![Raa Raja Movie: Valentine's Day Special Poster Released](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/raraaja.jpg.webp?itok=V85rozHS)
ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు ఎవరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో సినిమా రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్టులతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించకుండా ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది.
ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రా రాజా పోస్టర్ రిలీజ్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన ‘రా రాజా’ ట్రైలర్‌ను ఇది వరకే అందరం చూశాం. ఒక్క యాక్టర్ ముఖం కూడా చూపించకుండా ట్రైలర్ కట్ చేసిన తీరు బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్‌తోనే అందరినీ భయపెట్టేశారు.
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత ఆసక్తిని పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment