హర్రర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి | Man Dies In Chennai While Watching Horror Movie 'The Conjuring 2' | Sakshi
Sakshi News home page

హర్రర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Published Sat, Jun 18 2016 11:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

హర్రర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

హర్రర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

హార్రర్ సినిమా చూడాలన్న ఉత్సాహం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇటీవల విడుదలైన హాలీవుడ్ హార్రర్ మూవీ ద కంజూరింగ్ 2ను చూస్తూ 68 ఏళ్ల పెద్దమనిషి మరణించాడు. తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఈ సంఘటన జరిగింది. తిరువణ్ణామలైలోని శ్రీ బాలసుబ్రమణియర్ సినిమాస్ లో ప్రదర్శింపబడుతున్న ద కంజూరింగ్ 2 సినిమాను చూడటానికి కడప జిల్లాకు చెందిన జి రామ్ మోహన్, ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు.

సినిమా అంతా ప్రశాంతంగానే చూసిన రామ్ మోహన్కు క్లైమాక్స్ సమీపించే సరికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్న దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. రామ్ మోహన్ను పరీక్షించిన వైధ్యులు అప్పటికే చనిపోయినట్టుగా తెలిపారు. గతంలోనే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉందని అలా, గుండె సంబందిత వ్యాధులు ఉన్న వారు హర్రర్ సినిమాలు చూడటం మంచికాదని డాక్టర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement