![Wife Ties Husband To Tree For Taking Selfie Sets Him Afire - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/13/tree.jpg.webp?itok=fv-8nBY8)
బిహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాయాలపాలైన బాధితున్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలోని వసుదేవ్‌పుర్ సరాయ్ గ్రామంలో జరిగింది.
సెల్ఫీ తీసుకునే నెపంతో..
సెల్ఫీ తీసుకునే నెపంతో భార్య తన భర్తను చెట్టుకు కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి, నిప్పంటించింది. బాధితుడు అరుపులు పెట్టడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయింది. చుట్టుపక్కలవారు చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఘటనకు గల సరైన కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకే భర్తపై భార్య ఈ ఘాతుకానికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్లో వెతికిన భార్య
Comments
Please login to add a commentAdd a comment