న్యూఢిల్లీ: రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై కొత్త అనుభూతి కలగనుంది. శుచి, శుభ్రతతో కూడిన భోజ నం, అత్యాధునిక మరుగు దొడ్లు, వేళకు ట్రైయిన్ తదితర అంశాలపై దృష్టిసారిస్తూ ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిం చాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకు ‘ప్రాజెక్ట్ స్వర్ణ్’ పేరుతో వచ్చే సెప్టెంబర్ నుంచి 15 శతాబ్ది, 15 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మరింత విస్తృతంగా ప్రయాణికులకు సేవలు అందించాలని సంకల్పించింది. దీనికోసం రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా కేటరింగ్ చేసే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం, కోచ్‌లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందితో తగిన రక్షణను కల్పిం చనుంది. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం జాప్యం లేకుండా సాగేందుకు కచ్ఛితంగా రైళ్లు సమయపాలనను పాటిం చేలా చర్యలు తీసుకోనుంది.
మరో ప్రత్యేకత ఏమిటంటే ఎంపిక చేసుకున్న ప్రయా ణికులకు సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వంటి ఇతర సౌకర్యాలూ అందనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ముంబై, హౌరా, పట్నా, రాంచీ, భువనేశ్వర్‌లతో పాటు ఇతర మార్గాల మధ్య నడుస్తున్నాయి. శతాబ్ధి రైళ్లు హౌరా–పూరి, న్యూఢిల్లీ– చంఢీగఢ్, న్యూఢిల్లీ–కాన్పూర్, హౌరా– రాంచీతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి.