‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్‌గా నటించిన కన్నడ చిత్రం ‘రాజధాని’. కేవీ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందించారు. కన్నడలో విజయం సాధించిన ఈ మూవీని ‘రాజధాని రౌడీ’ పేరుతో సంతోష్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ–‘‘మాదక ద్రవ్యాలు, మద్యపానం బారినపడి నలుగురు యువకులు వారి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. చెడు పరిణామాలను ఎత్తి చూపించి, ఆలోచన రేకెత్తించే పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్ నటించారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment