facilities
-
హైటెక్ హంగులతో సమీకృత గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక హంగులతో కూడిన భారీ సమీకృత గురుకుల క్యాంపస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మంచి విద్యాబోధన, మెరుగైన వసతులు, మానసిక–శారీరక వికాసానికి వీలున్న పరిస్థితులు, హాస్టల్ వసతి, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణం, శుభ్రతతో కూడిన భోజనం..ఇలా అన్ని రకాలుగా ఇవి మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు.ఇందుకోసం తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. గతంలో రోడ్లు, భవనాల శాఖలో ఈఎన్సీగా పనిచేసి పదవీ విరమణ పొందిన గణపతిరెడ్డిని ప్రభుత్వం తాజాగా దీనికి ఎండీగా నియమించింది. ఇన్ఫోసిస్‌తో ఒప్పందం.. ఈ గురుకులాల్లో విద్యాబోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠ్యాంశాల తయారీ, బోధన పద్ధతులు, ఆధునిక బోధన వ్యవస్థ ఏర్పాటు.. తదితరాల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనితో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ గురుకులాల్లో పూర్తిగా డిజిటల్ బోర్డులు వాడుతారు. ఒక్కో క్యాంపస్ ఇలా... యూనివర్సిటీల మాదిరిగా విశాలమైన ప్రాంతాల్లో ఈ సమీకృత గురుకుల సముదాయాలను నిర్మిస్తారు. ఒక్కో గురుకులం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కనీసం 2,560 మంది విద్యార్థులు, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి 640 మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చూస్తారు. వాటిల్లో నిర్ధారిత దామాషాలో ఓసీ విద్యార్థులను కూడా చేర్చుకుంటారు. ⇒ అకడమిక్ బ్లాక్, డార్మెటరీ బ్లాక్, వంట, భోజనశాల, స్టాఫ్ క్వార్టర్స్ సముదాయం విడివిడిగా ఉంటాయి. ⇒ విద్యార్థులకు పాఠాలు బోధించే అకడమిక్ బ్లాక్ రెండంతస్తులతో నిర్మిస్తారు. ఇందులో 64 తరగతి గదులు, 10 ప్రయోగశాల గదులు, 12 ఉపాధ్యాయుల గదులు, ఒక పరిపాలన బ్లాక్, గ్రంథాలయం, 12 టాయిలెట్లు ఉంటాయి. ఇలాంటివి నాలుగు బ్లాక్స్ ఉంటాయి. ⇒ విద్యార్థుల వసతి గృహాలకు సంబంధించి 11 బ్లాక్స్ నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్‌లో 148 డార్మెటరీ హాల్స్ ఉంటాయి. వీటిని జూనియర్ హాస్టల్స్, సీనియర్ హాస్టల్స్‌గా విడివిడిగా కేటాయిస్తారు. జూనియర్ సెక్షన్లో ఒక్కో హాలులో 14 మంది విద్యార్థుల సామర్థ్యంతో 120 హాల్స్ ఉంటాయి. వాటిల్లో 1,680 మంది విద్యార్థులుంటారు. సీనియర్ సెక్షన్లో 376 మంది విద్యార్థులుండేలా 28 హాళ్లను నిర్మిస్తారు. ⇒ 41,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంట, భోజన శాల బ్లాక్ ఉంటుంది. ఇందులో రెండు డైనింగ్ హాల్స్, ఒక వంటశాల, 2 వెజ్, నాన్‌వెజ్ స్టోర్లు, ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక మల్టీ పర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ హాల్ ఉంటాయి. 1,280 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో దీన్ని వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. అధ్యాపకులు, సిబ్బంది కోసం కూడా ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తారు.ఏ నిర్మాణానికి ఎంత ?⇒ ప్రధాన భవన సముదాయాల నిర్మాణానికి: రూ.140 కోట్లు⇒ ప్రహరీ, పచ్చిక బయళ్లు, సెక్యూరిటీ బ్లాక్, కాంక్రీట్ డ్రెయిన్, రోడ్లు, ఎస్టీపీ, ప్లే గ్రౌండ్స్, భూగర్భ సంప్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, లిఫ్టులు, వీధి దీపాలు, సౌర విద్యుత్ వ్యవస్థ తదితరాలు రూ. 30 కోట్లు⇒ ఎలక్ట్రిక్ ఉపకరణాలు, డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, ఫర్నీచర్, క్రీడా పరికరాలు, వంటగది వ్యవస్థ, పన్నులు తదితరాలు: రూ.30 కోట్లు⇒ 58 నియోజకవర్గాల్లో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11,600 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో క్యాంపస్‌కు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర, సూర్యాపేట నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ మూడు నియోజకవర్గాలు కాకుండా మరో 55 నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒట్టి హడావుడి.. మందులే లేవు మరి
సాక్షి, అమరావతి: విజయవాడ జీజీహెచ్‌లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా శ్రీను, శివయ్య తరహాలోనే పదుల సంఖ్యలో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మందుల దుకాణానికి క్యూ కట్టారు. ఎవరిని కదిలించినా లోపల మందుల్లేవ్.. అందుకే బయట కొనుక్కోమని చీటీలు రాసిచ్చారని చూపించారు. ఆ దృశ్యాలు రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థకు అద్దం పట్టాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ సరఫరా చేయలేని ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వంద మందికిపైగా ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ మెడికల్ స్టోర్ వద్దకు వచ్చారు. కడుపు నొప్పి, బీపీ, గ్యాస్, నొప్పులు వంటి చిన్న సమస్యలతో పాటు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, గుండె, ఇతర జబ్బుల్లో చికిత్సలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, సిరప్లు సొంతంగా కొనుగోలు చేశారు. వీరందరూ డబ్బు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోలేక.. ఉభయ గోదావరి, కృష్ణా జిలాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చారు. పశ్చి మ గోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి మెడికల్ స్టోర్ ముందు నిలబడి ‘ప్రభుత్వాస్పత్రి అంటే నే చికిత్స, మందులు, పరీక్షలు అన్నీ ఉచితం. దీంతో రానుపోను చార్జీలు, తిండి, ఇతర అవసరాలకు కొంత డబ్బు తెచ్చుకున్నాం. తీరా ఆస్పత్రిలో చేరాక మందుల్లేవ్ బయట కొనమన్నారు. రూ.వెయ్యి ఫోన్ పే చేయ్ రా’ అంటూ స్నేహితుడి ని అభ్యర్థించడం ఆవేదనకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు సుమారు వంద రకాల మందులు ఆస్పత్రి నుంచి ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.ఇంజెక్షన్ బయట కొనుక్కోమన్నారునా భర్తకు స్టెంట్లు వేశారు. చికిత్సలో భాగంగా ఓ ఇంజెక్షన్ (నికోరన్) రాశారు. ఇక్కడేమో అది లేదన్నారు. బయట కొనుక్కుని రమ్మన్నారు. రూ.450 పెట్టి ఇంజెక్షన్ కొనక తప్పలేదు. – హృద్రోగ బాధితుడు వెంకట సురేశ్ భార్య, తణుకుస్టాక్ లేవన్నారునా మనవరాలికి అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం వచ్చాను. వైద్యులు చూశారు. మందులు రాసిచ్చారు. కౌంటర్ వద్దకు వెళితే మందులు అందుబాటులో లేవన్నారు. బయట కొనుక్కోవాల్సిందే. లేదంటే మళ్లీ రమ్మన్నారు. మళ్లీ ఇంకో రోజు రావాలంటే రానుపోను చార్జీలు, ప్రయాసలు పడాల్సి వస్తుంది. చేసేదేమీ లేక కష్టాలుపడి డబ్బు పెట్టి మందులు కొనుకున్నాం. – నవమ్మ, పైడూరిపాడు, విజయవాడ రూరల్డాక్టర్ రాసిన మందులు ఇవ్వలేదునెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు. ఈ నెల 7న 38.23 శాతం మంది రోగులు మందులు ఇవ్వలేదని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్, బీపీ, గ్యాస్ సమస్యలకు కూడా బోధనాస్పత్రుల్లో బయటకు చీటీలు రాసిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూది, సర్జికల్ గ్లౌజ్‌లకు సైతం కటకటగా ఉంటోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. -
తాగునీటికి తిప్పలు.. ఒకటికొస్తే అవస్థలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రహసనంగా మారింది. సరైన వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు వేచి ఉండలేక ఇళ్లకెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని 7,021 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం, 1,811 కేంద్రాలకు తాగునీటి వసతి ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024–25లో రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియనున్నా వేగం పుంజుకోవడం లేదు. పురోగతి లేని పనులు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. వీటిల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తారు. సమగ్ర పౌష్టికాహారాన్ని అక్కడే వండి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల వండిన ఆహారానికి బదులుగా ముడిసరుకునే అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని కేంద్రాలకు వీటిని మంజూరు చేసింది. 7,021 కేంద్రాలకు టాయిలెట్లు మంజూరు చేయగా... ఇందులో కేవ లం 1,015 టాయిలెట్లకు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 1,738 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా..4,268 కేంద్రాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు.అదేవిధంగా 1,864 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి వసతికి సంబంధించి పనులు మంజూరు కాగా కేవలం 289 మాత్రమే పూర్తయ్యాయి. మరో 406 కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా.. 1,169 కేంద్రాల్లో అసలు ప్రారంభమే కాలేదు. పాలకవర్గాలు లేకపోవడమే కారణం? ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులు ప్రారంభించకుంటే మంజూరైన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది. అంగన్వాడీల్లో వసతుల కల్పనలో స్థానిక సంస్థల పాత్రే కీలకం. కానీ పాలకమండళ్లు లేకపోవడం, ప్రత్యేక పాలన కొనసాగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఇదీ. ఇక్కడ 22 మంది చిన్నారులున్నారు. టాయిలెట్ అసంపూర్తిగా ఉండటంతో రోడ్డుపైనే లఘుశంక తీర్చుకుంటున్నారు. ఈ కేంద్రంలో తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నారులు, ఈ కేంద్రానికి వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. -
అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!
నా వాలెట్ లో అత్యంత విలువైన వస్తువు నా లైబ్రరీ కార్డు అని తెలుసుకున్నా ! : లారా బుష్ ( అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్ గారి సతీమణి ) నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నా మనసులో పదేపదే మెదిలిన ప్రశ్న ‘ అమెరికాలో ఉన్నదేమిటి ఇండియాలో లేనిదేమిటి ? ’ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించింది, చాలామంది మనవాళ్లయితే కూర్చున్న సీట్ ముందున్న టివీల్లో వరసగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ, అదే తెల్లవాళ్ళు ఎక్కువ మంది పుస్తక పఠనం చేస్తూ కాలక్షేపం చేయడం. పాశ్చాత్యులకున్నంత ‘ బుక్ రీడింగ్ ’ అలవాటు మనకు లేదనేది వాస్తవం. ఆ దేశంలోని గ్రంథాలయాలను చూసినప్పుడు కూడా ఇలాంటి తేడానే నాకు స్పష్టంగా కనబడింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ( 1971 ) నేను ఎక్కువగా వెళ్ళింది కోఠి సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం . ఆ తర్వాత కాలంలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ , ఆఫ్జల్ గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అప్పట్లో సెక్రటేరియట్ ఎదురుగా నున్న బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ వంటి వాటికి. వాటితో పోల్చుకున్నప్పుడు అమెరికాలోని ఏ చిన్న పట్టణానికి వెళ్లినా అక్కడ విశాలమైన భవనాల్లో, వేల పుస్తకాలతో , కూర్చొని చదువుకోడానికి అన్ని సౌకర్యాలున్న పబ్లిక్ లైబ్రరీలు చూడవచ్చు. అందులోనే జిరాక్స్ , wifi, చిన్నపాటి కేఫ్‌లు ఉండడం వల్ల బయటికి పోవాల్సిన అవసరం రాదు. ప్రతి లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేక సెక్షన్ పెట్టడం విశేషం. ఎంతోమంది గృహిణులు తమ పిల్లలను లైబ్రరీలో దింపేసి నిశ్చింతగా షాపింగ్ వంటి పనులకు వెళ్ళిరావడం గమనించాను. అక్కడ పనిచేసే లైబ్రరియన్లు ఎంతో ఓపికతో మనకు కావలసిన పుస్తకం దొరకడం లేదంటే వచ్చి వెతికి పెట్టడం చూసాను. లైబ్రరీ సభ్యత్వ కార్డు ఉంటే చాలు పుస్తకాలు తీసుకెళ్లడం, డ్రాప్ బాక్స్ సౌకర్యం వల్ల వాటిని రిటర్న్ చేయడం సులభం. అక్కడి గ్రంధాలయ ఉద్యోగులు చేసే మరో అదనపు సేవ లైబ్రరీకి విరాళంగా వచ్చే పాత పుస్తకాలు అమ్మడం. లాస్ ఎంజెలిస్ టొరెన్స్ పబ్లిక్ లైబ్రరీలో నేనలా కొన్న పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవి Chronicle of the World (1988 edition, 1300 pages) ఆదిమానవుడి నుండి ఆధునికుల వరకు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు సంవత్సరాలవారిగా ఎన్నో ఫోటోలతో సహా వివరణలున్నది. Literature ( Reading Reacting Writting ) 1991 edition , 2095 pages. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా! అని Oxford , American Heritage వంటి డిక్షనరీలు కూడా కోనేశాను. ఒక్కో పుస్తకానికి నేను చెల్లించినవి 2-4 డాలర్లు మించలేదు. అవి కూడా ఇంట్లో నున్న చిల్లర నాణాలన్నీ తీసుకెళ్లి ఇచ్చినా విసుక్కోకుండా , లెక్కపెట్టుకొని తీసుకున్న లైబ్రేరియన్ లకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ సందర్బంగా కొన్ని బార్న్స్ అండ్ నోబెల్ వంటి ప్రైవేట్ పుస్తక విక్రయశాలలకు కూడా వెళ్లి చూసాను. కొనుగోలుదారులకు వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా తక్కువేం కాదు, కొత్తకొత్త పుస్తకాలు అక్కడా కూర్చొని చదువుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టకపోవడం విశేషం. వాళ్ళ దగ్గర నేను కొన్నవి తక్కువ. ఎంపిక పేర చదివినవే ఎక్కువ. అయితే నాకు వచ్చిన చిక్కల్లా అమెరికాలో నేను అలా సేకరించిన పుస్తకాలను ఇండియాకు తేవడంలోనే. మనవాళ్లలో ఎక్కువ మంది లగేజీ బట్టలు, వస్తువులతో నింపేస్తారు కానీ.. పుస్తకాలు తీసుకురావడానికి ఆసక్తి చూపించరు. ఏం చేద్దాం మరీ.? వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్ అర్థమవ్వాలంటే మాత్రం..!) -
ప్రగతి దిశగా బాలికా చదువు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్కిన్స్ను ఇస్తోంది. ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు. బాలికలకు నూరు శాతం సదుపాయాలు పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. ‘స్వేచ్ఛ’గా చదువుకునేలా.. దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్‌కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు. అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది. -
తిరుమల తిరుపతి దేవస్థానాల సౌకర్యాలు భేష్
తిరుమల/న్యూఢిల్లీ: శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను టీటీడీ చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్ అధ్యక్షతన ఉన్న భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతోన్న సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి వివరించారు. కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు. కమిటీ సభ్యులు బిప్లవ్ కుమార్ దేవ్, నీరజ్ శేఖర్, దిలీప్ ఘోష్, దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్య పాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.43 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం డీడీలను టీటీడీ ఈవోకు దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33 లక్షల 33 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల11 వేలు అందించారు. తిరుపతి పరిశుభ్రతపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంస తిరుపతి నగరం పారిశు«ధ్యంలో మరింత నిబద్ధత పాటిస్తుందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తడి–పొడి చెత్త ద్వారా సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్, నిర్వహణ సౌకర్యాల కోసం శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛభారత్ మిషన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 11న తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న అనంతరం పారిశుద్ధ్యానికి సంబంధించి తిరుపతి నగరం పాటిస్తోన్న నిబద్ధతను కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. పారిశుధ్య సేవలను మరింతగా విస్తరించేందుకు, సిటీని ది బెస్ట్ క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు 1,000 మంది కార్మికులను నియమించింది. ఇక్కడ ఏర్పా టు చేసిన వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్.. కేంద్రీకృత ప్లాంట్లపై భారాన్ని తగ్గిస్తుందని, వాటి పనిభారం, రవాణా ఖర్చులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. గణనీయ పరిమాణంలో సేంద్రీయ వ్యర్థాలు ఉత్పన్నమయ్యే మార్కెట్లు, తోటల్లో తడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించిందని వెల్లడించింది. 3 ప్రధాన మార్కెట్లు, 3 తోటల వద్ద 6 వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. నగరంలో 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 బయో చెస్ట్ యంత్రాలను ఏర్పాటు చేసి రోజుకు 100 కిలోలకు పైగా ఉత్పత్తి చేసే 27 బల్క్ వేస్ట్ జనరేటర్లను, రోజుకు 50–100 కిలోలు ఉత్పత్తి చేసే 60 జనరేటర్లను గుర్తించి వర్గీకరించినట్లు పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకమైన రీతిలో రీసైక్లింగ్ చేయడానికి వాషింగ్ ప్లాంట్, ఆగ్లోమెరేటర్ మిషన్ (ధన మెషినరీ)ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ మిషనరీ వల్ల తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ బృందం ఏడాది కాలంలో 263.29 టన్నుల ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ను విక్రయించేలా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కృషి చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ కొనియాడింది. -
హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు! కానీ.. : మంత్రి కొండా సురేఖnews
వరంగల్: గత ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి.. హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు.. పేద ప్రజలకు సేవలందించే ఆస్పత్రి పాలన ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుతున్న క్రమంలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు.. పేద రోగులకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై ఆదివారం ఆస్పత్రి పరిపాలనాధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు సదుపాయలు అందుతున్నాయి.. గత ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించక మిగిలిన పనులు ఏమిటి.. ప్రస్తుతం కరోనా వార్డుల పరిస్థితిపై సమీక్షించిన అనంతరం మంత్రి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కరోనా రోగులకు మెరుగైన సేవలు ఎంజీఎంలో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో గత నెల 21 నుంచి ఇప్పటి వరకు 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందన్నారు. కరోనా జేఎన్–1 వేరియంట్ విస్తరిస్తున్న కారణంగా రోగుల సంఖ్య పెరిగినా.. సేవలందించేందుకు ఆస్పత్రిలో 1,200 ఆక్సిజన్ పడకలు అమర్చే సామర్థ్యం ఉందన్నారు. 24 గంటలు ఆక్సిజన్ సరఫరా చేసేలా 3 ట్యాంక్‌లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిధుల లేమితో నిలిచిన పనులు ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో రూ.1.03 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్ పిలువగా కాంట్రాక్టర్ రూ.12 లక్షల పనులు మాత్రమే చేపట్టారని, పనులు పూర్తి చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో ఫైర్ సెఫ్టీ కోసం రూ.35 లక్షల నిధులతో చేపట్టిన పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో చివరి దశలో ఆగిపోయాయని, వీటిని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అధికారిక నంబర్లు ప్రదర్శించాలి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎంఓలు, పరిపాలనాధికారుల నంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులపై ప్రదర్శించాలని చెప్పారు. ఆర్‌ఎంఓలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. రోగుల అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఎంజీఎంలో ప్రస్తుతం 14 ఆపరేషన్ థియేటర్లు వినియోగిస్తున్నారు.. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మూడు అపరేషన్ థియేటర్లు పనికిరాని స్థితికి చేరాయి.. వాటిని తొలగించి ఆ స్థానంలో రోగుల సహాయార్థం వచ్చే అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో హెచ్‌డీఎస్ సమావేశం.. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సరేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో డీజిల్ కొనేందుకు కూడా ప్రత్యేక నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాదారులు సరిగ్గా కిరాయి చెల్లించడం లేదని, వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే తొలగించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి ఆదాయ వనరులు సమకూరేలా రోడ్డు వైపున ప్రత్యేక షెడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో అటవీ శాఖ సిబ్బంది సహాయంతో ప్రత్యేకంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆస్పత్రి పరిపాలనాధికారుల పనితీరు మెరుగుపరిచేందుకు భవిష్యత్‌లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు మురళి, శ్రీనివాస్, రోషన్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ఈ దేవేంద్రకుమార్, డీఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవి చేస్తున్నాను. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..
మనలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఇష్టపడతారు. రైలు ప్రయాణంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోంది. అంగ వైకల్యం కలిగినవారు, మానసిక వ్యాధిగ్రస్తులు, అంధులు తమ రైలు ప్రయాణంలో ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు రైలు టిక్కెట్ ధరలోనూ రాయితీ లభిస్తుంది. అయితే ఇందుకోసం దివ్యాంగులు తమ అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగివుండాలి. సీటు సౌకర్యం దివ్యాంగులైన ప్రయాణికులకు ఇది వరం లాంటిది. దివ్యాంగులకు స్లీపర్ క్లాస్‌లో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లు, ఏసీ-3లో ఒక లోయర్, ఒక మిడిల్ బెర్త్, త్రీఈ కోచ్‌లో ఒక లోయర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ కేటాయిస్తారు. టిక్కెట్లపై తగ్గింపు దివ్యాంగులైన ప్రయాణీకులకు రైలు టిక్కెట్లలో రాయితీ లభిస్తుంది. దివ్యాంగులైన ప్రయాణికులు టిక్కెట్ల ధరలో 25 శాతం నుండి 75 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దివ్యాంగులైన ప్రయాణికులకు స్లీపర్ క్లాస్, ఏసీ-3 నుండి సాధారణ తరగతి వరకు అన్నింటా రాయితీలు లభిస్తాయి. ఈ రాయితీని పొందడానికి, టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి. చక్రాల కుర్చీ సౌకర్యం భారతీయ రైల్వే దివ్యాంగులైన ప్రయాణికులకు చక్రాల కుర్చీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. స్టేషన్ నుండి రైలు వద్దకు వచ్చేందుకు దివ్యాంగులు ఈ వీల్‌చైర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ వీల్ చైర్ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు ముందుగా సంబంధిత అధికారి లేదా స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాల్సివుంటుంది. తరువాత రైల్వే సిబ్బంది వీల్ చైర్‌ను దివ్యాంగుల దగ్గరకు తీసుకువస్తారు. అయితే ఈ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
200 ద్వీపాలు గల దేశం ఏది? సందర్శనలో భారతీయులకు వెసులుబాటు ఏమిటి?
భారతదేశంలో ఏ ముస్లిం గురించి మాట్లాడినా, మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు పాకిస్తాన్. అయితే ఇదే సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పాకిస్తాన్ కాదు. మనం ఇప్పుడు మాల్దీవులకు సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మాల్దీవులు ఆసియాలోనే అతి చిన్న దేశం. దీని వైశాల్యం 298 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా లక్షల సంఖ్యలో మాత్రమే ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు మాల్దీవుల జనాభా విషయానికొస్తే 2016 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా దాదాపు 4 లక్షల 28 వేలు. అయితే 2021లో ఇక్కడి జనాభా 5.21 లక్షలుగా అంచనా వేశారు. మాల్దీవులలో సుమారు 212 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు 200 ద్వీపాలు స్థానిక జనాభాకు కేటాయించారు. 12 ద్వీపాలను పర్యాటకుల కోసం కేటాయించారు. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేదు. మాల్దీవులకు వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే 30 నుంచి 90 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా లభిస్తుంది. అయితే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, మాల్దీవులలోని హోటల్లో బస చేసినట్లు రుజువు కలిగి ఉండాలి. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం మతాన్ని విశ్వసించే వారు మాత్రమే మాల్దీవుల పౌరులవుతారు. అంటే ఇక్కడ ఉండే ముస్లింలకు మాత్రమే స్థానిక పౌరసత్వం లభిస్తుంది. మాల్దీవుల రాజ్యాంగంలోని వివరాల ప్రకారం సున్నీ ఇస్లాం ఇక్కడ జాతీయమతం. ముస్లిమేతరులెవరికీ ఈ దేశ పౌరసత్వం ఇవ్వకూడదని కూడా ఈ రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ నియమాలు కూడా ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? -
డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. కొనుగోలు ప్రాధమ్యాలివే.. ♦ ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం ఇష్టపడుతున్నారు. ♦ చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆల నాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండా లని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలే ని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ♦ ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రా«ధమ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌక ర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ♦ వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. -
వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..
దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు. ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు. -
జిల్లాల సమగ్రాభివృద్ధికి పూర్తి సహకారం
సాక్షి, పాడేరు: జిల్లాలను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులతో శనివారం పాడేరు కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమలుజేయాల్సిన పనులు, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాతాశిశు మరణాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రసవ సమయానికి సకాలంలో ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. నెల రోజుల ముందుగా గర్భిణులను ఆస్పత్రులకు చేర్చి, సుఖ ప్రసవాలతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా చూడాలని సూచించారు. కాగా, అల్లూరి, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, నిశాంత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలన్నింటిని పారదర్శకంగా ఆమలుజేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రం పాడేరులో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనులను సీఎస్ పరిశీలించారు. -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలోని యూపీహెచ్‌సీల్లో ప్రజారోగ్య సౌకర్యాలకు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీల్లో) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం గుంటూరులోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి(యూపీహెచ్సీ)ఎన్ క్యూఎఎస్ ప్రోగ్రాం కింద 96.2 శాతం స్కోర్ ఇస్తూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. అన్ని రకాలుగా ఆయా వైద్య విభాగాలు సంతృప్తికరమైన వైద్య సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకుగాను అభినందించింది. గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్‌సీల్లో కల్పించిన నాణ్యమైన వైద్య సేవలకుగాను కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోర్‌ను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి యూపీహెచ్‌సీగా గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబును అభినందిస్తూ లేఖ రాశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాదాపు 100 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కేంద్రం గుర్తింపును సాధించేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు మే నెల 19,20 తేదీలలో గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించాయి. చదవండి: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్ ఇందిరా నగర్ యూపీహెచ్‌సీలో మొత్తం 12 వైద్య విభాగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు గాను 96.2 శాతం స్కోరును సాధించాయని విశాల్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపిహెచ్ సీల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు తీరును పరిశీలించాక నివేదికలను ఎన్హెచ్ఎస్ఆర్సీ ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. -
ఎల్జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు
ముంబై: పని ప్రదేశాల్లో లింగ సమానత్వం పాటించే దిశగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే తదితరులు) ఉద్యోగులకు బాసటనివ్వడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తమ సిబ్బంది, వారి భాగస్వాములకు ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చినట్లు 24/7డాట్ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే, పేటర్నిటీ, మెటర్నిటీ లీవుల సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. సంస్థ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీకి మిగతా ఉద్యోగుల తరహాలోనే వారు తమ సమస్యలను తెలియజేసి, అవసరమైన సహాయాన్ని పొందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు, ఆర్పీజీ గ్రూప్ కూడా ప్రైడ్మంత్ సందర్భంగా తమ సంస్థలో ఉద్యోగుల కోసం ఎల్జీబీటీక్యూఏఐప్లస్ అండ్ పార్ట్నర్స్ బెనిఫిట్స్ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. అటు ఆర్–షీల్డ్ పేరిట ప్రత్యేక హెల్ట్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా తెలిపారు. -
ప్రభుత్వ ప్రతిష్టకు ఆస్పత్రులు వన్నెతేవాలి
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యరంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తానికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుండాలని సీఎం జగన్ ఆశిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె మంగళవారం మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించారు. రోగి ఆస్పత్రిలో వైద్యం పొందాక డిశ్చార్జి అయినప్పుడు సంతోషంతో ఇంటికి వెళ్లాలని, సేవల పట్ల సంతృప్తి వ్యక్తపరచాలని చెప్పారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ అధికారులు తరచూ చూడాలని చెప్పారు. తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల్లో పింక్ కలర్ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్ డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని, పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో, సీఎస్ఆర్ సహకారాన్ని తీసుకుని, 16 బోధనాస్పత్రుల్లో ఇన్సినిరేటర్స్ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్చార్జీలను రూ.80కి పెంచిన నేపథ్యంలో మెనూలో మార్పు రావాలన్నారు. గిరిజన ప్రాంతాలు, ఒడిశాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు విశాఖ, విజయనగరం ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాలను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలన్నారు. ఈవెనింగ్ క్లినిక్‌లను బోధనాస్పత్రుల్లో పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ఉదయం ఓపీలకు హాజరైన రోగుల వైద్యపరీక్షల ఫలితాల పరిశీలన, ఇతర సేవలను ఈవెనింగ్ క్లినిక్‌లలో అందించాలని ఆమె సూచించారు. డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో దారుల్ షిఫా ఫుట్ బాల్ గ్రౌండ్
-
మంచిర్యాల మాతాశిశు కేంద్రంలో వైద్యులు, వసతులు కరువు
-
‘సారూ.. బడిలో మంచినీళ్లు లెవ్వు’
సాక్షి,జగిత్యాల టౌన్: ‘సారూ మా బడిలో తాగేందుకు మంచినీళ్లు లెవ్వు. మూత్రశాలలు పనిచేయడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నం. మీరైనా జోక్యం చేసుకోండి’ అని ఆరో తరగతి విద్యార్థి ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన రాజమల్లు కుమారుడు పి.విశ్వాంక్ ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. తమ పాఠశాలలో మూత్రశాలలు శిథిలమయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఒకటి, రెంటికి బడి సమీపంలోని పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్తున్నామని, అక్కడ నిర్వాహకులు పైసలు వసూలు చేస్తున్నారని తెలిపాడు. తమతోపాటు ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి అని వివరించాడు. అసలే పేదోళ్లమని, తాముపైసలు చెల్లించలేకపోతున్నామని వాపోయాడు. ప్రస్తుతం ఎండాకాలమని, దాహంతో తపి స్తున్నామన్నాడు. ప్రజావాణి ద్వారా జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌కు వినతిపత్రం అందజేశాడు. -
గూగుల్‌లో సౌకర్యాలు కట్..!
న్యూఢిల్లీ: గూగుల్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీసు, మసాజ్ పార్లర్లే కాదు, తరచుగా కంపెనీ లంచ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కోత విధించింది. ఇక నుంచి స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న గూగుల్ ఇప్పుడు ఇలా సౌకర్యాలు కూడా కట్ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. -
కూ.. చుక్ చుక్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎందుకీ రైలు ప్రత్యేకమో తెలుసా!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై స్పీడ్ రైలు. ఇది 18 నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలో దీన్ని నిర్మించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంజిన్‌లెస్, స్వీయ చోదక రైలుగా ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకుంది. ఇది 200-210 KMPH గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ట్రయల్స్ సమయంలో ఇది గరిష్టంగా 180 KMPH స్పీడ్‌తో ప్రయాణించింది. అయితే, భారతీయ రైల్వే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దాని ఆపరేషనల్ స్పీడ్‌ను 130KMPHకి పరిమితం చేసింది. ఇందులోని వసతులు గురించి చెప్పాలంటే.. ఈ రైళ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఇంటీరియర్‌తో నిర్మితమైంది. ప్రయాణీకుల కోసం ప్రతి కోచ్‌లో గ్లాస్-బాటమ్ లగేజ్ ర్యాక్‌ను అందుబాటులో ఉంచారు. రైలులో 'ఎగ్జిక్యూటివ్ క్లాస్', 'చైర్ కార్' ఉన్నాయి. ఈ కోచ్‌లు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తాయి. మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించబడింది. ఈ రైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది. మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. 360 డిగ్రీలు తిరిగే సౌకర్యవంతమైన సీట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, వ్యక్తిగత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లు, వ్యక్తిగత మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌లు, అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు, చైన్ పుల్లింగ్ సిస్టమ్ లేదు వీటితో మరెన్నో ఉన్నాయి. చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి! -
అక్కడ ఐటీ ఎంప్లాయిస్ కి గోల్డెన్ వీసా... ఇంకెన్నో ఫేసిలిటీస్
-
నా భర్తకు జైల్లో వసతులు కల్పించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ శాసనసభ్యుడు, తన భర్త రాజాసింగ్‌కు జైలులో సౌకర్యాలు కల్పించాలని టి.ఉషాభాయ్ కోరారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో పీడీ యాక్ట్ కింద రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో ఉంటున్న రాజాసింగ్‌కు సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. రాజాసింగ్‌కు జైల్లో మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, టీవీ వంటి సౌకర్యాలు అందజేసేందుకు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయా లని పిటిషనర్ తరఫు న్యాయవాది కె. కరుణసాగర్ నివేదించారు. ప్రజలు, కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ వాదనలు వినిపించేందు కు గడువు కావాలని రాష్ట్ర ప్రభు త్వ తరఫు న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. -
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు
సాక్షి, వికారాబాద్: స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా గిరిపుత్రులు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తండాలు పంచాయతీలుగా మారినా వాటి దుస్థితి మారలేదు. రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ కనీసం అంబులెన్స్‌లు కూడా రాలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలోని ఐదు గిరిజన తండాలకు నేటికీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకనే దిక్కవుతోంది. మండలంలోని బోజ్యానాయక్‌తండా, బాబునాయక్ తండా, హంక్యానాయక్ తండా, వాల్యానాయక్‌తండా, పర్శానాయక్, తౌర్యనాయక్తండాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. ప్రభుత్వం 2018లో ఎస్టీఎస్డీఎఫ్ (గిరిజన సొసైటీ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ.4.28 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీఓ 369 విడుదల చేసింది. అయితే ఆ యేడాదిలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లు వాయిదా పడుతూవచ్చాయి. తీరా 2020 మేలో పనులకు టెండర్లు పిలువగా అప్పట్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో 2020 జూన్ 5న మంత్రి సబితారెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండు నెలల్లో రోడ్లువేసి బస్సు సర్వీసులు కూడా నడిపిస్తామని అప్పట్లో మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే వాల్యానాయక్‌తండా రోడ్డు తప్ప నేటికీ మిగతా ఐదు తండాలకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు ఒకవైపు జరుపుతుండగా గిరిజన తండాల రోడ్లకు మోక్షం లభించడంలేదని తండావాసులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ తండాలకు చెందిన గిరిజనులు బషీరాబాద్‌కు రావాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రాణాలు పోతున్నా పట్టింపులేదు మాసన్పల్లి అనుబంధ గ్రామం తౌర్యనాయక్తండాకు రోడ్డు సౌకర్యంలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కోల్పోయారు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రోడ్డు వేయాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – భీమప్ప, సర్పంచ్, మాసన్పల్లి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు మండలంలోని బోజ్యానాయక్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, వాల్యానాయక్తండాలకు రూ.4.28 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు 2020లోనే అగ్రిమెంట్లు పూర్తిఅయ్యాయి. వాల్యానాయక్‌తండా పనులు పూర్తి అయ్యాయి. తౌర్యానాయక్తండా రోడ్డులో కల్వర్టు పనులు చేశాం. అయితే నిధులులేమి కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వంశీ కృష్ణ, ఏఈ, పీఆర్ గిరిజన భావాలకు అక్షరమేదీ? బొంరాస్‌పేట: గిరిజన తెగళ్లోని లంబాడీ, గోండు, ఎరుకల వారికి ఇప్పటికీ లిపి లేకపోయింది. ఈ తెగల వారు మాతృభాషలో మాట్లాడుకోవడం తప్ప అక్షరాలు రాయలేని పరిస్థితి. మాతృభాష ఒకటి, చదువు నేర్చేది మరో భాష కావడంతో తోటి విద్యార్థులతో తగినంత ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. వివిధ మండలాల్లో గోండు, నాయకి, పర్జీ, గదవ వంటి మాృభాష కలిగిన వారున్నారు. లంబాడీ, ఎరుకల, బుడగజంగం తెగల వారికి లిపి లేదు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే బొంరాస్‌పేటలో అత్యధికంగా 70కిపైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన పిల్లలు మాతృభాషను మాట్లాడుకోవడానికే పరిమితమవుతున్నారు. చదువుకోవడంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి గిరిజన తెగల మాతృభాషలకు లిపి కల్పించాలని కోరుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పలువురి అభిప్రాయాలు ఇలా.. లిపి రూపొందించాలి జనాభాలో 25 శాతానికిపైగా గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లంబాడీ భాషలో మాట్లాడే వారికి తెలుగులో చదవడం ఇబ్బంది ఏర్పడుతోంది. తోటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. లంబాడీతోపాటు గిరిజనుల భాషకు లిపి రూపొందించాలి. – విజయలక్షి, గిరిజన ఉపాధ్యాయురాలు తోటివారితో పోటీపడలేక.. మాతృభాష లంబాడీని సునాయాసంగా మాట్లాడుతున్నాం. తెలుగు, ఇతర భాషల్లో అంతగా మాట్లాడలేక పోతున్నాం. లంబాడ యాసలో మాట్లాడితే నవ్వుకుంటున్నారు. చదువులో ఇంకా ఇబ్బందిగా ఉంది. మిగతా విద్యార్థులకు మాతృభాష, చదువుకునే భాష ఒకటేకావడంతో చురుకుగా ఉన్నారు. – శాంతి, గిరిజన విద్యార్థిని, బాపల్లి -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
నవ్విపోదురు గాక..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అధికశాతం మంది విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి. అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే కంచే చేను మేసినట్లు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు. గుర్తించిన అనర్హులు 19,996 మంది జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి జాబితాను విద్యుత్ శాఖ అధికారులకు పంపించింది. 2019 నుంచి ఉచిత విద్యుత్ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు. అనర్హులపై జాబితాపై సర్వే ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు. ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ పొందుతుండడం గమనార్హం. నెలాఖరు లోగా సర్వే పూర్తి అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం. ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. – పి.నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ (చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...) -
Hyderabad: సొంత బండి సో బెటర్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. నలువైపులా నగరం విస్తరిస్తోంది. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పరిమితంగానే విస్తరించాయి. కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. నగర జనాభా ప్రస్తుతం ఇంచుమించు కోటిన్నరకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ పదేళ్లలో ప్రజారవాణా విస్తరణకు నోచకపోవడం వల్లనే వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజా రవాణా గణనీయంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం. కిక్కిరిసిపోతున్న రహదారులు.. గ్రేటర్లో ఏటా సుమారు 2.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో మూడొంతులకు పైగా వ్యక్తిగత వాహనాలే. ప్రజారవాణా వాహనాల విస్తరణ కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలు దాటింది. రోజు రోజుకు వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్ దృష్ట్యా వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ రెండేళ్లలోనే 5 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయస్సుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. పదేళ్లలో రెట్టింపు... పదేళ్లలో జనాభా పెరిగింది. 2011 నాటి లెక్కల ప్రకారం 75 లక్షలు ఉంటే ఇప్పుడు కోటిన్నరకు చేరింది. సొంత వాహనాలు సైతం ఇంచుమించు జనాభాకు సమాంతరంగా పెరిగాయి. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం ఈ పదేళ్లలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2012 నాటి లెక్కల ప్రకారం నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 సిటీ బస్సులు ఉండేవి. ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో రాకపోకలు సాగించారు. మరో 8 లక్షల మంది ఆటోలను వినియోగించుకున్నారు. లక్ష మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. అంటే 75 లక్షల జనాభాలో కనీసం సగం మందికి ప్రజా రవాణా అందుబాటులో ఉంది. ఆర్టీఏ లెక్కల ప్రకారం పదేళ్ల క్రితం నగరంలో వ్యక్తిగత 33 లక్షల వరకు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 71 లక్షలు దాటింది. ఇప్పు‘ఢీ’లా... రోజుకు 3.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే మెట్రో రైలు తప్ప ఈ పదేళ్లలో ఇతర రవాణా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. సిటీ బస్సుల సంఖ్య ఇంచుమించు సగానికి పడిపోయింది. 2550 బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌ల వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీ వాహనాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. కోవిడ్‌తో ఎంఎంటీఎస్‌ల వినియోగం దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు 75 మాత్రమే ఉన్నాయి. అప్పుడు లక్ష మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్ధులు తదితర అన్ని వర్గాలకు మెట్రో రైలును ఏకైక పరిష్కారంగా భావించారు. కానీ ఈ ఐదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం మెరుగుపడలేదు. (చదవండి: టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!) -
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్
పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్లాట్ఫారం ఎత్తు పెంచేదెన్నడో..? పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్ ఎక్కేందుకు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చదవండి: అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్ లేఖ -
కరెంటిస్తం.. నీళ్లిస్తం..
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్‌అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్‌అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్ఓ వికాస్‌మీనా, విద్యుత్‌శాఖ ఎస్సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్‌కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు. మీరందరూ వచ్చేయండి.. ‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్‌అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్‌కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్. స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు. ఆరునెలల్లో కరెంటు.. చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకా టెంట్లోనే.. తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు. బాధాకరం: మంత్రి సత్యవతి చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు. -
మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా తామే చూసుకుంటామని నమ్మించి భారీగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు డబ్బులు స్వాహా చేశారని నగర వాసి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాలిడే ట్రిప్ కోసం ఓ ట్రావెల్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. కుటుంబసభ్యులతో కలసి మాల్దీవ్స్ వెళ్లేందుకు ఫ్లైట్ ఛార్జీలతో పాటు 7 రోజులు, 8 రాత్రులు, హోటల్, స్పాతో కలిపి రూ.2.45 లక్షలు చెల్లించారు. అక్కడకు వెళ్లకముందే 7 రోజుల్లో మా ప్యాకేజీ ఉంటుందని, మరో రెండు రోజులు వేరే హోటల్లో ఉంచుతామంటూ అబద్దాలు ఆడి ఇబ్బంది పెట్టారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! -
అక్కడ దేవుడికే దిక్కులేదు.. పట్టించుకునే వాళ్లు లేరా!
చూడటానికి ఆ ఆలయాలు చక్కగా కనబడతాయి. వర్షం వస్తే భక్తులపైనే కాదు గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలపై కూడా వర్షం పడుతుంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో ఆ ఆలయాలకు వచ్చే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దివ్య క్షేత్రంలోని పలు ఉపాలయాల దుస్థితి ఇది. సాక్షి,ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ఉప, దత్తత ఆలయాలు ఉన్నాయి. రోజూ క్షేత్రానికి వేలాదిగా వచ్చే భక్తులు చినవెంకన్న దర్శనానంతరం ఆ ఆలయాలనూ సందర్శిస్తారు. ముఖ్యంగా క్షేత్రదేవత కుంకుళ్లమ్మ, క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లీశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. చెరువు వీధిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, పసరు కోనేరు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఆయా ఆలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను చినవెంకన్న దేవస్థానం నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. అధికారుల అలసత్వం కారణంగా ఆలయాల అభివృద్ధిలో మాత్రం డొల్లతనం బయటపడుతోంది. మేడిపండులా.. మేడిపండులా కనిపించే కుంకుళ్లమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, క్షేత్రపాలకుని ఆలయాల ఆవరణల్లో ఉన్న నవగ్రహ మండపాల శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ కుంకుళ్లమ్మ ఆలయ ముఖ మండపం మడుగుగా మారుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారిపైనే వర్షం పడుతోంది. ఆ ఆలయ ప్రహరీ బాగా బీటలు వారింది. క్షేత్రపాలకుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపం శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు దాన్ని బోట్లు పెట్టి నిలబెట్టారు. భక్తులు ఆ మండపంలోనే పూజలు చేస్తున్నారు. ఆదాయం రూ.కోట్లలో ఉన్నా.. శ్రీవారి ప్రధాన ఆలయానికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ఉపాలయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.త్వరలో మరమ్మతులు చేయిస్తాం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుంకుళ్లమ్మ ఆలయ శ్లాబ్‌లు దెబ్బతిన్న విషయం నా దృష్టికి రాలేదని దేవస్థానం ఈఓ జీవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఈఈ శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శ్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది తమకు తెలపలేదన్నారు. ఈ ఆలయంతో పాటు కుంకుళ్లమ్మ ఆలయం, నవగ్రహ మండపం శ్లాబ్‌లకు త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. -
దేశంలోనే తొలిసారి... కుక్కలకు వెంటిలేటర్ సౌకర్యం..
గాంధీనగర్: సాధారణంగా శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. యజమానులు కుక్కని తమ కుటుంబ సభ్యుల్లో ఒకదానిలా చూసుకుంటారు. ఒకవేళ తమ పెంపుడు కుక్కకు ఏమైనా జరిగితే యజమానులు విలవిల్లాడిపోతారు. కుక్కలు కూడా తమ యజమానిపట్ల అదే విధంగా ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఇక్కడ ఒక యజమాని.. తన పెంపుడు కుక్క పట్ల తన ప్రేమను గొప్పగా చాటుకున్నాడు. వివరాలు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన శైవల్ దేశాయ్ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకున్నాడు. అది ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. శైవల్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే.. బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశాడు. మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత.. అతను కొన్నిరోజులకు అహ్మదాబాద్‌లో.. వెటర్నరీ బెస్ట్ బడ్స్ పెట్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. దీనిలో అన్నిరకాల సదుపాయాలతోపాటు.. వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశాడు. భారత్‌లో మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న తొలి ఆస్పత్రిగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఆస్పత్రిలో మూగజీవాలన్నింటికి ఉచితంగా వైద్యం అందిస్తారని శైవల్ దేశాయ్ తెలిపారు. ఈ ఆస్పత్రి సీనియర్ వైద్యుడిగా దివ్వ్యేష్ కేలవాయ పనిచేస్తున్నారు. కొంత మంది కుక్కల నుంచి కరోనా సోకుతుందని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి నిజంలేదని తెలిపారు. -
ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తుండడం విశేషం. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా వీ.పీ. గౌతమ్ 2019 అక్టోబర్ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్‌దత్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్’ అనిపించుకున్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ కూడా.. ఖమ్మం అదనపు కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్ అధికారి శబరీష్ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్ దంపతులను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు. కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయ్..వినియోగించుకోండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, గాంధీఆస్పత్రి (హైదరాబాద్): సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించింది. ముందు జాగ్రత్తతో చేపట్టిన ఆలోచన విధానం సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది రోగులు, వైద్యులు, సిబ్బంది పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి తీవ్రమైన ప్రాణ, ఆస్తినష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరిగిన అగ్నిప్రమాదాలను గమనించిన సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తెలంగాణలోని కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఏర్పాటు పనులను నిరంతరం సమీక్షించారు. ► గాంధీఆస్పత్రి ప్రాంగణంలో ఈ ఏడాది ఏప్రిల్ 24న అగ్నిమాపక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ► నాటి ఆదేశాలే నేడు ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు దోహదపడ్డాయని పలువురు భావిస్తున్నారు. ► సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది పనితీరుపై ప్రశంసలజల్లు కురుస్తున్నాయి. ► సమాచారం అందిన మూడు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్ధలానికి చేరుకుని కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. ► ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డామని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు తెలిపారు. ► ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయకపోతే, ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని, ఈ వ్యవధిలో మంటలు మరింత విజృంభించి ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలే తమ ప్రాణాలు కాపాడాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ► నగరంలోని పలు ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాలు తెలంగాణ సెక్రటేరియట్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. కార్బన్ స్మోక్ ప్రమాదకరం గాంధీ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సకాలంలో స్పందించాం, విద్యుత్ కేబుళ్లు వైర్లను కార్బన్‌తోపాటు పలు రకాల కెమికల్స్‌తో తయారు చేస్తారు. ఇవి కాలుతున్న సమయంలో విపరీతమైన పొగను వెలువరిస్తాచి. ఈ పొగ ఎక్కువగా పీల్చితే ప్రాణాపాయం కలుగుతుంది. మేము మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే పలు వార్డులు పొగతో నిండి ఉంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలతోపాటు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగులపై కార్బన్ పొగ తీవ్రమైన ప్రభాపం చూపించే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పెను ప్రమాదం తప్పింది. – కేవీ నాగేందర్, ఫైర్ ఆఫీసర్ -
అయ్యో.. ఆ ప్రాంత విద్యార్థులకు చదవాలని ఉన్నా..
సాక్షి,రాయగడ(భువనేశ్వర్): పాఠశాలల్లో డ్రాపవుట్ శాతాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు సరైన వసతి, రహదారి సౌకర్యాలు లేక ఎంతోమంది విద్యార్ధులు చదువులకు స్వస్తి చెబుతున్నారు. కొలనార సమితిలోని పాత్రపుట్, ఇమిలిగుడ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నివాసాలకు సమీపంలో పాఠశాలలు లేక, పూజారిగుడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. విద్యార్థులు ఈ పాఠశాలకు చేరుకోవాలంటే పాత్రపుట్‌కు, పూజారిగుడ మధ్యనున్న నాగావళి నదిని దాటాల్సి ఉంది. ప్రతీఏటా వర్షాకాలంలో నదీప్రవాహం ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమని తెలిసికూడా విద్యార్థులు నదిని దాటుతున్నారు. నాలుగేళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.8కోట్లతో పాత్రపుట్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. వంతెన నిర్మాణం పూర్తయితే, తొమ్మిది గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. ఈ విషయమై ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ వ్యయం పెరగడంతో వంతెన పనులు నిలిచిపోయాయని, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. చదవండి: Cyclone Gulab: అందరికీ గుర్తుండి పోయేలా.. ‘గులాబ్’ పేరు పెట్టి మురిసిపోయిన తల్లులు -
మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి
న్యూఢిల్లీ: దేశంలో వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ‘ఎయిమ్స్’ తరహా సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావాలని అన్నారు. ప్రతి తాలూకాలో కనీసం ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉండాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. గడ్కరీ శనివారం మహా రాష్ట్రలో సతారా జిల్లాలోని కరాడ్‌లో కోవిడ్–19 మహమ్మారిపై పోరాడిన యోధులను సన్మానిం చారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నెలకొల్పేందుకు సహకార రంగం కూడా ముందు రావాలని పిలుపునిచ్చారు. మోదీతో సంభాషణను గడ్కరీ ప్రస్తావించారు. కరోనా తొలినాళ్లలో 13వేల వెంటిలేటర్లుండేవి. దేశంలో వెంటిలేటర్ల కొరత ఉందని తాను చెప్పగా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని మోదీ ప్రశ్నించారని, ఇప్పుడు భారీగా 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండొచ్చని బదులిచ్చానని చెప్పారు. చదవండి: Speaker Om Birla: చట్టసభల గౌరవం పెంచాలి -
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్‌కేర్
రాయదుర్గం: పాలియేటివ్ కేర్‌లోకి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామారావు పేర్కొన్నారు.ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలు అందజేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘స్పర్శ్ హోస్పిస్’ఆస్పత్రి భవనాన్ని మంత్రి కేటీరామారావు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 2016లో స్పర్శ్ హోస్పిస్ని మొదటిసారి సందర్శించినప్పుడు పాలియేటివ్‌కేర్ అంటే ఏమిటో తెలియదని, మానవత్వానికి ఇది గొప్ప సేవ అని ఆ తర్వాత తెలిసిం దని అన్నారు. ఇలాంటి ఆస్పత్రుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, ముందుకొచ్చే వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. స్పర్శ్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటిపన్నుల మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకునిగా అనేక కార్యక్రమాలకు వెళ్తామని, కానీ కొన్ని కార్యక్రమాలు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. పదేళ్ళుగా మానవతా దృక్పథంతో వైద్యం అందించిన స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రి కల నెరవేరి సొంత భవనానికి నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పన్ను మినహాయింపు ఇవ్వాలి: వరప్రసాద్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఉచితంగా సేవలందిస్తున్న స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని శాంతాబయోటెక్ సంస్థ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆస్పత్రి సీఈఓ రామ్మోహన్రావు మాట్లాడుతూ, దేశంలోనే రెండు అతిపెద్ద పాలియేటివ్‌కేర్ సదుపాయాలలో ఇది ఒకటని, దేశంలో అత్యంత అధునాతన అల్ట్రా మోడ్రన్ పాలియేటివ్‌కేర్ ఇదేనని గుర్తు చేశారు. తుదిదశ కేన్సర్ రోగులలో బాధను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉండే గదుల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేశ్కోట్బాగీ, ఫీనిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్, అధ్యక్షుడు వికాస్, ట్రస్టీలు సుబ్రహ్మణ్యం సురేష్‌రెడ్డి, జగదీశ్, ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఎదులతోపాటు పలువురు డాక్టర్లు, దాతలు, వైద్యబృందం పాల్గొన్నారు. -
హీరో గ్లామర్‌లో కొత్తగా ఈ ఫెసిలిటీ కూడా
ముంబై: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోహోండా గ్లామర్ 125 సీసీ బైక్‌లో మరొ అధునాత ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జోడించింది. మార్కెట్లో గ్లామర్‌కి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు సవాల్ విసిరింది. బ్లూటూత్ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో హీరో గ్లామర్ది ప్రత్యేక స్థానం. మైలేజీ, మెయింటనెన్స్, స్టైలింగ్ విషయంలో బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనో ఎక్కువ అమ్మకాలు సాధించింది. డిజిటల్ డిస్ప్లేతో ఆదిలోనే ఆకట్టుకుంది. కాగా తాజాగా గ్లామర్ బైక్‌కి బ్లూటూత్ ఫీచర్‌ని యాడ్ చేసింది హీరో మోటర్ కార్ప్. టీజర్ రిలీజ్ రైడింగ్‌లో ఉన్నప్పుడు మోబైల్‌కి వచ్చే కాల్స్ వివరాలు చూసుకునేందుకు వీలుగా బ్లూటూత్ ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జత చేసింది. దీనికి తగ్గట్టుగా మీటర్ కన్సోల్‌లో డిజిటల్ డిస్ప్లే సైజుని కూడా పెంచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను హీరో మోటర్ కార్ప్ లాంఛ్ చేసింది. మరిన్ని హంగులు బ్లూ టూత్ ఫీచర్‌తో పాటు గ్లామర్ 125 సీసీలో ఎల్ఈడీ ల్యాంప్‌ను మరింత ఆకర్షణీయంగా హీరో మోటర్ కార్ప్ మార్చింది. హెచ్ ఆకారంలోకి హెడ్‌ల్యాంప్‌ని డిజైన్ చేసింది. అదే విధంగా స్పీడో మీటర్ కన్సోల్‌ని ప్తూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ప్రస్తుతం మార్కెట్లో హీరోహోండా గ్లామర్ 125 సీసీ ధర రూ.78,900 (ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్)గా ఉంది. అప్‌గ్రేడ్ చేసిన గ్లామర్ 125 సీసీని ఈ ఆగస్టులోనే మార్కెట్లో రిలీజ్ కానుంది. Always stay connected. Get ready for a revolutionary ride... Coming Soon. pic.twitter.com/Tmy2DbSFDe — Hero MotoCorp (@HeroMotoCorp) July 25, 2021 -
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వాళ్లకు ‘నడక’యాతన తప్పట్లేదు
రాయగడ( భువనేశ్వర్): ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రాయగడ జిల్లాకు ఒరిగిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలే కాకుండా జిల్లా కేంద్రానికి సమీప గ్రామాలు కూడా కనీసం రహదారి సదుపాయానికి నోచుకోలేదని వాపోతున్నారు. జిల్లాను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను మంచాలపై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. నిండు గర్భిణినైనా రెండు కిలోమీటర్ల నడవాల్సిందే ఈ క్రమంలో నిండు గర్భిణిని రెండు కిలోమీటర్ల దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లిన సంఘటన గురువారం జరిగింది. అయితే అదేదో మారుమూల కుగ్రామం అనుకుంటే పొరబడినట్లే. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో అధికారులు సైతం ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీప తడమ పంచాయతీ పరిధి హులుకి గ్రామానికి చెందిన కైలాస కడ్రక భార్య సంజిత కడ్రక పురిటినొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం మేరకు అంబులెన్స్ వచ్చి సరైన రహదారి లేక హులుకి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జరఫా గ్రామంలో ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కైలాస కడ్రక, వదిన మోతికడ్రక, మరో యువతి సహాయంతో కలిసి గర్భిణి సంజిత కడ్రకను ముళ్ల పొదల మీదనుంచి అతి కష్టం మీద నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అంబులెన్స్ వరకు డోలీలో తీసుకువెళ్లేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో నడిపించుకుని తీసుకువెళ్లాల్సి వచ్చిందని భర్త కైలాస కడ్రక తెలియజేశాడు. -
జగనన్న కాలనీలు.. సౌకర్యాల నిలయాలు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాడు అలా ►టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్ నిర్మించారు. ►ఒక బెడ్ రూం, వంటగదితో కూడిన లివింగ్ రూమ్ నిర్మించారు. ►2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ►మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేడు ఇలా ►ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్. ►340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. ►ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా. ►ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్ ట్యాంక్. ►కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన -
ఆరోగ్య సంరక్షణపై దశాబ్దాల నిర్లక్ష్యం
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న వసతులను మెరుగుపర్చే విషయంలో మోదీ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. పైగా కొందరు బీజేపీ కీలక నేతల అహేతుకమైన, అశాస్త్రీయమైన ఆలోచనా తీరు కలవరం కల్గిస్తోంది. ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. పరస్పరం ఆరోపించుకునే క్రీడను కట్టిపెడదాం. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థది ఒకానొక దుఃఖకరమైన నిర్లక్ష్యపూరితమైన విషాదకర గాథ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ పరమ నిర్లక్ష్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలనలోనే ఇలా జరిగిందని చెప్పలేము. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నిరంతర నిర్లక్ష్య ఫలితంగానే ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న పెనుసవాళ్లను ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థ చేష్టలుడిగిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కూడా తీవ్రంగా విరుచుకుపడింది కానీ దాన్ని మనం కొన్ని అగ్రదేశాల కంటే కాస్త మెరుగైన రీతిలోనే ఎదుర్కోగలిగాం. కానీ ఆ తర్వాతే నిర్లక్ష్యం, అలసత్వం ఆవరించింది. 2021లో కరోనా సోకిన కేసులు, మరణాల రేట్లు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని సంబరపడిపోయాం. ఆ తర్వాత సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మ్యుటెంట్ రకాలతో విరుచుకుపడింది. అప్పటికే చాలీచాలని సౌకర్యాలతో, తక్కువ మంది వైద్య సిబ్బందితో కునారిల్లుతున్న ఆరోగ్య మౌలిక వసతుల కల్పనా రంగం దీని తాకిడిని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇప్పుడున్న అంబులెన్సుల కంటే అయిదు రెట్ల సంఖ్యలో అంబులెన్సులు భారత్‌కు అవసరమని తెలుస్తోంది. అంబులెన్స్ సౌకర్యం లేక కార్లు, రిక్షాలలో సైతం తీసుకుపోతున్న కరోనా రోగులు శ్వాస సమస్యతో రొప్పుతూ, ఆసుపత్రిలో బెడ్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాల వర్ణనలతో టీవీలు, సోషల్ మీడియా నిత్యం ముంచెత్తుతున్నాయి. అనేకమంది ఆసుపత్రుల వెలుపలే చనిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కాలంలో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా భారత్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తం కరోనా మరణాల్లో మూడో వంతు భారత్‌లోనే సంభవించాయి. అయితే అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా వాస్తవ మరణాలు ఉంటున్నాయని ఆధార సహితంగా తెలుస్తూండటం గమనార్హం. ఈరోజుల్లో యావత్ ప్రపంచ దృష్టి భారత్‌మీదే కేంద్రీకృతమై ఉందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు. గంగానదిలో డజన్లకొద్దీ శవాలు తేలియాడుతున్న భయానక దృశ్యాలు వణికిస్తున్నాయి. ఈ పవిత్ర నది గట్లలో భారీ యంత్రాల సాయంతో గోతులు తవ్వుతూ నదిలో కొట్టుకువస్తున్న శవాలను పూడ్చటానికి స్మశాన క్షేత్రాలను రూపొందిస్తున్నారు. గత బుధవారం ఒక టీవీ చానల్ వారు ఉత్తరప్రదేశ్ లోని ఎటావాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిని సందర్శించారు. దాంట్లో 100 పడకలు ఉన్నాయి. కానీ అంతకుమించిన రోగులు ఆసుపత్రిలో నేలమీద పడుకుని ఉన్నారు. ఇదే ఘోరమనుకుంటే అంతమంది రోగులున్న ఆ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కానీ, నర్సు కానీ కనిపించలేదంటే నమ్మశక్యం కాదు. చివరకు ఆసుపత్రి పాలనాయంత్రాంగం నుంచి ఒక్కరూ అక్కడ లేకపోవడం విచారకరం. పైగా పారిశుధ్య సిబ్బంది గైర్హాజరీతో ఒక్క టాయెలెట్ కూడా అక్కడ పనిచేయడం లేదు. ఇంతవరకు మహమ్మారి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వైరస్ వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉనికిలోనే లేని నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతి కల్పన ఘోరంగా ఉంటోంది. భారత్‌కు 73 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ప్రాధమ్యాలను దేశం నిర్ణయించుకోవలసి వచ్చింది. విషాదకరంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే రెండు అత్యంత కీలకమైన రంగాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ స్థాయి బోధనా సంస్థలను నెలకొల్పారు. అద్భుతమైన ఆసుపత్రులను నిర్మించారు. కానీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ప్రాథమిక పాఠశాలలు లేవు. వైద్య క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ లేవు. దీని ఫలితంగానే ముఖ్యంగా బాలికల్లో అక్షరాస్యతా స్థాయి పడిపోయింది. అదేవిధంగా సగటు ఆయుర్దాయం కూడా పడిపోయింది. మంచి ప్రజారోగ్య సంరక్షణకు ఇదే అసలైన సూచిక. చైనా, చివరకు ముస్లిం దేశమైన ఇండోనేషియా వంటి అతిపెద్ద దేశాలు కూడా తమ ప్రాధమ్యాలను సరైన విధంగా నిర్ణయించుకున్నాయి. ఇవి తొలి నుంచీ ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చాయి. ఈ రెండు దేశాల్లోనూ 1947 నాటికి భారత్ కంటే తక్కువ అక్షరాస్యతను, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవి. కానీ 1980లలో ఈ రెండు కీలక రంగాల్లో ఈ దేశాలు అవలీలగా భారత్‌ని దాటి ముందుకెళ్లిపోయాయి. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. వివిధ కేంద్రప్రభుత్వాలు నియమిస్తూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల ఎంపికలోనే ప్రజారోగ్యానికి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది దాగి ఉంది. జనతాపార్టీ తరపున రాజ్ నారాయణ్, కాంగ్రెస్ తరపు ఏఆర్ ఆంతూలే వంటి వారు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అత్యంత ప్రముఖ, అగ్రశ్రేణి సంస్థలు సైతం కాలం గడిచేకొద్దీ నిర్వహణాలోపం, అవినీతి కారణంగా ప్రమాణాలు దిగజార్చుకుంటూ వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న హిల్ స్టేషన్ అయిన కసౌలీలో 1904లోనే కేంద్ర పరిశోధనా సంస్థ (సీఆర్ఐ)ని నెలకొల్పారు. ఇది ఒకప్పుడు పలు రకాల వ్యాక్సిన్లు, సీరమ్ల తయారీదారుగా పేరుకెక్కింది. వీటిలో కొన్నింటిని ఎగుమతి కూడా చేసేవారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్బుమణి రామ్‌దాస్‌ని కేంద్ర ఆరోగ్యమంత్రిగా చేశారు. ఈయన కాంగ్రెస్ కూటమిపార్టీల్లో ఒక పార్టీకి చెందిన నేత. నా అభిప్రాయంలో ఆయన ఎంపిక ఏమాత్రం సరైనది కాదు. ఆయన హయాంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన ఒక ప్రతికూల నివేదిక కారణంగా అంతవరకు వ్యాక్సిన్లు, సీరమ్ల ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉన్న సీఆర్ఐ కేవలం ఒక పరీక్షా ప్రయోగశాల స్థాయికి కుదించుకుపోయింది. ప్రభుత్వ నిర్వహణలో ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. కానీ ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి సైన్సు స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పైగా ప్రత్యామ్నాయ వైద్యాన్ని అలోపతి కంటే ఆధిక్యతా స్థానంలో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ, వైద్య ఆవిష్కరణల పేరిట సెమినార్లు ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఆవు విసర్జించే వ్యర్థ పదార్ధాలను కేన్సర్ వంటి కీలక వ్యాధులకు కూడా ఉపశమన కారులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు దేశంలో చలామణీ అవుతున్నప్పుడు, సమర్థవంతమైన, ఆధునిక ఆరోగ్య మౌలిక వసతులను మనం ఏర్పర్చుకోగలమా? శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, ప్రశ్నించి సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి పర్చుకోవడం ప్రతి పౌరుడి విధి అని రాజ్యాంగమే నిర్దేశించింది. సైన్స్, ఔషధ రంగంలో భవిష్యత్తులో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ భారత రాజ్యాంగం ప్రవచించిన ఈ విశిష్ట వాక్యాన్ని ప్రముఖంగా పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: రాహుల్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
వంద పడకలు.. ముగ్గురే బాధితులు
రామంతాపూర్: ఉప్పల్ సర్కిల్లోని రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, చిలుకానగర్ డివిజన్లకు చెందిన వందలాది మంది ప్రతిరోజు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేసుకుంటున్నారు. చాలా మంది కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో ఆస్పత్రిలో వంద పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో చేరుదామని ఆశగా వస్తున్నారు. కానీ ఈ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. వంద పడకలతో ఏర్పాటుచేసిన ఈ ఐసోలేషన్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటివరకు ముగ్గురే చేరారు. దీంతో ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేసిన పడకలు నిరుపయోగంగా మారాయి. ఐసోలేషన్ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పల్స్ యాక్సిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఆదివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఐసోలేషన్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా బెడ్లు ఖాళీగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఐసోలేషన్ సెంటర్‌ను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించించా ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సెంటర్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ( చదవండి: కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు ) -
ఇక్కడ ఆడుతూ.. పాడుతూ..పాఠాలు నేర్పుతారు
విజయనగరం అర్బన్: అనాథ, నిరుపేద బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో వినూత్న బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒత్తిడిలేని విద్యను అందించేందుకు వీలుగా ఆటపాటలతో, విజ్ఞానదాయక అంశాలపై దృష్టిసారించారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులకు రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఇటీవలే వారి డైట్ చార్జీలను కూడా పెంచింది. చదువుల ఒత్తిడి లేకుండా విద్యార్థినులకు యోగాతో పాటు ఆటపాటలతో అభ్యసనం సాగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థినులకు ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరుగుతోంది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా... జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. అర్హులైన బోధనా సిబ్బందిని నియమించి ఆయా సబ్జెక్టుల్లో బోధన అందిస్తోంది. విద్యార్థినులకు యోగాతోపాటు వారికి ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో, ఇతర కళాంశాల్లో రాణించేలా సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల ఒకప్పుడు 80 శాతం దాటని ఉత్తీర్ణత మూడేళ్లుగా పెరుగుతూ రావడం విశేషం. పదోతరగతిలో 2017–18 లో 96.7 శాతం, 2018–19లో 97.56 శాతం, గత ఏడాది శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. దశలవారీగా విస్తరణ జిల్లాలో 33 కేజీబీవీలున్నాయి. అన్ని వర్గాలకు చెందిన నిరుపేద, అనాథ బాలికలు 8,206 మంది అందులో విద్యాబోధన పొందుతున్నారు. 6 నుంచి 10 వరకు తరగతుల నిర్వహణతోపాటు గతేడాది నుంచి ఇంటర్ తరగతులు కూడా ప్రారంభించారు. దీనికి అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టించింది. జిల్లాలోని 16 మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు లేకపోవడంతో అక్కడి బాలికల కోసం కేజీబీవీల్లో వసతి గృహాలను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లు, ఇతర స్కూళ్లలో చదివే విద్యార్థినులకు అక్కడే అవాసం కల్పిస్తున్నారు. నాణ్యమైన పదార్థాలతో రోజుకో మెనూ కేజీబీవీ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కరోనా అనంతరం పునఃప్రారంభమైనా ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయిస్తూ వాటి వ్యాప్తిని నిరోధించింది. వసతి గృహాల్లోని భోజన సౌకర్యం మెరుగుపర్చి, డైట్ చార్జీలను రూ.1,400కు పెంచింది. మోనూలో కూడా పలు మార్పులు చేసింది. రోజుకో రకమైన పదార్థాలతో సరికొత్త మెనూ రూపొందించి ఆ మేరకు అన్ని కేజీబీవీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం లేచినవెంటనే ప్రీ బ్రేక్ ఫాస్ట్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ తరువాత పండ్లు అందిస్తున్నారు. మాంసాహారులకు చికెన్, శాకాహారులకు కాయగూరలు అందిస్తున్నారు. పాలు, రాగిజావ, రాగి సంగటి, బూస్ట్, చిక్కీలు, ఊతప్పం, ఇడ్లీలు, పూరీలు, ఆలూ బఠానీ కుర్మా, చపాతీ, కోడుగుడ్లు, అన్నం, రోజకోరకమైన కూరలు ఇలా వివిధ రకాల వంటకాలతో విద్యార్థినులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు నిరుపేద, అనాథ బాలికల విద్యాబోధన కోసం నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఒత్తిడి లేని బోధన, అభ్యసనాలను అమలు చేస్తున్నాం. ఈ నేపధ్యంలోనే టెన్త్ ఫలితాలు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలోని 33 కేజీబీవీల్లో 8,206 మంది బాలికలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నాం. – జె.విజయలక్ష్మి, ఏపీసీ, ఎస్ఎస్ఏ ( చదవండి: క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్ ) -
గ్రామ నిర్ణయం మేరకే.. పంచాయతీ నిధుల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులను అక్కడి ప్రజలు, పంచాయతీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మొత్తం 142 మున్సిపాలిటీలు, పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. మహిళలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మీదుగా ఉన్న విద్యుత్ లైన్లను ప్రభుత్వ ఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్‌కో సీఎండీని ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం మాట్లాడారు. స్థానిక సంస్థల సాధికారతపై దృష్టి పెట్టామని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. ట్రాఫిక్, మహిళా పోలీసు విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఆర్అండ్ బీ, ఇరిగేషన్ , హోం, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించి.. పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులను మంజూరు చేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, నదులు, వాగుల మీద అవసరమైన చోట చెక్ డ్యాంల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆదేశించారు. యాసంగి పంటలకు నీళ్లు... కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. కొల్లాపూర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో యాసంగి పంటలకు నీరందించాలని ఆయా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, హర్షవర్ధన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, గంపా గోవర్దన్, అబ్రహం, సంజయ్ కుమార్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలె యాదయ్య, హన్మంత్ షిండే, పట్నం నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రసమయి బాలకిషన్, జైపాల్ యాదవ్, సండ్ర వెంకటవీరయ్య, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో మరిన్ని సౌకర్యాలు
సాక్షి కడప: కడప విమానాశ్రయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్ హరి కిరణ్ తెలిపారురు. బుధవారం కడప విమానాశ్రయంలో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ హోదాలో కలెక్టర్ హరి కిరణ్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. విమానాశ్రయ పరిధిలో పోలీసు బందోబస్తును మరింత పెంచాలని సూచించారు. విమానాశ్రయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రతకు సంబంధించిన పలు విషయాలను, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విమానాశ్రయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. కడప సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, అడిషనల్ ఎస్పీ రిషికేశవరెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్, కమిటీ కన్వీనర్ శివప్రసాద్, కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఏటీసీ ఇన్‌ఛార్జి షేక్ షకీల తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్‌లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్‌ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్‌లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్‌గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్‌కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
స్టార్ హోటళ్లు వద్దు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ షెడ్యూలుపై స్పష్టత వచ్చేసింది కానీ... దానితో ముడిపడిన ఎన్నో అంశాలపై ఇంకా గందరగోళం ఉంది. ఇందులో నిర్వహణ సమస్యలు కొన్ని కాగా... మరికొన్ని ఆటగాళ్ల డిమాండ్లు, భయాల గురించి ఉన్నాయి. లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నా... క్రికెటర్లలో కరోనా భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు. వాటిని తమ ఫ్రాంచైజీల ముందు ఉంచుతున్నారు. ఇందులో ఇప్పుడు క్రికెటర్ల వసతి అంశం తెరపైకి వచ్చింది. ఎప్పట్లా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. అక్కడ బస చేయడంపై కొన్ని భయాలు ఉన్నాయి. సాధారణంగా హోటల్ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌ల ద్వారా కోవిడ్ వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది. పైగా పెద్ద సంఖ్యలో ఇతర పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నా యాలపై దృష్టి పెట్టాయి. దుబాయ్‌లో గోల్ఫ్ రిసార్ట్‌లలో ఆటగాళ్లను ఉంచే విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. ముంబై యాజమాన్యమైతే ఒక అపార్ట్మెంట్ మొత్తాన్ని ఆటగాళ్ల కోసమే అద్దెకు తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ‘హోటల్లో అందరినీ ప్రతీ సారి స్క్రీనింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దుబాయ్‌లోని రిసార్ట్‌లలో సకల సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో గదిని కేటాయించడం కష్టం కాకపోవచ్చు’ అని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. కొందరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ సమయంలో మానసిక ఉల్లాసానికి తమకు గోల్ఫ్ ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రిసార్ట్‌లలో ఉంటే ఇది సాధ్యమవుతుందని, పైగా గోల్ఫ్ సోషల్ డిస్టెన్సింగ్లోనే జరుగుతుందని, ఏ సమస్యా ఉండ దని చెబుతున్నారు. కాంటాక్ట్‌లెస్ ఫుడ్ కావాలి... మరో వైపు ఐపీఎల్‌కు సంబంధించి పలు అంశాలపై ఫ్రాంచైజీల సందేహాలు ఇంకా తీరలేదు. వీటిపై తమకు మరింత స్పష్టతనివ్వాలని వారు కోరుతున్నారు. లీగ్‌లో గాయపడితే అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం అలానే ఉంది. అయితే బయటినుంచి కాకుండా కొందరు ఆటగాళ్ల బృందంతో బీసీసీఐ ఒక జాబితాను సిద్ధం చేసి వారిలోంచే ఎవరినైనా తీసుకునేలా ఫ్రాంచైజీల ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. యూఏఈలో 6 రోజుల క్వారంటైన్ కాకుండా వైద్యుల సూచనలు తీసుకుంటూ కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఆటగాళ్లు తీసుకునే ఆహారం పలువురు చేతులు మారకుండా ‘కాంటాక్ట్‌లెస్ డెలివరీ’ ఉండాలని డిమాం డ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను అనుమతించాలని విజ్ఞప్తులు బోర్డుకు ఎక్కువయ్యాయి. సుమారు 80 రోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు. అన్నింటికీ మించి తమ స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహించుకోవచ్చనే విషయంపై కూడా మరింత స్పష్టత కావాలని ఫ్రాంచైజీలు అడుగుతున్నాయి. -
ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులకు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ, ఈనెల 9న కువైట్ నుంచి 163 మంది వలస కార్మికులను రూ.1,500 చొప్పున చెల్లించే పెయిడ్ హోటల్‌కు తీసుకెళ్లారని ఆ లేఖలో తెలిపారు. ఇందులో 9 మంది వద్ద డబ్బులు లేకపోవడంతో వారిని ఆ హోటళ్లలో ఉంచి ఖర్చులు చెల్లిస్తామని బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులను విదేశాల నుంచి రాష్ట్రానికి ఉచితంగా తీసుకురావాలని, వారికి ఎలాంటి రుసుం విధించకుండా క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. -
కమిటీ..వీటి సంగతేమిటి?
సాక్షి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఇటీవల ఏర్పాటైన స్కూల్ మేనేజ్మెంట్ (ఎస్ఎంసీ) కమిటీలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం కనిపిస్తున్నాయి. బాధ్యతగా కనీస సౌకర్యాల కల్పనకు తోడ్పాటునందించాల్సిన అవసరం కనిపిస్తోంది. జిల్లాలో మూడు సంవత్సరాల తర్వాత ఎస్ఎంసీ కమిటీలను ఎన్నికల విధానంలో నియమించడంతో కొత్త ఉత్సాహం ఏర్పడింది. మొత్తం 1,619 పాఠశాలలు ఉండగా..1,240 బడుల్లో ఎన్నికలు నిర్వహించారు. 781 ఎస్ఎంసీ కమిటీలు ఏకగ్రీవమయ్యాయి. నూతన కమిటీలు కొలువుదీరాయి. 81 పాఠశాలల్లో వివిధ కారణాల చేత ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 98వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో పదో తరగతి పిల్లలే 20వేల మంది వరకు ఉన్నారు. ఈ కమిటీలు కనీస సౌకర్యాలపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య పీడిస్తోంది. కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారాయి. మరికొన్ని చోట్ల నీటి వసతి లేక ఉపయోగంలో లేవు. చాలా బడుల్లో బల్లలు సరిపడా లేక పిల్లలు నేలమీదనే కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఇబ్బంది తీవ్రంగా కనిపిస్తోంది. ఇక తాగునీటి సమస్య పీడిస్తోంది. చేతిపంపులు పనిచేయక, ఉన్నచోట చిలుము నీరు వస్తుండడంతో పిల్లలు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. జలమణి పేరిట శుద్ధి జలం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా మారింది. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల నుంచి కుళాయిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి లాంటి అనేక మండలాల్లోని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది. టీచర్ల కొరత ఉండడంతో చదువులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారిపై ఎస్ఎంసీ కమిటీలు దృష్టి సారించాయి. నిధులకు చైర్మన్, హెచ్ఎంల భాగస్వామ్యం ప్రభుత్వం విడుదల చేస్తున్న వివిధ రకాల నిధులు ఎస్ఎంసీ చైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లో జమకానున్నాయి. ఇరువురి సంతకాలతోనే..డ్రా చేసి అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. యాజమాన్య కమిటీల పనితీరును ఈసారి పక్కాగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల పెంపు కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే అల్పాహారం అందించట్లేదు. ఇందుకోసం చర్యలు తీసుకునేలా ఎస్ఎంసీ కమిటీలు ప్రయత్నం చేస్తున్నాయి. కమిటీల సహకారం తీసుకుంటాం.. కొత్తగా ఏర్పడిన ఎస్ఎంసీ కమిటీల ద్వారా సౌకర్యాల కల్పనకు సహకారం తీసుకుంటాం. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు పెంచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. త్వరలో అల్పాహారం అందించేందుకు నిధులు రానున్నాయి. అందుకు అనుగుణంగా అందించనున్నాం. మిగతా సమస్యల పరిష్కారానికి కమిటీల ద్వారా కృషి చేస్తాం. – కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్ఎం–రిక్కాబజార్ హైస్కూల్, పరీక్షల విభాగం సెక్రటరీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మా వంతు కృషి చేస్తాం.. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున బడిలో సౌకర్యాలు కల్పించేందుకు మావంతుగా కచ్చితంగా కృషి చేస్తాం. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం. పాఠశాలలో పదో తరగతి ఫలితాలు పెంచేలా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తాం. – జి.శ్రీనివాసరావు, ఎస్ఎంసీ చైర్మన్, జెడ్పీఎస్ఎస్ కొత్తగూడెం, ఖమ్మంఅర్బన్ -
ఇదిగో నవ లోకం
మహిళల కోసం కట్టిన మహా నగరాలు ఎలా ఉంటాయి? మహిళల కోసం నగరాలా! భువిపై అవెక్కడ? ఎవరు కట్టారని? సరే. ఇదే ప్రశ్న ఇంకొకలా. మహిళలు కనుక తమ కోసం మహానగరాలు కట్టుకుంటే అవి ఎలా ఉంటాయి? కట్టుకోవడం అంటే డిజైన్ చెయ్యడం. ఏ మహా నగర నిర్మాణమైనా మనుషులందరి కోసమే అయినప్పుడు మహిళలెందుకు ప్రత్యేకంగా నగరాలకు డిజైన్ చెయ్యడం? ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న నగరాలన్నీ పురుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పురుషులు ప్లాన్ చేసి కట్టినవే. స్త్రీల అవసరాలను, వసతులను, సదుపాయాలను మనసులో పెట్టుకుని ప్లాన్ చెయ్యాలంటే స్త్రీ మనసు ఉండాలి. పురుషుల వల్ల అది అయ్యే పని కాదు కనుక.. స్త్రీలే స్వయంగా డిజైన్ చేసి కట్టించాలి. ఒకవేళ వాళ్లకు అలా కట్టించే అవకాశం వస్తే ఏయే సౌకర్యాలకు, కనీసావసరాలకు స్త్రీలు ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పుడీ సందేహం కూడా ఏ పురుష పుంగవునికో రాలేదు. ఆదా కోలా అనే మహిళకు వచ్చింది. స్పెయిన్ దేశపు ముఖ్య నగరం బార్సిలోనాకు నాలుగేళ్లుగా ఆమె మేయర్. నగరంలో మంచి మంచి ‘ఉమెన్ ఫ్రెండ్లీ’ మార్పులు తెచ్చారు. వాటితో సరిపెట్టుకోక.. మహిళకు స్వర్గధామంగా ఉండే నగరం ఎలా ఉండాలో నగర మహిళల్ని అడిగి తెలుసుకుని ఒక నివేదికను తయారు చేసే పనిని ‘కలెక్టివ్ పంత్ 6’ అనే నిర్మాణ సంస్థకు ఆమె పురమాయించారు. ఆ సంస్థ ప్రతినిధులు బార్సిలోనాలోని మహిళల అభిప్రాయాలను సేకరించి మేయర్ కోలాకు సర్వే ఫలితాల నివేదికను సమర్పించారు. నివేదికలో ప్రధానంగా ఆరు అంశాలు అండర్‌లైన్‌తో ఉన్నాయి. ఎక్కడిక్కడ వాష్‌రూమ్స్ అందుబాటులో ఉండటం, మహిళలు గేమ్స్ ఆడేందుకు రోడ్ సైడ్ మైదానాలు, అనుౖÐð న రోజువారీ ప్రయాణ సదుపాయాలు, రోడ్లపై పూర్తిగా కార్లను నిషేధించడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీడపట్టున కాసేపు కూర్చునే వసతి, లేట్ నైట్ పార్టీలను నిషేధం.. నగరంలో ఈ ఆరూ ఉండాలని మహిళలు కోరుకున్నట్లు నివేదికలో ఉంది. మామూలు ఇంటి నిర్మాణానికే ఇంట్లో ఆడవాళ్ల వసతి, సదుపాయాల గురించి పట్టించుకోని మనకు ఒక మహానగరాన్నే ఆడవాళ్లకు వెసులుబాటుగా నిర్మించడం అనే ఆలోచన ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే బార్సిలోనాలో ఉన్నదెవరు? మహిళా మేయర్. సూపర్ మేడమ్ మీరు. -
హైకోర్టు వద్ద కప్పు టీ కూడా దొరకడం లేదు..
సాక్షి, అమరావతి: హైకోర్టులో సౌకర్యాల లేమిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల అందరూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. హైకోర్టుకు వచ్చేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నామంది. హైకోర్టు న్యాయమూర్తులైన తమకు ఇప్పటివరకు నివాస గృహాలు కూడా లేవని, ఇప్పటికీ ప్రైవేట్ అతిథి గృహాల్లో ఉంటున్నామని, ఈ పరిస్థితి ఎంత కాలమని ప్రశ్నించింది. న్యాయవాదులు కార్లు పార్కింగ్ చేసేందుకు, కూర్చోడానికి తగినంత స్థలం లేదని, హైకోర్టు వద్ద ఒక్క కప్పు టీ కూడా దొరికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. సౌకర్యాల లేమిపై న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని తెలిపింది. సౌకర్యాల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్విస్ చాలెంజ్ కింద కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పునఃసమీక్షిస్తున్నామని ప్రభుత్వం నివేదించిన నేపథ్యంలో దాని వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఎటువంటి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమంటూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.ఈ కేసులో తమ పరిధిని రాజధాని ప్రాంత అభివృద్ధి అంశానికి విస్తరింపచేస్తామని స్పష్టం చేసింది. ఇవీ వ్యాజ్యాలు... స్విస్ చాలెంజ్ కింద సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో 170కి సవరణలు చేస్తూ టీడీపీ సర్కారు తెచ్చిన జీవో 1ని సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్విస్ చాలెంజ్‌ను సవాలు చేస్తూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా హైకోర్టులో 2018లో ‘పిల్’ దాఖలు చేశారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ యాక్ట్ (ఏపీఐడీఈ) సవరణ చట్టాన్ని రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ సభ్యుడు యడవిల్లి సూర్యనారాయణమూర్తి 2018లో మరో పిల్ దాఖలు చేశారు. స్విస్ చాలెంజ్ కింద జరిగిన ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వీటిపై సీజే జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం గురువారంవిచారించింది. గత ఒప్పందాలపై పునఃసమీక్ష జరుగుతోంది... పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎవరూ హాజరు కాకపోవడంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ స్విస్ చాలెంజ్ కింద గతంలో జరిగిన ఒప్పందాలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ ఇంకెన్నాళ్లు చేస్తారు? జాప్యాన్ని సహించేది లేదని పేర్కొంది. గత సర్కారు ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ ఫలితమే! సాక్షి, అమరావతి: విభజన అనంతరం హైకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చాలా రోజులు ఉమ్మడిగానే కొనసాగింది. తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టును వేరుగా ఏర్పాటు చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భవనాలను కూడా ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలంటూ హైకోర్టు 2015లో తీర్పునిచ్చింది. అటు తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ భూభాగంపై ఏపీ హైకోర్టును ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని 2018 అక్టోబర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. దీనిపై సుప్రీంకోర్టు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరగా చంద్రబాబు సర్కారు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిలో డిసెంబర్ 15కల్లా హైకోర్టు భవనం సిద్ధమవుతుందని లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వ అఫిడవిట్‌ను విశ్వసించిన సుప్రీంకోర్టు జనవరి 1కల్లా ఏపీ హైకోర్టు ఏర్పాటు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నామంటూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రపతి 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందంటూ గత ఏడాది డిసెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించింది. మొదటి కోర్టు హాలు మాత్రమే చూపించి... గత ఫిబ్రవరిలో నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. ఆ రోజుకు సైతం హైకోర్టు భవనం నిర్మాణం పూర్తి కాలేదు. హైకోర్టు హాళ్లను పరిశీలించాలని భావించిన జస్టిస్ గొగోయ్‌కు అప్పటి ప్రభుత్వం కేవలం మొదటి కోర్టు హాలును మాత్రమే చూపించింది. మిగిలిన కోర్టు హాళ్లు కూడా ఇలాగే ఉంటాయంటూ వాటిని చూసే అవకాశం లేకుండా చేసింది. నిజానికి అప్పటికి హైకోర్టు భవన నిర్మాణ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం మార్చి 18న హడావుడిగా విజయవాడలో ఉన్న హైకోర్టును నేలపాడులోని తాత్కాలిక భవనంలోకి మార్చింది. అప్పటికి కూడా హైకోర్టు చుట్టూ బురదే. పలు సందర్భాల్లో వర్షాలకు హైకోర్టు మొత్తం లీకైంది. అక్కడకు బస్సు సదుపాయం కూడా లేదు. షామియానాలు వేసి కొద్ది రోజులు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బయట నుంచి ఓ చిన్న వ్యాన్‌లో వస్తున్న భోజనమే చాలా మంది న్యాయవాదులకు, కక్షిదారులకు దిక్కు. ఇప్పటికీ హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. -
మా పిల్లలకు టీసీలు ఇవ్వండి..
సాక్షి, ఖమ్మం : అసలే అద్దెభవనాలు, ఆపై వాటిలో అరకొర వసతులు, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, నీటి సౌకర్యం లేకుండా అవస్థలు పడుతూ గురుకుల పాఠశాలలో చదువులు కొనసాగించలేమని విద్యార్థులు, తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలని సోమవారం ఆందోళనకు దిగారు. వేరే ప్రాంతం నుంచి గురుకుల పాఠశాలను తరలించి ఒకే క్యాంపస్‌లో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని వెలుగుమట్ల గుట్టపై ఉన్న ఖమ్మం నియోజకవర్గ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనకు దిగారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో తమ పిల్లలను చదివించలేమని, టీసీలు ఇస్తే ఇంటికి తీసుకెళ్తామని పాఠశాలకు తాళం వేసి అందోళన చేశారు. జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గత ఏడాది ఒక ప్రైవేటు కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకొని ఏర్పాటు చేశారు. పాఠశాలలో 5, 6, 7 తరగతులకు సంబంధించిన సుమారు 200 మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదే పాఠశాల ఆవరణంలో ఒక భవనంలో వైరా నియోజకవర్గంలోని తాటిపూడిలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించారు. దసరా సెలవులకంటే ముందే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పటిలో తెలుసుకున్న విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చేశారు. తర్వాత దాన్ని వాయిదా వేశారు. తీరా సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం రోజున ఖమ్మం నియోజకవర్గం పాఠశాలకు, ఒక భవనం, వైరా నియోజకవర్గం పాఠశాలకు మరొక భవనం కేటాయించి ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. రెండు పాఠశాల విద్యార్థులు తమ లగేజీలతో బస్సులు, ఆటోలలో పాఠశాలకు వచ్చారు. అసలే అరకొర వసతులతో ఇబ్బంది పడుతుంటే దానికి తోడు వేరే పాఠశాల నుంచి 200 మంది విద్యార్థులను ఇక్కడకు తరలించడంతో సమస్యలు ఏర్పడ్డాయి. చిన్నపాటి క్యాంపస్‌లో 400 మంది పైగా విద్యార్థులు ఉండటాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యల మధ్య తమ పిల్లలను చదివించలేమని టీసీలు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులపై వత్తిడి చేశారు. ఒకేసారి వందలాది మంది విద్యార్థులు, తల్లితండ్రుల రాకతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అసలే రోడ్డు పక్కన లేక పోవడంతో లోపల ఉన్న కిలో మీటరు రావడం కష్టంగా ఉందని, ఇలాంటి చోట వైద్య పరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఇంత మందితో అద్దె భవనంలో సాగడం కష్టంగా ఉంటుందని నినాదాలు చేశారు. పాఠశాల గేటు వద్ద, ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై కూడా ఆందోళనకు దిగారు. -
విద్యార్థుల వసతులను పక్కనపెట్టి కాసుల వేట
-
హవ్వా.. ఇంత అధ్వానమా
సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : పైన పటారం..లోన లొటారం అన్న చందంగా ఉంది జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం పరిస్థితి. ప్రసిద్ధి చెందిన పెదవేగిలోని ఈ విద్యాలయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్లు అధ్వానంగా ఉన్నాయి. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే మరుగుదొడ్ల సమస్య దారుణంగా ఉందని చెబుతున్నారన్నారు. తాము స్వయంగా వెళ్లి చూస్తే పరిస్థితి పిల్లలు చెప్పిన దానికన్నా అధ్వానంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి అపారిశుద్ధ్య వాతావరణంలో తమ పిల్లలు ఉంటే రోగాల బారినపడతారని వారంతా భయపడుతున్నారు. 560 మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జవహర్ నవోదయ పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థులతో పనులు జవహర్ నవోదయ విద్యాలయంలో వసతులు, విద్య, అన్ని రంగాల్లో భేష్ అంటూ ఊదరగొట్టే యాజమాన్యం తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులతో పనులు చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మత్తులో భాగంగా విద్యార్థులు ఐరన్ ఊసలు పట్టుకుని సిబ్బందికి సహకరిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. తరగతి గదుల్లో ఉండాల్సి విద్యార్థులు ఇలా పనులు చేస్తూ కనిపించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం నవోదయ విద్యాలయంలో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నవోదయ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలు అందులో సీటు కోసం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. కాని సదుపాయాలు ఇలా ఉన్నాయని తెలీదు. జిల్లా కలెక్టర్‌కు చెప్పి మరమ్మతులు చేపడతాం. – కోటగిరి శ్రీధర్, ఎంపీ, ఏలూరు సమస్య 10 రోజుల్లో పరిష్కరిస్తాం అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతున్నాం. కలెక్టర్ దగ్గర నుంచి అనుమతులు ఇప్పించి పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తాం. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు శాసనసభ్యుడు పనివాళ్లు దొరకడం లేదు విద్యాలయంలో మరుగుదొడ్లు బాలేని మాట వాస్తవమే. నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. దానికి ఆరు నెలల సమయం పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పనివాళ్లు దొరకడం లేదు. దాంతో సక్రమంగా శుభ్రం చేయించలేకపోతున్నాం. – డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్, నవోదయ విద్యాలయం -
వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) : ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకత గాంచిన పాలకొండ జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4 నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవా లు నిర్వహించడం ఆనవాయితీ. పూరి ఆలయ తరహాలో ఇక్కడి ఆలయం ఉండడం ప్రత్యేకం. స్వామి వారి విగ్రహాలను తరలించే రథం సుమారు 50 అడుగులు ఉంటుంది. ఆరువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రథయాత్రకు మన రాష్ట్రంతో పా టు ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా దేవాదాయ శాఖ ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో చేపట్టడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాత్ర వివరాలు.. 4న మొదటి రథయాత్ర తొలిదశమి విగ్రహానికి సంప్రోక్షణం చేసి రథంపై ఉంచుతారు. 5న ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. 6 నుంచి స్వామి వారు పలు అవతారాల్లో భక్తులకు కనువిందు చేస్తారు. 6న మత్సా్యవతారం, 7న కూర్మావతారం, 8న హిరాపంచమి సందర్భంగా శ్రీ వరాహ–నరసింహస్వామి అవతారం, 9న వామన పరశురాం అవతారం, 10న రామ–బలరామ అవతారం, 11న కల్కి–జగన్మోహిని అవతారం, 12న మారుదశమి స్వామి వారి నిజరూప దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి తిరుగు రథయాత్ర 13న ప్రారంభమై 14న స్వామి విగ్రహాలను ప్రధాన ఆలయంలోనికి తీసుకువెళ్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయ అర్చకులు మఠం విశ్వనాథ దాసు స్వామి చరిత్ర కథ రూపంలో భక్తులకు వివరిస్తారు. భక్తులకు తప్పని అవస్థలు ఇక్కడి రథయాత్రకు లక్షల్లోనే భక్తులు వస్తుంటారు. అయితే సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఏటా వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆలయ కమిటీ లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు యాత్రను తమ ఆధీనంలోకి తీసుకుని దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. రథం పూర్తిగా విరిగిపోయి భక్తుల పైకి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. యాత్ర చూసేందుకు వచ్చే భక్తులు ఉండేందుకు కనీస సదుపాయాలు ఇక్కడ కనిపించడం లేదు. గత ఏడాది నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు రహదారి నిర్మాణానికి రూ.6లక్షలు నిధులు కేటాయించి పనులు చేయించినా అందులో నాణ్యత కనిపించలేదు. దీంతో భక్తులు ఈ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిలిచిన నూతన రథం తయారీ పనులు ఇక్కడ ఏళ్ల నాటి రథం పూర్తిగా శిథిలం కావడంతో కొత్తగా రథం తయారు చేయాలని గత ఏడాది చర్యలు తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన కలపను ఒడిశా నుంచి తెప్పించారు. ఇరుసులు తయారు చేపట్టిన రెండు రోజుల్లోనూ పనులు నిలిచిపోయాయి. అవసరం ఉన్న కలప లేకపోవడంతో పాటు నిధులు లేమి, పనివారు లేమి కారణాలతో ఈ ఏడాది రథం పనులు పూర్తి కాలేదు. ఉన్న కలప ప్రస్తుతం చెదలు పడుతోంది. అన్ని చర్యలు తీసుకుంటాం రథయాత్ర ఉత్సవాలకు సం బంధించి భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాం. ప్రైవేటు వ్యక్తుల పెత్తనం లేకుండా ఈ ఏడాది చర్యలు చేపడతాం. రహదారిని సక్రమంగా తయారు చేయాలని పంచాయతీ అధికారులకు నివేదించాం. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎస్.రాజారావు, ఆలయ ఈవో -
అన్నింటా మోడల్
ఆదర్శ పాఠశాలలు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నాయి... విద్యార్థుల ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్నాయి...కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా సౌకర్యాలు ఉన్నాయి... సుందరమైన భవనాలు, విశాలమైన ఆటస్థలాలు సొంతం... ఆధునిక వసతి గృహాలు అదనపు సౌకర్యం.. అన్ని సదుపాయాలు ఉచితం...ఇదే విద్య, సౌకర్యాలను ప్రైవేటు విద్యా సంస్థల్లో పొందాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి.. ఇంకెందుకు ఆలస్యం మోడల్ స్కూళ్లలో చేరి.. డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు ఉత్తమ విద్యను అందుకోండి. ప్రత్యేకతలు • విశాలమైన తరగతి గదులు, ఆటస్థలంతోపాటు గ్రంథాలయ సౌకర్యం • ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉంటుంది. • అర్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో బోధన • చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ • ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం • మల్టీమీడియం, హెల్త్‌కేర్, బ్యూటీ కేర్ బ్యాంకింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు పలు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. • ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సాక్షి, కడప ఎడ్యుకేషన్ : గ్రామీణ పిల్లలకు సైతం ఆంగ్ల మాధ్యమం, కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజం వేశారు. 2012కు కార్యరూపం దాల్చింది. 2013 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బోధన అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదివే వారికి ఉచిత భోజనంతోపాటు వసతి కల్పిస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆరవ తరగతిలో చేరిన విద్యార్థి ఇంటర్ వరకు అక్కడే చదువుకోవచ్చు. అత్యాధునిక వసతులు మోడల్ స్కూల్స్ భవనాలను ఆధునిక వసతులతో, కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పారు. అత్యాధునిక ల్యాబ్స్, రీడింగ్ క్లాస్ కోసం కుర్చీలు, టేబుళ్లు, లైట్లు, ఫ్యాన్లు తదితరాలు ఏర్పాటు చేశారు. స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యాలు బాగున్నాయి. ప్రవేశం ఇలా.. ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే సౌకర్యం ఉంది. ఇందులో ఏటా 6వ తరగతి, ఇంటర్మీ డియెట్కు ప్రవేశాలు కల్పిస్తారు. 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లను కూడా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. 6వ తరగతిలో చేరే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులకు 100కు 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 100కు 35 మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు. ఇందులో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రతి ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయి. సీట్ల రిజర్వేషన్లు 6వ తరగతికి సంబంధించి మొత్తంగా 80 సీట్లు ఉంటాయి. ఇందులో 26 సీట్లు ఓసీ జనరల్, 13 సీట్లు బాలికలకు, 8 ఎస్సీ జనరల్, 4 సీట్లు ఎస్సీ బాలికలకు, 3 సీట్లు ఎస్టీ జనరల్, 2 సీట్లు ఎస్టీ బాలికలకు, బీసీఈ ఒకటి, మిగతా 23 సీట్లు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇంటర్‌కు సంబంధించి 80 సీట్ల చొప్పున ప్రతి పాఠశాలలో ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు 20 సీట్ల చొప్పున ఉంటాయి. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి పట్టే సమయాన్ని బట్టి.. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇందులో 6వ తరగతి, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ముమ్మరంగా నమోదు అవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో.. ఎటువంటి ఫీజులు లేకుండా 6 నుంచి ఇంటర్ వరకు ఆంగ్లమాధ్యమంతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. 9 నుంచి ఇంటర్ వరకు బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ వారు మాత్రం పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూనిఫాం, పుస్తకాలు 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా ఇస్తారు. 6 నుంచి ఇంటర్ వరకు పుస్తకాలను ఉచి తంగా అందజేస్తారు. హాస్టల్లో లేని విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆధునిక ల్యాబ్స్ సైన్స్ ప్రయోగశాల (ల్యాబ్)లతోపాటు ప్రయోగాత్మకంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో దోహద పడతాయి. ప్రతి పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పది మోడల్ స్కూల్స్‌కు గాను తొమ్మిదింటికి మంజూరు కాగా.. సంబేపల్లెలో మాత్రం సొంత భవనం లేకపోవడంతో మంజూరు కాలేదు. ఈ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్, టెలిస్కోప్, రోబోటింగ్ పరికరాలతోపాటు నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడే ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించి విద్యార్థులు నూతన ఆవిష్కరణలను రూపొందించే అవకాశం ఉంది. కార్పొరేట్, ప్రైవేటులో.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో భారీగా ఫీజులు, అంతంత మాత్రంగానే మౌలిక వసతులు ఉంటాయి. వేలకు వేలు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇక హాస్టల్ సౌకర్యం కావాలంటే భారీగా డబ్బులు వెచ్చించాల్సిందే. ఇరుకైన తరగతి గదులు, వీటితోపాటు ప్రతిభావంతులకు బోధన ఒకలా.. ప్రతిభ లేని వారికి మరోలా ఉంటుంది. సరైన ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ వసతులు ఉండవు. వీటన్నింటి కంటే ఆటపాటలు అసలుండవు. నిత్యం ఒత్తిడితో కూడిన బోధనలు. వీటన్నింటి మధ్య విద్యార్థులు నలిగిపోతూ నిత్యం మానసిక ఒత్తిడితో కూడిన చదువులు సాగించాల్సిన పరిస్థితి. విద్యార్థుల్లో మనోవికాసం తగ్గి ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్న విషయాలకు కూడా ఆందోళన చెంది.. మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నారంటే అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సంబంధిత విషయాల్లో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. జిల్లాలో.. జిల్లాలో పది ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఖాజీపేట, కాశినాయన, వల్లూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, చిన్నమండెం, పుల్లంపేట, పెనగలూరు, సంబేపల్లె మండలాల్లో ఉన్నాయి. వీటిలో సంబేపల్లె పాఠశాలకు మాత్రం సొంత భవనం లేదు. స్థల సేకరణ సమస్య తలెత్తడంతో జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 9 పాఠశాలకు సొంత పాఠశాల భవనాలతోపాటు వసతి గృహాలు ఉన్నాయి. బోధన బాగుంది మోడల్ స్కూల్లో బోధన చాలా బాగుంది. ప్రణాళిక ప్రకారం చదివించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారు. ఆటలు ఆడిపిస్తారు. దీంతో చదువుతోపాటు ఆటలపైన కూడా పట్టు దొరుకుతుంది. – తస్నీమ్ ఫర్దీస్, 9వ తరగతి, వల్లూరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారు. చదువుతోపాటు నిత్యం పరీక్షలు నిర్వహిస్తారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో చాలా ఉత్సాహంగా చదవాలనిస్తుంది. – రయ్యన్ అహమ్మద్, 7వ తరగతి, వల్లూరు పదిలో పదికి పది పాయింట్లు గతేడాది పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించాను. విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్టడీ అవర్స్ నిర్వహించి బాగా చదివిస్తారు. నిత్యం పరీక్షలు నిర్వహించి.. మార్కులు తక్కువ వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. – లిఖిత, పదో తరగతి పూర్వపు విద్యార్థిని, వల్లూరు పేదలకు వరం మోడల్ స్కూల్స్ పేద విద్యార్థులకు వరం. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుంది. ఆటలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి వాటిలో ప్రవేశం కల్పిస్తారు. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా చదువుకుంటారు. – దిలీప్‌కుమార్, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, వల్లూరు సీబీఎస్ఈ సిలబస్ పెట్టాలి మోడల్ స్కూళ్లు అంగ్ల మాధ్యమంలో నడుస్తున్నాయి. దీంతోపాటు సీబీఎస్ఈ సిలబ స్ ప్రవేశపెడితే బాగుంటుంది. చాలా మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అన్ని మోడల్ స్కూళ్లలో మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి సీబీఎస్ఈ పెడితే బా గుంటుంది. – సురేష్‌బాబు, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, ఖాజీపేట నెలాఖరు వరకు అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్ స్కూల్స్‌లో ప్రస్తుతం 6, ఇంటర్మీడియట్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. పక్కాగా మెరిట్ ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేస్తున్నాం. ఈ నెలాఖరుకు సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తి అవుతుంది. – ఉష, అసిస్టెంట్ డైరెక్టర్, మోడల్ స్కూల్స్ అన్ని సౌకర్యాలు మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. కార్పొరేట్‌కు దీటుగా బోధన ఉంటుంది. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవల ఒక్కొక్క పాఠశాలలో రూ.12 లక్షలతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశాం. దీంతో విద్యార్థులు నూతన పరిశోధనలు చేసుకునేందుకు అవకాశం ఉంది. – పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి, కడప -
వైద్యం.. దైవాధీనం
శుక్రవారం ఉదయం 8.36 గంటలకు : రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగప్ప సర్జికల్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఇతని కాలుకు సర్జరీ చేయాల్సి ఉంది. పై అంతస్తులోని సర్జికల్ వార్డు నుంచి నల్లప్ప తన భార్య మల్లక్క సాయంతో అతి కష్టం మీద ఆపరేషన్ థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రిలో వేళ్లూనిన నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. అందుబాటులో ఉండాల్సిన ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు పత్తా లేకుండాపోయారు. ఈ పరిస్థితుల్లో నల్లప్పకు కాస్త బీపీ ఎక్కు వైనా పరిస్థితి ఊహించడమే కష్టం. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యం దైవాధీనంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కుగా సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో రోగుల ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. పాలనా వైఫల్యం కారణంగా ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఈ ఏడాదిలో ఇప్పటికే 170 చిన్నారులు మృత్యువాతపడ్డారు. అదేవిధంగా పలు విభాగాల్లో వైద్యుల ఇష్టారాజ్యం, స్టాఫ్ నర్సులపై పనిభారం.. తరచూ విద్యుత్ సమస్య.. ఏసీలు, ఫ్యాన్లు.. ఇతరత్రా పరికరాలు పనిచేయకపోవడం వల్ల రోగులు ప్రత్యేక్ష నరకం చూస్తున్నారు. దీనికి తోడు ఓ ఉన్నతాధికారి అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 19 మంది సీనియర్ ప్రొఫెసర్లను కాదని సూపరింటెండెంట్‌గా అర్హుడికి పట్టం కట్టింది. గత జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రిపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడా ఆసుపత్రిలో సేవలు అందకపోవడానికి కారణమైంది. గత మూడేళ్లుగా రోగుల అవస్థలు చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఆస్పత్రిలో గత మూడేళ్లుగా రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిగా పేరున్నా.. ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల బోధనాసుపత్రికి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు మరో 250 పడకలు ఆసుపత్రికి రానున్నాయి. కానీ ఆసుపత్రిలో రోజూ 1,300 అడ్మిషన్, 2వేల మంది ఔట్ పేషెంట్లు ఉంటున్నారు. అయితే కొందరు వైద్యుల ఇష్టారాజ్యం కారణంగా సరైన వైద్య సేవలు అందక ఆసుపత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇకపోతే 2010లో అప్పటి ప్రభుత్వం జీఓ 124ను విడుదల చేసింది. ఆ మేరకు 649 మంది స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఆ జీఓ కలగా మారడంతో పోస్టులు భర్తీకాక ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతోంది. పసికందుల ప్రాణాలతో చెలగాటం ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని(ఎస్ఎన్సీయూ) పట్టించుకునే నాథుడే లేరు. హెచ్ఓడీ.. ఓ అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఇన్చార్జ్ బాధ్యతలిచ్చినా.. ఆయన పట్టించుకోకపోవడంతో నలుగురు వైద్యులకే యూనిట్ అప్పగించి చేతులు దులుపుకున్నారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు కూడా పసికందులకందించే సేవల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కరువైంది. పాలు పట్టించే సమయంలో తల్లులకు సూచనలివ్వాల్సిన స్టాఫ్‌నర్సులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలు సరిగా పట్టించకపోవడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి పసికందులు మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. చిన్నపిల్లల విభాగంలో ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఏడాది నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు. ఈయనకు మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించకపోవడం గమనార్హం. ఇక్కడుండే మరో అసోసియేట్ ప్రొఫెసర్ డెప్యూటేషన్‌పై కర్నూలుకు వెళ్లిపోయారు. అర్హత లేకపోయినా అందలం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు ఆర్‌ఎంఓలు తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉంటున్న వీరు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(ఎమర్జెన్సీ వైద్యులు) ఆర్ఎంఓ సీట్లలో కూర్చుని పనులు చేసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా డాక్టర్ జగన్నాథ్‌కి సూపరింటెండెంట్ పోస్టులో కూర్చునేందుకు ఎలాంటి అర్హత లేకున్నా అధికార పార్టీ అండదండలతో ఆయన ఆ సీటులో కొనసాగుతున్నారు. పనులు నత్తనడక.. ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్, బరŠన్స్ వార్డు, 150 సీట్లకు సంబంధించి రూ.70 కోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీట్ల పెంపునకు సంబంధించి పట్టుమని 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఎన్ఏబీహెచ్కి సంబంధించిన కొన్ని పనులు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి చేపడుతుండడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అజెండా: మంత్రి రాక నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ఓ అజెండాను సిద్ధం చేసింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు జీఓ 124, నెల్లూరు ఆస్పత్రి తరహాలో ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ విభాగం, మెడిసిన్, ఈఎన్టీ, గైనిక్, ఆప్తమాలజీ, తదితర విభాగాల్లో యూనిట్ల పెంపు, పరికాల కొనుగోలుకు రూ.2కోట్లు ఇవ్వాలనే అజెండాను యాజమ్యాం సిద్ధం చేసింది. ఈ అజెండాను మంత్రికి అందజేయనున్నారు. అడ్డూఅదుపు లేని అవినీతి ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఓ కీలక అధికారికి కాసులిస్తే ఏ పనైనా ఇట్టే జరిగిపోతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఖైదీని ఎలాంటి రోగం లేకున్నా నెలల తరబడి వార్డులో ఉంచారు. ఓ ఆర్థో వైద్యుడు అడ్మిషన్లో కీలకంగా వ్యవహరించినా సూపరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెడికల్ రికార్డు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఏజెన్సీకి కట్టబెట్టడం, టెండర్లు లేకుండా ఏసీలు కొనుగోలు, ఆఫీస్ కార్యాలయంలో డెప్యూటేషన్, పదోన్నతులు, రాయితీలు కావాలన్నా సిబ్బంది చేయి తడపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్ చేశారు. అంతా ఆ అధికారి కనుసన్నల్లోనే అక్రమాల బాగోతం సాగుతోంది. సూపర్ స్పెషాలిటీకి మోక్షమెప్పుడో? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మోక్షమెప్పుడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైంది. 2016లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ వాట రూ.30 కోట్లు విడుదల చేయలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. తామే పనులు చేయిస్తున్నామంటూ పాలకులు ప్రజలను మభ్యపెట్టారు. ఆస్పత్రి ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్యం కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర సేవలు అందుబాటులోకి వస్తాయి. నేడు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాక అనంతపురం అర్బన్: ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 6.20 గంటలకు అనంతపురం చేరుకోనున్న ఆయన.. ఆర్అండ్బీ అతిథిగృహంలో విడిది చేస్తారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, పోస్ట్‌నేటల్ వార్డు, చిన్నపిల్లల వార్డును సందర్శిస్తారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ధర్మవరం చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో రాత్రి 6 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు. -
కొలిక్కిరాని.. విభజన
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై రోజులు గడిస్తే... ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. జిల్లా పునర్విభజనతో అదనంగా ఏర్పాటైన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సహా నల్లగొండ జెడ్పీలకు కొత్త పాలక వర్గాల ఎన్నిక ఇప్పటికే పూర్తయ్యింది. జూలై 4వ తేదీన పాత పాలకవర్గం దిగిపోగానే.. కొత్త పాలవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ... నల్లగొండ జెడ్పీకి మినహా మిగిలిన రెండు జెడ్పీలకు ఇప్పటి దాకా కొత్త భవనాలను సిద్ధం చేయలేదు. మరీ ముఖ్యంగా జెడ్పీ విభజన ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు ఉండగా.. మూడు జిల్లాలుగా పునర్విభజన జరిగాక.. మండలాల సంఖ్య ఏకంగా 71కి చేరింది. నల్లగొండ –31, సూర్యాపేట–23, యాదాద్రి భువనగిరి–17 మండలాలతో జిల్లాలుగా కొలువుదీరాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఇప్పటికీ వసతుల్లేవు. ఇప్పుడు కొత్త జిల్లాపరిషత్‌ల పరిస్థితీ అదే తరహాలో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీ విభజన కోసం తుది కసరత్తు మొదలు పెట్టారు. సిబ్బంది కేటాయింపులు, పోస్టింగులు.. తదితర అంశాలు చర్చించేందుకు పంచాయతీ కమిషనర్‌తో సీఈఓల సమావేశం ఈనెల 15వ తేదీన ఏర్పాటు చేశారు. వాస్తవానికి గురువారం జరగాల్సి ఉన్న ఆ సమావేశాన్ని 15వ తేదీకి వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ముగిస్తే కానీ.. జెడ్పీ విభజనపై ఒక స్పష్టత రాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మూడు జిల్లాలకు 68మంది సిబ్బంది విభజన ఉమ్మడి జిల్లా పరిషత్‌కు మంజూరైన పోస్టులు కేవలం 68. ఇందులో 11 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇప్పటికే పాత జెడ్పీ 57 మందితో నడుస్తుండగా.. అందులో జూనియర్ అసిస్టెంట్లు(26), ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ (17)లదే సింహభాగం. రెండు కొత్త జెడ్పీలు కొలువు దీరనున్నా... పాత సిబ్బంది విభజన తప్ప కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్ మాత్రం లేదని అంటున్నారు. మరీ అంతకు సిబ్బంది సరిపోకపోతే ఆయా మండలాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సిబ్బంది విభజన తర్వాత ఎవరి సొంత జిల్లాలకు వారిని కేటాయించే వీలుందని పేర్కొంటున్నారు. దీనికోసం ఆయా సిబ్బంది సర్వీసు, సీనియారిటీ తదితర వివరాలతో జెడ్పీ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. జెడ్పీ మొత్తం సిబ్బందిలో అత్యధికంగా 19 మంది ఉద్యోగులు నల్లగొండ మండలం నుంచే ఉన్నారు. అయితే, మండలాల సంఖ్యను బట్టి ఏ జిల్లాకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు, ఏ ప్రాతిపదికన చేపడతారు, ఏ రేషియో ప్రకారం కేటాయింపులు జరుపుతారు అన్న స్పష్టత ఇంకా రాలేదని, 15వ తేదీ నాటి సమావేశం తర్వాత నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఏర్పాటైన 12 మండలాల్లో సైతం ఇప్పటికీ సిబ్బంది లేరు. ప్రధానమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులు భర్తీ కానేలేదు. మొన్నటి పరిషత్ ఎన్నిలను సైతం తహసీల్దార్లకు బాధ్యతలు అప్పజెప్పి పూర్తి చేశారు. సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకే ఇన్చార్జ్ ఎంపీడీఓలుగా బాధ్యతలు ఇచ్చారు. కొత్త సిబ్బందిని నియమించుకునే అవకాశం లేదని, పాతవారిని సర్దుబాటు చేయాల్సిందేనని, దీంతో మూడు జెడ్పీలకూ అరకొర సిబ్బందే దిక్కయ్యేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఇల్లు ఇరుగ్గా ఉంది అత్తయ్యా
అందరూ కలిసి ఉండాలనేది మంచి ఆలోచన.అందులో లాభాలు ఉన్నాయి.సౌకర్యాలు ఉన్నాయి.కాని అత్తగారు ప్రతి కొడుక్కీ గది సౌకర్యంగా ఉందా అని చూస్తే సరిపోదు.ప్రతి కోడలికి గాలి ఆడుతుందా అనేది కూడా చూడాలి.ఇష్టాలు గౌరవించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. ఆ రెండంతస్తుల భవనంలో లోపలి మెట్ల ద్వారా ఏ గదికైనా చేరుకోవచ్చు.అంత సౌకర్యంగా కట్టారు.కాని ఆ ఇంటికే కాక ఆ ఇంట్లోని మనుషులకూ మెట్లు ఉన్నాయి.పై మెట్టు మీద ఒకరుంటారు.. కింద మెట్టు మీద ఒకరుంటారు.అది మాత్రం చాలా అసౌకర్యం. వర్తకుల ఇల్లు అది. ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కుటుంబం. తల్లి– తండ్రి, ముగ్గురు కొడుకులు– కోడళ్లు, మనవలు–మనవరాళ్లు... అందరూ కలిసి ఉంటారు. వంట గదిలో నిప్పు ఆరదు. డైనింగ్ టేబుల్‌కు విశ్రాంతి ఉండదు. తిండికి కొదవ లేదు. కాని మనసుల్లోనే ఏదో వెలితి. ఆ ఇంటి చిన్న కోడలు సోనమ్ పూర్తిగా మారిపోయిందని తెలియడానికి అంత ఉమ్మడి కుటుంబంలోని మనుషులకు కూడా ఆరు నెలలు పట్టింది. చిన్న కోడలు అంటే వయసులో చిన్నదని అనుకోవాల్సిన పని లేదు. 42 ఉంటాయి. పదిహేడు పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ల కొడుకు, పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నారు. ముందు నుంచి మెతక. అత్తగారు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. అత్తగారి తర్వాత? పెద్ద కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. పెద్ద కోడలి తర్వాత? రెండో కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు.ఇరవై ఏళ్లుగా చేసుకుపోతూనే ఉంది. చేసుకుపోతూనే ఉంది కదా అని ఎవరూ గమనించలేదు.గమనించేసరికి ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అత్తగారు లేచే సమయానికి కోడళ్లు కూడా నిద్ర లేవాలి. కాని గత ఆర్నెల్లుగా చిన్న కోడలు సమయానికి లేవడం లేదు. ఊరికే అలా పడుకుని ఉంటోంది. లేచినా తయారు కావడం లేదు. స్నానం చేయడం లేదు. దొడ్లోకి ఎప్పుడు వెళుతున్నదో అసలు వెళుతున్నదో లేదో తెలియదు. తిండి పూర్తిగా తగ్గిపోయింది. అప్పడప్పుడు ఆమె బాగా నవ్వేది. అసలు నవ్వు కనిపించడం లేదు. కొద్దో గొప్పో మాట్లాడేది. మాట వినిపించడం లేదు. అత్తగారు, తోడి కోడళ్లు కూడా మనుషులే. ఒక మనిషి ఈ స్థాయికి పడిపోయాకైనా వారు గమనించే తీరుతారు. గమనించారు. ఆస్పత్రికి తీసుకొచ్చారుసైకియాట్రిస్ట్ దగ్గరకు. సోనమ్‌కు చదువుకోవాలని ఉండేది. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. కాని చదువు మాన్పించి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. సరే.. భర్తను బాగా చూసుకోవడం.. భర్త చేసే పనిలో సాయం చేయడం.. పిల్లలను తీర్చిదిద్దుకోవడం.. ఇవైనా బాగా చేద్దామని అనుకుంది. ఆ కుటుంబ వర్తకంలో భర్త రాణించేది తక్కువ. అందుకని అతడికి తక్కువ స్థాయి పని అప్పజెప్పి ఉన్నారు. కనుక తక్కువ స్థాయి మర్యాద కూడా ఉంది. అతనికి తక్కువ స్థాయి మర్యాద కనుక అతడి భార్యకు కూడా తక్కువ స్థాయి మర్యాదే. నిర్ణయాలు మావగారు, ఇద్దరు బావగార్లు తీసుకుంటూ ఉంటారు. భర్తకే నిర్ణయం తీసుకునే వీలు లేనప్పుడు అతడి భార్యకు వీలు ఎక్కడ ఉంటుంది.ఆ ఇంట్లో తనకు నచ్చింది వండుకుని తినే స్వేచ్ఛ సోనమ్‌కు ఎప్పుడూ లేదు. వండుకోవద్దని ఎవరూ అనరు. కాని వండుకోవడానికి వీల్లేని వాతావరణం ఉంటుంది. పిల్లలు ఇద్దరు పుడితే తనకిష్టమైన పేర్లు సోనమ్ పెట్టుకోలేకపోయింది. భర్తకు ఇష్టమైన పేర్లు కూడా. ఒక పేరు పెదబావగారు పెడితే మరోపేరు రెండో బావగారు పెట్టారు.సంవత్సరానికి రెండుసార్లు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి వస్తారు గాని సోనమ్‌కు తన కుటుంబంతో విడిగా ఎక్కడికైనా వెళ్లి రావాలనే కోరిక మాత్రం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తీరలేదు. ‘అలాగే అత్తగారు’, ‘అలాగే ఒదిన’... ‘అలాగే మావయ్యా’ ఇవి అనీ అనీ నిద్రలో కూడా ఈ మాటలే అనడానికి అలవాటు పడిపోయింది.అసంతృప్తికీ అణచివేతకీ కూడా ఒక హద్దు ఉంటుంది.ఆ చెలియలి కట్టను కూడా ఆ కుటుంబం దాటి సోనమ్‌ను తీవ్రంగా బాధ పెట్టింది. సోనమ్ కుమార్తె వీర ఇంటర్ పాసైంది. ఇక ఇంట్లో అందరూ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ ఇళ్లల్లో ఆడపిల్లలకు ఆ వయసులో పెళ్లి చేస్తారు కనుక ఇది చాలా మామూలు విషయంగా వారు భావించారు. అత్తగారు, ఇద్దరు పెద్ద కోడళ్లు ఆ సంబంధం ఉంది ఈ సంబంధం ఉంది అని తామే మంతనాలు సాగిస్తూ ఉన్నారు. కాని వీరకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాగా చదువుకోవాలని ఉంది. కూతురు బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని తాను నిర్మించుకునే శక్తి పొందాలని సోనమ్‌కు గట్టిగా ఉంది. కాని ఆ మాట ఆ తల్లికూతుళ్లు ఇద్దరూ చెప్పే వీలు ఆ ఇంట్లో లేదు. భర్తకు చెప్తే అర్థం కాదు.అరె... నా కూతురు విషయంలో కూడా నాకు స్వేచ్ఛ లేదా అని సోనమ్ అనుకుంది.అంతే. తనలో తాను ముడుచుకుపోవడం మొదలుపెట్టింది. లోలోపలికి పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. ఆమెకిప్పుడు లోకవ్యవహారాల వేటి మీదా ఆసక్తి లేదు. ఆమె కేవలం ముక్కు నుంచి గాలి పీల్చి వదలగల ఒక బొమ్మ మాత్రమే. సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది. కుటుంబాన్ని కూచోబెట్టుకుని చెప్పింది.‘చూడండి. మనుషులు కలిసి ఉండటం ఎప్పుడూ బాగుంటుంది. కాని కలిసి ఉండటం అంటే కాళ్లకు సంకెళ్లు కట్టి ఉంచడం కాదు. ఎదుటివారి కలలు, కోరికలు, అభిప్రాయాలు వీటిని పట్టించుకుని వాటిని ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమే ఉమ్మడి కుటుంబం ఉద్దేశ్యం. కాని ఒకరిపై మరొకరు పెత్తనం చేయడం అణచి ఉంచడం ఎంత మాత్రం కాదు. మీరు ఇంట్లో మీ చిన్న కోడలుకు గది ఇచ్చారు కాని సమాజంలో భాగమవడానికి గడప ఇవ్వలేదు. అయినా ఆమె భరించింది. కాని ఆమె కూతురికి కూడా అదే పరిస్థితి వచ్చే సరికి శిథిలమయ్యింది. ‘ఇది నువ్వు చెయ్’ అనే మాటను మీ ఇంట్లో మానేయండి. ‘ఏం చేయాలనుకుంటున్నావు’ అని అడగడం నేర్చుకోండి. ఎదుటివారి ఇష్టాలను హేళన చేయకుండా గౌరవించే స్థితికి మీరంతా ఎదిగినప్పుడే మీ ఉమ్మడి కుటుంబం ఇంకా అర్థవంతంగా ఉంటుంది. మీ మనవరాలి పెళ్లి మీద మొదట నిర్ణయం తీసుకోవాల్సింది మీ మనవరాలే. తర్వాత ఆమె తల్లి. మీరు మాత్రం కాదు’ అని వారికి వివరించి చెప్పింది.అత్తగారు, తోడికోడళ్లు సోనమ్‌ను, వీరను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.వాళ్లు మొదట చేసిన పని పెళ్లి ప్రస్తావన వాయిదా వేయడం.వీర ఏం చదువుకోవాలన్నా సపోర్ట్ చేస్తామని సోనమ్‌కు వారు ధైర్యం చెప్పారు.అసలు ఒక వారం రోజుల సంతోషంగా తిరిగి రండి అని టికెట్లు బుక్ చేసి టూర్‌కు కూడా పంపారు. కిచెన్ రూల్స్ మారాయి. ఎవరికి ఏం కావాలన్నా సంకోచం లేకుండా వండుకోవాలని అత్తగారు ప్రకటన చేసింది. ఎవరి నిర్ణయాలకు అడ్డు చెప్పేది ఉండదని కాకుంటే మంచి చెడ్డలు ఆలోచించడానికి ఒక అవకాశం పెద్దలకు ఇవ్వదలిస్తే ఇవ్వండని మామగారు చెప్పారు.చిన్న చిన్న కిటికీ రెక్కలు కూడా విప్పినప్పుడు పెద్ద వెలుతురు తెస్తాయి.ఇంట్లో సోనమ్ ఇప్పుడు కూడా చిన్నకోడలే.కాని ఆ ఇద్దరు పెద్ద కోడళ్లకంటే కూడా హోదాలో తక్కువ కాదు. అధికారంలో తక్కువ కాదు. ఇటీవల కూతురిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాక ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పనిలో పడ్డ సోనమ్‌ను ఆ రెండంతస్తుల ఇంట్లో అందరూ తృప్తిగా చూశారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
ఇందూరు ‘స్టేషన్’లో ఇక్కట్లు..?
నిజామాబాద్ సిటీ: ‘ఏ గ్రేడ్’ రైల్వేస్టేషన్ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికి ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంలేదు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 45–50 రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే వారి ఇబ్బందులను తీర్చడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, ఏడాది క్రితం రెండో రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌కు వెనుకాల గల నాందేవ్‌వాడ, హమాల్వాడి, దుబ్బ, సుభాష్‌నగర్, కంఠేశ్వర్ ప్రాంతాల ప్రజలకు ఈ రైల్వేస్టేషన్ ఉపయోగపడుతుందని భావించారు. రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు ద్వారా ప్రధాన రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్లపై భారం తగ్గుతుందని సైతం భావించారు. తద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. దీంతో పై ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూలో ఉండటం, ఆ సమయంలో తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండటం నిత్యం జరుగుతోంది. అయితే రెండో రైల్వేస్టేషన్లో సిబ్బంది కొరత కారణంగా దాదాపుగా మూసి ఉంచుతున్నారు. గూడ్స్ రైలు వస్తే స్టేషన్ బంద్.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గూడ్స్ రైలు వచ్చిందంటే చాలు రెండో రైల్వేస్టేషన్‌కు తాళం పడుతోంది. రెండో రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందే గూడ్స్ రైలులో సరుకులు నింపే పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడకు టిక్కెట్ల కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడంలేదు. ప్రధాన స్టేషన్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిజామాబాద్ మీదుగా సుదూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ, నాందేడ్ మార్గాలకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. దీంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్లో టిక్కెట్టు కౌంటర్లు మూడు ఉండగా ఇవి ఏ మాత్రం సరిపోక ప్రైవేట్‌గా టిక్కెట్లు ఇచ్చే మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దివరకు సమస్య తీరింది. రైలు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికుల సంఖ్య బాగా ఉండడంతో బుకింగ్ కౌంటర్లన్ని కిటికిటలాడుతుంటాయి. రెండో స్టేషన్లో బుకింగ్ కౌంటర్ పనిచేయక ప్రయాణికుల బాధలు మరింత పెరుగుతున్నాయి. అవగాహన కల్పించకపోవడంతోనే.. నిజామాబాద్ రెండో రైల్వేస్టేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించకనే అది నిరుపయోగంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఉన్నట్లు ప్రచారం చేయకపోవటం, ప్రజల్లో అవగాహన కల్పించక ప్రజలంతా ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. తద్వారా అక్కడ టిక్కెట్ల కోసం ప్రయాణికుల తోపులాట ఆగటంలేదు. రెండో రైల్వేస్టేషన్ నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించి, బుకింగ్ కౌంటర్‌పై అవగాహన కల్పిస్తే దుబ్బ, నాందేవ్‌వాడ, హమాల్‌వాడీ, కంఠేశ్వర్, సుభాష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారులు రెండో రైల్వేస్టేషన్ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆ ఊరికి పోలింగ్ ఆమడ దూరం
సాక్షి, కరీంనగర్‌రూరల్: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే ఈ గ్రామస్తులు మరో ఊరికి పోవాల్సిందే. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్ధితి ప్రస్తుతం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఓట్లేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఊరిలోనే పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేయాలని స్ధానిక ప్రజాప్రతినిధులు అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే కొత్త పోలింగ్స్టేషన్ల ఏర్పాటులో ఎన్నికల సంఘం నిబంధనలు అడ్డురావడంతో అధికారులు పాత విధానంలోనే పోలింగ్‌ను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త గ్రామపంచాయతీతో సమస్య.. ప్రభుత్వం దుబ్బపల్లిని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో చామన్‌పల్లి పంచాయతీవాసులకు కొత్త సమస్య ఏర్పడింది. కొత్త గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ మండలంలోని 17 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 46,597 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 23,217, మహిళలు 23,379 మంది ఉన్నారు. మొత్తం 65 పోలింగ్స్టేషన్లు ఉన్నాయి. గతంలో చామన్‌పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శివారు గ్రామం దుబ్బపల్లిని గత ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది.అయితే దుబ్బపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్పీ పాఠశాలలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సైతం ఈ పాఠశాలలో చామన్‌పల్లి, దుబ్బపల్లి గ్రామాలకు కలిపి మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చామన్‌పల్లిలో ప్రస్తుతం మొత్తం ఓటర్లు 2357 మంది ఉండగా వీరిలో పురుషులు 1145, మహిళలు 1212 మంది ఉన్నారు. ఈ ఓటర్లందరికీ 85, 86, 87, 88 నంబర్ గల పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్త గ్రామపంచాయతీ దుబ్బపల్లిలో 571 మంది ఓటర్లు ఉండగా పురుషులు 289, మహిళలు 282 మంది ఉన్నారు. వీరందరికీ 89 నంబర్ పోలింగ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్లు పోవాల్సిందే.. చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లి గ్రామపంచాయతీ దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దుబ్బపల్లిలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దుబ్బపల్లిలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఓటు వేయడానికి చామన్‌పల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఓటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటు వేసేందుకు ముందుకురాకపోవడంతో స్థానిక నాయకులు ఆటోలను ఏర్పాటు చేశారు. ఆటోల్లో ఓటర్లను తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో పలు వివాదాలేర్పడ్డాయి. ఈక్రమంలో చామన్పల్లిలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్ధానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొత్త పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో అధికారులు గతంలో ఉన్నట్లుగానే పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈనెల 11న జరిగే పోలింగ్‌లో చామన్‌పల్లి ఓటర్లు గతంలో మాదిరిగానే దుబ్బపల్లికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లిలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ రోజున ఓటర్లను తరలించేందుకు అధికారులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయాలి. – వడ్లకొండ పర్షరాములు, చామన్‌పల్లి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి చామన్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రంను ఏర్పాటు చేయాలి. గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దుబ్బపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేయడం తగదు. దుబ్బపల్లికి వెళ్లి ఓటు వేయడం వృద్ధులు, మహిళలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. – బోగొండ లక్ష్మి, సర్పంచ్, చామన్‌పల్లి పాత పోలింగ్ కేంద్రాల్లోనే.. కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలతో ప్రస్తుతం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న కేంద్రాల్లోనే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – జి.కుమారస్వామి, తహసీల్దార్, కరీంనగర్‌రూరల్ -
‘దివ్యం’గా ఓటేయొచ్చు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంద శాతం పోలింగ్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. పోలింగ్ స్టేషన్లను దివ్యాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని.. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,386 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మెరుగుపడుతున్న ఓటింగ్ శాతం.. గతంలో వికలాంగులు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉండేవారు. శరీరం సహకరించక, రవాణా సౌకర్యంలేక తదితర కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఇలా కనీసం 50 శాతం దివ్యాంగులు కూడా పోలింగ్ స్టేషన్‌కు వచ్చే పరిస్థితులు లేకపోయేవి. దీన్ని గుర్తించిన ఎన్నికల సంఘం.. వారు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి దీనికి శ్రీకారం చుట్టగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 76 శాతం మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార వర్గాల అంచనా. అంతేగాక గతంలో ఏడు రకాల వికలాంగులు, వ్యక్తుల కోసమే పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 21కి పెంచారు. ఈ జాబితాలోని వారు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు అంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, చలన/శారీకర వైకల్యం, మానసిక వైకల్యం/బుద్ధిమాంధ్యం మానసిక రుగ్మత, యాసిడ్ దాడి బాధితులు, తలసేమియా, హెమోఫిల్ల (రక్తం గడ్డకట్టని స్థితి). మెదడు పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టువ్యాధి నయమైనవారు, మరుగుజ్జు, దీర్ఘకాలిక నరాల సమస్య, నరాల బలహీనత, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థలో సమస్యలున్నవారు. ప్రత్యేక సదుపాయాలు ఇలా.. పోలింగ్‌బూత్‌ల వరకు దివ్యాంగులను తీసుకొచ్చి.. వారు ఓటు వేసిన తర్వాత తిరిగి వాహనంలో ఇంటికి చేర్చుతారు. ఈ రవాణా సదుపాయం ఉచితమే. ప్రతి పోలింగ్ కేంద్ర వద్ద ట్రైసైకిల్ అందుబాటులో ఉంటుంది. మూగ, చెవిటి ఓటర్లకు సైన్ లాంగ్వేజీ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లోకి సులువుగా రాకపోకలు జరిపేందుకు ర్యాంప్‌లు నిర్మిస్తారు. అంధులకు సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి ఒకరిని అనుమతిస్తారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు అతి సమీపంలో వాహనాల పార్కింగ్ , గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒకరు చొప్పున వలంటీర్‌ను అందుబాటులో ఉంచుతారు. -
గెలిస్తే..రాజభోగమే..
సాక్షి, అశ్వాపురం: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎలాగైనా గెలిచి పార్లమెంట్ మెట్లు ఎక్కేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పలు రకాల వసతులు కల్పిస్తుంది. పదవిలో ఉన్న కాలంలో ఒక ఎంపీకి సెంట్రల్ సర్కారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది.. వార్షిక నిధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వేతనం.. ఎంపీలకు నెలకు రూ.1 లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25వేలు పింఛన్ వస్తుంది. వేతనంతో పాటు అలవెన్స్‌ల కింద నెలకు రూ.45వేలు అదనంగా ఇస్తారు. వసతి.. ఎంపీలకు ఢిల్లీలో నివాస వసతి కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలు కేటాయిస్తారు. సీనియర్ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. వైద్యం.. కేంద్ర పౌరసేవల కింద ప్రభుత్వం ఆరోగ్య పథకం ద్వారా వైద్య, ఆరోగ్య సేవలు కల్పిస్తుంది. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, పాథలాజికల్ లాబోరేటరీ సౌకర్యం, హృద్రోగ, దంత, కంటి, ఈఎన్టీ, చర్మ, తదితర ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ప్రయాణం.. ఎంపీలు ఏడాదికి 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం ఉచితం. ఫస్ట్‌క్లాస్ ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. జీవిత భాగస్వామికి కూడా అవకాశం ఉంటుంది. రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులో ఎంపీలకు ప్రత్యేక సీటు ఉంటుంది. నిధులు.. పార్లమెంట్ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్‌కు వస్తాయి. ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులకు ఈ నిధులు కేటాయిస్తారు. జిల్లా అధికారులు ఎంపీ సిఫార్సు మేరకు ఆ నిధులు మంజూరు చేస్తారు. పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్‌లు.. పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్‌ల కింద ఎంపీలకు నెలకు రూ45వేలను కేంద్రం ఇస్తుంది. వీటిలో రూ.15వేలు స్టేషనరీ, రూ.30 వేలు సహాయ సిబ్బంది, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2వేలు అదనంగా ఇస్తారు. -
బాక్సులు ఫుల్.. మందులు నిల్
సాక్షి, భైంసా: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడమే ధ్యేయంగా వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతోంది. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బాక్సులు ఉన్నా అందులో మందులు ఉండవు. భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో మందులు మచ్చుకైనా కనిపించవు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు లు ఉన్నా నామమాత్రంగా కనిపిస్తున్నాయి. పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేసేందుకు వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాని బస్సులలో ఫ స్ట్ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నప్పటికీ అందులో మందు లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీన్ని చూసిన ప్రయాణీకులు పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. కొన్ని బస్సులలో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు కనిపించడం లేదు. ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎఫ్‌సీ కోసం నామమాత్రంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు సైతం బస్సు రిజస్ట్రేషన్ చేసే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కాని అందులో మందులు ఉన్నాయా లేదో పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేసి అందులో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
విద్యార్థులకు తొలి ‘పరీక్ష’
ఇంటర్ విద్యార్థులకు ‘తొలి’ రోజే పరీక్ష తప్పలేదు. అసౌకర్యాల నడుమ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేశారు. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్ష సమయం అవుతున్నా ఏర్పాట్లు చేస్తూ కనిపించారు. పలు కేంద్రాల్లో తాగునీటికి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థ పడడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏఎన్ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అంతంత మాత్రంగానే ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేయడంతో విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎంత ముందుగా బయలుదేరినా.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీఆర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, మెజార్టీ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సరిగా వెలుతురు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటిలోనే పరీక్ష రాసిన పరిస్థితి నెలకొంది. కొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా ఒక లైటు బిగించి చేతులు దులుపుకున్నారు. ప్రతి రూముకు తాగునీటి వసతి కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. చాలా కేంద్రాల్లో పరీక్షకు అరగంట ముందుగా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ కేంద్రలో పరీక్షకు అరగంట ముందు సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రూముల్లో కూడా కుర్చీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ సిబ్బంది వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు వైద్య కిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా అవి కనిపించలేదు. పరీక్ష ప్రారంభమైనా కూడా ఏఎన్ఎం ఎవరూ రాకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు సైతం నామమాత్రపు విధులు నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు మాత్రమే ఒక కానిస్టేబుల్ రావడం విశేషం. నెల్లూరులో ట్రాఫిక్ కష్టాలు అభివృద్ధి పేరుతో అధికారులు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేశారు. ఏ ప్రాంతంలోనూ పూర్తిస్థాయిలో పనులు చేసిన పరిస్థితి లేదు. దీంతో ఉదయం సమయంలో ఒకవైపు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో వాహనాలు, మరో వైపు పాఠశాలలకు విద్యార్థులను తీసుకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు టెన్షన్ పడ్డారు. ప్రధానంగా స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్, వీఆర్సీ, ఆర్టీసీ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆయా కూడళ్లలో పోలీసులు కనిపించలేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసుశాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పరీక్ష ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. చాలా మంది తల్లిదండ్రులు బైక్‌లతోనే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కేంద్రాల వద్ద కోలాహలం.. ఆలయాలు, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. దేవాలయాల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, బంధువులు కూడా రావడంతో రద్దీగా కనిపించింది. విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లను కళాశాల బయట డిస్ప్లేలో ఉంచారు. ఈ నేపథ్యంలో నంబర్లు చూసుకునేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గమిగూడారు. విద్యార్ధులు పరీక్ష రాసేందుకు గదిలోకి వెళ్లగా తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల వద్ద బయట నిరీక్షించారు. మాస్ కాపీయింగ్ ఆరోపణలు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మాస్ కాపీయింగ్క పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలే మాస్ కాపీయింగ్‌కు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, తోటపల్లిగూడూరు, చేజర్ల, అల్లూరు, సౌత్‌మోపూరు, రాపూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిసింది. 820 మంది విద్యార్థులు గైర్హాజరు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90 కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 27610 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 26790 మంది హాజరయ్యారు. 820 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 26510 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 25793 మంది హాజరయ్యారు. 717 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఒకేషనల్‌కు సంబంధించి 1100 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 997మంది హాజరయ్యారు. 103 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ సత్యనారాయణ డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలలతో పాటు మరో రెండు కళాశాలలను తనిఖీలు నిర్వహించారు. సిటింగ్, స్క్వాడ్ అధికారులు జిల్లాలో 63 కేంద్రాలను పరిశీలించారు. -
‘ఉపాధి’ సిబ్బందికి లోకేశ్ ఝలక్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం తన శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల్లోంచే దాదాపు రూ.రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పిలిపించుకుని, వారిచే సన్మానం చేయించుకుని.. ఆ సన్మాన సభలో జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం జీవో నంబర్ 52ను జారీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఆ జీవో గురించి చూస్తే.. దానిని కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంటూ వివరాలు కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఐఏఎస్‌ల సమక్షంలోనే అధికారుల లోకేశ్ భజన ఉపాధి కూలీలకు గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు రూ.360 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయినా ఆ శాఖ మంత్రి లోకేశ్.. ఆ పథకం నుంచే రూ.రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తన సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్టు ఆశ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకంలో పనిచేసే ఉద్యోగులను ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసిమరీ విజయవాడ రప్పించుకున్నారు. సభలో రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే మంత్రి లోకేశ్‌ను పులిబిడ్డ.. అంటూ కీర్తించారు. లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. -
ఆరుబయట నరకయాతన
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రాస్పత్రిలో రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించారు. కానీ రోగులవెంట వచ్చే సహాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా నివారించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సకల సదుపాయాలతో 150 పడకల సామర్థ్యంగల ఎంసీహెచ్‌ను నిర్మించారు. రోజూ 300 నుంచి 500 వరకు గర్భిణులు ఓపి సేవలు పొందుతున్నారు. ప్రసవాల కోసం జిల్లా నలుమూలలనుంచి సమారు 100 నుంచి 150 మంది గర్భిణులు ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఇంతటి తాకిడి ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రోగులవెంట వచ్చే సహాయకులకు కనీస సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సహాయకుల కోసం గతంలో తడకలతో షెడ్డును నిర్మించారు. ఆది కాస్త గాలికి కూలిపోవడంతో ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. ఎంసీహెచ్‌లో గర్భిణుల సహాయం కోసం ఒక్కరిని మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారంతా ఉదయం, రాత్రి పూట ఆరుబయట ఎండకు, చలికి ఇబ్బందులు పడాల్సిందే. కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడం వలన నేలపై, బెంచీలపై నిద్రించాల్సి వస్తుందని పలువురు సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుబయటే ఎండకు కూర్చుని భోజనం చేయాల్సి వస్తుందని, కనీసం తాగడానికి తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కోనుక్కుంటున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నీటిట్యాంకు చిన్నది కావడంతో సహయకుల వాడకానికే సరిపోతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంసీహెచ్‌ను నిర్మించిన పాలకులకు కనీసం సహాయకుల కోసం విశ్రాంతి షెడ్డును నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే షెడ్డును నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. చలికి వణికి పోతున్నాం లోపల పడుకోనివ్వకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నాం. చలికి వణికిపోతున్నాం,. కనీసం ఉండడానికి షెడ్డు కూడా లేకపోవడం అన్యాయం. గర్భిణులకు సహాయంగా వచ్చిన వారు ఎక్కడ ఉండాలి. – పుల్లమ్మ, నార్కట్‌పల్లి తాగునీరు కొనాల్సి వస్తుంది కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం దారునం. రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కొనుక్కుంటున్నాం. పడుకోవడానికి, కూర్చోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – యాదమ్మ, రాములబండ -
కోచ్‌లు ఇక ఉత్కృష్టం
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో సదుపాయాలు పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర రైల్వే నడుం బిగించింది. ఇందులో భాగంగా పలు రైళ్లలో కోచ్‌లను ఆధునిక సదుపాయాలతో రీడిజైన్ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 రైళ్లలో ఉత్కృష్ట కోచ్‌లను దశలవారీగా చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు అన్ని రైల్వే జోన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏసీ కోచ్‌లు, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్‌లకు ఈ సదుపాయం వర్తించనుంది. తొలిదశలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దక్షిణ మధ్య రైల్వేలో తొలిదశలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 6 ఉత్కృష్ట కోచ్‌లను ప్రవేశపెట్టారు. నూతన రంగులు, డిజైన్లు, ఆధునిక సదుపాయాలతో ఈ కోచ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ (నం.12728/12727) హైదరాబాద్– విశాఖల మధ్య రెండు రైళ్లు నడుస్తాయి. వీటిలో దశలవారీగా ఉత్కృష్ట కోచ్‌లను ప్రవేశపెడుతున్నారు. రెండో దశలో ఎంచుకునే రైళ్లు 45 ఒక్కోరైలుకు 24 చొప్పున వీటిలో ఉండే కోచ్‌లు– 1080 కోచ్‌కు 60 లక్షల చొప్పున అయ్యే ఖర్చు రూ.648,00,00000 తెలంగాణ, గౌతమి, చార్మినార్, పద్మావతి, నారాయణాద్రి, హుస్సేన్ సాగర్, ముంబై, దేవగిరి, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఈ ప్రాజెక్టు కింద దక్షిణ మధ్య రైల్వే చేపట్టనుంది. మొత్తం రైళ్లు - 2 కోచ్‌ల సంఖ్య - 48 ఆధునీకరణ అయినవి - 6 ఒక కోచ్ ఆధునీకరణకు అయ్యే ఖర్చు - 60 లక్షల రూపాయలు 6 కోచ్‌ల ఆధునీకరణకు అయిన ఖర్చు - 3.6 కోట్ల రూపాయలు డిసెంబర్ నాటికి ఒక రైలు, జనవరి, 2019 నాటికి రెండో రైలు కోచ్(24)లను ఉత్కృష్ట కోచ్‌లుగా మారుస్తారు. ఏముంటాయి? ♦ నాన్ ఏసీ కోచ్‌ల్లో అగ్నిప్రమాదాలు, చోరీల నియంత్రణకు ఏర్పాట్లు.. అంధులకు అందుబాటులో ఉండేలా బ్రెయిలీ లిపిలో నేమ్ప్లేట్లు.. ♦ టాయిలెట్లలో నీరు నిల్వకుండా పాలిమరైజ్డ్ ఫ్లోరింగ్.. బెర్తుల్లో సౌకర్యంగా ఉండే కుషన్ ఏర్పాటు.. ♦ ఆధునిక బయోటాయిలెట్లు.. ఎల్ఈడీ లైట్లు -
ఏవియేషన్‌కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్
ముంబై: ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్ చార్జీలను 12 శాతం పెంచడం ద్వారా పెరిగిన వ్యయాలను అధిగమించొచ్చని సూచించింది. అంతేకాక విమానయాన సంస్థల రుణ భారం 10 శాతం మేర పెరుగుతుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 71 శాతం వాటా జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థల చేతుల్లోనే ఉంది. -
రాజ్ భవన్ స్కూల్.. నావల్ల కాదు బాబోయ్!
సోమాజిగూడ: సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ విధులు నిర్వహించలేనని చేతులెత్తేశారు. ఈ స్కూల్లో హెచ్ఎంకు కనీసం రూమ్ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు. ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్ స్కూలు (బేగంపేట్–2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్ఎంగా బేగంపేట్–2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. తాజాగా హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ తానిక్కడ విధులు నిర్వర్తించలేనని, పేరెంట్ స్కూలుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల డీఈఓకు లేఖ రాశారు. దీనిపై డీఈఓ వెంకటనర్సమ్మ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం గత పది రోజులుగా స్కూలు రావడం మానేశారు. కనీసం రూమ్ కూడా లేదు... ఈ విషయంపై ఇన్చార్జి హెచ్ఎం సుమన్‌ను వివరణ కోరగా... తాను బేగంపేట్–2 స్కూలుకు వెళ్తున్నట్లు చెప్పారు. అదేమంటే రాజ్‌భవన్ స్కూల్లో హెచ్ఎం కూర్చునేందుకు కనీసం రూమ్ కూడా లేదని, గత రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్ స్కూలును వీడి బేగంపేట్ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
తాండూరు : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ‘మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?’శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. బుధవారంరాత్రి తాండూరులో బస చేసిన మంత్రి గురువారం ఉదయం నియోజకవర్గంలోని 12 గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ‘సాక్షి’ కథనాన్ని చూసి స్పందించారు. పంచాయతీల ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకుని వెంటనే తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బెంచీలను పక్షం రోజుల్లో సమకూరుస్తామని, అందుకోసం రూ.20 లక్షలను వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. అదనపు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ‘సాక్షి’కథనం విద్యార్థుల సమస్యకు దర్పణం పట్టిందన్నారు. నూతన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలున్నా ‘సాక్షి’కథనం చూడగానే మధ్యలోనే వెనుదిరిగి ఇక్కడికి వచ్చానని చెప్పారు. విడతలవారీగా కళాశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. -
జైల్లో షరీఫ్‌కు బీ–క్లాస్ వసతి
ఇస్లామాబాద్: అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్‌లకు రావల్పిండిలోని అదియాలా జైలులో బీ–క్లాస్ వసతులు కల్పించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. లాహోర్ విమానాశ్రయంలో దిగగానే వీరిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు విమానంలో రావల్పిండికి తరలించారు. తర్వాత షరీఫ్, మరియమ్లను అదియాలా జైలుకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న వైద్యులు షరీఫ్, మరియమ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరు ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. శనివారం ఉదయం అల్పాహారంలో భాగంగా వీరిద్దరికి ఎగ్ఫ్రై, పరోటా, టీని జైలు అధికారులు ఇచ్చారు. ఉన్నతస్థాయి విద్యావంతులు, ధనికులు తదితరులకు జైలులో బీ– క్లాస్ వసతిని కల్పిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం బీ–క్లాస్ ఖైదీల గదిలో ఓ మంచం, కుర్చీ, లాంతరు, ఓ అల్మారా తదితర సౌకర్యాలుంటాయి. ఖైదీల ఆర్థిక స్థోమతను బట్టి జైలు గదిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, వార్తాపత్రికలు సమకూర్చేందుకు జైళ్ల శాఖకు అధికారాలున్నాయి. ప్రస్తుతం బీ–క్లాస్ వసతులు అనుభవిస్తున్న షరీఫ్, మరియమ్‌లకు సీ–క్లాస్‌లోని నిరక్షరాస్యులైన ఖైదీలకు చదువు చెప్పే బాధ్యతను అప్పగించే అవకాశముంది. పంజాబ్ ప్రావిన్సులో ఘర్షణలు.. షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ అరెస్టులను నిరసిస్తూ వారి స్వస్థలమైన పంజాబ్ ప్రావిన్సులో పలుచోట్ల మద్దతుదారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మంది షరీఫ్ మద్దతుదారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు. కాగా, శుక్రవారం షరీఫ్ రాక నేపథ్యంలో అరెస్ట్‌చేసిన 370 పీఎంఎల్–ఎన్ నేతల్ని, కార్యకర్తల్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. -
‘శ్రీగౌతమి’ నిందితులకు జైల్లో రాజభోగాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : శ్రీగౌతమి హత్య కేసు నిందితులకు జైలులో సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆమె సోదరి పావని ఆరోపించింది. శ్రీగౌతమి హత్య కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు సజ్జా బుజ్జి, జడ్పీటీసీ బాలాం ప్రతాప్‌లకు నరసాపురం సబ్ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె జైలు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పావని ఫిర్యాదు మేరకు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టారు. జైలు శాఖ డీఎస్పీ మారుతి రమేష్ దాదాపు రెండు గంటల నుంచి జైలులోని సిబ్బందిని విచారించారు. విచారణ అనంతరం డీఐజీకి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. -
సీజనల్ వ్యాధుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో చెరువులు, కుంటలు, నీటితో నిండి కనువిందు చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులవల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషజ్వరాలు సైతం ప్రబలి మంచాలకే పరిమితమవుతున్నారు. జ్వరం, దగ్గు, నీళ్ల విరేచనాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులవైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతతో పాటు సరైన మందులు లేకపోవడంతో ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బం దుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావిం చిన ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే రోగులకు వివిధ రకాల పరీక్షలు, మందుల పేరిట అందినకాడికి డబ్బులు గుంజుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. వర్షాకాలంలో ప్రబలేవ్యాధులు, నివారణోపాయాలపై గ్రామాలవా రీగా సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉన్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏజెన్సీ వాసులు నిరక్షరాస్యులు కావడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో వ్యాధులతో బాధపడేవారికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. విషజ్వరాలే కాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ప్రభుత్వ దవాఖానా పట్ల నమ్మకం పెంచాలి. వైద్య వృత్తి పవిత్రతను కాపాడాలి. -కామిడి సతీష్ రెడ్డి, జెడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘ 98484 45134 -
ఓఆర్ఆర్ వెంట సకల సౌకర్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు వెంట వాహనదారులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ఈ రహదారిపై ఇంధన స్టేషన్లు, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు, మినీ ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లు, ఫుడ్ కోర్టులతో పాటు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే 19 ఇంటర్ ఛేంజ్లున్న 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్ ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు తొలుత ఏర్పాటు చేస్తామని హెచ్ఎండీఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత మిగిలిన 14 ఇంటర్ ఛేంజ్‌ల వద్ద పనులు ప్రారంభిస్తామని అందులో పేర్కొంది. భద్రతకు పెద్దపీట... కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో కొన్నిరోజుల క్రితం సంపూర్ణ ఓఆర్ఆర్ వాహన చోదకులకు అందుబాటులోకి వచ్చింది. వీరి అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ప్రయాణించే వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. 2012లో 204, 2013లో 200, 2014లో 139, 2015లో 686, 2016లో 828, 2017లో 812 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యం లో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం కోసం ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఆ దిశగా హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖను కూడా రాశారు. దీంతో పాటు అంబులెన్స్‌ల సంఖ్యను పది నుంచి 16కు పెంచాలని నిర్ణయించారు. అలాగే హెచ్‌టీఎంఎస్ వ్యవస్థతో ఓఆర్ఆర్ను అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా ఇట్టే సమాచారం అందుకుని అంబులెన్స్ ఘటనాస్థలికి త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చిరంజీవులు తెలిపారు. -
ప్రథమ సేవకుడిగా పనిచేస్తా
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా? జ: సాధారణ భక్తుల కోసం రింగ్‌రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు? జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను. ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా? జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను. ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా? జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను. ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు? జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్‌లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. -
నిర్వహణతోనే..
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యముండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుంది. అందుకే సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చు లెక్కుండాలి. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సము దాయం బాగుంటుంది. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలి. ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేం దుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. -
మళ్లీ రోడ్డెక్కిన రైతన్నలు
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు మళ్లీ రోడ్డెక్కారు. రెండు రోజులుగా కాంటాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నా.. మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా, తక్కువ ధరలు వేసి మమ్మల్ని దోచుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాలకు వెలితే తేమశాతం పేరుతో కొర్రీలు, డబ్బులు వెంటనే ఇవ్యరు.. మార్కెట్లకు వస్తే వ్యాపారుల దోపిడీ మేము మరెక్కడికి వెళ్లి మా పంటను అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం రాస్తారోకో జరిపిన రైతులు శుక్రవారం రెండోరోజూ ఆందోళన చేపట్టారు. ఉదయం మార్కెట్ కార్యాలయంలోని కార్యదర్శి, చైర్మన్ గదుల్లోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వసం చేశారు. వ్యాపారులు చేసిన మోసానికి కడుపుమండిన రైతులు రెండో రోజుకూడా మార్కెట్‌కు దగ్గరలోని నేషనల్ హైవే మీద రాస్తారోకోకు దిగారు. అయితే గురువారమే జేసీ సంజీవరెడ్డి వచ్చి క్వింటాళ్‌కు రూ.1,100నుంచి రూ.1,400 వరకు పడ్డ అన్ని కుప్పలకు ధర రూ.1400లు చేయాలని వ్యాపారులను ఆదేశించినా అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చేదాకా మా రాస్తారోకో ఆగదని రైతన్నలు రోడ్డుమీదే భీష్మించారు. దీంతో కలెక్టర్ సురేంద్రమోహన్ రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిని మరలా మార్కెట్‌కు తీసుకువెళ్లారు. తేమశాతం చేతితోనే.. సాధారణంగా ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి దాని ఆధారంగా వ్యాపారలు ధరలు నిర్ణయించాలి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో తేమశాతంను మిషన్లతో పరిశీలిస్తుండగా వ్యవసాయ మార్కెట్లో మాత్రం వ్యాపారులు, వారి గుమస్తాలు ధాన్యం తేమను చేతితోనే అంచనా వేసి ఇప్పటికి ఆశాస్త్రీయంగానే ధరలను నిర్ణయిస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కొద్ది సేపు మార్కెట్లో తిరిగి రైతులను శాంత పరిచి కార్యాలయంలో వ్యాపారులు, కమీషన్‌దారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ «తేమశాతం ఎలా చూస్తున్నారని వ్యాపారులని ఆడుగగా చేతితో చూసి ధరలు అంచనా వేస్తామని వ్యాపారులు చెప్పడంతో ఇకనుంచి అలా కుదరదని ఖచ్చితంగా తేమశాతం చూసే మిషన్‌తోనే చూసి «మద్దతు« ధరలు రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ సురేంద్రమోహన్ చెప్పారు. మార్కెట్ నిర్వహణలో అంతా వైఫల్యమే.. మార్కెట్ నిర్వహణలో మార్కెట్ సిబ్బంది వైఫల్యం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై జేసీ సంజీవరెడ్డి కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడారు. మార్కెట్లో తేమశాతం మిషన్లు అందుబాటులో లేక పోవడంతో కార్యదర్శిపై అందోళన వ్యక్తం చేశారు. సీజన్ సమయంలో మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతుందని ముందే తెలిసినా వ్యవసాయ మార్కెట్లలో అందకు తగ్గ ఏర్పాట్లను మార్కెట్ సిబ్బంది చేయలేదు. రాత్రి సమయంలోనే ఎక్కువగా రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకు వస్తారు. అప్పుడు మార్కెట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండరు. ఉదయం 11 గంటల వరకూ ఏ అధికారి కాని, సిబ్బందికాని కార్యాలయానికి రారు. అంతా కమీషన్‌దారులు, వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే మార్కెట్ నిర్వహణను చూస్తున్నారు. వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నప్పుడు తప్పనిసరిగా మార్కెట్ సూపర్వైజర్లు ధరల సరళిని పరిశీలించాలి. అలా చేసి ఉంటే ధరలు తక్కువ వేస్తున్నారని ముందే పసిగట్టవచ్చని..ఆదిలోనే తమ సమస్యను పరిష్కరించే అవకాశముండేది రైతులు అంటున్నారు. మార్కెట్లోనే అధికారుల మకాం.. మార్కెట్‌కు గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో ఒక్క బస్తా కూడా గురువారం కాంటా కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆందోళనలో ఉన్న రైతులను కలెక్టర్ సముదాయించారు. వ్యాపారులకు అవసరముంటే ధాన్యం అమ్ముకోవచ్చని లేదంటే మీ ధాన్యాన్ని మద్దతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని కలెక్టర్ ప్రకటించారు. జేసీ సంజీవరెడ్డితో సహా వ్యవసాయ, రెవెన్యూ, కోఆపరేటివ్, సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు మార్కెట్లోనే మకాం వేశారు. వారి సిబ్బందితో తేమశాతం పరిశీలన, కొన్నవారికి వెంటనే గన్నీ బ్యాగులు సరఫరా, కాంటాలు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. ధాన్యం ఎక్కువగా వస్తున్నందున టోకెన్ పద్ధతితోనే ధాన్యం క్రమబద్దీకరించాల్సి ఉందని రోజు 30 వేల బస్తాలు వచ్చే విధంగా టోకెన్లు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు.. దొడ్డు, సన్నాలకు ఒకే ధర ! కొద్దిరోజుల వరకు దొడ్డు రకం ధాన్యానికి ధర రూ.1,550అటు ఇటుగా ఉండగా సన్న రకాలకు రూ.1,750 నుంచి రూ.1,900 వరకు ధర పలికింది. కాని వ్యాపారులు గురువారం సందట్లో సడేమియాలాగా సన్నరకాలకు కూడా రూ.1,550 వరకే ధరలను వేయడంతో సన్న రకాలు తెచ్చిన రైతులు జేసీ ఎదుట లదోదిబోమన్నారు. సన్నాలకు ధర బాగుందని అవి పండించామని వ్యాపారులు నిలువునా ముంచారని ఆదుకోవాలని కోరడంతో ధరలను మళ్లీ వేపిస్తామని తెలిపారు. రెండు రోజులుగా మార్కెట్లో ఇంతజరుగుతుంటే మార్కెట్ కమిటీ చైర్మన్‌గాని.. డైరెక్టర్లు గాని ఒక్కరు మార్కెట్ వైపునకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారమూ సెలవే.. గురువారం అధికంగా వచ్చిన ధాన్యానికి మార్కెట్ అధికారులు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఆదివారం ఎలాగు సెలవుకాగా సోమవారం ఒక్కరోజు మార్కెట్ నడిచే అవకాశముంది మరలా మంగళవారం మేడే సెలవు ఉంటుంది. రైతులతో పాటుగా.. మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని చాలెంజ్‌గా తీసుకున్న జిల్లా అధికారులు వ్యవసాయ మార్కెట్లోనే మకాం వేశారు. కలెక్టర్ సురేంద్రమోహన్, జేసీసంజీవరెడ్డి రైతులతో పాటుగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్లోనే ఉండి కాంటాలు, బస్తాల ఎగుమతులను పర్యవేక్షించారు. వీరి వెంట సివిల్‌సప్లయ్, వ్యవసాయశాఖల అధికారులు అనురాధ, జ్యోతిర్మయి, సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి, మార్కెట్ కార్యదర్శి ఎల్లయ్య, సిబ్బంది పోశెట్టి, అల్తాఫ్‌లు ఉన్నారు. గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో శుక్రవారం రాత్రి వరకు 70శాతం కాంటాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మార్కెట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేశ్యర్రావు ఆధ్వర్యంలో టౌన్ సీఐ శివశంకర్. ఎస్ఐ జానకిరాములు ఉదయం నుంచి బందోబస్తు నిర్వహించారు. -
మండుటెండలో మాడిపోతున్నారు!
సీతంపేట:ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నచోట మౌలిక సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేచోట నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, దీంతో ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలుమండిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇలాంటి సమయంలో కూలీలకు వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 5,65,650 వేల కుటుంబాలున్నాయి. వీటిలో 11,76,647 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 58,860, ఎస్టీలు 46,762, ఇతరులు 4,64,028 మంది వేతనదారులకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఈ ఏడాది 5,57,923 మంది వేతనదారులకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీ జనాభాకు43,318 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇవ్వగా టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లోని గిరిజన వేతనదారులు లక్ష మందికి పైగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పేరుకుపోయిన వేతన బకాయిలు ఉపాధి వేతనదారులకు గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.మూడు, నాలుగేసి నెలలు బకాయిలుంటే ఎలా బతుకుతామని వేతనదారులు ప్రశ్నిస్తున్నారు. చేసిన కష్టానికి సకాలంలో ప్రతిఫలం రాకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలంలో అయితే రోజువారీ వేతనంతో పాటు అదనంగా 25 నుంచి 30 శాతం కలిపి వేతనం ఇవ్వాలి. ఇదికాకుండా పనులుచేసే చోట తాగునీటి సౌకర్యం లేని పక్షంలో కూలీలు తాగునీరు తెచ్చుకుంటే రోజుకు రూ.5 ఇస్తారు. పనులు చేసేందుకు అవసరమైన గునపం పదును చేసుకునేందుకు రూ.10 ఇవ్వాలి. ఒక్కో వేతనదారుకి రూ.194 వరకు కూలి గిట్టుబాటు కావాలి. కాని ఎండ కారణంగా పని ముందుకు సాగకపోవడంతో తక్కువ వేతనమే గిట్టుబాటు అవుతోందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవంటున్నారు. టెంట్లు రాలేదు ఈ ఏడాది ఇంకా టెంట్లు రాలేదు. గత ఏడాది పంపిణీ చేశాం. మందుల కిట్లు కూడా రాలేదు. ప్రస్తుతానికి వేతనదారులకు గునపాలు పంపిణీ చేశాం.–శంకరరావు, ఏపీవో, ఉపాధి హామీ పథకం -
మీడియాపై ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం
-
మీడియాపై ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం
సాక్షి, అమరావతి : టీడీపీ గల్లా జయదేవ్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి సాధించారని సన్మానాలు చేయించుకున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్‌ను పక్కదోవ పట్టించవద్దన్న ఎంపీ గల్లా జయదేవ్ ... మీరు మాకు సన్మానం చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. తాను ఎక్కడా సన్మానాలు చేయించుకోలేదని, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చేశారని, దాన్ని తాము కాదనలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. సీఎంతో టీడీపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో టీడీపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఎంపీల ఒక్కొక్కరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏపీలో రోగులకు గుబులు పుట్టిస్తున్న ప్రభుత్వ వైద్యం
-
కోటిలింగాల ఘాట్‌లో బురదనీరు
-
అసౌకర్యాల అంగన్వాడీలు
అడ్డాకుల : అంగన్వాడీ కేంద్రాలు అసౌకర్యాల నిలయాలుగా మారుతున్నాయి. కేంద్రాలకు సరైన భవనాలు లేక చాలాచోట్ల అద్దె భవనాలే దిక్కయ్యాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిలో సృజనాత్మకత పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల లక్ష్యం నెరవేరడంలేదు. చిన్నారుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అన్నీ అరకొర వసతులే మండలంలో 38 అంగన్వాడీ కేం ద్రాలు ఉండగా వాటిలో రెండు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింత లు కలిపి 1500 మంది వరకు ఉంటారు. అయితే ప్రధానంగా భవనాల సమస్య అంగన్వాడీ కేంద్రాలను వేధిస్తోంది. అద్దె భవనాలు, పురాతన ప్రభుత్వ భవనాలను అంగన్వాడీ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. కేవలం 14 అంగన్వాడీ కేం ద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిలో ఆరిం టిని అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అడ్డాకుల3వ కేంద్రం, తిమ్మాయిపల్లి తండా, పెద్దమునుగల్‌ఛేడ్ గ్రామాల్లో 1వ కేంద్రాలు, దుబ్బపల్లి, కందూర్ 2వ కేంద్రం, పొన్నకల్ 3వ కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. వీటికి నెలకు ఒక్కో కేంద్రానికి రూ.350 నుంచి రూ.500 వరకు అద్దె చెల్లిస్తున్నారు. పాత భవనాల్లో 18 కేంద్రాలు..! గ్రామాల్లో పాఠశాల భవనాలు, ఇతర కార్యాలయాలను అంగన్వాడీ కేంద్రాలుగా కొనసాగిస్తున్నారు. అడ్డాకుల 4వ కేంద్రం, గుడిబండ 2వ కేంద్రం, చిన్నమునుగల్‌ఛేడ్, పెద్దమునుగల్‌ఛేడ్ 2వ కేంద్రం, రాంచంద్రాపూర్, కాటవరం, కాటవరం తండా, తిమ్మాయిపల్లి తండా 2వ కేంద్రం, కందూర్ 4,5వ కేం ద్రాలు, చౌడాయపల్లి, సుంకరాంపల్లి, వడ్డెపల్లి, గౌరిదేవిపల్లి, పొన్నకల్ 2వ కేంద్రం, రాచాల 1,2వ కేం ద్రాలు ఇతర భవనాల్లో ఉన్నారు. వీటిలో కొన్నింటిని పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. ఆటలకు దూరం అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు ఆట వస్తువులు చూపి వారిని ఆకట్టుకునే విధంగా చేయాలి. కానీ చాలా కేంద్రాల్లో పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు పూర్తి స్థాయిలో లేవు. కొన్ని కుర్చీలు, ఒకటి, రెండు ఆట వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వాటితోనే పిల్లలు ఆడుకోవాల్సి వస్తోంది. దీంతో చాలా కేంద్రాల్లో పిల్లలు మధ్యాహ్నం వరకే కేంద్రాల్లో ఉంటున్నారు. తర్వాత తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్తున్నారు. చాలా కేంద్రాల్లో మరుగుదొడ్లు అందుబాటులో లేవు. అంగన్వాడీ పిల్లలు ఒంటికి, రెంటికి ఆరుబయటకే వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. తాగునీటికి సరైన వసతి లేకపోవడంతో నల్లా నీళ్లే దిక్కవుతున్నాయి. ప్రతిపాదనలు పంపాం కొన్ని చోట్ల భవనాల సమస్య ఉంది. నాలుగు అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. వాటిలో రాచాల 2వ కేంద్రం, కాటవరం, తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి తండాలో కొత్త భవనాలు నిర్మించడానికి నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాం. చిన్నారులకు సమస్యలు ఎదురవకుండా చర్యలు చేపడుతున్నాం. –అనిత, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు -
ఇదేనా సం‘క్షేమం’?
ఉప్పునుంతల : స్థానిక బీసీ బాలుర హాస్టల్లో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పలుమార్లు హాస్టల్ నిద్ర చేసి ప్రత్యక్షంగా చూసిన సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసినా ఫలితం లేదు. హాస్టల్ చుట్టూ ప్రహరీ లేకపోవడంలో ఇబ్బందిగా మారింది. వాటర్ ట్యాంకుకు పగుళ్లు రావడంతో నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. హాస్టల్పైన, ఉన్న చిన్న వాటర్ ట్యాంకు ద్వారా వచ్చే నీటితోనే ఇబ్బందుల మధ్య స్నానాలు చేస్తున్నారు. నీటివసతి లేక స్నానపు గదులు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. దాంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. 35కు దాటని విద్యార్థుల హాజర్ 160మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఈ హాస్టల్లో ప్రస్తుతం 90 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నా 35 మందికి మించి ఉండటంలేదు. వారిలో 20మంది వరకు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. తాడూరు, మర్రిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు హాస్టల్లో అడ్మిషన్ ఉన్నా ఆయా గ్రామాల నుంచే పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు తప్పా హాస్టల్లో ఉండడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండడంతో ఆరుబయటికి వెళ్తున్నాం. స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – శివ, 5వ తరగతి, హాస్టల్ విద్యార్థి -
ఘోషా.. నిరాశ!
