Shatabdi Express Trains
-
ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు భారీ షాకిచ్చింది. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచింది. నవంబర్ 14 నుంచి రాజధాని / శతాబ్ది /దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్/ డిన్నర్‌కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది) -
రైలులో కలుషితాహారం.. 40 మందికి అస్వస్థత
ఖరగ్‌పూర్/పశ్చిమ బెంగాల్: పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన అల్పాహారం తిని నలభై మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14మంది ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పూరి నుంచి బయల్దేరిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ దాటిన తర్వాత అల్పాహారంగా ఆమ్లెట్, బ్రెడ్ తీసుకున్నామని బాధితులు చెప్పారు. అల్పాహారం తీసుకున్న అనంతరం వాంతులు, కడుపులో నొప్పి మొదలైందని వారు తెలిపారు. రైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఖరగ్‌పూర్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. కాగా, రైలు ప్రయాణంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే రైల్వే శాఖ ఈ విషయం వెలుగు చూడడంతో చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఐఆర్సీటీసీ పంపిణీ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార’ని ఆగ్నేయ రైల్వే జోన్ ప్రజా సంబంధాల అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. ‘ఆహార పదార్థాల నమూనాలు సేకరించాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామ’ని ఖరగ్‌పూర్ డివిజన్ మేనేజర్ రాబిన్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెండర్ వద్ద కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఆహార పదార్థాలేవైనా కొన్నారా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. భోజన వసతి అనుకున్నాం.. ఆస్పత్రి పాలయ్యాం ‘పూరి పర్యటనకు వచ్చాం. భోజన వసతి ఉంటుందని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యాం. కానీ ఇలా ఆస్పత్రి పాలవుతామనుకోలేద’ని బెంగాల్‌కు చెందిన రూపమ్ సేన్ గుప్తా వాపోయారు. రైలులో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన ఆహారాన్నే కొన్నామని ఆయన తెలిపారు. -
రాజధాని, శతాబ్దిలకు కొత్త సొబగులు
న్యూఢిల్లీ: రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై కొత్త అనుభూతి కలగనుంది. శుచి, శుభ్రతతో కూడిన భోజ నం, అత్యాధునిక మరుగు దొడ్లు, వేళకు ట్రైయిన్ తదితర అంశాలపై దృష్టిసారిస్తూ ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిం చాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకు ‘ప్రాజెక్ట్ స్వర్ణ్’ పేరుతో వచ్చే సెప్టెంబర్ నుంచి 15 శతాబ్ది, 15 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మరింత విస్తృతంగా ప్రయాణికులకు సేవలు అందించాలని సంకల్పించింది. దీనికోసం రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేటరింగ్ చేసే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం, కోచ్‌లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందితో తగిన రక్షణను కల్పిం చనుంది. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం జాప్యం లేకుండా సాగేందుకు కచ్ఛితంగా రైళ్లు సమయపాలనను పాటిం చేలా చర్యలు తీసుకోనుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఎంపిక చేసుకున్న ప్రయా ణికులకు సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వంటి ఇతర సౌకర్యాలూ అందనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ముంబై, హౌరా, పట్నా, రాంచీ, భువనేశ్వర్‌లతో పాటు ఇతర మార్గాల మధ్య నడుస్తున్నాయి. శతాబ్ధి రైళ్లు హౌరా–పూరి, న్యూఢిల్లీ– చంఢీగఢ్, న్యూఢిల్లీ–కాన్పూర్, హౌరా– రాంచీతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి.