టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న హాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా? | Hollywood Actress Tollywood Entry with horror suspense thriller Movie | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!

Published Tue, Jul 2 2024 9:29 PM | Last Updated on Tue, Jul 2 2024 9:32 PM

Hollywood Actress Tollywood Entry with horror suspense thriller Movie

లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'నిన్ను వదలను'. యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశోక్ కుల్లర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

hollywood

ఈ చిత్రంలో రష్యాకు చెందిన లియుబా పామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సింగర్‌గా రాణించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు నిర్మాతగా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్‌కు రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నిన్ను వదలను అంటూ హారర్ థ్రిల్లర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement