
శశికాంత్, రామచంద్ర, జేమ్స్ కాస్మో, కార్తీక్ సుబ్బరాజ్
ఎంటర్‌టైన్మెంట్ వరల్డ్‌లో మన దక్షిణాది చిత్రాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి, వివేక్ ఒబెరాయ్.. వంటì నటులు మన సౌత్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు హాలీవుడ్ నటులు వస్తున్నారు. అనుష్క, మాధవన్, షాలినీ పాండే, అంజలి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్‌సన్ నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
తాజాగా ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మరో హాలీవుడ్ స్టార్ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ‘బ్రేవ్ హార్ట్, ట్రాయ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు జేమ్స్ కాస్మో. ఆల్రెడీ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సౌత్ సినిమాలకు పని చేస్తున్న తరుణంలో ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ మన దక్షిణాది సినిమాలపై ఆసక్తి చూపించడం విశేషం. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని శశికాంత్, రామచంద్ర నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment