Sonia Agarwal, Smruthi Venkat team up for horror thriller - Sakshi
Sakshi News home page

Sonia Agarwal: సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో హార్రర్‌ చిత్రం

Jan 9 2023 10:18 AM | Updated on Jan 9 2023 10:46 AM

Sonia Agarwal and Smruthi Venkat New Film Starts In Chennai - Sakshi

హార్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా తాజాగా నటి స్మతి వెంకట్‌ సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హార్రర్‌ కథా చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డ్రీమ్‌ హౌస్‌ పతాకంపై ఎన్‌.కారుణ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నిజ జీవితంలో మన కళ్లముందు జరిగే కొన్ని అమానుష సంఘటనలు నిజంగా ఎలా జరుగుతాయా మనకి తెలియదన్నారు. అలాంటి ఘటనలతో ఈ చిత్రాన్ని రపొందిస్తున్నట్లు చెప్పారు.

ఇది సాధారణ హార్రర్‌ చిత్రాలకు భిన్నంగా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందన్నారు. నటి స్మతి వెంకట్, సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో కథానాయకుడిగా రోషన్‌ నటిస్తున్నారని, సంగీత దర్శకుడు సిద్ధార్త్‌ విపిన్, దర్శకుడు సుబ్రమణియం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర టైటిల్‌ను, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి కేఎం రయాన్‌ సంగీతాన్ని, విజయ్‌కుమార్‌ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్మృతి వెంకట్, సోనియా అగర్వాల్‌ కొత్త చిత్రం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement