అదరగొడుతున్న హారర్‌ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది! | Munjya Movie Crosses Rs 50 Crore Mark | Sakshi
Sakshi News home page

హాఫ్‌ సెంచరీ కొట్టిన హారర్‌ మూవీ.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే!

Published Mon, Jun 17 2024 4:29 PM | Last Updated on Mon, Jun 17 2024 5:03 PM

Munjya Movie Crosses Rs 50 Crore Mark

ఎండాకాలం అయిపోయింది. సమ్మర్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, చందూ చాంపియన్‌, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్‌లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మోనా సింగ్‌, శార్వరి, అభయ్‌ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్‌డాక్‌ సూపర్‌నేచురల్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. 

ఇకపోతే ఈ యూనివర్స్‌లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్‌టాక్‌తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్‌డాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: సినిమా ఫ్లాప్‌ అయితే పార్టీ చేసుకుంటా: రామ్‌ చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement