిద్దార్థ్ పరిమితమయ్యారు.