Rajdhani
-
రాజధాని రౌడీ వస్తున్నాడు
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్గా నటించిన కన్నడ చిత్రం ‘రాజధాని’. కేవీ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందించారు. కన్నడలో విజయం సాధించిన ఈ మూవీని ‘రాజధాని రౌడీ’ పేరుతో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ–‘‘మాదక ద్రవ్యాలు, మద్యపానం బారినపడి నలుగురు యువకులు వారి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. చెడు పరిణామాలను ఎత్తి చూపించి, ఆలోచన రేకెత్తించే పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్ నటించారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
రాజధానిని మింగేసిన బాబు భూదందా
సినిమా క్లైమాక్స్‌లో విలన్ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే. అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రోచర్ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్.. డూపర్.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు.. ఇదంతా బాబు అండ్ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్ చాలెంజింగ్ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్‌తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
అమ్మో ‘రాజధాని’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్‌ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు. డిమాండ్ ఉన్నా.. రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2016లో కొన్న బస్సులే... ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు. అన్నీ సమస్యలే.... పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది. -
మీ ధ్యాసంతా భ్రమరావతేనా?
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ? సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్‌లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్‌లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్‌ను అందుబాటులో ఉంచారు. గెజిట్‌కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు. ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది. ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బందులు వస్తాయి వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు. -
రాజధాని ఫైల్స్ ప్రదర్శనను ఆపండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ఏకైక ఉద్దేశంతో తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సరి్టఫికేషన్ (సీబీఎఫ్సీ) జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ సినిమా వైఎస్సార్సీపీ తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనన్నారు. అవాస్తవాలతో ప్రజలను మ«భ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిరి్మంచారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. అమరావతి పేరును ఐరావతి, ప్రధాని పేరును సురేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును రాంబాబు వంటి నిజ జీవితంలో పోలి ఉండే పేర్లను ఆయా పాత్రలకు పెట్టారన్నారు. స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని నిరి్మంచారని వివరించారు. ఈ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారి ఉద్దేశాలు ఏమిటి తదితర వివరాలను సీబీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. కించపరిచేలా సన్నివేశాల్లేవు చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. మొదట తమ చిత్రాన్ని ఎగ్జామిన్ కమిటీ చూసి పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పిందని, దీనిపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని చెప్పారు. రివిజన్ కమిటీ కూడా పలు సన్నివేశాలను తొలగించాల్సిందేనని చెప్పిందని, దీంతో ఆ సన్నివేశాలను తొలగించామన్నారు. ఆ తరువాతే సీబీఎఫ్సీ తమకు చిత్ర ప్రదర్శనకు అనుమతినిస్తూ సరి్టఫికెట్ జారీ చేసిందన్నారు. తమకు గత ఏడాది డిసెంబర్లో సర్టిఫికెట్ ఇస్తే వైఎస్సార్సీపీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు. -
అత్యంత విచిత్రంగా తృటిలో తప్పిన రైలు ప్రమాదం
జార్ఖండ్‌లోని బొకారోలో డ్రైవర్ సమయస్ఫూర్తి కారణగా రైలు ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం బొకారోలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక ట్రాక్టర్ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో అటువైపుగా న్యూఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. అయితే రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. డీఆర్ఎస్ మనీష్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బొకారో జిల్లాలోని భోజూడీహ్ రైల్వే స్టేషన్ పరిధిలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు మూసుకుపోవడంతో ఒక ట్రాక్టర్ మధ్యలో చిక్కుకుపోయింది. అదేసమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్(22812) అటుగా వస్తోంది. ఆ ట్రాక్టర్‌ను గమనించిన రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 45 నిముషాలు ఆగిపోయింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతోపాటు గేట్ మ్యాన్‌ను విధుల నుంచి తొలగించారు. కాగా జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. చదవండి: రైలు నుండి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు -
TSRTC: రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్ జామ్
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్-65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
రాజధాని, శతాబ్దిలకు కొత్త సొబగులు
న్యూఢిల్లీ: రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై కొత్త అనుభూతి కలగనుంది. శుచి, శుభ్రతతో కూడిన భోజ నం, అత్యాధునిక మరుగు దొడ్లు, వేళకు ట్రైయిన్ తదితర అంశాలపై దృష్టిసారిస్తూ ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిం చాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకు ‘ప్రాజెక్ట్ స్వర్ణ్’ పేరుతో వచ్చే సెప్టెంబర్ నుంచి 15 శతాబ్ది, 15 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మరింత విస్తృతంగా ప్రయాణికులకు సేవలు అందించాలని సంకల్పించింది. దీనికోసం రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేటరింగ్ చేసే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం, కోచ్‌లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందితో తగిన రక్షణను కల్పిం చనుంది. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం జాప్యం లేకుండా సాగేందుకు కచ్ఛితంగా రైళ్లు సమయపాలనను పాటిం చేలా చర్యలు తీసుకోనుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఎంపిక చేసుకున్న ప్రయా ణికులకు సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వంటి ఇతర సౌకర్యాలూ అందనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ముంబై, హౌరా, పట్నా, రాంచీ, భువనేశ్వర్‌లతో పాటు ఇతర మార్గాల మధ్య నడుస్తున్నాయి. శతాబ్ధి రైళ్లు హౌరా–పూరి, న్యూఢిల్లీ– చంఢీగఢ్, న్యూఢిల్లీ–కాన్పూర్, హౌరా– రాంచీతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి. -
ఎయిర్ ఇండియా- రైల్వేస్ ప్రైస్ వార్
న్యూఢిల్లీ: విమాన టికెట్లలో డిస్కౌంట్ ఆఫర్లతో భారతీయ రైల్వేలకు ప్రభుత్వ, ఇతర ప్రయివేట్ విమానయాన సంస్థలు షాకిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలకు దాదాపు సమామైన ధరలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే నూతన సంవత్సరంలో మూడు ప్రధాన విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించాయి. తాజా ఎయిర్ ఇండియా మూడు నెలల తగ్గింపు ధరలను లాంచ్ చేసింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆఫర్ జనవరి 6 న మొదలై ఏప్రిల్ 30 వ తేదీతో ముగియనుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రాయితీ టిక్కెట్లు జనవరి 26 ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. (చదవండి: ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు) రైల్వే రిజర్వేషన్ కోసం వెయిటింగ్ తదితర కారణాల రీత్యా అసంతృప్తిగా ఉన్న రైల్వే ప్రయాణికులను ఆకర్షించే యోచనలో ఈ తగ్గింపు ధరల్ని ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ ప్రత్యేక ఛార్జీలు అన్ని రాజధాని రూట్ తోపాటు, జాతీయ రవాణా సంస్థ రైల్వేస్ తిరగని ఇతర మార్గాల్లో కూడా అందుబాటులోకి తెచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు, న్యూ ఢిల్లీ-ముంబై విమాన ఛార్జీ రూ 2,401 కే అందిస్తుండగా , రాజధాని ఎసి సెకండ్ కాస్ల్ ఛార్జీ రూ 2,870 గా ఉంది. న్యూఢిల్లీ-పాట్నా రాజధాని టికెట్ రూ 2,290, కాగా, ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్ ను రూ 2,315 కు అందిస్తోంది. -
సెల్పీ కోసం రైలు పట్టాలపై రాళ్లను ఉంచి..
పాట్నా: ముగ్గురు టీనేజర్లు సెల్ఫీ కోసం ప్రయాణీకుల ప్రాణాలను పనంగా పెట్టారు. రైలు పట్టాలపై కంకర రాళ్లను ఉంచి ట్రేన్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పాట్నా నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్ ప్రెస్ ఫిరోజాబాద్ లోని తుండ్లా జంక్షన్ వద్ద పట్టాలపై రాళ్లను ఉంచారు. దీంతో్ రైలు ఆగుతుందని దగ్గరికి రాగానే సెల్ఫీ తీసుకోచ్చని ఈ ప్రయత్నం చేశారు. వాళ్ల చర్యల్ని గమనించిన లోకో పైలట్ రైలును ఆపి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎప్) పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బుధవారం బాలనేరస్థుల న్యాయస్థానానికి తరళించారు. ఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ముగ్గురు 13నుంచి16 ఏళ్ల లోపు వారేనని, వీరు తుండ్లా, ఆగ్రా, గ్వాలియర్ కు చెందిన వారని తెలిపారు. వీరు వేసవి సెలవుకు తుండ్లాలోని బందువుల ఇళ్లకు వచ్చారని తెలిపారు. వారి నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని. వీరిపై రైల్వే ప్రొటెక్షన్ ఆక్ట్ 154 ప్రకారం కేసును నమోదు చేసినట్టు కుమార్ తెలిపారు.