ప్రసవమంటే పునర్జన్మే అంటారు. అతివ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ జన్మించిన దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రసవానంతరం మాతాశిశువులను కంటికి రెప్పలా చూసుకుంటారు. అయితే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే ఘోషా ఆస్పత్రిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. కనీస సౌకర్యాలను అభివృద్ధి చెందించి అతివలకు మేలు చేయాల్సిన అవసరం ఉండగా, ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. హామీలైతే కుమ్మరిస్తున్నారు కానీ మాతృమూర్తులకు, నవజాత శిశువుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పాతపోస్టాఫీసు: ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరైన సదుపాయాలు కానరావడం లేదు. ఆస్పత్రికి 147 పడకల సామర్థ్యం ఉన్నా వైద్యాధికారులు 250 పడకలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మెరుగైన వైద్య సేవలకోసం ఇక్కడకు వస్తుంటారు. ప్రసూతి కేసులు అధికంగా వచ్చినపుడు మంచానికి ఇద్దరు వంతున బాలింతలను ఉంచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కన్నా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం వల్ల సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. హామీలు గాలికి.. గత ఏడాది ఫిబ్రవరి 17న ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం జరగలేదు కాని లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదే నెల 20న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏప్రిల్ 4న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆస్పత్రిని సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించి పలు హామీలను గుప్పించారు. అవి ఒక్కటి కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు. ఇవీ వాగ్దానాలు ♦రూ. 20 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో ఉన్న ఖాళీ స్థలంలో 100 పడకల మాతాశిశు ఆస్పత్రిని నిర్మిస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మే 31కి శంకుస్థాపన జరిగుతుందని, 18 నెలల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ♦అందుబాటులో ఉన్న నిధులతో ఆస్పత్రిలో శిథిలమైపోయిన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు భూగర్భ ౖడ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. ♦ఆస్పత్రి అభివృద్ధికి వుడా రూ.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఆ నిధులు ఏమైపోయాయో తెలియదు. ♦రూ. 28 లక్షల వ్యయంతో 315 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని చెప్పి నెలలు గడిచాయి. ♦రూ. 22.6 లక్షల వ్యయంతో నవజాత శిశువుల విభాగానికి ఎయిర్ కంప్రెసర్, సీసీ రోడ్ల నిర్మాణం, కొత్త ఆంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని ♦ఇక్కడ మరుగుదొడ్ల కొరతను తీర్చేందుకు జీవీఎంసీకి మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యతను అప్పగిస్తామని అన్నారు. ♦పూర్తి స్థాయిలో ఆస్పత్రిలో అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ♦శాశ్వత ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. ఇవీ వాస్తవాలు.. ♦ఆస్పత్రిలో వినియోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్కు కాలం చెల్లింది. దీని సామర్థ్యాన్ని మించి విద్యుత్‌ను ఆస్పత్రి వినియోగించడం వల్ల విద్యుత్ బల్బులు ఎప్పటికప్పుడు మాడిపోతున్నాయి. చిన్నచిన్న పరికరాలు కాలిపోతున్నాయి. 47 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రతి రోజు 80 కిలోవాట్లను వాడుతున్నారు. ♦ఇక్కడి సీసీ రోడ్లు శిథిలమై సంవత్సరాలు గడుస్తున్నా నూతనంగా రోడ్లను వేసేందుకు తగిన నిధులు లేకపోవడం వల్ల గతుకులు పడిన రోడ్లతో అంతా అవస్థలు పడుతున్నారు. ♦ప్రతి రోజు సుమారు 100 మంది ఔట్ పేషెంట్లు ఆస్పత్రికి వస్తుంటారు. వీరితో పాటు ఆస్పత్రిలో చేరిన రోగులు, వారి సహాయకులు మరొ 200 వరకూ ఉంటారు. వీరందరి వినియోగానికి సరిపడా మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఆస్పత్రి ఆవరణలో ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న సులాభ్ కాంప్లెక్స్మీద వీరంతా ఆధారపడవలసి వస్తుంది. దీంతో మరుగు వెళ్లేందుకు మహిళలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ♦నవజాత శిశువుల విభాగంలో అగ్నిమాపక యంత్రాలకు బదులు చిన్న పరిమాణంలో ఉన్న పరికరాలు అమర్చారు. వీటివల్ల ప్రయోజనం పరిమితమే. ♦ఆస్పత్రిలో పడకల సామర్థ్యం కన్నా అదనంగా మంచాలను వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏర్పాటు చేసిన పడకలతో పాటు నవజాత శిశువుల విభాగపు కింది భాగంలో మంచాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆ విభాగపు తొలి అంతస్తుకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై కూడా మంచాలు వేశారు. ♦రోగుల సంఖ్యను బట్టి 31 మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా ప్రస్తుతం 18 మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, అంబులెన్స్ డ్రైవర్, ఫ్యామిలీ ప్లానింగ్ వెల్పేర్ వర్కర్, గార్డెనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరానికి సరిపడా నాలుగో తరగతి సిబ్బంది లేరు. ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ అధికారి పోస్టు ఆరు నెలలుగా, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టు గత ఏడాది ఎనిమిది నెలలుగా,, హాస్పిటల్ మేనేజర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్నాయి. -
యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
సాక్షి హైదరాబాద్: హజ్ –2018 యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మసీవుల్లా ఖాన్ అన్నారు. దేశంలోనే ఈ కమిటీని నంబర్‌వన్‌గా నిలుపుతామని ఆయన తెలిపారు. నాంపల్లి హజ్ కార్యాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఆయన నూతన చైర్మన్‌గా ఎన్నికైనట్లు హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎ.షుకూర్ ప్రకటించారు. ఈ ఎన్నికతో కొత్త రాష్ట్ర హజ్ కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ మూడేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. కొత్త చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని, ఈ పదవికి ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మన్నాన్ ఫారూఖీ ఎన్నికల అధికారిగా పాల్గొన్నారు. -
నీడలేని నిర్వాసితులు
-
‘అమర్నాథ్ యాత్ర’కు ఆధునిక హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్జీటీ తెలిపింది. -
రక్తదానం ప్రోత్సాహానికి ఫేస్బుక్లో సౌకర్యం
న్యూఢిల్లీ: రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్సైట్లో ఫేస్బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి. వెంటనే ఫేస్బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నామని, కొద్ది వారాల్లో మిగతా నగరాలకు కూడా విస్తరిస్తామని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ (ఆరోగ్యం) హేమా బూదరాజు తెలిపారు. -
ప్రాణాలతో చెలగాటం
- అస్తవ్యస్తంగా చిన్నపిల్లల వార్డు - ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే వార్డు మార్పు - పట్టించుకునేవారు లేరు - ఇదీ సర్వజనాస్పత్రి దుస్థితి అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే చిన్నపిల్లల వార్డును సూపరింటెండెంట్ బ్లాక్ పైభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన భవనంలోకి మార్చడం పలు విమర్శలకు దారితీస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే వారు మరింత ఇబ్బందులకు గురయ్యేలా యాజమాన్యం వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వార్డులో గందరగోళ పరిస్థితి నెలకొది. ప్రమాదకరంగా మెట్లు : నూతన భవంలో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. మెట్ల వద్ద గేట్ వేయకపోవడంతో పాటు గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అలాంటి ముందస్తు జాగ్రతలు తీసుకోలేదు. ఎవరైనా రోగుల బంధువులు ఫోన్ మాట్లాడేటప్పుడు పొరపాటున జారి పడితే మూడో అంతస్తు నుంచి కిందకు పడే అవకాశం ఉంది. రాత్రివేళల్లో బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గేట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పరికాల అమరికేది? : వార్డులో కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లకు స్విచ్‌బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రమాదకరమైన కేసులకు వెంటిలేటర్ తప్పనిసరి. ఐసీయూలో ఏసీలు బిగించలేదు. తాగేందుకు నీటి సదుపాయం లేదు. దీన్నిబట్టిచూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే యాజమాన్యం చిన్నపిల్లల వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి వారి తల్లిదండ్రులకు అందజేశారు. మూడో అంతస్తు కావడంలో వేడి అధికంగా వస్తుంటుంది. వాల్ రూఫింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత : ప్రస్తుతం వార్డులో 200 మంది చిన్నారుల అడ్మిషన్లో ఉన్నారు. షిప్ట్‌కు ముగ్గురు స్టాఫ్ నర్సులను మాత్రమే నియమించారు. వాస్తవంగా వార్డులో నాలుగు యూనిట్లు ఉన్నాయి. యూనిట్‌కు ఇద్దరు స్టాఫ్ నర్సులైనా విధుల్లో ఉండాలి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని మాత్రమే కేటాయించారు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. దీంతో రోగుల అటెండర్లు పదుల సంఖ్యలో వార్డుల్లోనే తిష్టవేశారు. దీని ద్వారా క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ముందుగానే చెప్పాం యూనిట్లో అన్నీ సమకూర్చాకే వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లా. యూనిట్లో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పరికరాల ఏర్పాటుకు స్విచ్‌బోర్డు, రూఫింగ్, ఏసీలు బిగించాల్సి ఉంది. గైనిక్ వారి కోసం ఆత్రుతతో యూనిట్ మార్చాల్సి వచ్చింది. - డాక్టర్ మల్లీశ్వరి, చిన్నపిల్లల వార్డు హెచ్ఓడీ -
‘వసతి’ ఘోరం
- బూత్ బంగ్లాను తలపిస్తున్న హాస్టల్ భవనం - నాణ్యత లేని భోజనం.. స్వచ్ఛత లేని నీరు - ఇబ్బందుల్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు హిందూపురం అర్బన్: హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల మధ్య విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. తమ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. కళాశాలలో సుమారు 250 మందికి పైగా విద్యార్థినులు డీఫార్మసీ, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరారు. కళాశాలలో ప్రవేశం కోసం రూ.4,500 చెల్లించి ప్రతినెలా మెస్ చార్జీల పేరిట రూ.1,400 కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తున్నారు. అయితే కళాశాల ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి విషపురుగులకు ఆవాసంగా మారుతోందని విద్యార్థులు భయపడిపోతున్నారు. నాణ్యత లేని ఆహారం హాస్టల్లో విద్యార్థినులకు ముద్ద అన్నం, నీళ్ల చారు, కూరగాయలు లేని పప్పు, నీళ్ల వంటి మజ్జిగ అందిస్తున్నారు. ఉదయం పూట టిఫెన్ ఉప్మా, పొంగల్ పచ్చళ్లతో తినాల్సి వస్తోంది. రాత్రిపూట కూడా ఇంతే పరిస్థితి అని విద్యార్థులు వాపోతున్నారు. తీపి పదార్థాలు, మాంసాహారం అనేది మచ్చుకైనా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకానికి కుళ్లిపోయిన టమాట, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వాడుతుంటారు. తాగునీటిని నాలుగు రోజులకోసారి ట్యాంకర్ ద్వారా తెప్పించి సంప్‌లో వేయిస్తారు. దుర్గంధానికి కేరాఫ్ పాత భవనాలు కావడంతో బూజు పట్టి అపరిశుభ్రంగా ఉంటున్నాయి. గదుల గోడలపై పిచ్చి రాతలు రాశారు. అసభ్యకరమైన బొమ్మలు వేసి ఉండటంతో విద్యార్థినులు అసహనంతో ఆ గదుల్లోనే ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు బాత్ రూంలు దుర్వాసనతో నిండి ఉన్నాయి. మరుగుదొడ్లకు తలుపులు కూడా ఉండవు. నీటికొరత కారణంగా బట్టలు ఇళ్లకు తీసుకెళ్లి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి. కొత్త హాçస్టల్ భవనాన్ని గతేడాది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించినా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రిన్సిపాల్‌కు చెప్పినా ప్రయోజనం లేదు : పవిత్ర, పాలిటెక్నిక్ ఫైనలియర్ హాస్టల్లో సమస్యలపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. గదుల్లో ఉండలేమని చెబితే టీసీ ఇస్తాం ఇంటికి వెళ్లిపోండి అని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక ఉంటున్నాం. ఆకతాయిలు రాళ్లు వేస్తున్నారు : దీపిక, పాలిటెక్నిక్ హాస్టల్ గదులల్లో సరైన విద్యుత్ సదుపాయాలు ఉండటం లేదు. చీకటి పడితే ఆకతాయిలు రోడ్డుపక్కన నుంచి రాళ్లు వేస్తుంటారు. విజిల్స్ వేస్తారు. చాలా భయంగా ఉంటుంది. ఉదయాన్నే ఒక విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దీనిపై యాజమాన్యం స్పందించడం లేదు. -
ఉపరాష్ట్రపతి పర్యటన, వాహనాలు మళ్లింపు
విశాఖ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలును దారి మళ్లించారు. దేవరపల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం,సూర్యాపేట మీదగా వాహనాలను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, ఖమ్మం మీదగా మళ్లిస్తున్నారు. ఇక విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ మీదగా గుడివాడ, పామర్రు, చల్లపల్లి, బాపట్ల ఒంగోలు మీదగా, చెన్నైవైపు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ఒంగోలు, బాపట్ల, గుడివాడ మీదగా మళ్లిస్తున్నారు. కాగా ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత వెంకయ్య నాయుడు తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఇవాళ (శనివారం) వెలగపూడిలో ఆయనకు పౌరసన్మానం చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు వెంకయ్య నాయుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 23 కి.మీ. మేర రోడ్డుకు ఇరువైపులా జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు, ప్రజలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతారు. కాగా కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ చివరి సంతకం చేశారని, ఆ ఇళ్ల శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే చేయిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. -
నిరీక్షణ.. ఓ పరీక్ష!
ఆసుపత్రిని స్కాన్ చేయండి! - ప్రహసనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ - రేడియాలజిస్టుల కొరతతో అవస్థలు - అందుబాటులే ఒక్కరే వైద్యురాలు - గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం - గంటల తరబడి వేచి చూడాల్సిందే.. మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ గారికి.. అయ్యా, మేము నిరుపేదలం. ఖరీదైన వైద్యం చేయించుకునేందకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేం. నెలలు నిండడంతో ప్రసవ వేదన పడుతున్నాం. కొన్ని రకాల స్కానింగ్‌లు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. స్కానింగ్ థియేటర్‌కు ఉదయం 9కి వస్తే 11 గంటలైనా పరీక్షలు చేయడం లేదు. సంబంధిత వైద్యులు రాకపోవడంతో మేమంతా వరుసలో నిల్చొని, అలసిపోతే కూర్చొని గంటల తరబడి నిరీక్షిస్తున్నాం. కూర్చోవడానికి బండ ఒక్కటే ఉండడంతో మా అవస్థలు వర్ణనాతీతం. మీరైనా మా బాధలు తీర్చండి. ఇట్లు సర్వజనాస్పత్రిలో చికిత్సకు వచ్చిన గర్భిణులు. అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. నిరుపేదలకు పెద్దదిక్కుగా నిలిచే ఈ ఆసుపత్రిలో ఎక్కడికక్కడ నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలంటే గర్భిణులు, మూత్రపిండాల వ్యాధులు, కడుపునొప్పి బాధితులు చుక్కలు చూడాల్సి వస్తోంది. వైద్య సేవలు బాగుంటాయనే ఆశతో వచ్చే రోగులకు ఇక్కడి పరిస్థితితో పై ప్రాణం పైనే పోతోంది. పేరుకు 500 పడకల ఆసుపత్రే అయినా.. ఇన్‌పేషెంట్స్ 800 మందికి పైమాటే. రేడియాలజీ విభాగం పరిధిలోని ఎక్స్‌రే, సీటీ స్కాన్ల విషయం పెద్దగా సమస్య లేనప్పటికీ.. అల్ట్రాసౌండ్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ విభాగం హెచ్ఓడీ కృష్ణవేణి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత రేడియాలజిస్టు శారద ఇన్చార్జి బాధ్యతలు తీసుకోగా.. ఆమె కూడా బదిలీపై వెళ్లిపోయారు. మరో రేడియాలజిస్టు పద్మ అనధికారికంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఇంకో రేడియాలజిస్టు వసుంధర సైతం గత 15 రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో భారమంతా డాక్టర్ దీప మోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సీనియర్ రెసిడెంట్ మధుబాబు ఉన్నా.. కేటాయించిన గడువు పూర్తి కావడంతో వెళ్లిపోయారు. ఇటీవల డాక్టర్ దీప సెలవు పెట్టడంతో ఒక రోజు స్కానింగ్‌ను సైతం నిలిపేయాల్సిన దుస్థితి తలెత్తింది. మధ్యాహ్నం దాటితే అంతే.. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందిస్తున్నారు. ఆ తర్వాత కాల్ డ్యూటీ పేరుతో వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర కేసులుంటే చాలా మంది బయట స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ సేవలకు ‘స్కానింగ్’ కట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిత్యం 300 మంది వరకు గర్భిణులు, మహిళలు వస్తుంటారు. గర్భంలో శిశువు ఎదుగుదల, లోపాలు గుర్తించాలంటే స్కానింగ్ తప్పనిసరి. అయితే వైద్యుల కొరత కారణంగా ప్రస్తుతం ఓపీ సేవలు నిలిపేశారు. గైనిక్ ఓపీకి వచ్చే వాళ్లు స్కానింగ్ చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇతర సమస్యలతో ఇక్కడికొచ్చే వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిపై దృష్టి సారించి పరిపాలనను గాడిన పెట్టాలని రోగులు వేడుకుంటున్నారు. డీఎంఈతో మాట్లాడుతున్నాం రేడియాలజిస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. హెచ్ఓడీల మీటింగ్ పెట్టి ఔట్ పేషెంట్స్ కేసులకు స్కానింగ్ రాయొద్దని చెప్పాం. ఇక్కడి సమస్యపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)తో మాట్లాడుతున్నాం. కర్నూలు ఆస్పత్రి నుంచి ఎవరినైనా పంపాలని కోరాం. సీనియర్ రెసిడెంట్స్నైనా పర్వాలేదన్నాం. – డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి ఆ ఇద్దరికీ సెలవు ఇవ్వలేదు రేడియాలజిస్టులు వసుంధర, పద్మలు సెలవు కావాలని కోరారు. ఇక్కడి పరిస్థితి దృష్ట్యా కుదరదని చెప్పాం. ఒకరు రిజిస్టర్ పోస్టులో పంపారు. మరొకరు నేరుగా ఇచ్చారు. ఇద్దరివీ తిరస్కరించాం. డ్యూటీలకు రాకపోవడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మెడికల్ కళాశాల -
విధుల్లో చేరిన ఫెసిలిటేటర్ల
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా 396 మంది ఫెసిలిటేటర్లను నియమించగా, వారంతా మంగళవారం విధుల్లో చేరినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామూనాయక్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 30న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే శిక్షణ అందించామన్నారు. -
ఫెసిలిటేటర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్సీ కార్పోరేషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫెసిలిటేటర్ల నియామకం కోసం బుధవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. స్థానిక పెన్నార్ భవన్‌లోని ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయంలో మొదటిరోజు అనంతపురం, ధర్మవరం రెవిన్యూ డివిజన్ల పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్య్వూలను నిర్వహించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రామూనాయక్ పర్యవేక్షణలో ఎస్కేయూకు చెందిన ప్రోఫెసర్లు ఆనందరాయుడు, శ్రీధర్, సుధాకర్‌లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండు డివిజన్లకు చెందిన 72 మంది అభ్యర్థులు ఈ ఎంపికకు హాజరయ్యారు. గురువారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజన్లకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఈడీ రామూనాయక్ తెలిపారు. -
ఖర్మాస్పత్రులు
- సర్కార్ ఆస్పత్రుల్లో రోగులకు నరకం - వైద్యులు కనిపించరు...సిబ్బంది ఉండరు - సాయంత్రమైతే చాలా ఆస్పత్రులు ఖాళీ 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలు అనంతపురం ఆస్పత్రిలో కుక్కల స్వైరవిహారం...వార్డుల్లో ఎలుకల సంచారం - సాక్షి విజిట్‌లో కనిపించిన సిత్రాలు ‘నాకు 7 నెలలు. కడుపులో గడ్డ ఉంది, బీపీ పెరిగింది. గుత్తి ఆస్పత్రికి వెళితే అనంతపురం పెద్దాస్పత్రికి వెళ్లాలన్నారు. ఇక్కడికి వస్తే ఉదయం రాపో...అంటున్నారు. అడ్మిట్ చేసుకోండంటే బెడ్లు లేవంటున్నారు. ఇపుడు 11 గంటలైంది. ఈ చలిలో ఎక్కడ ఉండాలి.’ - అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చిన గుత్తికి చెందిన మల్లీశ్వరి ఆవేదన ఇది సర్కారు వైద్యం దైవాదీనంగా మారింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రులు కూడా సాయంత్రం ఆరింటికే మూతపడుతున్నాయి. కొన్నిచోట్ల ఆస్పత్రి తీసి ఉంచినా సిబ్బంది కనిపించడం లేదు. అత్యవసర సమయంలో అటెండర్లు, స్వీపర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు. తమకొచ్చిన వైద్యంతో రోగులకు నరకం చూపుతున్నారు. చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోనూ రోగుల బాధలు వర్ణించేందుకు వీలు కావడం లేద. కిక్కిరిపోయిన కాన్పుల వార్డుల్లో ఒక్కే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్యం చేస్తున్న తీరు వైద్యఆరోగ్య శాఖ డొల్ల తనానికి పరాకాష్టగా నిలిచింది. శనివారం రాత్రి 8 నుంచి సాక్షి బృందం జిల్లాలోని 42 పీహెచ్‌సీలను పరిశీలించగా...దాదాపు అన్నిచోట్ల సిబ్బంది విధులకు డుమ్మాకొట్టడఽం కనిపించింది. - సాక్షిప్రతినిధి, అనంతపురం పేదలు ప్రాణం మీదకు వస్తే పేదలంతా ప్రభుత్వ ఆస్పత్రులకే పరుగు తీస్తారు. కానీ అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వారికి నరకం చూపుతోంది. మందులుంటే సిబ్బంది ఉండరు..సిబ్బంది ఉంటే మందులు దొరకరు. అన్నీ ఉంటే అసౌకర్యాల కొరత..ఇలా పేదోడికి బతుకుండగానే నరకం చూపుతున్నారు. 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ వైద్యులు, సిబ్బంది సాయంత్రమే ఇంటిబాట పడుతుండడంతో అర్ధరాత్రి వేళ అత్యవసరమై దవాఖానకు వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు. - అనంతపురం సర్వజనాస్పత్రి రాత్రి 9.45 గంటల సమయంలో ఆరుబయట రోగుల బంధువులు నిద్రపోతుండగా... వారి మధ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. వారిలో నిండుగర్భిణీలు...పండు ముసలివారూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఉదయం వస్తేనే చూస్తామని నర్సులు చెప్పారనీ, అందువల్లే అంతదూరం వెళ్లి రాలేక ఆస్పత్రిలో ఆవరణలో నిద్రకు ఉపక్రమించినట్లు తెలిపారు. ఒకే బెడ్డుపై ఇద్దరు...ముగ్గురు అనంతపురం ఆస్పత్రిలోని కాన్సుల వార్డులో ఒక బెడ్డుపై ఇద్దరు ఉన్నారు. నెలలు నిండి, నొప్పులతో బాధపడుతున్న గర్భిణీలు వార్డుబయల వాకిట్లో కూర్చున్నారు. కొందరు కిందనే నిద్రపోయారు. ఇదేంటని నర్సులను ప్రశ్నిస్తే...‘బెడ్లు లేవు... రోజూ ఇంతే’ అన్న సమాధానం వినిపించింది. కాన్సుల వార్డును పరిశీలిస్తే అనంతపురం ఆస్పత్రి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. - రాత్రి 11.30 గంటల సమయంలో ఆర్థోపెడిక్వార్డులోని ఓ బెడ్డు వద్ద రోగి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. కూడేరు మండలం ముద్దలాపురానికి చెందిన అశోక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎమర్జెన్సీ నుంచి ఆర్థోపెడిక్వార్డుకు రెఫర్ చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా నర్సులు పట్టించుకోలేదు. - మొత్తమ్మీద ఈ ఆస్పత్రి పేరుకు 500 పడకల ఆస్పత్రి. కానీ సౌకర్యాల కల్పన మాత్రం దారుణంగా ఉన్నాయి. ఐపీలో(ఇన్‌పేషెంట్స్)రోజూ 800–900మంది దాకా ఉంటున్నారు. దీనికి అనుగుణంగా ఆస్పత్రి స్థాయిని పెంచాల్సి ఉంది. లేదంటే రోగులకు రోజూ నరకమే! 24 గంటల ఆస్పత్రులు మరీ దారుణం జిల్లాలో 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. కుందుర్పి ఆస్పత్రిలో 8.45 గంటలకు డాక్టరుతో పాటు సిబ్బంది కూడా ఇంటిబాట పట్టడంతో ఆస్పత్రి ఖాళీగా కనిపించింది. డాక్టర్లు ఆన్ కాల్ డ్యూటీ ద్వారా హాజరవుతారనుకున్నా... సిబ్బంది కూడా ఆయన బాటే పట్టారు. ఉరవకొండ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మినహా ఎవ్వరూ లేరు. కదిరి ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టరు లేరు. ఓ కాంపౌండర్, స్టాఫ్‌నర్సు మాత్రమే ఉన్నారు. దోమల బెదడ తీవ్రంగా ఉండటంతో రోగులు బెడ్లవద్ద మస్కిటో కాయిల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ఆత్మకూరు పీహెచ్‌సీల్లోనూ వైద్యులు జాడ కనిపించలేదు. కేవలం నర్సులు మాత్రమే ఉన్నారు. ఆత్మకూరులో అయితే నర్సులూ కనిపించలేదు. కనగానపల్లి పీహెచ్సీలో లైట్లు కాలిపోవడంతో రోగులు అంధకారంలో అల్లాడిపోయారు. శెట్టూరులో నర్సులంతా సాయంత్రం కాగానే ఇంటిదారిపట్టారు. ఆరా తీస్తే ఇళ్లవద్ద ఉంటూ ఏవైనా కేసులు వస్తేనే ఆస్పత్రికి వస్తారని తెలుస్తోంది. కేసులు వచ్చే సంగతి వారికి ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇక ధర్మవరం ఆస్పత్రిలో భువనేశ్వరి అనే స్టాఫ్ నర్సు మినహా ఎవ్వరూ కనిపించలేదు. రాయదుర్గంలో డాక్టర్ 8.30కు వచ్చి వెళ్లారు. నర్సులు మాత్రమే ఉన్నారు. గుంతకల్లులో రోగులు బెడ్షీట్లు లేకపోవడంతో ఇళ్లవద్ద నుంచి తెచ్చుకున్నారు. ఇలా మొత్తం జిల్లాలోని 42 ఆస్పత్రులను ‘సాక్షి’ పరిశీలించగా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ రాత్రి వేళ రోగులకు మెరుగైన వైద్యం అందినట్లు కనిపించలేదు. -
రాజధాని, శతాబ్దిలకు కొత్త సొబగులు
న్యూఢిల్లీ: రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై కొత్త అనుభూతి కలగనుంది. శుచి, శుభ్రతతో కూడిన భోజ నం, అత్యాధునిక మరుగు దొడ్లు, వేళకు ట్రైయిన్ తదితర అంశాలపై దృష్టిసారిస్తూ ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిం చాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇందుకు ‘ప్రాజెక్ట్ స్వర్ణ్’ పేరుతో వచ్చే సెప్టెంబర్ నుంచి 15 శతాబ్ది, 15 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మరింత విస్తృతంగా ప్రయాణికులకు సేవలు అందించాలని సంకల్పించింది. దీనికోసం రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేటరింగ్ చేసే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం, కోచ్‌లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందితో తగిన రక్షణను కల్పిం చనుంది. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం జాప్యం లేకుండా సాగేందుకు కచ్ఛితంగా రైళ్లు సమయపాలనను పాటిం చేలా చర్యలు తీసుకోనుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఎంపిక చేసుకున్న ప్రయా ణికులకు సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వంటి ఇతర సౌకర్యాలూ అందనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ముంబై, హౌరా, పట్నా, రాంచీ, భువనేశ్వర్‌లతో పాటు ఇతర మార్గాల మధ్య నడుస్తున్నాయి. శతాబ్ధి రైళ్లు హౌరా–పూరి, న్యూఢిల్లీ– చంఢీగఢ్, న్యూఢిల్లీ–కాన్పూర్, హౌరా– రాంచీతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి. -
బడిత బాజా
ఏలూరు (ఆర్ఆర్ పేట) : మౌలిక సదుపాయాల మాట లేదు. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి లేదు. వేసవి సెలవులు పూర్తవడంతో ఎప్పటిలా పాత సమస్యలతోనే సోమవారం బడులు తెరుచుకున్నాయి. ఇరుకు గదుల్లో దుమ్ము, ధూళి విద్యార్థులకు స్వాగతం పలికాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పలుచోట్ల బెంచీలు లేకపోవడంతో నేలబారు చదువులు తప్పని పరిస్థితి కనిపించింది. ఇటు సర్కారీ బడులతోపాటు అటు ప్రైవేట్ పాఠశాలల నిర్వా హకులు సైతం బడిత బాజా (మంచీచెడు అనే ఆలోచన లేకుండా) చందాన సావధానంగా బడి తలుపులు బార్లా తెరిచారు. దుమ్ము దులపలేదు.. నేలపై తప్పలేదు ప్రభుత్వ పాఠశాలల్లో పాత తరగతి నుంచి కొత్త తరగతి గదుల్లోకి విద్యార్థులు ఉత్సాహంగా తరలిరాగా సమస్యలు స్వాగతం పలి కాయి. చాలాచోట్ల తరగతి గదుల్లో దుమ్ము, ధూళిని దులపలేదు. బెంచీలన్నీ దుమ్ముకొట్టుకుపోయి దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక చిన్నారులు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. అక్కడక్కడా ఉపాధ్యాయులకూ ఇలాంటి పరిస్థితి తప్పలేదు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉండటంతో ఒకేచోట రెండు తరగతులు నిర్వహించడం కనిపించింది. తొలి రోజున అరకొరగానే విద్యార్థులు తరగతులకు హాజరుకాగా.. ఉపాధ్యాయులూ వారితో పోటీపడ్డారు. కొన్ని పాఠశాలల్లో శ్లాబులు పాడై వర్షం నీరు గదుల్లోకి చేరే పరిస్థితి కనిపించింది. పలుచోట్ల నూతన తరగతి గదులు నిర్మించినా ఫ్లోరింగ్, సున్నాలు వేయకపోవడంతో అక్కరకు రాలేదు. అరకొరగా పాఠ్య పుస్తకాలు జిల్లాలో 2,920 ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 520 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,930 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 3.20 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వారికి 14.74 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 8.70 లక్షల పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 40 శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరుకోవాల్సి ఉంది. తమకు పుస్తకాలు ఇస్తారో లేక బయట కొనుక్కోమంటారోననే ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతోంది. బదిలీల టెన్షన్ ఉపాధ్యాయులు బదిలీల టెన్షన్లో ఉండటంతో పాఠ్యాంశాల బోధనపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు రేషనలైజేషన్ ప్రకియ కొలిక్కి రాకపోవడంతో ఏ పాఠశాలలు ఉంటాయో.. ఏ పాఠశాలలో విలీనమవుతాయోననే ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. తాము పనిచేస్తున్న పాఠశాలను ఉంచుతారో మూసేస్తారో అనే దిగులు.. మూసేస్తే తమకు ఎక్కడ స్థానం కల్పిస్తారో అనే అనుమానం ఉపాధ్యాయుల్ని వెంటాడుతున్నాయి. హేతుబద్ధీ్దకరణలో భాగంగా జిల్లాలో 129 పాఠశాలలు మూతపడనున్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం, హేతుబద్ధీకరణ పూర్తయ్యాకే బదిలీలు చేయాల్సి ఉండటం బోధనపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ స్కూళ్లది మరో దారి పైకి హంగులు కనిపిస్తున్నా ప్రైవేట్ పాఠశాల్లోని పరిస్థితులు సైతం సర్కారు బడులతో పోటీ పడుతున్నాయి. బెంచీల సమస్య లేకపోయినా.. ఇరుకు గదుల సమస్య ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల్ని వెంటాడుతోంది. కనీసం ఆడుకునేందుకు స్థలం లేక.. భోజనం చేసేందుకు జాగా లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అధిక శాతం ప్రైవేట్ స్కూల్స్ నివాస గృహాల్లాంటి గదులు, అపార్ట్‌మెంట్స్‌లో కొనసాగుతున్నాయి. కనీసం సైకిల్ పార్క్ చేసుకునే సదుపాయం లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. వీటిలో ఫీజుల మోత మాత్రం భారీగా మోగుతోంది. జిల్లాలో 1,129 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 2.27 లక్షల మంది చదువుతున్నారు. వీరికి విరామ సమయంలో ఆడుకోవడానికి కనీసం క్రీడా ప్రాంగణాలు కూడా అందుబాటులో లేవు. -
దయనీయం.. సర్వజన వైద్యం!
జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యం.. దయనీయంగా మారుతోంది. వార్డుల్లో వైద్యులు ఎప్పుడొస్తారో తెలీదు! సిబ్బంది ఉన్నా... అక్కడి రోగులను పట్టించుకునే ఓపిక వారి ఉండదు. ఫలితంగా పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తున్న వారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరికి వారే సొంత ‘సేవలు’ చేసుకోవాల్సిన దుస్థితి నెలకుంది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన నారాయణరెడ్డి (80) గురువారం రాత్రి నుంచి మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఈయన్ను సర్వజనాస్పత్రికి తీసుకురాగా మేల్ సర్జికల్ వార్డులో చేర్చారు. ఈ వార్డులో పది మంది వరకు నర్సింగ్ విద్యార్థులు, నర్సులు ఉన్నా వార్డులోని ఓ గదికే పరిమితమయ్యారు. మూత్ర సమస్య కారణంగా నారాయణరెడ్డికి బ్లీడింగ్ మొదలైంది. స్పందించాల్సిన వైద్య సిబ్బంది అటుగా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. బెడ్ అంతా రక్తపు మరకలయ్యాయి. దీంతో కొడుకు హనుమంతరెడ్డి, కుమార్తె లక్ష్మీదేవి తమ తండ్రికి సపర్యలు చేయడం మొదలు పెట్టారు. చివరకు ఈ దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తుండగా అప్రమత్తమైన వైద్య సిబ్బంది హడావుడి చేశారు. ఇలాంటి దయనీయ దృశ్యాలు ‘పెద్దాస్పతి’లో కొకొల్లలుగా కన్పిస్తాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు రోగులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – అనంతపురం మెడికల్ -
సిబ్బంది జాస్తి.. సౌకర్యాలు నాస్తి
- అనంత పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువు - సిబ్బందికే కాదు.. ఎస్ఐలదీ అదే పరిస్థితి - రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుకుల మధ్య ఓ ఎస్ఐ ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఇందులో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్ఐలు, పదుల సంఖ్యలో ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పని చేస్తున్నారు. డీఎస్పీకి, ఓ ఎస్ఐకు మాత్రమే చిన్నపాటి గదులు ఉన్నాయి. మిగిలిన వారు కనీసం కుర్చీ వేసుకునేందుకు కూడా వీల్లేదు. అనేక మంది ఎస్ఐలు అవసరమైనప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రావడం, నిలబడే విధులు నిర్వహించి వెళ్లడం పరిపాటిగా మారింది. వాహనాలదీ అదే సమస్య. డీఎస్పీకి ఒక వాహనం, మిగిలిన ఎస్‌ఐలందరికీ మరో వాహనం ఉంది. ఒకరు వాహనం తీసుకుని వెళ్తే మిగిలిన వారు బైక్‌లపై వెళ్లి విధులు నిర్వర్తించాల్సిందే. మిగతా పోలీస్ స్టేషన్లలోనూ అదే పరిస్థితి. ఎస్ఐ స్థాయి అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక కానిస్టేబుల్, హోంగార్డుల గురించి చెప్పనక్కర లేదు. అనంతపురం సెంట్రల్ : అనంతుపరం పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలే కాదు.. అధికారులు, సిబ్బందికీ కనీస సౌకర్యాలు లేవు. ఎస్ఐలకు కూడా కనీస వసతరులు కల్పించకపోవడం విడ్డూరంగా ఉంది. అంతో ఇంతో వన్ టౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లు మినహాయిస్తే, మిగిలిన వాటిలో ఎస్ఐలకు చాంబర్లు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐదు మంది ఎస్ఐలు ఉన్నారు. ఒకప్పటి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో, ప్రస్తుతం పోలీసు స్టేషన్ నిర్వహిస్తున్నారు. ఏమాత్రం సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. నూతన భవనం పనులు ప్రారంభమైనా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అంతుబట్టడం లేదు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మరి దారుణం. పూరతన భవనంలో, ఇరుకు గదిలో ఇద్దరు ఎస్ఐలు పని చేస్తున్నారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ షెడ్‌ను ఎస్ఐ శుభ్రం చేసుకొని వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎండలకు అందులో కూర్చునేందుకు కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. చాంబర్ల కొరతతో పాటు మరుగుదొడ్ల సమస్య కూడా ఎక్కువుగా ఉంది. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో మరుగుదొడ్డి మాత్రమే ఉంది. అధికారులు, సిబ్బంది వాటినే వినియోగించుకుంటున్నారు. సమస్యలపై వచ్చే ప్రజలకు మాత్రం ఎక్కడా అనుమతుల్లేవు. దీంతో పరిసరాలను చూసుకోవాల్సి వస్తోంది. -
గొంతు ఎండుతున్న గొంతువారి పల్లె
-
గుక్కెడు నీళ్ల కోసం తెగింపు
-
ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
♦ అందుకు ఫెసిలిటేషన్ కౌన్సిల్, ‘హెల్త్ క్లినిక్’: కేటీఆర్ ♦ పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ‘రిచ్’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో రూ.100 కోట్లతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు కేంద్ర మంత్రితో చర్చించాం. సిరూపర్ పేపర్, ఏపీ రెయాన్స్ వంటి సంస్థల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. ఆయా శాఖల పద్దులపై విపక్షాల ప్రశ్నలకు గురువారం సభలో ఆయన సమాధానమిచ్చారు. మైనారిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేందుకు త్వరలో టీఎస్–ప్రైమ్ విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రంలో 30 కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల దాకా ఉన్నా అవి విద్యాపరమైన సంస్థలుగానే మిగిలి పోయాయి. ఈ నేపథ్యంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, కొత్త పారిశ్రామికీకరణ, సంపద సృష్టి, ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం రిచ్ అనే కొత్త విధానం తేనుంది’’ అని ప్రకటించారు. పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. జిల్లాల వారీగా వనరులను గుర్తించి, అందుకు తగ్గట్లు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీ ఇస్తాం. హైదరాబాద్‌లో ఉన్న 1,140 పై చిలుకు కాలుష్యకారక పరిశ్రమలను కాలుష్యరహిత ఏర్పాట్లతో దశలవారీగా శివార్లకు తరలిస్తాం. వాటి కార్మికులకు నివాస సదుపాయం కల్పిస్తాం. గతంలో పరిశ్రమలకు విచ్చలవిడిగా భూ కేటాయింపులు చేశారు. మేం అవసరాల మేరకే కేటాయిస్తున్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేయనందుకు 790 ఎకరాలను వెనక్కు తీసుకున్నాం. రామగుండంలో ఆటో పార్కును శనివారం 25న సీఎం ప్రారంభిస్తారు. మిర్యాలగూడలో మరో పార్కు వస్తుంది. బెజ్జంకిలో గ్రైనైడ్ క్లస్టర్ రానుంది. చేనేత పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రూ.1,200 కోట్ల కేటాయింపుల్లో రూ.400 కోట్లు చేనేత కోసమే ప్రత్యేకించాం. బతుకమ్మ, దసరా పండుగలకు పేదలకు చేనేత వస్త్రాల పంపిణీకి రూ.160 కోట్లు కేటాయించాం. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును ఏప్రిల్‌లో సీఎం ప్రారంభిస్తారు. వచ్చే సమావేశాల నాటికి అసెంబ్లీలో సభ్యుల డెస్కుల ముందు సభా వ్యవహారాలు తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు. -
పేరులో ప్రథమం.. సౌకర్యాలలో అధమం
ఎన్పీకుంట : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ప్రాంతం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో అధమంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడిది సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులకే కాకుండా తిమ్మమ్మ భక్తుల సైతం అసంతృప్తి చెందుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులతో పాటు తిమ్మమ్మ భక్తులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. అయితే తిమ్మమ్మ భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానాలు చేసేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళల ఇబ్బందులు వర్ణణాతీతం. తమ ఇంటిల్లిపాదీ భోజనం వండుకోవడానికి వంట గదుల లేకపోవడంతో చెట్లకిందే వంట చేసుకుంటున్నారు. తిమ్మమ్మమర్రిమాను దుకాణాలు ఉండే ప్రాంతంలో సిమెంటు రోడ్లు లేకపోవడంతో కొండల నుంచి వచ్చిన నీటితో నిల్వ ఉండి, మడుగుల్ని తలపిస్తుంటాయి. దీంతో పర్యాటకులు దుకాణాల వద్దకు రావడం లేదు. పర్యాటక శాఖ వారు విడిది గృహాన్ని నిర్మించి పదేళ్లయినా నేటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే విడిది గృహం తలుపులు తెరుచుకుంటాయి. దీంతో ఒకసారి వచ్చిన పర్యాటకులు మరోసారి రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మమర్రిమాను వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పర్యాటకులు కోరుతున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరో టెన్షన్
-
పదోతరగతి పరీక్షలు ప్రారంభం
-
కష్ట'పది'
-
తూర్పు మన్యంలో చిన్నారుల మృత్యుఘోష
-
సచివాలయ సందర్శకులకు తాగునీటి ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయానికి వెళ్తున్నారా? అయితే తాగడానికి సరిపడా మంచి నీటిని పట్టుకెళ్లండి. ఎందుకంటే అక్కడ ప్రధాన గేటు నుంచి మొదలుకుని మంత్రుల పేషీల వరకు ఎక్కడా తాగునీటి సౌకర్యం లేదు. ప్రతి రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రాజధానిలోని సచివాలయానికి వస్తుంటారు. అలా వచ్చిన వారికి దాహం తీర్చుకోవడానికి ఎక్కడా నీటి సదుపాయం లేదు. గుక్కెడు నీళ్లు తాగడానికి ఏదైనా విభాగానికి వెళ్లి అడిగి మరీ దాహం తీర్చుకోవాలి. గతంలో డీ బ్లాక్ పార్కింగ్ స్థలంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా, అది పని చేయడం మానేసి ఏళ్లు గడుస్తోంది. మంత్రులు, అధికారుల పేషీల ముందు కూడా వాటర్ డిస్పెన్సర్లు లేవు. ఎండాకాలం సమీపిస్తున్నందున ఇప్పటికైనా తాగునీటి సదుపాయం కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలి మాస్‌కాపీయింగ్ నిరోధానికి చర్యలు : డీఈవో లింగయ్య ఆదిలాబాద్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య చీఫ్ సూపరిటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణపై శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాల్లో అసౌకర్యాలు గురికాకుండా అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రం లోకి అధికారులు, విద్యార్థులకు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ వద్దని తెలిపారు. మార్చి 14 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 10,410 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 9,752 మంది, ప్రైవేటు విద్యార్థులు 658 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. విద్యాశాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఉప విద్యాధికారి శాంరావు పాల్గొన్నారు. -
సినిమా చూపిస్తున్నారు !
• కొత్త బొమ్మ పడిందంటే ధరల మోత • పండగల సమయాల్లో అధికంగా వసూళ్లు • అటకెక్కిన ఆకస్మిక తనిఖీలు.. • కనిపించని కనీస సౌకర్యాలు మహబూబ్‌నగర్ క్రైం : ఏదో కాలక్షేపం కోసం సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తే అధిక ధరలతో సమస్యల సినిమా చూపిస్తున్నారు. అంతమొత్తం చెల్లించి లోపలికి వెళ్లినా చెమటలు కక్కాల్సిందే.. విశ్రాంతి సమయంలో ఏమైనా తినాలన్నా.. తాగాలన్నా అక్కడ ఉన్న ధరలతో కళ్లు తిరుగుతున్నాయి. వాహనం తీసుకెళ్తే జేబు గుల్ల అవుతుంది. ఇక మరుగుదొడ్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే రీతిలో అధ్వానంగా ఉన్నాయి. థియేటర్లోకి వెళ్లి అలా కూర్చున్నామో లేదో కాళ్ల పక్కనే ఆటలాడే మూషికాలు.. చిరిగిన.. విరిగినా సీట్లు.. సినిమా చూడటం దేవుడెరుగు ఎప్పుడు బయట పడుదామోనన్న పరిస్థితి నెలకొంది. ఇదీ జిల్లాలో సగానికి పైగా థియేటర్ల పరిస్థితి. మరి ఇదంతా జరుగుతుదంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఆకస్మిక తనిఖీలు ఎక్కడ జరుగుతున్నట్లు? ధరల నియంత్రణ ఎక్కడ అమలవుతున్నట్లో అధికారులకే తెలియాలి. అధిక ధరలకు టికెట్ల విక్రయాలు ప్రస్తుతం సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహకులు వారి వ్యాపారం పెంచుకోవడం కోసం టిక్కెట్ల ధరలతో పాటు పార్కింగ్, క్యాంటిన్ ధరలు అమాంతంగా పెంచారు. ముఖ్యంగా టిక్కెట్ల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. టిక్కెట్‌పై రూ.70వేసి ప్రత్యేకంగా స్టాంప్‌తో రూ.100 ముద్ర వేసి ప్రేక్షకులతో 100 తీసుకుంటున్నారు. నిత్యం లక్షల్లో జనాల నుంచి నిర్వాహకులు దోచుకుంటున్నారు. కనిపించని కనీస సౌకర్యాలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో 50వరకు థియేటర్లున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే ఏడు థియేటర్లు ఉన్నాయి. అన్నిచోట్ల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తుండగా.. సౌకర్యాలు మాత్రం కరువైంది. రెవెన్యూ అధికారులు మాత్రం థియేటర్ల అనుమతికి సంబంధించి 5 విభాగాలు నిరభ్యంతర పత్రం అందిస్తుండటంతో వాటికి అనుగుణంగా రెన్యువల్ చేస్తున్నాం. అధిక ధరలను నియంత్రించేందుకు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అవి కన్పించడం లేదు. అనుమతులు ‘మామూలే’.. ప్రతి థియేటర్‌ను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. ఫిల్మ్ ఛాంబర్, ట్రాన్స్‌కో, ఆర్అండ్బీ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తీసుకొస్తే రెవెన్యూ శాఖ థియేటర్లను నడుపుకునేందుకు అనుమతినిస్తుంది. కానీ అ నుమతుల్లో మాముళ్లదే పైచేయిగా మారుతోంది. క నీస సౌకర్యాలు లేకున్నా అనుమతులిచేస్తున్నారు. భ వన సామరŠాథ్యన్ని తెలుపుతూ ఆర్అండ్బీ అ భ్యంతరం లేదని ధృవీకరించాలి. అలాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయం టూ ట్రాన్స్‌కో, ఎలాంటి అగ్నిమాపక శాఖ, సినిమా ప్రదర్శించే తెరకు సంబంధించి ఫిల్మ్‌ఛాంబర్ అ భ్యంతరం లేదని ధ్రువీకరిస్తే రెవెన్యూ శాఖ అనుమతి ని రెన్యువల్ చేస్తుంది. ఆచరణలో మాత్రం చేయి తడిపారంటే అనుమతి ఇచ్చేస్తున్నారు. ఇక అధికారుల ఆకస్మిక తనిఖీ అటకెక్కింది. జేబులు ఖాళీ.. కుటుంబంలో భార్య, భర్త ఇద్దరు పిల్లలతో సినిమాకు వెళితే పచ్చనోటు కూడా సరిపోవడం లేదు. విశ్రాంత సమయంలో క్యాంటిన్లో టీ, బిస్కెట్లు, సమోసాలు, శీతలపానియాలు కొనుగోలు చేస్తే బయట లభిస్తున్న ధరలకు ఐదురేట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. బిల్లు ఉండదు. వారి నోటికి ఎంతొస్తే అంత చెప్పడం.. ప్రేక్షకులు విధిలేక చెల్లించడం జరుగుతోంది. మరి కొత్త సినిమాలు విడుదల అవుతున్న సమయంలో మరింత దోపిడీ జరుగుతోంది. అదేవిధంగా థియేటర్లలో సైకిల్‌కు రూ.15, బైక్, కారు, ఆటోలకు రూ.30వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పోనీ వాహనాలకు భద్రత ఉందా అంటే అది లేదు. పార్కింగ్ రుసుంలో పేరిట ఇచ్చే రసీదులో ఎవరి సామాన్లలకు వారే బాధ్యులే అని ఉంటుంది. -
కర్నూలులో రైల్వే డీఆర్ఎం తనిఖీలు
కర్నూలు(రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం అరుణా సింగ్...బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. మొదటి ప్లాట్ ఫాంతోపాటు రెండు, మూడవ ప్లాట్ ఫాంలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తాగునీరు. శుభ్రత, డ్రెయినేజి వ్యవస్థ, సౌకర్యాలను తనిఖీ చేశారు. రెండో ప్లాట్ ఫాంలోని కుర్చీలు, ఫ్యాన్లు తదితరాలను పరిశీలించారు. ఎస్కలేటర్ల పనితీరు, ప్లాట్‌ఫాం ట్రాకులను సైతం చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌తోపాటు ఆవరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఏదైనా అసౌకర్యాలు ఏర్పడితే సహించబోమన్నారు. ఆమె వెంట కర్నూలు స్టేషన్ మేనేజరు మక్బూల్ హుసేన్, బుకింగ్ సూపర్వైజర్లు మెయిన్, మునీర్, రమాదేవి, టికెట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
జైళ్లలో గర్భిణులకు సౌకర్యాలు లేవు!
►వైద్య సదుపాయాలు, ప్రసవ ఏర్పాట్లూ లేనే లేవు ►హైకోర్టుకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ నివేదిక ►ఆ నివేదికను బట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయండి ►సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయండి ►ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ మహిళా ఖైదీ లు, వారి పిల్లలు, గర్భిణులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నివేదించారు. అత్యధిక శాతం జైళ్లలో వైద్య సదుపాయాలు లేవని, రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు కూడా లేరని, చాలా చోట్ల ఈ పోస్టు ఖాళీగా ఉందన్నారు. జైళ్లలో ఉన్న గర్భిణులను చెకప్‌లు, ప్రసవా ల నిమిత్తం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతు న్నారని, ఏ జైలులో కూడా ప్రసవ ఏర్పాట్లు లేవని వివరించారు. పుట్టి న పిల్లలను తల్లితోనే ఉండేందుకు అను మతినిస్తున్న జైలు అధికారులు, ఆ పిల్లలకు వాతావరణ పరిస్థి తులకు తగినట్లుగా దుస్తుల సౌకర్యం కల్పించడం లేదన్నారు. అత్యధిక జైళ్లలో అంతర్గత విద్య, వినోద ఏర్పాట్లు లేవని తెలిపారు. ‘రాష్ట్రంలోని జైళ్లలో నలుగురు గర్భిణులు, తల్లులతో పాటు 35 మంది పిల్లలు ఉన్నారు. చాలా జైళ్లలో పిల్లలకు వండిపెట్టేందుకు ఏర్పాట్లేవీ లేవు. పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో జైళ్లలో ఎటువంటి రికార్డులను నిర్వహించ డం లేదు. దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో వాక్సిన్లు వేస్తున్నారు. ఖైదీలకు దూరంగా పిల్లలు ఉండేందుకు అత్యధిక జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో మానసిక వైకల్యంతో బాధప డుతున్న 112 మంది ఉన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం మినహా మిగిలిన జైళ్లలో ఎక్కడా మానసిక వైకల్యంతో బాధపడు తున్న వారికి ప్రత్యేక వసతి ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని అన్నిజిల్లాల న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శులు 4 కేంద్ర కారా గారాలను, ఒక ఓపెన్ ఎయిర్ జైల్, 3 ప్రత్యేక మహిళా జైళ్లు, 8 జిల్లా జైళ్లు, 4 స్పెషల్ సబ్‌జైళ్లు, 66 సబ్‌జైళ్లు సందర్శిం చారు. వారి వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాం’ అని సభ్య కార్యదర్శి తన నివేదికలో పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి కూడా ఓ నివేదికను సమర్పించారు. గురువారం ఈ నివేదికల్ని న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఈ నివేదికలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరి శీలన చేసి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలతో నివేదికలు సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బాల నేరస్తులు, మహిళా ఖైదీల హక్కుల కోసం రాష్ట్రాలేం చర్యలు తీసుకుంటు న్నాయో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల్ని∙గతం లో నివేదికలు కోరిన విషయం తెలిసిందే. -
విశాఖ ఏయూలో చిల్లర దొరక్క విద్యార్థుల పాట్లు
-
బాల్యం..బందీ!
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ చదువులు కనీస సౌకర్యాలూ కరువే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం - ఇక్కడ కనిపిస్తున్న అంగన్వాడీ కేంద్రం కొత్తచెరువులోని బసవన్నకట్ట సమీపంలో ఉంది. ఒకటే గది. అందులో పదుల సంఖ్యలో చిన్నారులు. ఇంటికున్న పెంకులు ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. గత్యంతరం లేక చిన్నారులు చదువుకొనసాగిస్తున్నారు. అధికారులు కనీసం తనిఖీ చేసిన దాఖలాలు లేవు. - ఇది తాడిపత్రిలోని ఓ అంగన్వాడీ కేంద్రం. అద్దె గదిలో కొనసాగుతోంది. కేంద్రానికి వచ్చే చిన్నారులంతా ఇదిగో ఇలా ఇరుకుగా కూర్చోవాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఉన్న కేంద్రంలో పిల్లలు ఎలా ఆడుకోగలరో.. ఎలా చదువుకోగలరో పాలకులే గుర్తించాలి. అనంతపురం టౌన్ : బుడిబుడి అడుగులు... ముద్దుముద్దు మాటలతో అక్షరాలు నేర్చుకునేందుకు వచ్చే చిన్నారులకు అసౌకర్యాల నడుమ కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు శాపాలుగా మారుతున్నాయి. ఇరుకైన అద్దె గదులు..అపరిశుభ్ర వాతావరణంలో బాల్యం బందీ అవుతోంది. అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యానికి చిన్నారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఐసీడీఎస్ పరిధిలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కేంద్రాలు 4,286, మినీ కేంద్రాలు 8,40 ఉన్నాయి. వీటిలో 1,170 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 3,110 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా మిగిలిన కేంద్రాలు వివిధ పాఠశాలల, సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం ఇదీ..: కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏటా వీటి నిర్వహణకు రూ. కోట్లు కేటాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రానికీ అన్ని సౌకర్యాలు కలిగిన సొంత భవనం ఉండాలి. అది లేకపోతే కనీసం మూడు గదులు ఉండే భవనాన్ని అద్దెకు తీసుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో అంగన్వాడీ కేంద్రం కనీసం 500 నుంచి 600 గజాల విస్తీర్ణంతో విశాలంగా పిల్లలు ఆడుకునే విధంగా ఉండాలని నిబంధనలు ఉన్నా అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. మౌలిక సదుపాయాలపై సమీక్షలేవీ? ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు ఉంటే చిన్నారులు ఉత్సాహంగా పాఠాలు వింటారు. కానీ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. గాలి, వెలుతురు సరిగా ఉండడం లేదు. కేంద్రాలకు వచ్చే సరుకులు, ఆట వస్తువులు, వంటావార్పు అన్నీ ఒకే గదిలో చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు పెచ్చులూడుతాయో తెలియని పరిస్థితుల్లో విద్యాబోధన సాగుతోంది. మరుగుదొడ్లు అస్సలు కనిపించవు. వసతుల విషయంలో కనీసం అధికారులు సమీక్షలు కూడా చేయని దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.750, పట్టణ ప్రాంతాల్లోని వాటికి రూ.3 వేలు నెలసరి అద్దె ఇస్తుండగా ఆ నిధులతో అన్ని వసతులతో కూడిన కేంద్రాలు దొరకడం కష్టంగా మారుతోందని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. నిర్మాణాలు కొనసాగుతున్నాయి : జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేని మాట వాస్తవమే. ప్రస్తుతం వివిధ పథకాల కింద 1200 వరకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. -
నోట్ల రద్దుతో పాడిరైతులకు కష్టాలు
-
ఫ్యాన్లు తిరగవు.. లైట్లు వెలగవు!
– ఎంఎం వార్డులో రోగుల అవస్థలు – మరుగుదొడ్ల శుభ్రతా నామమాత్రమే – ఫిర్యాదుచేసినా పట్టించుకోని అధికారులు - ఇదీ సర్వజనాస్పత్రి దుస్థితి అనంతపురం మెడికల్ : పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల అవస్థలు వర్ణణాతీతం. ఫ్యాన్లు తిరక్క.. లైట్లు వెలగక రాత్రి వేళ చీకట్లోనే గడపాల్సిన దుస్థితి. ఎంఎం (మేల్ మెడిసిన్) వార్డులో నెల రోజులుగా ఈ పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ సుమారు 85 మంది వరకు రోగులు వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. వార్డులోని మొదటి గదిలో ఐదు లైట్లు, మూడు ఫ్యాన్లు, రెండో గదిలో ఏడు లైట్లు, మూడో గదిలో ఒక లైట్, నాలుగో గదిలో ఒక లైట్, ఆరు ఫ్యాన్లు కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దీంతో రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి అయితే గదుల్లో చీకటి నెలకొంటోంది. ఇక్కడి పరిస్థితిని వార్డు డ్యూటీల్లో ఉన్న సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేశారు. అయినా వారిలో చలనం లేదు. పైగా వార్డులో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. నర్సింగ్ విద్యార్థులు మధ్యాహ్నానికే వెళ్లిపోతుండడంతో స్టాఫ్ నర్సులపై పనిభారం పడుతోంది. అందుబాటులో లేని ఎంఎన్ఓ జ్వరాలు, గుండె సంబంధిత వ్యాధులు, ఇతరత్రా జబ్బులతో ఇక్కడికొచ్చే వారికి స్కానింగ్, పరీక్షలు చేయాల్సి వస్తే అంతే. ఒక ఎంఎన్ఓను కేటాయించగా సమయానికి ఆయనా అందుబాటులో ఉండని పరిస్థితి. ఇక పరిశుభ్రత కూడా నామమాత్రంగా ఉంది. వార్డుల్లోని మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయి. రోజూ మూడు సార్లు శుభ్రం చేయాల్సి ఉన్నా మధ్యాహ్నం మాత్రమే శుభ్రం చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. వ్యర్థ పదార్థాలను వేయడానికి వార్డు బయట ప్రత్యేక బిన్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్ని మాత్రమే దర్శనమిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నాలుగు రకాల బిన్స్ ఉండాలి. వాటిలో సూది మందులు, ఆహార పదార్థలు, జీవ వ్యర్థాలు వంటికి వేరుచేసి వేయాలి. కానీ ఎలా పడితే అలా పడేస్తున్నారు. నీడిల్స్ కిందే పడి ఉండడంతో చిన్న పిల్లలు దాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక రాత్రి వేళ దోమల బెడద కూడా ఎక్కువగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాత్రయితే చీకటే నాది కర్నూలు జిల్లా జొన్నగిరి. మలేరియా రావడంతో ఇక్కడే చికిత్స తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా వార్డులో లైట్లు వెలగడం లేదు. రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉన్నాయి. రోగం నయం అవుతుందో లేదో తెలీదు కానీ కొత్త రోగాలొస్తాయేమోనని భయంగా ఉంది. - : స్వామినాయక్ బాత్రూంలు కంపు కొడుతున్నాయ్ నాది శింగనమల మండలం మదిరేపల్లి. గుండెనొప్పిగా ఉండడంతో పది రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. ఉదయాన్నే బాత్రూంకు వెళ్లాలంటే కంపుకొడుతోంది. శుభ్రం చేయడం లేదు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - : వెంకటనాయుడు -
సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : బయోమెట్రిక్ పద్ధతి అమలుకన్నా ముందు హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఉదయం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వార్డన్ల సమావేశాన్ని వీరు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనేక హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్య బలహీనపడుతోందన్నారు. వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదని, వంట మనుషులపై ఆధారపడుతున్నారన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేదే లేదని స్పష్టం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు బయటకి పంపారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం బండి పరుశురాం, ఏఐఎస్ఎఫ్ జాన్సన్, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం సాకే నరేష్, శివ, సురేష్, అనిల్, మధు, రాఘవ, భార్గవ్, రితేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దు రైతు గుండెల్లో రైళ్లు
-
ఆ కస్టమర్లకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ లో దిగ్గజ బ్యాంకులు ఖాతాదారులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ హోంలోన్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు మరో ఆఫర్ ప్రకకటించింది. సాలరీడ్ కస్టమర్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ , టర్మ్ లోను పేరుతో రెండు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ అవసరాల కోసం టర్మ్ లోన్, పెళ్లి, విద్య, వైద్యఖర్చులు, విదేశీ ప్రయాణం తదితర వ్యక్తిగత అత్యవసర ఖర్చులు నిమిత్తం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా ఆఫర్ లో ఖాతాదారులు ఆస్తుల తనఖా ద్వారా 5 లక్షలనుంచి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. మొత్తం అమౌంట్ లో కనీసం 10 శాతం టర్మ్ లోనుగాను, గరిష్టంగా 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ లో అయితే రుణం తీసుకున్న సొమ్ము, రోజులు ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రివర్స్ స్వీప్ సౌకర్యం కూడా అందుబాటులోఉందని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అందుబాటులో వున్న అదనపు నిధులను ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలోకి జమచేయనున్నట్టు పేర్కొంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉద్యోగస్తుని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు. అంతేకాదు చాలాసులువుగా వీటిని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో వారు వాడుతున్న ఖాతానుంచే అవసరమైన సందర్భాల్లో కావాల్సిన సొమ్మును స్వీకరించవచ్చన్నమాట. అలాగే తమ దగ్గర హోం లోన్ లేని ఉద్యోగులు ముఖ్యంగా కార్పొరేట్ రుణగ్రహీతలు కావాలంటే.. తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని కూడా సూచించింది. -
నిర్వేదం
–దుస్థితిలో ఆయుర్వేద ఆస్పత్రులు – 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేని వైనం – ఇప్పటికే ఆరు మూత ఆయుర్వేదానికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మన ప్రాచీన వైద్యవిధానం కావడంతో పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా నిర్వహించింది. ఇంతవరకు బాగానే ఉన్నా..జిల్లాలోని ఆయుర్వేద ఆస్పత్రుల పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోంది. వైద్యులు, సిబ్బంది లేకపోవడం, మందుల కొరత తదితర కారణాలతో మూతపడుతున్నాయి. అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 50 ఆయుర్వేద డిస్పెన్సరీలు(ఆస్పత్రులు) ఉన్నాయి. రెగ్యులర్ కింద 28, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద 22 నడుస్తున్నాయి. వీటిలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, ఎస్ఎన్ఓలు ఉండాలి. అయితే.. ఏ ఆస్పత్రిలోనూ తగినంత మంది సిబ్బంది లేరు. 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బూదిలి, గడేహోతూరు, హావళిగి, నరసింగయ్యగారిపల్లి, పుట్లూరు, విడపనకల్లు, కోడూరు, అచ్చంపేట, ముదిగుబ్బ, రొళ్ల, సొమందేపల్లి, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, నాగసముద్రం గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, యల్లనూరు, ఎర్రగుంట డిస్పెన్సరీలను మెడికల్ ఆఫీసర్ లేకుండానే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేని కారణంగా అగళి, బొమ్మనహాళ్, తాడిమర్రి, శంకరగల్, అమరాపురం, మోరుబాగల్ వైద్యశాలలు మూతపడ్డాయి. భరోసా లేని బతుకులు రెగ్యులర్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు సక్రమంగా వస్తున్నా.. ఎన్ఆర్హెచ్ఎం కింద పని చేస్తున్న వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏటా రెన్యూవల్ కోసం పోరాడాల్సిన దుస్థితి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసినా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. రెన్యూవల్ కాకపోవడంతో ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. మందుల సరఫరాకు బ్రేక్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫార్మసీ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో మందుల సరఫరాకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అరకొరగా వస్తున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నెలకు 1,200 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. అనంతపురంలోని ఆస్పత్రికి రోజూ 60 మంది వరకు వస్తున్నారు. అయితే.. వీటిలో చాలా మందులు అందుబాటులో లేవు. నొప్పులకు వాడే యోగరాజ గుగ్గులు, కాంచనార గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, సింహనాద గుగ్గులు, డయాబెటీస్‌కు వాడే నిసామలకి, బీపీ బాధితులకు ఇచ్చే సర్పగంధతో పాటు జలుబు, కంటి, చెవి సమస్యలు వస్తే వేసే డ్రాప్స్ కూడా లేవు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అటు ప్రజాప్రతినిధులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. -
సెన్సార్ చిక్కుల్లో ఇక సె..లవ్ చిత్రం
-
పరిశ్రమల స్థాపనకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం
కాకినాడ కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : కొత్తగా పరిశ్రమలు స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు రుణాలు మంజూరుకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం ఈ నెల 21, 22 తేదీల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం సాయంత్రం జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో సింగిల్‌విండో ఆమోదంలో పెండింగ్ సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను ఆయన సమీక్షించారు. ఆరు ఎస్సీ, ఎస్టీ కేసులకు వాహనాల రుణాల రాయితీలను ఆమోదించారు. మూడు సాధారణ పరిశ్రమలకు సబ్సిడీలు మంజూరు చేశారు. పరిశ్రమల శాఖ డీడీ డేవిడ్ సుందర్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పరిశ్రమల్లో 243 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు. ఏడు పరిశ్రమలు భూ కేటాయింపులు దరఖాస్తు చేయగా వాటిని పరిశీలించి త్వరగా మంజూరు ఇవ్వాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎస్వీ పటేల్, డీడీ సిహెచ్ గణపతి, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ
ముంబై: దేశీయ రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో... వ్యవసాయ రుణాల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు రుణాలను వేగవంతంగా పంపిణీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. ఆదాయం పెరగడం అనేది సరైన మూలధన పెట్టుబడులపైనే ఆధారపడి ఉం టుందని ఆర్బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్యాంక్‌లు, లీడ్బ్యాంకులకు జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో భాగంగా బ్యాంకులు సాగు రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరింది. అవసరమైన చోట ప్రక్రియను సులభంగా మార్చడంతోపాటు నిర్ణీత గడువులోపల రుణాలను మంజూరు చేయాలని నిర్దేశించింది. పేపర్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫోటోలు మాత్రమే..! మొండిబకాయిలు పెరిగిపోతుండడం, ‘నేమ్ అండ్ షేమ్’ పాలసీలో భాగంగా బ్యాం కులు ఎగవేతదారుల ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురించడానికి చర్యలు తీసుకుంటుండడం వంటి పరిణామాల నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేవలం ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోలు మాత్రమే పేపర్లలో ప్రచురించే చర్యలు చేపట్టాలని సూచించింది. రుణం చెల్లింపులో డిఫాల్ట్ అయినంత మాత్రాన విచక్షణా రహితంగా అందరి ఫొటోలూ పేపర్లలో ప్రచురించనక్కర్లేదని సూచించింది. దీనిని చాలా సున్నిత అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది. -
వసతులు లేని పాఠశాలల గుర్తింపు
పూర్తయిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే పాఠశాలల స్థితిగతులు ఇక ఆన్లైన్లోనే.. వసతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలకు ఆదేశం? వీణవంక : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్థితిగతులపై ఇటీవల విద్యాశాఖ ప్రారంభించిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే (జీఐఎస్)జిల్లావ్యాప్తంగా పూర్తయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని వసతుల వివరాలను వేర్వేరుగా ఆన్లైన్లో నమోదు చేశారు. గత ఏప్రిల్‌లో ప్రారంభమైన జీఐఎస్ సర్వే.. జిల్లాలోని 3102 ప్రభుత్వ, 600 ప్రైవేటు పాఠశాలలో కొనసాగింది. ఆ వివరాలు సేకరించి ప్రత్యేక సాఫ్ట్వేర్ కలిగిన మోబైల్ ద్వారా ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేశారు. పాఠశాలలో కనీస వసతులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకునేందుకు విద్యాశాఖ జీఐఎస్ సర్వే ద్వారా ఆన్లైన్లో పొందుపర్చింది. వసతులు లేని కొన్ని ప్రైవేటు పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలో ఆ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 30 శాతం వరకు మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైందని సమాచారం. ఆన్లైన్లో నమోదు ఇలా జిల్లాలో కేజీబీ, ఉన్నత పాఠశాలలు 721, ప్రాథమికోన్నత పాఠశాలలు 339, ప్రాథమిక పాఠశాలలు 1995, మోడల్ స్కూల్లు 47, ప్రైవేటు పాఠశాలలు 600వరకు ఉన్నాయి. జీఐఎస్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ కలిగిన మోబైల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఆ మోబైల్ ద్వారా పాఠశాల భవనం, మంచినీటివసతి, మరుగుదొడ్లు, కరెంట్ సౌకర్యం, సైన్స్‌ల్యాబ్, మూత్రశాలలు, ప్రహరీ, క్రీడామైదానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మోబైల్ ద్వారా ఫొటోలు తీసి వేర్వేరుగా గూగుల్స్కు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఏయే పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయో.. విద్యాశాఖ ఆన్లైన్లో గుర్తిస్తుంది. అలాగే మానిటరింగ్ చేసేటప్పుడు ఈ ఆన్‌లైన్‌తో సులభంగా తనిఖీ చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. వసతులు లేని పాఠశాలల గుర్తింపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో కనీస వసతులు లేని పాఠశాలలను జీఐఎస్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో ప్రహరీ, మూత్రశాలలు, క్రీడామైదానం లేవని సర్వేలో తేలినట్లు సమాచారం. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా.. వసతులు కల్పనలో వెనుకంజ వేయడం విమర్శలు తావిస్తోంది. కొన్ని పాఠశాలలో కనీసం ప్రేయర్ చేయడానికీ స్థలం లేదని నిర్ధరణ కావడం యాజమాన్యాల దోపిడీకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీఐఎస్ ద్వారా సర్వే చేసిన విద్యాశాఖ అధికారులు వసతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
మర్రిగూడ : కస్తూర్భా పాఠశాలలో మౌలిక వసతులు కలిపించకపోవడంతో పాఠశాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఎంపీపీ అనంతరాజుగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నుంచి∙పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక విద్యార్థినులు ఆరుబయటికి పోతున్నారన్నారు. పాలు ప్యాకెట్లు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. మెను ప్రకారం భోజనం అందక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల నిర్వాహణను మెరుగు పర్చాలని కోరారు. ఆయనlవెంట ఎంఈఓ ఎం.సుధాకర్ ఉన్నారు. -
మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం
ఖమ్మం జెడ్పీసెంటర్ : ఖమ్మం నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని 16వ డివిజన్లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, సైడ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ కమర్తపు మురళి, కమిషనర్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యార్థులు జాస్తీ.. వసతి నాస్తి
– జేఎన్టీయూలో హాస్టల్ సదుపాయం లేక ఇక్కట్లు – అమ్మాయిలకు రెండు హాస్టల్స్ పరిమితం – ఓటీఆర్‌ఐలో ఫార్మసీ విద్యార్థులకు హాస్టల్ లేని వైనం జేఎన్టీయూ : వర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్ కొరత, తగిన ∙మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇక్కట్లుకు గురవుతున్నారు. ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు సగం మందికి వసతి లేక వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. ఉన్న వాటిలో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. భోజనం ఇక్కడ .. వసతి బయట: జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో ఆరు బ్రాంచుల్లో నాలుగు సంవత్సరాల విద్యార్థులు కలిపి 1440 మంది చదువుతున్నారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంది. కానీ ఎంటెక్ 22 బ్రాంచుల్లో 697 మంది అభ్యసిస్తున్నారు. వీరిలో 400 మంది విద్యార్థులకు హాస్టల్ కొరత ఉంది. హాస్టల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ అందుతుంది. దీంతో ఈ 400 మంది విద్యార్థులకు హాస్టల్లో భోజనం అందుబాటులో తెచ్చారు. కానీ వసతిలేక బయట ఉండాల్సిన దుస్థితి . బయట అద్దె అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి అందుతున్న స్కాలర్షిప్ ఏ మాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఓటీపీఆర్‌ఐలో హాస్టళ్లు లేవు.. ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్, ఫార్మసీ ఇనిస్టిట్యూట్ జేఎన్టీయూ అనంతపురంలో ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంటెక్ సుటిక్స్, కెమిస్ట్రీలో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. నాలుగు బ్రాంచులకు కలిపి కేవలం 14 ఎంఫార్మసీ సీట్లు భర్తీ కావడానికి కారణం హాస్టల్ వసతి లేకపోవడమేనని తెలుస్తోంది. ––––––––––––––––––––––––– హాస్టళ్లు పెంచాలని ప్రతిపాదన పంపాం ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపాం. లేపాక్షి పక్కన మరో నూతన భవనం నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ కొరత తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నాం. –డాక్టర్ శివకుమార్, హాస్టల్ మేనేజర్. -
శ్రీమఠం..నీటి కష్టం
– పుణ్యస్నానాలకు నీరు కొరత – మూతపడిన మరుగుదొడ్లు – భక్తులకు తప్పని ఇబ్బందులు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఆదివారం.. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు, కాలకత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నీరు లేక మరుగుదొడ్లు మూతపడడంతో మహిళా భక్తులు నరకయాతన అనుభవించారు. క్షేత్రంలోని నదీతీరాన రెండు సులభ్ కాంప్లెక్స్‌లు, రంగసభాంగన లాక్ రూమ్‌లో స్త్రీ, పురుషుల మరుగుదొడ్లు, శ్రీమఠం ప్రధాన ద్వారంలోని మరుగుదొడ్ల సముదాయాలు నిర్మించారు. ఆదివారం సెలవు కావడంతో వేలాదిగా భక్తులు శ్రీమఠానికి తరలివచ్చారు. నీటి సాకుతో మరుగుదొడ్లు మూత పడడంతో వేలాది మంది భక్తులు కష్టాలు ఎదుర్కొన్నారు. పుణ్యస్నానం దూరం.. వర్షాభావంతో తుంగభద్ర నదిలో నీరు అడుగంటింది. ఆరాధనోత్సవాలు దష్టిలో ఉంచుకుని శ్రీమఠం అధికారులు నదీతీరాన షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత దీనిని పట్టించుకోలేదు. భక్తులు రాళ్లలో రప్పలు దాటుకుని దూరంలో ఉన్న నది మడుగుల్లో మునకలు సాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వద్ధులు మాత్రం సుదూరం పోలేకపోతున్నారు. అధికారులు కనీసం షవర్బాత్కు నీరు వదిలితే వేలాది మంది భక్తులు సంతోషిస్తారు. కనికరించాలి : పుల్లమ్మ, కషాపురం వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నదిలో నీళ్లు లేక స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. శ్రీమఠం అధికారులు షవర్బాత్కు నీరు వదలడం లేదు. కారణంగా భక్తుల పుణ్యస్నానాలకు కష్టమైంది. మఠం అధికారులు కనికరిస్తే బాగుండు. ఇదేమి చోద్యం : విశ్వామిత్ర, గుల్బర్గా కాలకత్యాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంతగా భక్తులు బాధ పడుతున్నా శ్రీమఠం అధికారులు చోద్యం చూడటం శోచనీయం. పేరుగాంచిన క్షేత్రంలో నీటి కొరత కారణంగా శౌచాలయాలు మూతవేశారంటే సిగ్గుగా ఉంది. ఇకనైనా మఠం అధికారులు మేల్కోవాలి. -
హాస్టల్ ‘బెస్ట్’.. వసతుల్లో వేస్ట్!
