పాట్నా: ముగ్గురు టీనేజర్లు సెల్ఫీ కోసం ప్రయాణీకుల ప్రాణాలను పనంగా పెట్టారు. రైలు పట్టాలపై కంకర రాళ్లను ఉంచి ట్రేన్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పాట్నా నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్ ప్రెస్ ఫిరోజాబాద్ లోని తుండ్లా జంక్షన్ వద్ద పట్టాలపై రాళ్లను ఉంచారు. దీంతో్ రైలు ఆగుతుందని దగ్గరికి రాగానే సెల్ఫీ తీసుకోచ్చని ఈ ప్రయత్నం చేశారు.
వాళ్ల చర్యల్ని గమనించిన లోకో పైలట్ రైలును ఆపి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎప్) పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బుధవారం బాలనేరస్థుల న్యాయస్థానానికి తరళించారు. ఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ముగ్గురు 13నుంచి16 ఏళ్ల లోపు వారేనని, వీరు తుండ్లా, ఆగ్రా, గ్వాలియర్ కు చెందిన వారని తెలిపారు. వీరు వేసవి సెలవుకు తుండ్లాలోని బందువుల ఇళ్లకు వచ్చారని తెలిపారు. వారి నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని. వీరిపై రైల్వే ప్రొటెక్షన్ ఆక్ట్ 154 ప్రకారం కేసును నమోదు చేసినట్టు కుమార్ తెలిపారు.