Horror movie
-
మా సినిమాకు జిమ్మిక్కులు అక్కర్లేదు: బాలీవుడ్ హీరో
ఈ మధ్య హారర్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో 'భూల్ భులయ్యా 3' రానుంది. ఈ ఫ్రాంచైజీలో మొదటిసారిగా 2007లో అక్షయ్ కుమార్ హీరోగా భుల్ భులయ్యా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కావడంతో 2022లో సీక్వెల్ తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. సింగం అగైన్ Vs భూల్ భులయ్యా 3ఈ చిత్రానికి విశేష స్పందన రావడంతో మూడో భాగం ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ మూడో పార్ట్‌లోనూ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా అజయ్ దేవ్‌గణ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి బడా స్టార్లు నటించిన 'సింగం అగైన్' రిలీజవుతోంది. జిమ్మిక్కులు అవసరం లేదుదీంతో ఈ దీపావళి వార్‌లో ఎవరు గెలుస్తారనేది బాలీవుడ్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హీరో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. భూల్ భులయ్యా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు. కథపై, సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది అని పేర్కొన్నాడు.చదవండి: ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా -
హారర్ మూవీకి 'ఎ' సర్టిఫికెట్.. అప్పుడే రిలీజ్
మున్నా కాశీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ముఖ్య పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
'సి 202' హారర్ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్
ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్, టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ‘సి 202’. పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లోనే ఈ సినిమాను చిత్రీకరించారు. మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్‌తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
'చరిత్ర పునరావృతం'.. త్వరలో తుంబాడ్ 2
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి చిత్రమే తుంబాడ్. హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలైంది. అప్పుడు మరీ అంత ఆదరణ లభించలేదు కానీ ఓటీటీలో మాత్రం జనం విపరీతంగా చూశారు. తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ కూడా చేశారు. బాలీవుడ్లో ఫ్రెష్‌గా రిలీజ్ చేసిన సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు తుంబాడ్ రాబట్టడం విశేషం.చరిత్ర పునరావృతంతాజాగా తుంబాడ్ మేకర్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఈ మేరకు తుంబాడ్ చిత్ర హీరో సోహమ్ షా చిన్న టీజర్ కూడా వదిలారు. ఇందులో కాలం ఎన్నటికీ ఆగదు.. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండియన్ సినిమాలోనే గ్రేటెస్ట్ మూవీ తుంబాడ్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుందంటే ఆగలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈసారి మరిన్ని ట్విస్టులుఈ సీక్వెల్ గురించి హీరో, నిర్మాత సోహమ్ షా మాట్లాడుతూ.. తుంబాడ్ 2తో ఆడియన్స్‌కు మరింత అద్భుతమైన అనుభూతిని అందించాలనుకుంటున్నాం. ఈసారి మరిన్ని ట్విస్టులు ఉండనున్నాయి. అత్యాశకు పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మరింత లోతుగా, వివరంగా చూపించనున్నాం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sohum Shah Films (@sohumshahfilms) చదవండి: యష్మికి బుల్లెట్ దింపిన నాగ్.. వెంటనే ప్లేటు తిప్పేసిందే! -
'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ టైంలో హిందీలో ఇలా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'ముంజ్య'. తాజాగా ఇది హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1952. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతం. తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడంతో చేతబడి చేసి వశం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తానే బలైపోతాడు. అప్పటి నుంచి 'ముంజ్య' అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. ప్రస్తుతానికి వస్తే పుణెలో బిట్టు (అభయ్ వర్మ) తల్లి, నానమ్మతో కలిసి ఉంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. కొంకణ్ ప్రాంతానికి వెళ్తాడు. అనుకోకుండా ముంజ్యని విముక్తి చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైంది? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కోరిక తీరని ఆత్మ, దెయ్యంగా మారడం.. ఓ వ్యక్తి వల్ల బయట ప్రపంచంలోకి రావడం.. అక్కడి నుంచి అందరినీ ముప్పతిప్పలు పెట్టడం.. చివరకు కోరిక తీర్చుకునే క్రమంలో చావడం... ఈ స్టోరీ లైన్ చెప్పగానే అనుష్క 'అరుంధతి' సినిమా గుర్తొచ్చి ఉంటుందేమో! దాదాపు ఇదే కథతో తీసిన హిందీ సినిమా 'ముంజ్య'. కాకపోతే అనుష్క మూవీ మొత్తం సీరియస్‌గా ఉంటే ఇది మాత్రం కాస్త భయపెడుతూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది.1952లో కొంకణ్ అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. గోట్య అనే పదేళ్ల పిల్లాడు, పక్కింట్లో ఉంటే మున్ని అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాకపోతే ఇతడి కంటే ఆమె ఏడేళ్లు పెద్దది. ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలిసి.. ఏకంగా చేతబడి చేసి ఆమెని వశపరుచుకోవాలనుకుంటాడు. తన చెల్లినే బలివ్వాలనుకుంటాడు. ఇదంతా చెటుక్వాడి అనే దీవిలో చేస్తాడు. అనుకోకుండా అప్పుడు గోట్యా చనిపోతాడు.. పిల్ల దెయ్యంగా మారతాడు. ఇలా నేరుగా కథలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతానికి వస్తే చాలా భయస్తుడైన బిట్టు(అభయ్ వర్మ)కి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. అందులో ముంజ్య కనిపిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో చెటుక్వాడి వెళ్లి అక్కడే నిర్బంధంలో ఉన్న ముంజ్యని విడుదల చేసేస్తాడు. అప్పటినుంచి ముంజ్య.. బిట్టు వెంటపడతాడు. తనకు మున్నితో పెళ్లి చేయాలని తెగ వేధిస్తాడు. అక్కడి నుంచి మొదలైన కథ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.పాయింట్ బాగానే ఉన్నప్పటికీ భయపెట్టే సీన్స్ అక్కడక్కడే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'ద లార్డ్ ఆఫ్ రింగ్స్'లోని గోలుమ్ అనే పాత్రని స్ఫూర్తిగా తీసుకుని.. ముంజ్య అనే పిల్ల దెయ్యాన్ని సృష్టించారు. నిజంగానే దెయ్యమా అనే రేంజులో గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ దానితో పెద్దగా భయపెట్టలేకపోయారు. రెండు గంటల సినిమానే కానీ కొన్నిచోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇందులో బెలా పాత్రలో శర్వరి అనే అమ్మాయి చేసింది. ఈమె పెద్దగా ఇంపార్టెన్స్ లేదేంటా అనుకుంటాం. కానీ చివర్లో దెయ్యాన్ని చేసి భయపెట్టాలని చూశారు. కానీ ఆ పార్ట్ అంతా ఓకే ఓకే.ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అభయ్ వర్మ యాక్టింగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. కాబట్టి ఉన్నంతలో న్యాయం చేశారు. రీసెంట్ టైంలో హారర్ సినిమాలేం చూడలేదు. టైమ్ పాస్ అవ్వాలి అనుకుంటే హిందీలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ముంజ్య' చూడొచ్చు.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
సడెన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' హరర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా 'ముంజ్యా' సడెన్‌గా ఓటీటీలో విడుదల అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్ర మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ముంజ్యా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి డిస్నీ+ హాట్‌స్టార్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (ఆగష్టు 25) ఓటీటీలో విడుదలైంది. అయితే, కేవలం హిందీ వర్షన్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర ముంజ్యా సత్తా చాటింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. ఈ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ 2 ఐదో సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. -
ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్ మంజ్యా సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్‌స్టార్ కూడా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న హాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?
లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'నిన్ను వదలను'. యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశోక్ కుల్లర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో రష్యాకు చెందిన లియుబా పామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సింగర్‌గా రాణించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు నిర్మాతగా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్‌కు రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నిన్ను వదలను అంటూ హారర్ థ్రిల్లర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
ఎండాకాలం అయిపోయింది. సమ్మర్లో బ్లాక్‌బస్టర్ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ యూనివర్స్‌లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్‌టాక్‌తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్ -
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్‌నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్‌ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్‌నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్‌కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్‌ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్‌గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్‌న్యూస్. 'ది ఫస్ట్ ఒమెన్' అనే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్(1976), డామెయిన్- ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్(1981), ఒమెన్ 4- ద అవేక్నింగ్(1991), ది ఒమెన్(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్ ఒమెన్(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ఆర్కష స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వారికి మాత్రమే!
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి వారంలో థియేటర్లలో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియన్ మూవీ ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్‌కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్‌లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్‌లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసేయొచ్చు. -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్‌గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్‌లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్‌గా గజానంద్ (ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్‌రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
'పిండం' చూసి భయపడతారు: డైరెక్టర్ సాయి కిరణ్ దైదా
‘నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను.దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు తెలుగులో చాలా హారర్ మూవీస్ వచ్చాయి. అవన్ని ఒకెత్తు.. మా పిండం మూవీ మరో ఎత్తు. హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు’అని అన్నారు దర్శకుడు సాయి కిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పిండం’.'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సాయికిరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకొని ‘పిండం’సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. ► పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ►ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది. ► టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది. ► ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం. ►ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ►త్వరలో కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను. -
హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా!
టాలీవుడ్లో శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కోలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన రెజీనా తాజాగా తమిళంలో కంజూరింగ్ కన్నప్పన్ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు సతీష నాజర్, శరణ్య పొన్వన్నన్, ఆనంద్‌రాజ్, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సెల్విన్ రాజ్సేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఈ చిత్రం గురించి సెల్విన్ మాట్లాడుతూ.. ఇది హార్రర్, కామెడీ జానర్లో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. అయితే ఇది గత చిత్రాల తరహాలో ఉండదన్నారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలిపారు. హాలీవుడ్ స్టైల్లో కొన్ని విషయాలను చెప్పామన్నారు. వినూత్న కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని హార్రర్‌తో కూడిన ఫాంటసీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ఇందులోని క్యాష్‌బ్యాక్ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరించినట్లు తెలిపారు. మంచి చిత్రాన్ని చేయాలనే భావనతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకావట్లేదని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తి అయిందని.. మరోపక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు సెల్విన్ రాజ్సేవియర్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్లో సెక్షన్ 108 చిత్రంలో నటిస్తోంది భామ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. -
ప్రపంచంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా ఇదే! చెక్కుచెదరని రికార్డు!
అతివృష్టి, అనావృష్టి.. వర్షం విషయంలోనే కాదు బాక్సాఫీస్ విషయంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. మొదటి సందర్భంలో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే రెండో సందర్భంలో మాత్రం నిర్మాత పంట పండినట్లే! మరి ప్రపంచంలోనే అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో మీకు తెలుసా? లక్షలు పెట్టి తీస్తే వేల కోట్లు కొల్లగొట్టిన ఆ సినిమా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే! కశ్మీర్ ఫైల్స్.. పెట్టుబడి రూ.15 కోట్లు వసూళ్లు.. కలెక్షన్స్ రూ.350 కోట్లు. వావ్, గ్రేట్ అని నోరెళ్లబెడుతున్నారేమో.. 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమా సంగతి చెప్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం ఖాయం! ఈ హాలీవుడ్ సినిమా ఏకంగా 13,30,000 శాతం లాభాలను అందుకుంది. ఈ సినిమాను 2007లో హాలీవుడ్ డైరెక్టర్ ఓరెన్ పెలి తెరకెక్కించాడు. తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాలో నలుగురు మనుషులు, ఒక అస్థిపంజరం ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా తీయడానికి ఆయనకు 15 వేల డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు) ఖర్చయ్యాయి. అయితే పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్‌లో కాస్త మార్పులుచేర్పులు చేసి దానికి మరిన్ని హంగులు అద్ది రిలీజ్ చేసింది. దీనికి దాదాపు రూ.90 లక్షలు ఖర్చయ్యాయి. ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్ డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటివరకు లాభాల పంట పండించిన చిత్రంగా 'ద బ్లైయిర్ విచ్ ప్రాజెక్ట్' పేరిట ఉన్న రికార్డును పారానార్మల్ యాక్టివిటీ మూవీ తన స్వాధీనం చేసుకుంది. ఈ ఊపుతో 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమాకు సీక్వెల్స్ కూడా తీశారు. వరుసగా ఆరు సీక్వెల్స్ తీయగా ఇవి మొత్తంగా రూ.7320 కోట్లు రాబట్టాయి. ఇలా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ రెండో స్థానంలో ఉంటుంది. 1999లో వచ్చిన 'ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' రూ.85 లక్షలతో తెరకెక్కగా రూ.1045 కోట్లు రాబట్టింది. 2003లో వచ్చిన టార్నేషన్ కేవలం రూ10,000తో తెరకెక్కగా రూ.5.5 కోట్లు సాధించింది. రెండు లక్షలతో తెరకెక్కిన పోర్నోగ్రఫీ చిత్రం 'డీప్ త్రోట్' రూ.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రూ.87వేలతో నిర్మితమైన 'ఎరేజర్ హెడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.6 కోట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. చదవండి: బ్రో సహా మరో బాలీవుడ్ సినిమాకు ఆదరణ కరువు, రిటైర్మెంట్ తీసుకోమన్న కంగనా పెళ్లైన 6 ఏళ్లకే విడాకులు.. విడిపోవడం కష్టంగా ఉందని నటి పోస్ట్ -
సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో హార్రర్ చిత్రం
హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా తాజాగా నటి స్మతి వెంకట్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హార్రర్ కథా చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డ్రీమ్ హౌస్ పతాకంపై ఎన్.కారుణ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నిజ జీవితంలో మన కళ్లముందు జరిగే కొన్ని అమానుష సంఘటనలు నిజంగా ఎలా జరుగుతాయా మనకి తెలియదన్నారు. అలాంటి ఘటనలతో ఈ చిత్రాన్ని రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇది సాధారణ హార్రర్ చిత్రాలకు భిన్నంగా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందన్నారు. నటి స్మతి వెంకట్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో కథానాయకుడిగా రోషన్ నటిస్తున్నారని, సంగీత దర్శకుడు సిద్ధార్త్ విపిన్, దర్శకుడు సుబ్రమణియం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర టైటిల్‌ను, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి కేఎం రయాన్ సంగీతాన్ని, విజయ్‌కుమార్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్మృతి వెంకట్, సోనియా అగర్వాల్ కొత్త చిత్రం ప్రారంభం -
హీరోగా మ్యూజిక్ డైరెక్టర్.. మరో హర్రర్ చిత్రం '13'
చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ 'డార్లింగ్' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్. నందగోపాల్ సమర్పణలో మద్రాస్ స్టూడియోస్, అన్షు ప్రభాకర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్ ఫోన్ చేసి మంచి హారర్ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్ నేపథ్యంలో డార్లింగ్ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చదవండి:👇 రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_71236443.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘నఘం’.. టీజర్ విడుదల
గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'నఘం'. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్ చేసిన ఈ టీజర్.. అందరిని ఆకట్టుకుంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు కావాల్సిన సంగీతాన్ని భగవత్ అందించారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. -
హారర్ ఆట
నూతన నటీనటులతో పీబీ లింగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాతో ఆట’. విఘ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సినీ క్రియేషన్స్‌పై బి.ఎల్. బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బి.ఎల్. బాబు మాట్లాడుతూ– ‘‘నాతో ఆట’ ఒక హారర్ చిత్రం. మంచి కథతో యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో నిర్మించాం. మా చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. -
సమాధానం ఏంటి?
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’. విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’కి విశేష స్పందన లభించింది’’ అన్నారు. ‘‘మా నిర్మాతగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు విప్రా. ‘‘చక్కని హారర్ సినిమా ఇది. ‘క్వశ్చన్ మార్క్ (?)’ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీత దర్శకుడు: రఘు కుంచె.