అస్తవ్యస్తంగా సెయింట్ జోసఫ్ హైస్కూల్ బెస్ట్ అవలెబుల్ హాస్టల్ అవస్థలు పడుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్(ఇంగ్లిష్ మీడియం)లోని బెస్ట్ అవలెబుల్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని నిరుపేదఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. చదువుతో పాటు హాస్టల్ సదుపాయం సైతం స్కూల్ యాజమాన్యమే సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా శాఖల ద్వారా మెస్ చార్జీల కోసం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.18 వేల నుంచి రూ.21 వేల చొప్పున పాఠశాలకు అందుతోంది. కాగా, నిధులు సక్రమంగా అందుతున్నా హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేదు. దీనిపై విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా నిర్వాహకుల్లో మార్పు రాలేదు. 138 మంది విద్యార్థినులు, 132 మంది విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్లో బాలబాలికలకు హాస్టల్ వసతి కల్పిచడంతో పాటు పాఠశాలఅవకాశం ఉంది.స్కూల్లో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 85 మంది ఎస్సీ, 138 మంది ఎస్టీ విద్యార్థినులుచదువుతున్నారు. వీరితో పాటు డేస్కాలర్స్ కూడా ఉన్నారు. కాగా, విద్యార్థులకు వసతి కల్పించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తోంది. బాలుర హాస్టల్ గదులతోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. భవనానికి కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. 132 మంది బాలుర విద్యార్థులకుకేవలం ఐదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నీటి సరఫరాలేకపోవడంతో విద్యార్థులే బకెట్లలో నీరు తీసుకెళ్తున్నారు. ఇకబాలికల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కుళ్లిన కూరగాయలు బెస్ట్ అవలేబుల్ స్కూల్ అంటే కాన్వెంట్ స్కూల్అన్న పేరుకే తప్ప.. ఇక్కడ చీకటి గదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్న బాత్రూమ్లు, కిటికీలు లేని గదులతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులకు వడ్డించే భోజనం సైతం అధ్వానంగా ఉంది. కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారు. కలెక్టర్‌కు నివేదిస్తాం: వెంకటేశం, ఎంఈఓ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ బెస్ట్ అవలెబుల్ స్కూల్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకువిచారణ చేశాం. నివేదికలు కలెక్టర్‌కు అందిస్తాం. -
భక్తులకు అన్ని సౌకర్యాలు : జేసీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పుష్కర ఘాట్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జేసీ రాంకిషన్ తెలిపారు. శనివారం బీచుపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పుష్కరఘాట్లు భక్తజనసంద్రంగా మారాయన్నారు. అలంపూర్, బీచుపల్లి, సోమశిలలో అంచనాలకు మించి భక్తులు స్నానాలు ఆచరించారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, స్నాన ఘట్టాల్లో ఉన్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి పుష్కరఘాట్‌కు ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. గొందిమళ్ల ఘాట్‌లో స్నానమాచరించే వారి సంఖ్య లక్షకు చేరుకుందన్నారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్ఓ రాజారావు, బీచుపల్లి ఘాట్ ప్రత్యేకాధికారి రంగారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి గౌతం ఫక్రూ, డీఎస్పీ బాలకోటి, ఓఎస్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్భాటం ఫుల్.. వసతులు నిల్
ఇదీ పుష్కరనగర్‌లో పరిస్థితి భక్తులకు, సిబ్బందికి సాంబారు అన్నమే.. గుంటూరు (నెహ్రూనగర్): కృష్ణా పుష్కరాల యాత్రికుల కోసం గుంటూరు శివారులోని గోరంట్లలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్కర్‌నగర్‌లో హంగులు ఆర్భాటంగా ఉన్నా సేవల్లో మాత్రం తుస్సుమనిపించారు. వివిధ జిల్లాల నుంచి అమరావతికి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను అంగరంగ తీర్చిదిద్దారు. వివిధ రకాల స్టాల్స్‌ను అందులో ఏర్పాటు చేశారు. మందుల షాపు, పండ్లు, పూజా సామగ్రి, కిరాణా స్టోర్స్ తదితరాలు ఉన్నాయి. యాత్రికులకు ఆరోగ్య పరంగా ఏమైనా సమస్యలు వస్తే వెంటనే చికిత్స చేసే నిమిత్తం వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు వినోదం నిమిత్తం విశ్రాంతి తీసుకునే రెండు షెడ్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనా ప్రకారం దాదాపు 10 వేల మంది యాత్రికులు పుష్కర్ నగర్‌కు వస్తారనుకున్నారు. మొదటి రోజైన శుక్రవారం అందులో 10 శాతం మంది కూడా రాలేదు. యాత్రికులకు వినోదం కోసం డీవైఈవో రమేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులతో కూచిపూడి, బుర్రకథ, అమ్మవారి వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్వచ్ఛంద సేవలు.. పుష్కర్‌నగర్‌లో యాత్రికులకు సేవలందించేందుకు చలమయ్య డీగ్రీ కళాశాల నుంచి 50 మంది, విజ్ఞాన్ డీగ్రీ కాళాశాల నుంచి 35 మంది విద్యార్థులు వచ్చారు. యాత్రికులకు భోజనాల వడ్డింపు, బస్సుల రూటు వివరాలు తదితరాలు తెలియజేయడంలో విద్యార్థులు సహకారం అందించారు. సాంబారు అన్నం తినలేక.. నగరపాలక సంస్థ, ఇస్కాన్ సంస్థ అనుబంధంగా పుష్కర యాత్రికులకు పుష్కరనగర్‌లో ఉచిత భోజన వసతి కల్పించారు. అయితే భోజనాల్లో అన్నం, సాంబారు, స్వీట్ పెట్టి చేతులు దూలుపుకున్నారు. సిబ్బంది సాంబారు అన్నం తినలేక అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రంగా ఉన్న దృష్ట్యా కనీసం పెరుగు, మజ్జిగ ఉన్నా బాగుండేదని పేర్కొన్నారు. యాత్రికులు చేసేది లేక సాంబరు అన్నంతోనే సరిపెట్టుకున్నారు. భోజనాల వద్ద మంచినీటి సరఫరా కూడా సరిగా లేదు. భక్తులు అన్నం ప్లేటును బెంచ్‌పై వదిలి వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత వైఫై హుళక్కే.. పుష్కర్‌నగర్‌లో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా వైఫై అని అధికారులు ప్రకటించినప్పటికీ, ఇక్కడ వైఫై అందుబాటులో లేదు. ఎక్కడో సిగ్నల్ టవర్ ఉండటంతో పుష్కర్‌నగర్ దాకా సిగ్నల్ రాని పరిస్థితి. కేవలం స్టాల్స్ వరకు మాత్రమే వైఫై సిగ్నల్ అందుతున్నప్పటికీ దానికి కూడా అధికారులు పాస్వర్డ్ పెట్టారు. రెండో రోజు నుంచి యాత్రికులు పెరిగేఅవకాశం ఉండటంతో ఉండే ఫోన్ సిగ్నల్స్ కూడా అందవేమో అని కొందరు అనుకుంటున్నారు. అధికారులు సిగ్నల్స్ ఫ్రీక్వేన్సీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
దుర్గమ్మ దర్శనానికి రెండు రకాల వీఐపీ పాస్‌లు
-
ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
ఉండి : ఉండి ఇరిగేషన్ కార్యాలయాన్ని గురువారం వెలివర్రు గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు ముట్టడించారు. గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడు డ్రెయిన్ల తవ్వకానికి వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను ఇరిగేషన్ అధికారులు సీజ్ చేయడంతో వారు ఆందోళనకు దిగారు. వెలివర్రు గ్రామంలోని కుమ్మరకోడు, మాలకోడుల కింద దాదాపు 100 ఎకరాలు సాగులో ఉంది. అయితే వీటి తవ్వకంలో కొన్నేళ్లుగా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకంలోనైనా పనులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు చందాలు వేసుకుని డ్రెయిన్ల తవ్వకాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు తమ ఆధ్వర్యంలో డ్రెయిన్లను తవ్విస్తామని హామీ ఇచ్చి తవ్వకాలను నిలిపివేయించారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదుతో అధికారులు గురువారం ఉదయం తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లయినర్‌ను సీజ్ చేశారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఉండి ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ముదునూరి కొండరాజు, బీజేపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. -
పుష్కరాలకు సకల సౌకర్యాలు
-
పుష్కరాలకు సకల సౌకర్యాలు
నెహ్రూనగర్: పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పుష్కర్‌నగర్ వద్ద సకల సౌకర్యాలతో కూడిన సదుపాయాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్‌నగర్‌లో ఏర్పాట్ల పై విలేకర్లతో మాట్లాడారు.యాత్రికులకు షెడ్లు ఏర్పాటు చేశామని, సదరు షెడ్లలో రోజుకు 10 వేల మంది యాత్రికులు సేద తీరవచ్చన్నారు.. యాత్రికులు సౌకర్యార్థం పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. రోజు 10 వేల మందికి భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంబులెన్స్ సదుపాయం, మెడికల్ షాపులు, క్లాక్ రూం, యాత్రికులకు అవసరమైన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వినోదం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. పుష్కర్ నగర్ నుంచి అమరవాతికి, పవిత్ర సంగమం వద్దకు కూడా బస్సులు ఏర్పాటు చేశామని, బస్సులే కాక రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులందరికీ సకల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. -
పుష్కరాల బస్సుల్లో సాధారణ చార్జీలే
-
పుష్కరాల బస్సుల్లో సాధారణ చార్జీలే
–విజయవాడ, గుంటూరుకు నేరు బస్సులుండవు – పోనురాను టికెట్లు ఒకేసారి కొనుక్కోవచ్చు – ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తిరుపతి అర్బన్: కృష్ణా పుష్కరాల స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమలులో ఉంటాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పుష్కరాలకు ఆర్టీసీ తరఫున తీసుకున్న ప్రత్యేక చర్యలు, ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులను బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. జిల్లాలోని 14 డిపోల నుంచి ప్రస్తుతానికి 11 రెగ్యులర్ బస్సులు విజయవాడకు నడుస్తున్నాయని, వాటితో పాటు పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి రోజూ 40 నుంచి 50 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాలు జరిగే రోజుల్లో విజయవాడ, గుంటూరు నగరాలకు నేరుగా బస్సులు వెళ్లవని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా గోరంట్ల వరకు పుష్కరాల బస్సుల్లో వెళ్లి, అక్కడి నుంచి టౌన్ సర్వీసుల్లో జంట నగరాలకు చేరుకునేలా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. గోరంట్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పుష్కరాల బస్టాండుకు భక్తుల తాకిడి అంచనాలకు మించి పెరిగితే, అంతకు ముందే వచ్చే చిలకలూరిపేట, మేదరమిట్ల ఆర్టీసీ బస్టాండ్లలో భక్తులను కొంతసేపు నియంత్రించి పుష్కరాలకు అనుమతిస్తారన్నారు. గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండు ప్రాంతంలో సుమారు 4వేల మందికి పైగా భక్తులు బస చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గోరంట్లలో అన్ని అధునాతన శాటిలైట్ విజ్ఞానాన్ని వినియోగించుకుని సాంకేతికంగా అన్ని సేవలను అందిస్తామని వివరించారు. పోను,రాను టికెట్లు ఒకేసారి కొనుక్కోవచ్చు యాత్రికులు పోను, రాను టికెట్లను ఒకేసారి కొనుక్కునే వెసులుబాటు కల్పించినట్లు ఆర్ఎం తెలిపారు. ఏ కేటగిరీ బస్సు టికెట్ కొనుక్కున్నా, తిరుగు ప్రయాణంలో ఆ కేటగిరీ బస్సులు అందుబాటులో లేకపోయినా ఇతర కేటగిరీ బస్సుల్లో వ్యత్యాసపు చార్జీలు చెల్లించి ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గోరంట్ల, అమరావతి బస్టాండ్ల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తులకు ఉచిత మినీ బస్సుల సౌకర్యం కల్పించామన్నారు. పుష్కర సేవల్లో 1200 మంది సిబ్బంది కృష్ణా్ణ పుష్కరాల సేవలో చిత్తూరు ఆర్టీసీ రీజియన్ నుంచి 1200 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆర్ఎం వెల్లడించారు. కంటింజెన్సీ ప్లాన్‌లో జిల్లాలోని 14 డిపోల నుంచి 50 బస్సులను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 12 రోజుల పాటు 450 బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. గ్రూపులుగా వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. 9959225684 నంబరులో సంప్రదిస్తే బల్క్ బుకింగ్, ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తారన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్, పీఆర్వో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పుష్కర వేళ.. వసూళ్ల పర్వం
పుష్కర భక్తుల సౌకర్యాల కోసం అంటూ అధికార పార్టీ నేతల వసూళ్లు సమావేశాలు పెట్టి మరీ స్పష్టమైన ఆదేశాలు అధికారులకూ టార్గెట్లు పుష్కరాల పేరు చెప్పి.. అధికార పార్టీ నేతలు అక్రమ వసూళ్లకు తెరతీశారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాలు, అసోసియేషన్లు, మద్యం దుకాణాలు, రేషన్ షాపులు.. ఎవ్వరినీ వదలటం లేదు. వసూలు చేసిన సొమ్ముకు లెక్కలూ చూపటం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్య నేత తనయుడు, పలువురు ముఖ్య నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. సాక్షి, గుంటూరు : కాదేదీ కలెక్షన్‌కు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. పవిత్రమైన పుష్కరాల పనుల కోసం విడుదల చేసిన నిధులను ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్ల రూపంలో కొల్లగొట్టిన నేతలు తాజాగా భక్తులకు సేవా కార్యక్రమాల పేరుతో వసూళ్లకు తెర తీశారు. ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా జరగనున్న పుష్కరాలకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. వారి సౌకర్యార్థం అంటూ వ్యాపారులతో పాటు పలు వాణిజ్య సముదాయాలకు, అసోసియేషన్లకు అధికార పార్టీ నేతలు ఇండెంట్లు వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా స్వచ్ఛందంగా భక్తులకు సహాయసహకారాలు అందించాలనుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ వ్యాపార, వర్తక సంఘాలతో పాటు పలు అసోసియేషన్ నేతలను పిలిచి సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు విధిస్తున్నారు. తమ అసోసియేషన్ తరఫున ఫలానా కార్యక్రమం చేపడుతున్నామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా తమకే డబ్బు పంపాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం.. సాటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో తాము డబ్బు ఖర్చు చేద్దామని భావిస్తుంటే .. అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఒత్తిళ్లు చేయటంపై స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి మాటకు ఎదురుచెబితే తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిస్తారనే భయంతో మిన్నకుంటున్నారు. జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్యనేత తనయుడు, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని అధికార పార్టీ ముఖ్య నేతలంతా దౌర్జన్యంగా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్.. అంతటితో ఆగక ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మద్యం దుకాణాలు, రేషన్ డీలర్లు, పెట్రోలు బంకులు, కిరోసిన్ హాకర్లు.. ఇలా పలు వర్గాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయా శాఖలకు చెందిన అధికారులు నేరుగా వారికి ఫోన్లు చేసి ఈ నెల 11వ తేదీ సాయంత్రం కల్లా డబ్బులు అధికార పార్టీ ముఖ్య నేతలకు చేర్చాలని హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి కొందరు కింది స్థాయి అధికారులు అందులో కొంత మొత్తం తమకు పంపాలంటూ బెదిరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అంతా తలలు పట్టుకుంటున్నారు. లెక్కా పత్రం లేకుండా వసూళ్లు.. పుష్కర యాత్రికులకు అన్నదానం, వసతి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాల కల్పనకు అంటూ చేస్తున్న ఈ వసూళ్లకు లెక్కలు చూపే పరిస్థితే లేదు. ఎవరెవరి నుంచి ఎంతెంత సొమ్ము అందినదీ.. వాటిని ఏయే సౌకర్యాల కల్పనకు ఉపయోగిస్తారు.. అనే సమాచారం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దాతలు తాము అందజేస్తున్న సొమ్ముతో ఎంతమందికి సదుపాయాలు అందిస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలకు సర్వం సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం అహర్నిశలూ కష్టపడుతోందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ పార్కును పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా 72 ఘాట్ల నిర్మాణం పూర్తయిందని, వీటిని ఏ, బీ, సీ, డీ ఘాట్లుగా గుర్తించామన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అమరావతి, ధరణికోట, తాళ్లాయపాలెం, సీతానగరం, పెనుమూడి ఘాట్లకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా అని, గుంటూరు నగర శివారులో లక్ష మంది భక్తులకు వసతి కోసం గోరంట్ల రోడ్డులో ఒకటి, విజయవాడ రోడ్డులో మరొకటి పుష్కర నగర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. దీనికి అనుసంధానంగా ప్రతి పుష్కరఘాట్‌కు సమీపంలో ఐదారు పుష్కర నగర్లు ఏర్పాటు చేసి 25 వేల మందికి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు పుష్కర నగర్ నుంచి ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి రుసుం వసూలు చేయకుండా ప్రయాణం చేసే విధంగా వసతులు కల్పించినట్టు వివరించారు. -
నిధులిచ్చినా.. సౌకర్యాలు సున్నా
► ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు కనీస వసతులు, ఇతర సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వపరంగా ఆదేశాలిచ్చి, నిధులు మంజూరు చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లు, టు టయర్ కాట్లు, అల్మారాలు, టీచర్లు, సిబ్బందికి టేబుళ్లు, కుర్చీలు తదితరాల ఏర్పాటు కోసం గత ఏడాది చివర్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశాలిచ్చారు. రూ.125 కోట్లు కూడా కేటాయించారు. గతంలోనే వీటిపై నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వపరంగా రాష్ర్టస్థాయి కొనుగోలు కమిటీ ఖరారు కాకపోవడంతో ఆయా సౌకర్యాల కల్పన ఆగిపోయింది. హాస్టల్ విద్యార్థులకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో భాగంగానే ఆయా సౌకర్యాలను కల్పించాలని గత డిసెంబర్ 28న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగియడంతో పాటు 2016-17లో కూడా నాలుగు నెలలు గడిచినా ఆయా సౌకర్యాల కల్పనకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. సీసీ కెమెరాలు, కంప్యూటర్లదీ అదే పరిస్థితి మారుమూల ప్రాంతాల్లోని బాలికల హాస్టళ్ల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. అయినా అధికార యం త్రాంగం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ర్టంలోని 152 గిరిజన బాలికల పాఠశాలలు, హాస్టళ్ల (99 బాలికల ఆశ్రమ పాఠశాలలు, 53 బాలికల హాస్టళ్లు)లో 152 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు (సీసీ టీవీలు) వాటి పర్యవేక్షణకు కంప్యూటర్ల ఏర్పాటునకు గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఒక్కో సీసీ టీవీ ఏర్పాటునకు రూ.5 వేల చొప్పున రూ.7.6 లక్షలకు, ఒక్కో కంప్యూటర్ ఏర్పాటునకు రూ. 22,879 చొప్పున రూ.34.70 లక్షలకు అంచనా వేసి మొత్తం 152 సీసీటీవీ, 152 కంప్యూటర్ల కొనుగోలుకు అనుమతినిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అధికారులకు ఆదేశాలు పంపించినా ఇప్పటివరకు వాటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న 1,22,604 మంది విద్యార్థులకు ఒక జత స్పోర్ట్స్ షూ, రెండు జతల సాక్స్‌ను అందజేయాలని మంత్రి చందూలాల్ ఆదేశించారు. దీనిపై కూడా అధికారుల్లో సానుకూల స్పందన కొరవడింది. -
‘ప్లంబర్’తో ఒలింపిక్స్‌కు...
బ్రిటన్ జట్టు ముందు జాగ్రత్త రియో: ఒలింపిక్ విలేజ్‌లో సౌకర్యాలు బాగా లేవు... నల్లాలు లీక్ అవుతున్నాయి, డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి... రియోలో అడుగు పెట్టిన దగ్గరినుంచి చాలా మంది ఆటగాళ్లు చేస్తున్న ఫిర్యాదులు ఇవి. బ్రిటన్ జట్టు మాత్రం వీటికి పరిష్కారం కనుక్కుంది! ఎవరో వస్తారని, బాగు చేస్తారని ఎందుకు సమయం వృథా చేయడం. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. అందుకే ఒలింపిక్స్‌కు తమ జట్టుతో పాటు ప్లంబర్‌ను కూడా తీసుకుపోయింది. ‘మాతో పాటు ప్లంబర్‌ను తీసుకొచ్చాం. అతడికి పెద్దగా పని పడకపోతే మంచిదే. కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే బాగు చేసుకోవచ్చు. ఆటగాళ్లకు సౌకర్యంగా కూడా ఉంటుంది’ అని బ్రిటన్ చెఫ్ డి మిషన్ మార్క్ ఇంగ్లండ్ చెప్పడం విశేషం. -
బీమా ముగిసింది.. దీమా చెదిరింది
–3 లక్షల మందిలో బీమా చేసింది 1.25 లక్షలే –రెన్యువల్ ప్రక్రియ పూర్తికాకుండా ముగిసిన గడువు సాక్షి, చిత్తూరు: అన్నదాతకు బీమాపై ధీమా లేకుండా పోతోంది. అతివృష్టి, అనాష్టి నుంచి గట్టెక్కించే సౌకర్యం దూరమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దీనిని కోల్పోతున్నారు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా రైతులు నష్టపోయారు. జిల్లాలో 6 లక్షలమందికి పైగా రైతులున్నారు. వీరిలో బ్యాంకుల ద్వారా 1,09,878 మంది రైతులు రుణాలు పొందారు. 16,451 మంది రైతులు నేరుగా బీమా చెల్లించారు. పంట రుణ ప్రక్రియ పూర్తి పూర్తికాక మునుపే బీమా గడువు ముగిసింది. దీంతో బీమా చెల్లించని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ కారణం చేతనైనా పంట సరిగా పండకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. బీమా గడువు పెంచాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా రైతులు చాలా వరకు నిరక్షరాస్యులే. బీమాపై వీరికి సరైన అవగాహన లేదు. ఈ విషయంలో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. గత ఏడాది పంట రుణాలు తీసుకున్న వారు తప్పితే ఈ ఏడాది పంటల బీమా చేయించుకున్నవారు తక్కువే. ఇది తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయలేదు. ఫలితంగా 3 లక్షల మందికిపైగా వేరుశనగ రైతులు నష్టపోయారు. ఎస్సీ,ఎస్టీ రైతులే అధికం పంటల బీమా చెల్లించని వారిలో ఎస్సీ, ఎస్టీ రైతులే అధికంగా ఉన్నారు. కొన్ని బ్యాంకుల్లో వసతి లేమి, సిబ్బంది కొరత కారణంగా కూడా రైతులు బీమా సకాలంలో చెల్లించలేకపోయారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా బీమా చెల్లించలేకపోయామని అన్నదాతలు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెన్యువల్ ప్రక్రియ మందగమనంతో సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాక మునుపే బీమా గడువు ముగియడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. తప్పెవరిదైనా శిక్ష మాత్రం రైతులకే పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫసల్ బీమాలో దక్కని చోటు వేరుశనగకు ప్రధాని అట్టహాసంగా ప్రకటించిన ఫసల్ బీమాలోనూ చోటు దక్కలేదు. జిల్లాలో సుమారు లక్ష హెక్టార్లకు పైగా సాగయ్యే వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయలేదు. అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమాటా లాంటి పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేయడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గడువు పెంచాలి బీమా చెల్లింపునకు గడువు తేదీ పెంచాలి. జిల్లాలో ఎక్కువ మంది రైతులు నిరక్ష్యరాస్యులే. వీరికి బీమాపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు మరింత నష్టపోతున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల పంట నష్టపోతే.. బీమా లేకపోవడం వల్ల రైతులు మరింత అప్పుల పాలవుతారు. బీమా గడువు పెంచకపోతే ఉద్యమిస్తాం. సీవీవీ.ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు -
వసతుల ఏర్పాట్ల పరిశీలన
నేరేడుచర్ల : మండలంలోని మహంకాళీగూడెం కష్ణా పుష్కరఘాట్ వద్ద యాత్రికులకు కల్పిస్తున్న మౌలిక వసతుల ఏర్పాట్లను శనివారం డీఆర్డీఏ పీడీ అంజయ్య పుష్కరఘాట్ ఇన్చార్జ్ సుందరి కిరణ్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. ఘాట్ వద్ద నిర్మిస్తున్న స్నానాల గదులు, మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల, గరిడేపల్లి తహసీల్దార్లు డి. సత్యనారాయణ, వజ్రాల జయశ్రీ, ఎంపీడీఓ నాగపద్మజ, ఎస్ఐ జి. గోపి, ఈఓఆర్డీ జ్యోతిలక్ష్మి, పీఆర్‌జేఈ రామకష్ణ, ఐబీఏఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!
ఇప్పటికే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందించడంలో ముందున్న విమానయాన సంస్థ స్పైస్ జెట్.. కొత్తగా స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. గంటలదరబడి క్యూలైన్లలో బోర్డింగ్ పాస్ ల కోసం, చెకిన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ యాప్.. స్మార్ట్ చెక్-ఇన్ ను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా ప్రవేశ పెట్టింది. ప్రయాణీకులు గంటలకొద్దీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు స్పైస్ జెట్ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ చెక్- ఇన్ పేరున కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ నూతన యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని దీనిద్వారా ఎయిర్ పోర్టులో నిమిషాల్లో చెకిన్ అయ్యే అవకాశం కల్పించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త సేవతో ప్రయాణీకులు చెకింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో స్పైస్ జెట్ ముందుంటుందని ఈ సందర్భంలో ఆయన తెలిపారు. త్వరలో ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న విమాన ప్రయాణీకులు.. విమానాశ్రయంలోని చెక్ ఇన్ ప్రాంతంలోకి చేరగానే ఫోన్లకు ఓ అలర్డ్ వస్తుంది. దాన్ని అంగీకరించిన వెంటనే ఫోన్ లోకి బోర్డింగ్ పాస్ వచ్చి చేరుతుంది. ఈ కొత్త స్మార్ట్ చెక్-ఇన్ సేవ ను వినియోగించుకుంటే ప్రయాణం హడావుడితోపాటు ప్రయాణీకులు చెకిన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. -
వసతుల కల్పనకు కృషి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు గాను వసతుల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ఆస్పత్రులకు అధికశాతం పేదవారే వస్తారని, వీరికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషిచేస్తానన్నారు. వైద్య రంగంలో ఎన్నో ఆధునికమైన పరికరాలు వచ్చాయని, వాటిని ఆస్పత్రికి తీసుకురావడానికి సంబంధితశాఖాధిపతులతో మాట్లాడతానని తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ‘ సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి నివేదించానని వివరించారు. ఆస్పత్రిలో కొత్త జనరేటర్, శిథిలమైన మార్చురీగది స్థానంలో కొత్త గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో ఇన్వర్టర్లు పనిచేయడంలేదని, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదుల్లో వసతులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆస్పత్రిలో వసతులు, పరిసరాలను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, జిల్లా కమ్యూనిటీ హెల్త్ అధికారి డాక్టర్.హనుమంతరావు, మహిళా సంఘాల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, శంకర్పల్లి ఎంపీపీ చిన్న నర్సింహులు, మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 29సిహెచ్‌వి 03ః చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య 29సిహెచ్‌వి 04ః ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాలె యాదయ్య